‘విలాసం’గా... | Vilasam Movie Audio Launched | Sakshi
Sakshi News home page

‘విలాసం’గా...

Published Tue, Aug 12 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

‘విలాసం’గా...

‘విలాసం’గా...

పవన్.జి, సనంశెట్టి జంటగా పి.ఎ. రాజగణేశన్ దర్శకత్వంలో పవిత్రన్ ప్రశాంత్ నిర్మించిన ‘విలాసం’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ -‘‘సరికొత్త సినిమా ప్రపంచాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకూ రెండు వేల ఎకరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సినిమా సిటీ నిర్మించలేదు. చిన్న సినిమా నిర్మాతలకు అండగా నిలబడటం కోసం త్వరలో తెలంగాణ సినీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నాకిది తొలి సినిమా. మంచి కథ, సంగీతం కుదిరింది’’ అన్నారు. పాటలు అందరికీ నచ్చుతాయని సంగీత దర్శకుడు రవి రాఘవ్ పేర్కొన్నారు.     ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వరరెడ్డి, సత్యం రాజేశ్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement