
'మమ్మల్ని పిలుస్తోంది సినిమాలో నటించేందుకు కాదు.. వారితో కలిసి రాత్రంతా రూమ్‌లో ఉండేందుకు!' అంటూ ఆగ్రహం, అసహనం ఒకేసారి వ్యక్తం చేసింది నటి సనం శెట్టి (Sanam Shetty). సమానత్వం అంటే ఇదా? అని ప్రశ్నించింది. కూల్ సురేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సనం శెట్టి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె.. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్‌పై విమర్శలు గుప్పించింది.
అది సమానత్వమా?
సనం శెట్టి మాట్లాడుతూ.. బ్యాడ్‌గర్ల్ టీజర్ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదు.. అదొక చెత్త ఉదాహరణ. స్వేచ్ఛ, లింగసమానత్వం అనే అంశాలను చాలా తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీపడి సిగరెట్ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు. సమానత్వం అంటే అన్నింట్లోనూ మాకు సమాన అవకాశాలివ్వాలి, సమాన గౌరవం దక్కాలి. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్‌ను సంప్రదించే విధానం ఒకేలా ఉందా? లేదు. నన్నే తీసుకోండి. సినిమాలో నటించమని పిలవడానికి బదులు వారితో కలిసి గదిలో ఉండమని పిలుస్తున్నారు. ఇది సమానత్వమా?
ఎందుకు తీస్తారో అర్థం కాదు
బ్యాడ్ గర్ల్ టీజర్ ఏమాత్రం బాగోలేదు. ఇది టీనేజీ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. ఇలాంటి చెత్త మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. బాధ్యతాయుతమైన ఫిలింమేకర్స్ ఇలాంటి సినిమాలు చేయడం మరింత బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. అంబులి 3డీ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైందీ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాలతో తెలుగువారికి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఎతిర్ వినైయాత్రు మూవీ చేస్తోంది.
#BADGIRL Teaser is NOT a BOLD Example.. ❌
It's a #BAD Example! 👎#Freedom of choice and #GenderEquality concepts are wrongly portrayed in case of #Minors here! #Legally, #Ethically and even #Medically it sends a terribly #wrong message to the already influencable adolescent… pic.twitter.com/Dv6pVdXxtG— Sanam Shetty (@ungalsanam) February 18, 2025
చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?
Comments
Please login to add a commentAdd a comment