vidya balan bollywood
-
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
నటి విద్యాబాలన్ ఫాలో అయ్యే డైట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్. తనుంటే హీరోతో పనిలేదు అన్నట్లుగా సినిమా ఆశాంతా ఆమె చుట్టూనే తిరిగేలా ఆమె నటన ఉంటుంది. బ్యూటీ పరంగా ఇప్పటికీ యువ హీరోయిన్లను తలదన్నేలా గ్లామరస్‌గా ఉంటుంది. వయసు పెరుగుతుందా అన్న సందేహం వచ్చేలా ఆమె ఫిట్నెస్ ఉంటుంది. ఇంతలా గ్లామర్‌ని మెయింటెయిన్ చేసేందుకు విద్యా బాలన్ ఎలాంటి డైట్ ఫాలో అవుతుందంటే..బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆకట్టుకునే నటనా నైపుణ్యానికే గాక ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించడంలో కూడా పేరుగాంచింది. ఇటీవల ఒక ఇంటర్యూలో తను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని ఫాలో అవుతుందో షేర్ చేసుకుంది. తాను ఇంట్లో వండిన గ్లూటైన్ రహితమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాను "నో రా డైట్"ని ఫాలో అవుతానని చెప్పారు. 'నో రా డైట్' అంటే..పచ్చి ఆహారం కాకుండా వండినవి అని అర్థం. ఇక్కడ నటి విద్యా బాలన్ కూరగాయాలు, కొన్ని రకాల పండ్లు, మాంసం, పాల సంబంధిత ముడి ఆహారాలను పచ్చిపచ్చిగా తీసుకోనని చెబుతున్నారు. సురక్షితమైన పోషకాహారం కోసం చక్కగా వండిన వాటికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అనారోగ్యాలను నివారించడం కోసమే తాను ఇలాంటి డైట్‌ని అనుసరిస్తానని చెప్పారు. పచ్చి ఆహారాల్లో ముఖ్యంగా మాంసాలు, గుడ్లు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల్లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆహార వ్యాధులకు కారణమవుతాయి. ఈ ఆహారాలను పూర్తిగా ఉడికించడం వల్ల ఆయా వ్యాధికారకక్రిములు నశించి, ఇన్ఫెక్షన్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వండిన ఆహార పదార్థాల్లో సంక్లిష్ట ప్రోటీన్లు, ఫైబర్లు విచ్ఛిన్కన్నం అవుతాయి. దీంతో సులభంగా జీర్ణమయ్యి, ప్రేగు సిండ్రోమ్ లేదా జీర్ణశయాంతర రుగ్మతలు దరి చేరవు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ నో రా డైట్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉడికించి లేదా కుక్ చేసినవి తినడం వల్ల మన శరీరం పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలలోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్, క్యారెట్‌లోని బీటా కెరోటిన్‌ను కుక్ చేస్తే సులభంగా గ్రహించగలుగుతాం. ఎలా ఫాలో అవ్వాలంటే..కుక్ చేయడం వల్ల పోషక శోషణ మెరుగుపడుతుంది. పోషకాలను సంరక్షించే వంట పద్ధతులను ఉపయోగించడం ముఖ్యం. స్టీమింగ్, మైక్రోవేవ్, వంటి పద్దుతల్లో తక్కువ నీటితోనే ఉడికిపోతాయి. పోషకాల నష్టం కూడా జరగదు. అయితే ఉడకబెట్టడం వల్ల నీటిలో కరిగిపోయే విటమిన్ సీ, బీ వంటి వాటిని కోల్పోవచ్చు. అందువల్ల పోషక విలువలు కోల్పోకుండా ఉండే వంట పద్ధతులను అనుసరించడం ముఖ్యం. ఈ డైట్‌ని అనుసరించాలనుకున్నప్పుడూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. తగినంత పోషకాలు లభించేలా ఉడికించిన కూరగాయలు తోపాటు పండ్లు, ధాన్యాలు వంటివి కూడా చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వండటం వల్ల కోల్పోయిన పోషకాల నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారని అన్నారు. ఈ డైట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..కొన్ని రకాల కూరగాయాలు, పండ్లను కుక్ చేసి తీసుకోవాలి, అలాగే కొన్ని రకాల పోషకాల కోసం ఫైబర్‌తో కూడిన పప్పుధాన్యాలు పండ్లను పచ్చిగానే తీసుకోవాలని చెబుతున్నారు. వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా వండిన వాటి తోపాటు ముడి ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని అందించగలుగుతారు. దీనివల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?) -
కాఫీకి పిలిచి రూమ్‌కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
ఆ విషయాన్ని సిగ్గులేకుండా అడిగేశా: విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో తనదైన నటనతో మెప్పించింది భామ. న్యూ ఇయర్ వేళ 44వ వసంతంలో అడుగుపెట్టింది సీనియర్ నటి. ఆమె బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమె విషెష్ తెలియజేశారు. కెరీర్లో విద్యాబాలన్‌కు ఎదురైన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుల్జార్ సినిమాలో నటించాలని తన కోరిక అని తెలిపింది. ఆయన సినిమాలో నటించేందుకు ఎలాంటి సిగ్గులేకుండా అడిగానని చెప్పుకొచ్చింది. 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని అడిగానని వెల్లడించింది. (ఇది చదవండి: Chiranjeevi: ఆ విషయంలో చరణ్‌కు, నాకు పోలికే లేదు) విద్యాబాలన్ మాట్లాడుతూ..' దేవుడి దయ వల్ల నా అవసరాలు తీరాయి. మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. మా సోదరి యాడ్ ఏజెన్సీకి వైస్ ప్రెసిడెంట్. నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. కానీ నేను ఎప్పుడూ దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నేను భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. దానివల్ల నా జీవితం సంతోషంగా ఉంది. నేను గుల్జార్ సాబ్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అతను ఇకపై దర్శకత్వం వహించడని తెలిసింది. చాలాసార్లు గుల్జార్ సాబ్తో 'ఏక్ యాడ్ ఫిల్మ్ కర్ లీజియే మేరే సాథ్' అని సిగ్గులేకుండా అడిగా. నేను ఉడీ అలెన్‌తో కూడా పని చేయాలనుకుంటున్నా' అని అన్నారు. 2005లో సంజయ్ దత్ నటించిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లగే రహో మున్నా భాయ్ (2006), భూల్ భూలయ్యా (2007), ది డర్టీ పిక్చర్ (2011), మిషన్ మంగళ్ (2019) లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. శకుంతలా దేవి (2020) మూవీలోనూ మెరిసింది విద్యా చివరిసారిగా సురేష్ త్రివేణి చిత్రం జల్సాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెఫాలీ షా, మానవ్ కౌల్ కూడా నటించారు. ఆమె తదుపరి చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా డిక్రూజ్, సెంధిల్ రామమూర్తి కూడా నటిస్తున్నారు. కాగా.. గుల్జార్ మౌసం (1975), అంగూర్ (1982), మాచిస్ (1996), హు టు టు (1999) సినిమాలకు దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: నిర్మాతతో డేటింగ్.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి) -
హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే పలువురు యూజర్స్ తమకు తోచిన ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తుంటారు. కానీ వాటికి దీటుగా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌కు ఎదురైంది. 'డర్టీ పిక్చర్' సినిమాతో ఒక ఊపు ఊపేసిన విద్యా బాలన్ ఇటీవలే శకుంతల దేవి, షెర్నీ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. తాజాగా విద్యాబాలన్ నటించిన 'జల్సా' చిత్రంతో మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే ఉన్నారు. విద్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి' అనే సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్లో ఒక యూజర్ 'మీరు హాట్ ఫొటోషూట్లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. అందుకు విద్యా 'ఇది (వాతావరణం) వేడిగా ఉంది.. నేను షూటింగ్ చేస్తున్నాను. ఇది హాట్ ఫొటోషూట్ కాదా..' అని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలా తన బరువు, ఇతర అంశాలపై ఆమెను ప్రశ్నించగా పలు మీమ్స్‌తో సమాధానాలిచ్చింది విద్యా బాలన్. -
ఓటీటీలోకి 'జల్సా' చిత్రం.. ముచ్చటగా మూడోసారి
Vidya Balan Jalsa Movie Released In OTT: కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమాలకు ప్రత్యామ్నాయంగా కనిపించినవి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. తర్వాత కొద్ది రోజులకు చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇవే కాకుండా బడా హీరోలు, అగ్ర నటులు సైతం ఓటీటీకే మొగ్గు చూపారు. బాలీవుడ్లో అత్యుత్తమ ప్రతిభగల నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. ఒటీటీలో సినిమాను విడుదల చేసి హిట్ కొట్టిన మొదటి బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఆమె 2020లో నటించిన 'శకుంతల దేవి' చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. తర్వాత 2021లో 'షేర్ని' మూవీతో ఆ విజయ పరంపరను కొనసాగించింది. తాజాగా 'జల్సా' సినిమాతో తాను హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. జల్సా సినిమాను ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు విద్యా బాలన్ నటించిన 'తుమ్హారీ సులు' డైరెక్టర్ సురేష్ త్రివేణి దర్శకత్వం వహించారు. ఇందులో విద్యా ఒక జర్నలిస్టుగా నటించింది. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు విద్యా బాలన్ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే విడుదలై విజయం సాధించాయి. మరీ ఈ సినిమా ఓటీటీలో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందో చూడాలి. -
రొమాన్స్ కు వయసుతో పనిలేదు:విద్యాబాలన్
ముంబై: రొమాన్స్ ను పండించడానికి వయసుతో పనిలేదని అంటోంది బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యా బాలన్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'బాబీ జాసస్'చిత్రంలో యువ నటుడు ఆలీ ఫైజల్ తో జోడీ కడుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన విద్య.. సినిమాల్లో హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండించటానికి ఏ వయసైన ఫర్వాలేదని అభిప్రాయపడింది. సినిమాలో కథకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు వయసులో వ్యత్యాసాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సమర్ షేక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విద్య, ఆలీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకు్న ఈ చిత్రం జూలై 4 వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది.బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహంలతో నటించిన విద్య.. బాలీవుడ్ అగ్రనటులు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లతో మాత్రం నటించలేదు. తగిన స్ర్కిప్ట్ దొరికినప్పుడు వారితో తప్పక నటిస్తానంటోంది ఈ 36 ఏళ్ల బాలీవుడ్ భామ.