‘‘నేను 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే సినిమా రంగంలోని వారు ఎలా ఉంటారనే విషయం అప్పటికి నాకు తెలియదు. ఓ దర్శకుడు నా కాస్ట్యూమ్స్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలకి బాధపడి, డిప్రెషన్‌లోకి వెళ్లాను’’ అని హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్‌లో ΄పాల్గొన్న ప్రియాంకా చోప్రా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘటనల గురించి మాట్లాడారు. ‘‘ఓ సినిమా షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లాను.
నాకు ఎలాంటి దుస్తులు కావాలో నా కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పండి అని డైరెక్టర్‌తో అన్నాను. నా ముందే నా కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఫోన్ చేసిన ఆయన... ‘కథానాయిక లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అందుకే ప్రియాంక దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి’ అంటూ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు.
ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా, బాధగా అనిపించింది. దీంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆ డైరెక్టర్ నన్ను చిన్నచూపు చూస్తే ఆ సినిమా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత ఆ మూవీ చేయలేదు. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఇప్పటివరకు కూడా ఆ దర్శకుడితో పని చేయలేదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా.
Comments
Please login to add a commentAdd a comment