Sanam Shetty
-
సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి
'మమ్మల్ని పిలుస్తోంది సినిమాలో నటించేందుకు కాదు.. వారితో కలిసి రాత్రంతా రూమ్‌లో ఉండేందుకు!' అంటూ ఆగ్రహం, అసహనం ఒకేసారి వ్యక్తం చేసింది నటి సనం శెట్టి (Sanam Shetty). సమానత్వం అంటే ఇదా? అని ప్రశ్నించింది. కూల్ సురేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సనం శెట్టి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె.. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్‌పై విమర్శలు గుప్పించింది.అది సమానత్వమా?సనం శెట్టి మాట్లాడుతూ.. బ్యాడ్‌గర్ల్ టీజర్ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదు.. అదొక చెత్త ఉదాహరణ. స్వేచ్ఛ, లింగసమానత్వం అనే అంశాలను చాలా తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీపడి సిగరెట్ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు. సమానత్వం అంటే అన్నింట్లోనూ మాకు సమాన అవకాశాలివ్వాలి, సమాన గౌరవం దక్కాలి. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్ను సంప్రదించే విధానం ఒకేలా ఉందా? లేదు. నన్నే తీసుకోండి. సినిమాలో నటించమని పిలవడానికి బదులు వారితో కలిసి గదిలో ఉండమని పిలుస్తున్నారు. ఇది సమానత్వమా?ఎందుకు తీస్తారో అర్థం కాదుబ్యాడ్ గర్ల్ టీజర్ ఏమాత్రం బాగోలేదు. ఇది టీనేజీ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. ఇలాంటి చెత్త మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. బాధ్యతాయుతమైన ఫిలింమేకర్స్ ఇలాంటి సినిమాలు చేయడం మరింత బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. అంబులి 3డీ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైందీ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాలతో తెలుగువారికి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఎతిర్ వినైయాత్రు మూవీ చేస్తోంది. #BADGIRL Teaser is NOT a BOLD Example.. ❌It's a #BAD Example! 👎#Freedom of choice and #GenderEquality concepts are wrongly portrayed in case of #Minors here! #Legally, #Ethically and even #Medically it sends a terribly #wrong message to the already influencable adolescent… pic.twitter.com/Dv6pVdXxtG— Sanam Shetty (@ungalsanam) February 18, 2025 చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌పై పలువురు సినీతారులు రియాక్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్స్ సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా దీనిపై మాట్లాడారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజాగా హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ సనమ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తమిళ సినిమాల్లో కూడా ఉందని వెల్లడించింది. ఎవరైనా కమిట్ అవ్వాల్సిందే తప్పా.. నో చెప్పడానికి తమిళ ఇండస్ట్రీలో అవకాశం లేదని తెలిపింది.సనమ్ శెట్టి మాట్లాడుతూ..'హేమ కమిటీ నివేదిక వివరాలు నాకు తెలియవు. కానీ నేను ఈ చర్యను స్వాగతిస్తున్నా. ఇలాంటి నివేదికను రూపొందించినందుకు జస్టిస్ హేమకు, కేరళ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తమిళ సినీ ప్రపంచంలోనూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ఎవరూ బయటికి చెప్పలేరు. నేను నా స్వంత అనుభవంతో దీనిపై మాట్లాడుతున్నా. తాను వ్యక్తిగతంగా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా. పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. సినిమాల్లో అవకాశాల కోసం ఇదొక్కటే మార్గం కాకూడదు. టాలెంట్ ఉంటే.. అవకాశాలు అవే వస్తాయని నేను నమ్ముతా" అని అన్నారు. కాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై హేమ కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.హేమ కమిటీ రిపోర్ట్ ఏంటంటే?మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ విచారణ జరిపి రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను ఆగస్ట్ 19న కేరళ ప్రభుత్వం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది మహిళలు కమిట్ అవ్వాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం సంచలనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. -
Sanam Shetty: గ్లామర్ స్టిల్స్‌తో అలజడి రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ
-
నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తా..నటికి బెదిరింపులు
తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి సనమ్ శెట్టిని చంపుతానంటూ ఓ ఆకతాయి బెదిరింపులకు పాల్పడ్డాడు. అదేపనిగా ఆమెకు మెసేజ్‌లు పంపుతూ వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. "గత కొద్ది నెలలుగా నాకు దారుణమైన మెసేజ్‌లు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో వచ్చే వీటిని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చంపుతానంటూ ఏకంగా నా ఫోన్ నంబర్‌కు కూడా బెదిరింపు మెసేజ్‌లు పంపించాడో వ్యక్తి. అతడు నా పర్సనల్ విషయాలు కూడా సేకరించినట్లు అనిపించడంతో వెంటనే అప్రమత్తమై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే లైట్ తీస్కోకండి, బయటకు చెప్పండి, సాయం తీసుకోండి. ఒకరకంగా అది వేరేవాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుంది" అని చెప్పుకొచ్చింది. నటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాయ్ జాన్ పాల్గా గుర్తించారు. అయితే అతడు ఏ ఉద్దేశ్యంతో ఈ చర్యకు పాల్పడ్డాడు? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇక తనను హతమారుస్తానని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే కొద్ది రోజులుగా తనకు ధైర్యం చెప్తూ అండగా నిలబడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. View this post on Instagram A post shared by Sanam Shetty (@sam.sanam.shetty) -
పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. మోసం చేశాడు
చెన్నై: నటి సనంశెట్టి ఫిర్యాదు మేరకు బిగ్ బాస్ దర్శిన్‌పై పోలీసులు కేసును నమోదు చేశారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా నటిస్తున్న సనంశెట్టి, నటుడు దర్శిన్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత ఆమెను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై నటి సనంశెట్టి ఆ మధ్య స్థానిక ఆడయారు మహిళా పోలీస్ స్టేషన్లో దర్శిన్ పై ఫిర్యాదు చేసింది. (ఎమ్మెల్యే ప్రేమ వివాహం) నటుడు దర్శిన్, తాను ప్రేమించుకున్నామని..పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఏడాది పాటు కలిసి తిరిగామని తెలిపింది. అయితే ఉన్నఫలంగా దర్శిన్ తనతో మాట్లాడడం మానేశాడని, తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెప్పింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కాగా ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపిన దర్శిన్ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్ పై కేసు నమోదు చేశారు. దర్శిన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. (ఒక ఫొటో ఆ ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!) -
'పాత బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రంతా.. అందుకే'
పెరంబూరు : బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోతో పాపులర్ అయిన నటుడు దర్శన్, నటి సనంశెట్టితో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. కాగా చిత్ర షూటింగ్ మధ్యలోనే దర్శన్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఏమైందో తెలియదుకానీ సనంశెట్టి.. దర్శన్‌పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దర్శిన్ తాను ప్రేమించకున్నామని... తమకు 2019 మేలో వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇరు కుటుంబాల సమ్మతితో జూన్‌లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిపింది. అయితే దర్శన్‌కు బిగ్‌బాస్ గేమ్‌షోలో పాల్గొనే అవకాశం రావడంతో పెళ్లిని వాయిదా వేసుకుందామన్నాడని, అందుకు తానూ అంగీకరించినట్లు చెప్పింది. బిగ్‌బాస్ కారణంగా దర్శన్‌కు పేరు వచ్చిందంటే అందుకు కారణం తానేనని పేర్కొంది. దర్శన్ కోసం రూ.15 లక్షల వరకూ ఖర్చు చేశానని, అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత దర్శన్ మారిపోయాడని, పెళ్లిని ఆపేశాడని ఆరోపించింది. ఈ విషయమై దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే ‘అప్పుడు దర్శన్‌కు నీపై ప్రేమ కలిగిందని, ఇప్పుడు అది పోయిందని’ అంటున్నారని వాపోయింది. దర్శన్ తనకు నమ్మకద్రోహం చేశాడని సనంశెట్టి ఆరోపించింది. కాగా దర్శన్ ...సనంశెట్టి ఆరోపణలపై స్పందించాడు. శనివారం అతను మీడియా ముందుకు వచ్చాడు. సనంశెట్టి ఇటీవల తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో ఒక రాత్రి అంతా గడిపిందంటూ పలు ఆరోపణలను చేశాడు. అలాంటి ఆమెను తానెలా పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యలు చేశాడు. సనంశెట్టిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదని దర్శన్ తేల్చి చెప్పాడు. -
నటి మీరామిథున్ కన్నీరు మున్నీరు
చెన్నై : అందాల పోటీలు రద్దు కావడంతో కార్యక్రమ నిర్వాహకురాలు నటి మిరామిథున్ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...‘ 8 తోటాగళ్’ చిత్ర నాయకి మీరామిథున్ 2016 ఏడాది మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని గెలుచుకోవడంతో....తనే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. దీంతో తనకు మిస్ సౌత్ ఇండియా పట్టాన్ని అందించిన నిర్వాహకులు ఆమెను పోటీలు నిర్వహించరాదని హెచ్చరించారు. అంతే కాకుండా తాము ఆమెకి అందించిన మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని తిరిగి తీసేసుకుని, ఆ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నటి సనంశెట్టికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పట్టాని నటి మీరామిథున్ ఉపయోగించుకోరాదని హెచ్చరించారు. దీంతో వారిపై ఇటీవల నటి మీరా మిథున్ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను నిర్వహించనున్న అందాల పోటీల కార్యక్రమానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పోలీసులు రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినట్లు మీడియాతో పేర్కొన్న నటి మీరామిథున్ సోమవారం తాను నిర్ణయించినట్లుగా స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటళ్లో అందాల పోటీల ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అలాంటిది అందాల పోటీలు జరగలేదు. ఈ విషయమై నటి మీరామిథున్ స్థానిక మైలాపూర్‌లో మీడియాతో తన గోడును వెల్లబోసుకున్నారు. తాను రెండు రోజులుగా రేయింబవళ్లు కష్టపడి అందాల పోటీలకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని.. పోటీల్లో పాల్గొనడానికి 11 మంది మోడల్స్ సిద్ధం అయ్యారని చెప్పారు. సోమవారం ఉదయం ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లి వారిని కలవగా అందాల పోటీలను నిర్వహించరాదని చెప్పారన్నారు. అంతేగాకుండా ఇద్దరు పోలీసులతో హోటల్‌కు వచ్చి తనను బెదిరించారని కంటతడి పెట్టారు. త్వరలో మళ్లీ అందాల పోటీలు నిర్వహించి తీరుతానని అన్నారు. -
ఆ రెండింటికి పెద్ద తేడా లేదు
స్టార్డమ్ కోసం పోరా డుతున్న హీరోయిన్లలో నటి సనమ్‌శెట్టి ఒకరు. నటిగా బిజీగా ఉన్నా, సరిగ్గా పేలే పాత్ర కోసం ఎదురుచూస్తోంది. అంబులి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కథం కథం, సవారి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అదేవిధంగా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తున్న సనమ్‌శెట్టి తాజాగా మిష్కిన్ శిష్యుడు అర్జున్ కలైవన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఇందులో బర్మా చిత్రం ఫేమ్ మైఖెల్ హీరోగా నటిస్తున్నారు. ఇది రివెంజ్, థ్రిల్లర్ సన్నివేశాలతో కూడిన ఒక అర్థవంతమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో ఒక మధ్య తరగతి కుటుం బానికి చెందిన యువకుడి ఎదుగుదలకు అండగా నలిచే యువతిగా నటి సనమ్‌శెట్టి నటిస్తోందట. దీనితో పాటు ఈ బ్యూటీ తమిళం, ఆంగ్లం భాషల్లో నటించిన మార్కెట్ అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోందట. అంతే కాదు తాజాగా ఒక వెబ్ సిరీస్‌లోనూ నటించేస్తోందీ అమ్మడు. బహుభాషా నటిగా బిజీగా ఉన్నా, వెబ్ సీరీస్‌లో నటించడానికి సై అనడం గురించి అడగ్గా సనమ్‌శెట్టి ఏం చెప్పిందో చూద్దాం. ఇప్పుడు అంతా డిజిటల్ మయంగా మారింది. ఇక ఒక నటిగా సినిమాకు, వెబ్ సీరీస్‌కు పెద్దగా వ్యత్యాసం ఏం తెలియడం లేదు. రెండింటికీ శ్రమ ఒకటే. అయితే అవి విడుదలయ్యే విధానమే వేరు. ఇంకా చెప్పాలంటే తమిళంలో వెబ్ సిరీస్ నిర్మాణం తక్కువే. వాటి వీక్షకులు మాత్రం ఎక్కువవుతున్నారు. అందుకే వాటి నిర్మాణం అధికం కావలసి ఉంది అని నటి సనమ్‌శెట్టి పేర్కొంది. -
ప్రాణాలను పణంగా పెట్టి తీశాం
కీకారణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి తగడు చిత్రాన్ని తెరకెక్కించామని ఆ చిత్ర దర్శకుడు ఎం.తంగదురై వెల్లడించారు. రాగదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ కుప్పసామి నిర్మించిన చిత్రం తగడు. ప్రభ, అజయ్, సనంశెట్టి, దీపక్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.చార్లస్ మిల్విన్ సంగీతాన్ని, ఇళయకంభన్ పాటల్ని అందించారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చేసి సాధించాలన్న లక్ష్యంతో తపించే ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులకు ఒక సీడీ దొరుకుతుందన్నారు. అందులోని సమాచారం ప్రకారం వివరాలు శోధించడానికి నడుం బిగించి అడవుల్లోకి వెళతారన్నారు. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? వారి లక్ష్యాన్ని సాధించారా? అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన చిత్రం తగడు అని తెలిపారు. కారరణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు.అయితే చిత్రం చూసిన తరువాత కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం కలిగిందని, ఈ నెల 19న తగడు చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రేయసి కోసం!
మనసుకు నచ్చిన అమ్మాయి కోసం సప్త సముద్రాలు ఈదడానికి కూడా రెడీ అంటారు చాలా మంది కుర్రాళ్లు. ఓ యువకుడు ప్రేమ కోసం అలాంటి రిస్కే చేశాడు. చివరకు ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ప్రేమికుడు’. మానస్, సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మి ఎన్. రెడ్డి ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలో ఈ సినిమా పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇదొక స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. ఈ తరం మనోభావాలకు అద్దంపట్టే సినిమా’’ అని దర్శకుడు చెప్పారు. ఈ వేదికపై హీరో మానస్ పుట్టినరోజు వేడుక కూడా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన సమన్శెట్టీ
-
అదృష్టమంటే నాదే
అదృష్టమంటే సనమ్ శెట్టిదే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి లెగ్ పెట్టిందో లేదో అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అదృష్టం వరించింది. 'ఇంటింటా అన్నమయ్య' చిత్రంలో హీరోయిన్గా నటించినా ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. అది వేరే సంగతి. అయితే ఈ అమ్మడుకి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం సనమ్ శెట్టిని తలుపు తట్టింది. అదికూడా ఆడిషన్స్ లేకుండానే డైరెక్ట్‌గా ఎంపికైంది. ఇక దర్శకేంద్రుడు దర్శకత్వంలో పని చేయాలని... ప్రిన్స్ మహేష్ సరసన నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ అయిన కల కంటుంది. చాలాఏళ్ల తర్వాత కానీ హీరోయిన్లకు ఈ అవకాశం రాదు. అటువంటింది సనమ్‌ను హీరోయిన్గా తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివ చెప్పడం... అందుకు మహేష్ బాబు ఓకే చెప్పడం చకచక జరిగిపోయాయి. దాంతో సనమ్ మాత్రం ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. తాను రెండు సార్లు లక్కీఛాన్స్ కొట్టేశానని సంబరపడుతుంది. అంతేనా మొట్టమొదటి సారిగా మహేష్ బాబును కలిసినప్పుడు చాలా ఆందోళన పడ్డానని... అలాగే చాలా ఒత్తిడి అనుభవించానని చెప్పింది. కానీ మహేష్‌తో మాట్లాడిన తర్వాత ఒత్తిడితో ఆందోళన మాయమైందని చెప్పుకొచ్చింది. మహేష్ బాబు చుట్టు ఓ తేజోవంతమైన కిరణాలు (ఆరా) తిరుగుతుంటాయని సనమ్ చెప్పడం విశేషం. ఇక మహేష్ బాబుతో పాటు సీనియర్ నటులు సుకన్య, జగపతి బాబులతో కలిసి నటిస్తుంటే కొత్త విషయాలు ఎన్నో తెలుస్తున్నాయని పేర్కొంది. చిత్రసీమలో ప్రవేశించిన కొద్దికాలంలో ఇటువంటి అవకాశాలు వస్తాయని జీవితంలో ఎప్పుడు అనుకోలేదని సనమ్ శెట్టి తనకు 'పట్టిన' అదృష్టాన్ని చూసి తానే ఆశ్చర్యపోతోంది. -
విలాసం మూవీ స్టిల్స్
-
‘విలాసం’గా...
పవన్.జి, సనంశెట్టి జంటగా పి.ఎ. రాజగణేశన్ దర్శకత్వంలో పవిత్రన్ ప్రశాంత్ నిర్మించిన ‘విలాసం’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ -‘‘సరికొత్త సినిమా ప్రపంచాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకూ రెండు వేల ఎకరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సినిమా సిటీ నిర్మించలేదు. చిన్న సినిమా నిర్మాతలకు అండగా నిలబడటం కోసం త్వరలో తెలంగాణ సినీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నాకిది తొలి సినిమా. మంచి కథ, సంగీతం కుదిరింది’’ అన్నారు. పాటలు అందరికీ నచ్చుతాయని సంగీత దర్శకుడు రవి రాఘవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వరరెడ్డి, సత్యం రాజేశ్ తదితరులు మాట్లాడారు.