కన్నడ నటుడు దర్శన్ అనారోగ్యంతో ఇబ్బుందులు పడుతున్న విషయం తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో ఈ కారణం వల్లే ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం ఆయనకు కోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని షరతు విధించింది.
ఆపరేషన్ చేయడానికి దర్శన్ మానసికంగా సిద్ధంగా లేరని దర్శన్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పటికే నాలుగు వారులు కావస్తుంది. అయితే, ఇన్ని రోజులైనా దర్శన్ ఆపరేషన్ చేయించుకోకపోవడంతో పోలీసులు సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్లారు. దర్శన్ బెయిలు రద్దు చేయాలని, లేదంటే ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అభిప్రాయపడ్డారు.
దర్శన్‌కు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దర్శన్ కూడా మానసికంగా సిద్ధమవుతున్నారని, ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల ఆపరేషన్ వాయిదా పడుతోందని కోర్టుకు దర్శన్ తరుపు లాయర్ వివరించారు. అందుకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా సమర్పించారు. ప్రస్తుతం కన్సర్వేటివ్ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఫిజియోథెరపీ, మందులతో నొప్పిని అదుపులో ఉంచడం జరుగుతోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment