Vidya Balan Epic Reply to User Who Asked Hot Photoshoots - Sakshi
Sakshi News home page

Vidya Balan: హాట్‌ ఫొటోషూట్స్‌ ఎందుకు చేయరన్న నెటిజన్‌.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై

Published Tue, Mar 15 2022 5:33 PM | Last Updated on Tue, Mar 15 2022 7:00 PM

Vidya Balan Epic Reply To User Who Asked Hot Photoshoot - Sakshi

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియా వేదికగా ఇంటరాక్ట్‌ అవుతుంటారు. ఈ క్రమంలోనే పలువురు యూజర్స్‌ తమకు తోచిన ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తుంటారు. కానీ వాటికి దీటుగా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యా బాలన్‌కు ఎదురైంది. 'డర్టీ పిక్చర్‌' సినిమాతో ఒక ఊపు ఊపేసిన విద్యా బాలన్‌ ఇటీవలే శకుంతల దేవి, షెర్నీ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. 

తాజాగా విద్యాబాలన్‌ నటించిన 'జల్సా' చిత్రంతో మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో తరచు యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్‌. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ కూడా ఎక్కువే ఉన్నారు. విద్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి' అనే సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్‌లో ఒక యూజర్‌ 'మీరు హాట్‌ ఫొటోషూట్‌లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. అందుకు విద్యా 'ఇది (వాతావరణం) వేడిగా ఉంది.. నేను షూటింగ్‌ చేస్తున్నాను. ఇది హాట్‌ ఫొటోషూట్‌ కాదా..' అని గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఇలా తన బరువు, ఇతర అంశాలపై ఆమెను ప్రశ్నించగా పలు మీమ్స్‌తో సమాధానాలిచ్చింది విద్యా బాలన్‌. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement