పొలిమేర మూవీ సిరీస్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్(satyam Rajesj>). తాజాగా మరో హిస్టారికల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ఠ ఎన్.సింహ, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను(Tribanadhari Barbarik Teaser) మేకర్స్ రిలీజ్ చేశారు. పురాణాల్లో పాత్రల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి' అనే డైలాగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ప్రభావతి, మేఘన, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment