పెరంబూరు : బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోతో పాపులర్ అయిన నటుడు దర్శన్, నటి సనంశెట్టితో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. కాగా చిత్ర షూటింగ్ మధ్యలోనే దర్శన్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఏమైందో తెలియదుకానీ సనంశెట్టి.. దర్శన్‌పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దర్శిన్ తాను ప్రేమించకున్నామని... తమకు 2019 మేలో వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇరు కుటుంబాల సమ్మతితో జూన్‌లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిపింది.
అయితే దర్శన్‌కు బిగ్‌బాస్ గేమ్‌షోలో పాల్గొనే అవకాశం రావడంతో పెళ్లిని వాయిదా వేసుకుందామన్నాడని, అందుకు తానూ అంగీకరించినట్లు చెప్పింది. బిగ్‌బాస్ కారణంగా దర్శన్‌కు పేరు వచ్చిందంటే అందుకు కారణం తానేనని పేర్కొంది. దర్శన్ కోసం రూ.15 లక్షల వరకూ ఖర్చు చేశానని, అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత దర్శన్ మారిపోయాడని, పెళ్లిని ఆపేశాడని ఆరోపించింది. ఈ విషయమై దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే ‘అప్పుడు దర్శన్‌కు నీపై ప్రేమ కలిగిందని, ఇప్పుడు అది పోయిందని’ అంటున్నారని వాపోయింది. దర్శన్ తనకు నమ్మకద్రోహం చేశాడని సనంశెట్టి ఆరోపించింది.
కాగా దర్శన్ ...సనంశెట్టి ఆరోపణలపై స్పందించాడు. శనివారం అతను మీడియా ముందుకు వచ్చాడు. సనంశెట్టి ఇటీవల తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో ఒక రాత్రి అంతా గడిపిందంటూ పలు ఆరోపణలను చేశాడు. అలాంటి ఆమెను తానెలా పెళ్లి చేసుకుంటానని వ్యాఖ‍్యలు చేశాడు. సనంశెట్టిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదని దర్శన్ తేల్చి చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment