Saath Nibhana Saathiya-2 Sneha Jain Talks About Casting Couch: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం `కాస్టింగ్ కౌచ్`. ఇటీవలి కాలంలో ఎంతో మంది నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. తాజాగా నటి స్నేహా జైన్ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని, దక్షిణాది పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది.
'కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఓ సినిమాలో నాకు అవకాశం ఇస్తానని ఓ సౌత్ డైరెక్టర్ నుంచి కాల్ వచ్చింది. దాంతో నా ఫోటోలు, వివరాలను ఆయన పంపించాను. మరుసటి రోజు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని చెప్పిన ఆయన ఒక రోజంతా తనతోనే గడపాలని, దేనికైనా ఓకే చెప్పాలన్నాడు. ఆ మాటలకు షాక్ అయ్యాను. నేను అలాంటివి చేయనని చెప్పేశాను.
అయితే వారం తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్ నాకు కాల్ చేసి ఇలాంటివి చాలా కామన్. నువ్వు ఓకే అంటే ఇప్పటికీ ఆ ఆఫర్ ఉందని చెప్పాడు. నాకు కోపం వచ్చి గట్టిగా అరచి ఫోన్ పెట్టేశాను' అని చెప్పుకొచ్చింది. స్నేహా జైన్ ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’లో నటిస్తుంది.
చదవండి : 'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే...
కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి
Comments
Please login to add a commentAdd a comment