
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. అయితే కొందరు మాత్రమే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసం చేస్తుంటారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ బుల్లితెర నటి సనయా ఇరానీ ఓపెన్ అయింది. ఓ బాలీవుడ్ దర్శకుడు తనను సంప్రదించారడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దక్షిణాదిలో కూడా కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యాయని తెలిపింది. తనను రిజెక్ట్ చేయడానికి మాత్రమే కలవాలని కొందరు పట్టుబట్టారని తాజా ఇంటర్వ్యూలో సనయ చెప్పింది.
సనయా మాట్లాడుతూ.. ' మ్యూజిక్ వీడియో కోసం ఆడిషన్ చేస్తున్నామని మొదట నాతో చెప్పారు. కానీ అక్కడికి వెళ్లాక ఇది ఒక సినిమా కోసమని తెలిసింది. దీంతో నేను అక్కడే ఉన్న సెక్రటరీకి ఆడిషన్ చేయనని చెప్పా. ప్లీజ్ సార్‌కు కోపం వస్తుంది.. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని ఆమె నాతో చెప్పింది. ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. 'నేను ఈ పెద్ద సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో మీరు బికినీ వేసుకోవాలి. మీరు బికినీ ధరించేందుకు సిద్ధమేనా?' అని అడిగాడని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత "అతని సెక్రటరీ చెప్పడంతో నేను అతనికి కాల్ చేసాను. నేను మీటింగ్‌లో ఉన్నా.. అరగంట తర్వాత నాకు కాల్ చేయండి అన్నాడు. మరోసారి 45 నిమిషాల తర్వాత కాల్ చేశా. ఇప్పుడు టైం ఎంత? నిన్ను ఏ సమయానికి చేయమని అడిగాను? అని నాపై కోప్పడ్డాడు. దీంతో అతనికి దర్శకుడిగా పనికిరాని వాడని నాకర్థమైంది' అని వివరించింది. కాగా.. 'మిలే జబ్ హమ్ తుమ్', 'ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్' వంటి టీవీ షోలతో బాలీవుడ్‌లో సనయా గుర్తింపు తెచ్చుకుంది. సనయ చివరిగా షార్ట్, బటర్‌ఫ్లైస్ సీజన్ -4లో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment