Urfi Javed Recalls Horrific Casting Couch Experience - Sakshi
Sakshi News home page

Uorfi Javed : లవర్‌లా ఫీలవ్వు.. కౌగిలించుకో అన్నాడు: ఉర్ఫీ జావెద్

Published Mon, Aug 21 2023 3:22 PM | Last Updated on Wed, Sep 6 2023 10:10 AM

Uorfi Javed Recalls Horrific Casting Couch Experience - Sakshi

బిగ్ బాస్ నటి ఉర్ఫీ జావెద్ పరిచయం అక్కర్లేని పేరు. తన విచిత్రమైన ఫ్యాషన్‌ డ్రెస్సులతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఇటీవల ముంబయిలో  ఓ ఇంటరాక్షన్ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముంబయిలో తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను గురించి నోరు విప్పింది.   సోషల్ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ఉర్ఫీ.. కెరీర్‌ ఆరంభం ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించింది.  

(ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి)

ముంబయికి వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఆడిషన్స్‌కు హాజరైనట్లు తెలిపింది. అయితే ఓ దర్శకుడు మాత్రం తనను నీ లవర్‌లా భావించి సన్నిహితంగా మెలగాలని కోరినట్లు ఉర్ఫీ తన అనుభవాన్ని పంచుకుంది. అంతే కాకుండా తనను కౌగిలించుకోవాలని బలవంతం చేశాడని పేర్కొంది. అయితే తాను మాత్రం అయిష్టంకానే కౌగిలించుకుని.. అక్కడే అతనికి గుడ్ బై చెప్పానని తెలిపింది. 

అయితే ఆ గదిలో కెమెరా లేకపోవడంపై అతన్ని నిలదీస్తే.. నా తలే నా పర్సనల్ కెమెరా అని బదులిచ్చాడని వివరించింది. ఇలాంటి వారి బారిన పడకుండా యువతులను హెచ్చరించడానికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నట్లు వివరించింది.  ఆ తర్వాత ముంబయికి చెందిన ఓ దర్శకుడు ఆడిషన్ కోసం ఏకంగా తన ఇంటికి పిలిచాడని ఉర్ఫీ గుర్తు చేసుకుంది. 

కాగా..  ప్రస్తుతం బిగ్ బాస్-16 ఫేమ్ నిమృత్ కౌర్ అహ్లువాలియా నటిస్తోన్న ఏక్తా కపూర్  చిత్రం 'లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2'లో ఉర్ఫీ కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్‌లో గెస్ట్‌గా కనిపించింది. అంతేకాకుండా 'బడే భయ్యా కి దుల్హనియా', 'మేరీ దుర్గా', 'బేపన్నా' లాంటి సీరియల్స్‌లో కూడా నటించింది.

(ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement