రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం కొద్దిరోజులుగా మెరుగ్గాలేదు. దీంతో తనకు అత్యవసర చికిత్స అవసరం అంటూ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సుమారు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.
తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న దర్శన్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్ నాగేశ్ తెలిపారు. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మైసూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో దర్శన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ ఇలా చెప్పారు.
చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. దర్శన్ కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని తెలిపారు. ఆయన వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలిలో కూడా ఆ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దర్శన్‌కు ఇప్పటికే ప్రాథమిక చికిత్సలు ప్రారంభించామని తెలిపారు. పూర్తి రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చని చెప్పారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యులు పంపిన మెడికల్ రిపోర్టులను కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment