రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న దర్శన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఆయన రిమాండును కోర్టు పొడిగించింది. కొద్దిరోజుల క్రితం హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన బెంగళూరు పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ రెడీ చేశారు. దానిని కోర్టులో కూడా దాఖలు చేశారు. రేణుకాస్వామి హత్య కుట్రలో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ ఉన్నారని పోలీసులు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు అందించారు.
ఇదీ చదవండి: డాక్టర్‌పై నటి రోహిణి ఫిర్యాదు
ఈ కేసులో హీరో దర్శన్, పవిత్రగౌడ, గ్యాంగ్‌కు బెయిలు భాగ్యం దక్కలేదు. కోర్టు వారి కస్టడీని పొడిగించింది. శుక్రవారంతో జ్యుడీషియల్ రిమాండు ముగియడంతో పోలీసులు 17మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24వ ఏసీఎంఎం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. పూర్తి చార్జిషీట్ సమర్పించాలని, ఎల్రక్టానిక్స్ సాక్ష్యాలను ఒక వారంలోపు ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులకు సెప్టెంబర్ 17 వరకూ కస్టడీని పొడిగించింది.
పవిత్ర బెయిలు అర్జీ వాపస్
ఈ హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ కోర్టులో పెట్టుకున్న బెయిలు పిటిషన్ వెనక్కు తీసుకుంది. అయితే చార్జ్‌షీట్ దాఖలైందని, పలు సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె న్యాయవాదులు వాపస్ తీసుకున్నారు. త్వరలో కొత్త బెయిలు అర్జీ దాఖలు చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment