user
-
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడిపోయారు జనాలు. అంతకు ముందు కూడా చేశారు గానీ. ఆ మహమ్మారి తర్వాత నుంచి ఆన్లైన్ షాపింగ్ మహా ఎక్కువయ్యింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇలానే ఓ మహిళ కొడుకు బ్లింకిట్ నుంచి పెద్ద మొత్తంలో కూరగాయాలు కొనుగోలు చేశాడు. డెలివరీ అయ్యాక బిల్ చూసి తల్లి షాకయ్యింది. ఏంటిది ఇంత మొత్తంలో కూరగాయాలు కొన్న కొత్తిమీరకు కూడా బిల్లు వేస్తారా అని విస్తుపోయింది. ఈ విషయమై తన కొడుకుతో చెప్పింది. తన తల్లి ఆలోచననను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ..'నేను బ్లింకిట్ (Blinkit)లో కూరగాయలు కొనుగోలు చేశా. అందులో కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు బాధ కలిగింది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా! అని ఆమె భావిస్తోంది.' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీన్ని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధింద్సాకి ట్యాగ్ చేశారు. వినియోగదారుడు సోషల్ మీడియా పోస్ట్‌కి రెస్పాండ్ అయిన అల్మిందర్ ధింద్సా దీని గురించి పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత జస్ట్ నాలుగు గంటల్లోనే ఫాలో అప్ పోస్ట్‌లో ధింద్సా ఫ్రీగా కొత్తిమీర ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్ సావంత్ తల్లిగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేస్తాం అని ధింద్సా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇలా ఓసామన్య వినియోగదారుడి పోస్ట్‌పై సీఈవో సత్వరమే స్పందించడంపై ప్రశంసల జల్లు కురిపించారు నెటిజన్లు. అంతేగాదు మరిన్నింటిని ఉచితంగా ఇవ్వొచ్చు అంటూ సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు.It’s live! Everyone please thank Ankit’s mom 💛 We will polish the feature in next couple of weeks. https://t.co/jYm2hGm67a pic.twitter.com/5uiyCmSER6— Albinder Dhindsa (@albinder) May 15, 2024 (చదవండి: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో) -
భారత్‌లోకి టెస్లా.. పేరు మార్చుకుంటేనే పనవుతుంది! వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్‌లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్‌ఫారమ్‌లో తన యూజర్ నేమ్‌ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్‌ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్‌ను ఎలాన్ భాయ్‌గా మార్చకుండా భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు. .@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai? — Carl Bhai (@getpeid) February 18, 2024 ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది. -
గ్రేట్ లాండ్రీవాలా.. నిజాయితీ చాటుకుని, రూ.2100 అందుకుని..
మీరెప్పుడైనా ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టి మరచిపోయారా? అలాగే ఉతికేందుకు ఇచ్చేశారా? ఇంట్లోనైతే ఫర్వాలేదు కానీ... బయట లాండ్రీకి ఇస్తే? ఇక అంతే సంగతులు. ఆ డబ్బులను శాశ్వతంగా మరచిపోవచ్చు. ఇదీ మన అనుభవం కానీ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి వ్యక్తి ఒకరికి దీనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. జేబులో ఉంచి మరచిపోయిన డబ్బు అంతకు అంతా తిరిగి వచ్చింది. లాండ్రీవాడి నిజాయితీ పుణ్యం! వివరాలు ఏమిటంటే... మధ్యప్రదేశ్‌లోని శివపురిలోని సంతోషి మాత ఆలయానికి సమీపంలో సూపర్ లాండ్రీ దుకాణం ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న డ్రై క్లీనర్ పంచమ్ రజక్‌కు కొన్ని దుస్తులు డ్రైక్లీనింగ్‌కు వచ్చాయి. వాటిని వాషింగ్ మెషీన్‌లోకి వేసేందుకు సిద్ధం చేస్తూండగా అందులో 500 రూపాయల నోట్ల కట్ట కనిపించింది. కట్టలో మొత్తం 50 వేల రూపాయలు ఉన్నట్లు స్పష్టమైంది. అంత డబ్బు చూసిన రజక్‌కు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. నిజాయితీ పరుడు కావడంతో ఈ విషయాన్ని వెంటనే వినియోగదారుడికి తెలియజేశాడు. తరువాత పంచమ్ రజక్ ఆ కస్టమర్ ఇంటికి వెళ్లి, రూ.50 వేల మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. అతని నిజాయితీని గుర్తించిన కస్టమర్ అతనికి బహుమానంగా రూ.2100 అందజేశాడు. కాగా ఈ సంగతి తెలుసుకున్న స్థానికులు డ్రై క్లీనర్ పంచమ్ రజక్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. -
వినియోగదారుల కేసుల పరిష్కారంలో కృత్రిమ మేధ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కృత్రిమ మేధని వినియోగిస్తుండటం శుభపరిణామమని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్(ఎన్సీఆర్డీ) అధ్యక్షుడు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘వినియోగదారుల హక్కులు, రక్షణ’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శులు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు, వినియోగదారుల గ్రూపులు, ఎన్జీవోలు హాజరయ్యారు. వినియోగదారుల రక్షణ ఫ్రేమ్‌వర్క్, డెవలప్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్, ప్రెస్ మానిటరింగ్, లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జస్టిస్ సాహి మాట్లాడుతూ వినియోగదారుల కమిషన్ గత ఏడాది 1.26 లక్షల కేసులు పరిష్కరించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1.36 లక్షల కేసులు పరిష్కరించడం శుభపరిణామమని చెప్పారు. కేసుల పరిష్కారం కోసం కాన్ఫోనెట్ 2.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. వినియోగదారులు 17 ప్రాంతీయ భాషల్లో ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. ప్రతి నెలా వినియోగదారుల హక్కుల కంట్రోల్ రూమ్‌కు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు తమ హక్కుల పట్ల అవగాహన పెరిగిందని, ఇది స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్, ప్రత్యేక కార్యదర్శి నిధి ఖరే, ఏపీ ప్రభుత్వ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటంతోపాటు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆయా రాష్ట్రాల సహకారంతో పని చేస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా తూనికలు, కొలతల పరికరాలను విక్రయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించిన ఓఐఎంఎల్ సర్టిఫికెట్లను జారీ చేసే అథారిటీని పొందిన 13వ దేశంగా భారత్‌ను జాబితాలో చేర్చడంలో కృషి చేసిన లీగల్ మెట్రాలజీ విభాగానికి అభినందనలు తెలిపారు. -
‘ఫొటో చూసి ఎత్తు చెప్పండి’ అమ్మడి ప్రశ్నకు ఐఫోన్‌తో నెటిజన్ సమాధానం!
సోషల్ మీడియాలో రోజురోజుకూ విచిత్రమైన పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా x (గతంలో ట్విట్టర్)లో ఒక యువతికి సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. దీనిలో ఆమె యూజర్స్‌కు ఒక ప్రశ్న సంధించింది. వెంటనే దీనికి సమాధానాలు, కామెంట్ల వెల్లువ మొదలయ్యింది. తన ఎత్తు ఎంతో చెప్పమన్న ఆ అమ్మడిని కంగుతినిపిస్తూ యూజర్స్ సమాధానాలిస్తున్నారు. guess my height 👀 pic.twitter.com/02t86D25a7 — S. (@daalmakhniiii) August 12, 2023 xలో దాల్‌మఖనీ పేరు కలిగిన యూజర్ తనకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె ఒక ఐఫోన్ పట్టుకుంది. ‘నా హైట్ ఎంతో చెప్పండి’ అని అడిగింది. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ లక్షల్లో సమాధానాలు వచ్చాయి. 1500కు పైగా యూజర్స్ ఈ పోస్టును లైక్ చేశారు. సాగర్ అనే యూజర్ చేసిన కామెంట్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆమె చేతిలోని ఐఫోన్-12 పొడవు 14.6 సెంటీమీటర్లు అని పేర్కొంటూ, ఆమె ఫొటో పక్కన అంటే తల మొదలు కొని పాదాల వరకూ ఒక్కొక్కటిగా 9 ఫోన్లను పెడుతూ వచ్చాడు. దీనిని మొత్తం లెక్కించాక ఆమె ఎత్తు 4 అడుగుల 31 ఇంచీలు అని తేల్చిచెప్పాడు. రాహుల్ అనే యూజర్ ఎన్నో దుర్గుణాలు కలిగిన రావణుడు కూడా ఏనాడూ ఇటువంటి ప్రశ్న అడగలేదని కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. 4.31 ft pic.twitter.com/mmtgmh1LAk — Sagar Budhwani (@Sagarbudhwani_) August 12, 2023 -
క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!
ప్రస్తుత డిజిటల్ యుగంలో డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డు ఉండటం చాలా అవసరంగానూ సర్వసాధారణంగానూ మారిపోయింది. లావాదేవీల పరంగా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండూ దాదాపు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. అయితే వాటికి కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి ఖర్చు చేయడానికి డెబిట్ కార్డ్ ఉపయోగపడితే, ఖాతాలో డబ్బులేకపోయినా, లిమిట్ మేరకు తక్షణ అవసరాలకు వాడుకుని భవిష్యత్తు చెల్లింపు సూత్రంపై క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి క్రెడిట్ స్కోర్. క్రెడిట్ కార్డ్‌ని షాపింగ్ చేయడానికి, అవుట్లెట్లలో చెల్లింపులకు, ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి, ఏటీఎం నగదును విత్‌డ్రా చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ నగదు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ లేదా బ్యాంకు క్రెడిట్ పరిమితి నుండి లోన్‌గా లభిస్తుంది. లావాదేవీ జరిగిన తేదీ నుండి గరిష్టంగా 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిలో లోన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అయితే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే భారీ షాక్ తప్పదు. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వోచర్లను సంపాదించవచ్చు. ఈ పాయింట్లు క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ నుండి ఆకర్షణీయమైన బహుమతులు, షాపింగ్ వోచర్ల ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో ఉపయోగించక పోతే క్రెడిట్ కార్డ్ తిప్పలు తప్పవు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నివారించాల్సిన అత్యంత సాధారణ తప్పులను చూద్దాం. సకాలంలో చెల్లింపులు క్రెడిట్ కార్డ్ గడువు తేదీని అస్సలు మిస్‌కాకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్లో మొత్తం ఖర్చులపై 48 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని అనుమతి ఉంటుంది. దీని ఆధారంగా ప్రతి నెల నిర్దిష్ట తేదీలోపు బకాయిలను క్లియర్ చేయాలి. గడువు తర్వాత బకాయి మొత్తంపై వడ్డీ బాదుడు ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో.. సకాలంలో బిల్ చెల్లించలేకపోతే, క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. భవిష్యత్తులో లోన్ పొందే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) చెల్లించాల్సిన కనీస మొత్తం, వడ్డీ వివరాలు పూర్తిగా చూడాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మొత్తం లోన్ అమౌంట్ చెల్లించలేక, ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే ఈ మెయిల్ ద్వారా అందించే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను పూర్తిగా చదవాలి. ఇందులో లోన్లపై వివరాలు, వడ్డీ, చెల్లించాల్సిన మినిమం నగదు లాంటి వివరాలు పరిశీలించాలి. ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో పేర్కొన్న అన్ని లావాదేవీలు ఖచ్చితమైనవేనా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పొరబాటు లేదా మోసపూరిత లావాదేవీ జరిగినట్లయితే క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్‌లు వడ్డీ ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, వార్షిక రుసుములు మొదలైన అనేక ఛార్జీలుంటాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో అలాంటి ఛార్జీలు ఏవైనా ఉంటే, అన్యాయమని భావిస్తే వాటిపై ప్రశ్నించవచ్చు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నగదు విత్‌డ్రా అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసరమైతే తప్ప దీన్ని వాడ కుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఇలాంటి నగదు అడ్వాన్సులపై అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. అంతేకాదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ షురూ అవుతుంది. అంతేకాకుండా, రుణ మొత్తం పెరుగుతూనే ఉండి చివరికి బిల్లును తడిసి మోపెడవుతుంది. క్రెడిట్ లిమిట్ మించకుండా క్రెడిట్ కార్డ్ వాడేటపుడు మన లిమిట్‌ను ఖచ్చితంగా గమనించాలి. క్రెడిట్ రేషియోలో 50శాతం లేదా అంతకంటే తక్కువ వాడటం ఉత్తమం. ఇలాంటి వాటిల్లో తేడా వస్తే క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా దెబ్బ తింటుంది. అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డ్ భారతదేశంలో అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు నిబంధనలు, షరతులు, ఛార్జీలు, ఫీచర్లు, ప్రయోజనాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ఉదాహరణకు విమాన టిక్కెట్లు ,హోటల్స్బుక్ చేసుకోవడానికి అదనపు ప్రయోజనా లందించే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ఉన్న క్రెడిట్ కార్డ్ కోసం కూడా వెతకవచ్చు, తద్వారా ఇతర క్రెడిట్ కార్డ్‌ల నుండి తక్కువ వడ్డీ రేట్లకు లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. చివరగా: క్రెడిట్ కార్డ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, కానీ వాటిని తెలివిగా వాడితేనే ఫలితం. లేదంటే అనవసరమైన అప్పులు చిక్కులు తెచ్చిపెడతాయి. అన్నింటికంటే మించి, అవసరాలకు సరిపోయే సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. నిర్లక్ష్యంగా అవకాశం ఉంది కదా అని ఎలాంటి ప్లాన్స్ లేకుండా వాడేస్తే ఆ తరువాత వాటిని చెల్లించలేక నానా అగచాట్లు పడాలి. వడ్డీకి వడ్డీకి పెరిగి పెద్ద గుదిబండలాగా మెడకు చుట్టుకుంటుంది. (బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) -
మన దేశంలో ట్విటర్ తొలి యూజర్ ఎవరో తెలుసా?
దాదాపు 16 ఏళ్ల కిందట.. ట్విటర్ పుట్టుక దశలో ఉన్నప్పుడే మన దేశం నుంచి ఒకావిడ ఆ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను వాడింది. ఆవిడ పేరే నైనా రెద్దు. దేశంలోనే తొలి ట్విటర్ యూజర్ అనే విషయం మీకు తెలుసా?. అంతేకాదు ఆమె ప్రొఫైల్‌కు బ్లూటిక్ కూడా ఉంది. తాజాగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లడం.. గుణాత్మకం పేరిట అందులో చోటు చేసుకుంటున్న మార్పులపై నైనా స్పందించారు. ఆర్కుట్, బ్లాగింగ్ జమానా టైంలో ట్విటర్ ఇంకా అధికారికంగా అడుగుపెట్టని సమయమది. ఆ ఏడాది(2006)లో TWTTR(ట్విటర్ ప్రాజెక్టు కోడ్ పేరు) పేరిట ఒక మెయిల్ నైనాకు వచ్చింది. ఏదో ఇన్విటేషన్ అనుకుని అందులో చేరారామె. అలా చేరిన ఆమె.. భారత్ తరపున తొలి ట్విటర్ యూజర్ ఖ్యాతిని దక్కించుకున్నారు. నైనా రెద్దు ప్రస్తుతం.. జైసల్మేర్(రాజస్థాన్)లోని ఓ హోటల్లో పని చేస్తున్నారు. అది కాక ఇంకా ఆమెకు కొన్ని హాబీలు పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో 22 వేల పైగా ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అందులో సెలబ్రిటీలే ఎక్కువ కావడం గమనార్హం. అయినా ఫాలోవర్స్ సంఖ్య ప్రామాణికం కాదంటున్నారు ఆమె. ఇప్పటిదాకా ఆమె లక్షా 75వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి ట్విటర్లో ఇప్పటిదాకా వచ్చిన మార్పులు, ఎలన్ మస్క్ పగ్గాల గురించీ ఆమె స్పందించారు. TWTTR పేరుతో అందింన ఆహ్వానం నాకింకా గుర్తుంది. అది ట్విటర్ మహావృక్షంగా ఎదుగుతుందని ఆనాడు నేను ఊహించనే లేదు. ఆ టైంలో భారత్ నుంచి యూజర్లు ఎవరూ లేరు. ట్విటర్ ఉద్యోగులు, వాళ్ల స్నేహితులు మాత్రమే ఛాటింగ్‌లో పాల్గొనేవాళ్లు. ముంబైలో ఉద్యోగం కోసం వచ్చాక.. నేనూ అందులో మెసేజ్‌లు చేయాలని అనుకున్నా. కేవలం అదొక మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అనుకుని ఆగిపోయా. అలా ఏడాదిన్నర గడిపోయాక.. ఆ ప్లాట్‌ఫామ్ గురించి విషయం అర్థమైంది. ట్వీట్లు చేయడం ప్రారంభించా. అమెరికాలో ఓ ఆర్టికల్‌లో తొలి 140 మంది ట్విటర్ యూజర్ల మీద ఓ కథనం ప్రచురితమైంది. అందులో నా పేరు చూసుకున్నాకే అర్థమైంది.. ఇదేదో ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్ అని. ఆ తర్వాత తక్కువ యూజర్లే ఉన్నప్పటికీ.. తొలి యూజర్‌కావడంతో ట్విటర్ నుంచి ఆమెకు బ్లూటిక్ మార్క్ దక్కింది. ఇక తాజాగా ఎలన్ మస్క్ బ్లూటిక్కు డబ్బులు వసూలు చేసే అంశంపైనా నైనా స్పందించారు. నెలకు రూ.650(8 డాలర్లు) దాకా చెల్లించాలని అంటున్నారు. అసలు ఎందుకు చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదు కదా. ఇప్పుడున్న బ్లూటిక్ అకౌంట్ల విషయంలోనా? కొత్తగా రాబోతున్న అకౌంట్ల విషయంలోనా? లేదంటే ఇంకా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ప్రతీ ఒక్కరికీ అంటే మాత్రం అది సహేతుకం కాదు. ట్విటర్ ఒక ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ ఫిగర్లకు వెరిఫై పేరిట బ్లూటిక్‌లను కేటాయించడం మొదలుపెట్టింది. గత 16 ఏళ్లుగా నేను చెల్లింపులు చేయలేదు. అలాంటిది ఇప్పుడెందుకు చేయాలి? అని మస్క్ నిర్ణయంపై నిలదీశారామె. ఇక భారత్‌లో బ్లూటిక్ చెల్లింపుల పరిణామం అంతగా ఉండకపోచ్చని ఆమె వ్యాఖ్యానించారు. బ్లూటిక్ అనేది సాధారణంగా అవసరం లేని వ్యవహారం. కచ్చితంగా కావాలని అనుకునేవాళ్లు డబ్బు చెల్లిస్తారు. అవసరం లేదనుకునే వాళ్లు మానుకుంటారు. అయితే ఇండిపెండెంట్ జర్నలిజం లాంటి పనులు చేసుకునేవాళ్లకు మాత్రం ఇది ప్రభావం చూపించొచ్చు అని నైనా తెలిపారు. ఇక ట్విటర్ స్వేచ్ఛా ప్రకటనపై ఆమె భిన్నంగా స్పందించారు. ట్విటర్‌కు స్వేచ్ఛకు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని అన్నారామె. మిగతా యాజర్లలాగా తాను ఇతర సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నానని, ట్విటర్లో రాబోయే మార్పులు తనపై ప్రభావం చూపించకపోవచ్చని ఆమె అంటున్నారు. Whatever is said and done, there's definitely more excitement on Twitter now, than I've seen in ages, that has nothing to do with government politics. — Naina (@Naina) November 8, 2022 -
మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు
బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్‌గా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసేటపుడు, షాపింగ్ చేసేటపుడు, హోటల్‌కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం. ఎక్కువ రేటింగ్, పాజిటివ్ రివ్యూలు ఉన్నవాటిని మరో ఆలోచన లేకుండా ముందుకు పోతాం. అయితే జొమాటో తన ప్లాట్‌ఫాంలో నెగిటివ్ రివ్యూలను డిలీట్ చేసిందట. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఒక మహిళా యూజర్ ఫిర్యాదు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన దిశా సంఘ్వీ కోరమంగళలోని ఓ రెస్టారెంట్ కెళ్లి భోజనం చేశారు. అయితే ఆతర్వాత తనకు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందంటూ జొమాటోలో రివ్యూ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి అనుభవం కేవలం తన ఒక్కదానికి మాత్రమే పరిమితం కాలేదని ఆరోపించారు. తన సహోద్యోగి కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యాడని, గత కొన్ని నెలల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్న అనేక మంది తన దృష్టికి వచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ రివ్యూని తొలగించడం వివాదాన్ని రేపింది. (Bharti Airtel:అదరగొట్టిన భారతి ఎయిర్టెల్) తన రివ్యూని జొమాటో తొలగించడంపై దిశా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కంపెనీ తొలగించిన తన రివ్యూ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో ఆదివారం షేర్ చేశారు. అలాగే తన రివ్యూను తొలగిస్తూ జొమాటో అలర్ట్ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సరైన ప్లాట్‌ఫారమ్ కాదని జొమాటో ఇమెయిల్‌లో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్‌లో వచ్చిన రివ్యూ తనిఖీలో భాగంగా కంటెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గమనించామని అందుకే ఆ రివ్యూని తొలగించామని వివరణ ఇచ్చినట్టు ఇందులో ఉంది. దీంతో కొన్ని గంటల్లోనే ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. వేల కొద్దీ లైక్‌లు వందల కొద్దీ రీట్వీట్లు , కామెంట్ల వెల్లు వెత్తింది. ఇక తప్పక జొమాటో స్పందించింది. ఫోన్ నంబర్ / ఆర్డర్ ఐడీని ప్రైవేట్ మెసేజ్ ద్వారా షేర్ చేయాలని ఈ విషయాన్ని వెంటనే పరిష్కరిస్తాంటూ జొమాటో రిప్లై ఇచ్చింది. అయితే ఇంటర్నెట్ వినియోగదారులు కంపెనీ చెబుతున్నకంటెంట్ మార్గదర్శకాలపై మండిపడుతున్నారు. తమ అనుభవాన్ని షేర్ చేస్తే 'దుర్వినియోగం' అంటున్నారు. ఇక కమెంట్స్ ఆప్షన్ దేనికి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించారు."హలో జొమాటో! నేను చూడాలనుకుంటున్నది సరిగ్గా ఇలాంటి రివ్యూనే. ఆహారం యావరేజ్‌గా ఉంటే, అది కేవలం ప్రయత్నించి దాటవేయడం మాత్రమే. కానీ ఆ ఆహారం నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలిగితే, అది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన విషయం. సమాధానం చెప్పాలి అని మరొకరు రాశారు. "హే జొమాటో, అసలు మీ నిబంధనల్లోనే ఏదో తీవ్రమైన లోపం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలనే రిపోర్ట్ చేయాలి. వినియోగదారులకు అవగాహన కలగాలి. ఇది అన్యాయమైతే సదరు విక్రేతను ప్రతిస్పందించనివ్వండి" అని మరొకరు వ్యాఖ్యానించారు.వెంటనే జొమాటో లిస్టింగ్లోంచి ఆ రెస్టారెంట్‌ను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. A recent visit to a restaurant in Koramangala, B'lore left my colleague and me with a severe case of food poisoning. I wrote a review on @zomato and while doing so, found that many people had a similar experience in the last few months. Zomato took down the review citing this👏🏻 pic.twitter.com/O3V1lbpzN9 — Disha Sanghvi (@DishaRSanghvi) October 30, 2022 its funny when @zomato doesn't take down the restaurant listing based on the health code violation or get that inspected. Instead -- they take down your listing — swati poddar (@swatipoddar) October 30, 2022 @zomato does not care of a restaurant causes frequent food poisoning. This is an anti-consumer stance . As a customer I want to know if a restaurant has minimal hygiene standards. Censoring hygiene related reviews makes Zomato’s review system meaningless. https://t.co/ZmvkymoYy9 — MooseMan (@moosemaniam) October 30, 2022 -
రూ. 10 ప్యాకెట్లో 5 చిప్స్! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్ ఇస్తారా?!
సాక్షి, ముంబై: చిరుతిండి, కాలక్షేపం అనగానే దాదాపు అందరి దృష్టి చిప్స్ వైపే మళ్లుతుంది. ఎంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కొన్నా.. అందులో గ్యాస్ ఎక్కువ.. చిప్స్ తక్కువ ఇది అందరికి తెలిసిన సంగతే. తాజాగా మరో వింత సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది. 10రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్ ఉండటంతో తెల్లబోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సెటైర్లతో సందడి చేస్తున్నారు. ఒక విద్యార్థి కాలేజీకి వెడుతూ పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. కట్ చేస్తే.. అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్ చేయగానే.. చిప్‌కు రెండు రూపాయలు భయ్యా.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్ చేతిలో పెడతారేమో అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. గత 27 ఏళ్లుగా టాప్ క్వాలీటీ మసాలా ఎయిర్ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్లీ గ్యాస్... మనం తినే చిప్స్ జస్ట్ కాంప్లిమెంట్.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే పలువురు యూజర్స్ తమకు తోచిన ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తుంటారు. కానీ వాటికి దీటుగా స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంటారు సెలబ్రిటీలు. ఇలాంటి సంఘటనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్‌కు ఎదురైంది. 'డర్టీ పిక్చర్' సినిమాతో ఒక ఊపు ఊపేసిన విద్యా బాలన్ ఇటీవలే శకుంతల దేవి, షెర్నీ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. తాజాగా విద్యాబాలన్ నటించిన 'జల్సా' చిత్రంతో మార్చి 18న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్‌గా ఉంటుంది విద్యా బాలన్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే ఉన్నారు. విద్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏదైనా అడగండి లేదా ఏమైనా చెప్పండి' అనే సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్లో ఒక యూజర్ 'మీరు హాట్ ఫొటోషూట్లు ఎందుకు చేయకూడదు?' అని ప్రశ్నించాడు. అందుకు విద్యా 'ఇది (వాతావరణం) వేడిగా ఉంది.. నేను షూటింగ్ చేస్తున్నాను. ఇది హాట్ ఫొటోషూట్ కాదా..' అని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇలా తన బరువు, ఇతర అంశాలపై ఆమెను ప్రశ్నించగా పలు మీమ్స్‌తో సమాధానాలిచ్చింది విద్యా బాలన్. -
ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు: ఫేస్ బుక్
ప్రస్తుతం సోషల్ మీడియా నెట్టింట ఎంతలా ప్రభంజనం సృష్టిస్తోందో మనకు తెలియంది కాదు. అలాంటి సోషల్ మీడియాపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వినియోగదారుల సమాచారం లీకవుతోందంటూ రకరకాలు విమర్శలు సర్వత్రా ఎదురైనప్పటికీ వాటిన్నంటిని అధిగమిస్తూ ఫేస్బుక్ తనదైన శైలిలో దూసుకుపోతుంది. కానీ, ఇప్పటికీ సంస్థపై రూమర్లు, తప్పుడు ప్రచారాలు ఆగడం లేదు. సరిగ్గా అలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రముఖ ది వాల్‌స్ట్రీట్ జర్నల్ ఫేస్బుక్ పై కొన్ని కథనాలను ప్రచురించింది. ఫేస్బుక్ ఉద్యోగులు, యాజమాన్య సిబ్బంది వినయోగదారులకు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంలో విఫలమైందని, ఒకవేళ గుర్తించినప్పటికీ దాన్ని అధిగమించిలే సరొకొత్త విధానాలు తీసుకురాలేకపోయిందంటూ... ఆరోపిస్తూ కథనాలను ప్రచురించింది. అలాగే ప్రముఖులకు ఫేస్బుక్ నుంచి మినహాయింపులు, ఇన్‌స్ట్రాగాం యాప్ వినియోగించే యువ వినియోగదారులపై ప్రతికూలభావాలను తగ్గించేలా అల్గారిథమ్ మార్పులు చేసిందని విమర్శించింది. అభివృద్ధి చెందిన దేశాలు మానవ అక్రమ రవాణకు ఫేస్బుక్ ఫ్లాట్ ఫాంని ఎలా వినయోగించుకుంటాయంటూ ఫేస్బుక్ ఉద్యోగులు ఎదురు ప్రశ్నిస్తున్నారంటూ.. రకరకాలుగా కథనాలు ప్రచురించింది. (చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్) ఈ క్రమంలో ఫేస్బుక్ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లాగ్ మాట్లాడుతూ...."ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనాలు ఫేస్బుక్ లీడర్ షిప్, ఉద్యోగుల పట్ల తప్పుడు భావం కలిగేలా ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించింది. అంతేకాదు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేసిందంటూ తీవ్రంగా విరుచుకుపడింది. ఇవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టిపడేశారు. సంస్థకు ఇబ్బంది కలిగించే వాటిని విస్మరిస్తాం. కోవిడ్ వ్యాక్సిన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా పోస్టులు చేస్తుందన్న విషయాన్ని గుర్తుచేశారు. పరిశోధన విభాగంలో సోషల్‌మీడియా కొత్త ఒరవడులు సృష్టిస్తున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న సమస్యలుగానే మిగిలుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: గిన్నిస్ బుక్‌లోకి వైట్ పెయింట్.. కరెంట్ సేవ్‌తో పాటు ఏసీలను మించే చల్లదనం!!) -
పోర్న్ వీడియో? ట్విటర్ తప్పులో కాలు
సాక్షి, న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్ తప్పులో కాలేసింది. ఐఫోన్ 12 మినీ వీడియోను అప్లోడ్ చేసినందుకు ఒక యూజర్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వీడియోను పోర్న్ వీడియోగా పొరబడి అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో సదరు లబోదిబోమన్నాడు. వివరాల్లో వెళ్లితే నిఖిల్ చావ్లా అనే యూజర్, ఐఫోన్ 12 మినీ వీడియో టీజర్‌ను తన ట్విటర్ ఖాతాలో అప్లోడ్ చేశాడు. అంతే పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత అతని ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ ఉందంటూ ఈ వీడియోను తొలగించింది. ఆ తరువాత ఖాతాను అన్‌లాక్ చేసి, అభ్యంతరమైన, అశ్లీల కంటెంట్‌ను తొలగించడమో,రిపోర్ట్ చేయడమో చేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చేలోపే తన అకౌంట్‌ను మరో 24 గంటలు బ్లాక్ చేశారని వాపోయాడు. చివరకు ట్విటర్ పాలసీ టీంను సంప్రదించి తన ఖాతా అన్‌లాక్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే యూజర్ పోస్ట్ చేసిన ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో కంటెంట్‌ను ట్విటర్ అల్గోరిథం అభ్యంతరకరమైందిగా గుర్తించిందని ట్విటర్ తెలిపింది. ఇలాంటి వాటిని నిరోధించేందుకు వినియోగదారులు సేఫ్టీ సెటింగ్స్‌లో మీడియా సెన్సెటివ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది. Working with the @Twitter @Policy team to get our founder @nikhilchawla’s account back with the iPhone 12 Mini video tweet that was erroneously marked as intimate content. We have filed an appeal! @TwitterIndia @manishm @keyamadhvani @jack Thank you all for your support! pic.twitter.com/ZgKiJtOzmL — The Unbiased Blog (@TheUnbiasedBlog) January 5, 2021 -
మీకొక నామినీ కావాలి..?
ఎన్నో రకాల ఆర్థిక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమనే అలవాటు నేటి తరంలో ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు ఆర్జించే ప్రతీ వ్యక్తి పేరిట బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో పెట్టుబడులు ఉంటుంటాయి. భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం వీటిని ఆశ్రయించే వారు ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్ చేయడమనే కాకుండా, సంబంధిత వ్యక్తికి ప్రాణ ప్రమాదం జరిగితే పెట్టుబడులన్నీ కుటుంబానికి చెందేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ పెట్టుబడి సాధనంలో నామినీ పేరును రిజిస్టర్ చేయడం లేదా విల్లు రాయడం... ఈ రెండింటిలో ఏదో ఒక్కటైనా తప్పనిసరిగా చేయడాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడినట్టు అవుతుంది. ఇందుకు ఏం చేయాలన్నది తెలియజేసే కథనమే ఇది... ఓ ఇన్వెస్టర్ తను మరణం సంభవిస్తే, తన పేరిట ఉన్న పెట్టుబడులను స్వీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఫలానా అంటూ వారి పేరును నమోదు చేయడమే నామినేషన్ . ఆర్థిక సేవల సంస్థ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ, బీమా సంస్థలకు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఇది. నామినీ నమోదు చేయడం వల్ల పెట్టుబడులను వారి పేరిట బదిలీ చేయడం సులభతరం అవుతుంది. ఇన్వెస్టర్ మరణించిన తర్వాత వారి పేరిట ఉన్న పెట్టుబడులను నామినీగా ఉన్న వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ నమోదు చేసుకోకుండా, ఓ ఇన్వెస్టర్ మరణించినట్టయితే అప్పుడు వారసులు ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ చేసుకునే వారు ఇన్వెస్టర్ మరణ ధ్రువీకరణ పత్రం, ఇన్వెస్టర్‌తో తనకున్న అనుబంధం (లీగర్ హేర్ సర్టిఫికెట్), తనకున్న హక్కులను రుజువు చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎక్కువ సమయం, శ్రమతో కూడిన పని. ప్రతీ ఇన్వెస్టర్ నామినీ పేరును నమోదుతో పాటు, నిర్ణీత కాలానికి ఓసారి సమీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే, ఉదాహరణకు... వివాహానికి పూర్వం బ్యాంకు ఖాతా తెరిచిన వారు, పెట్టుబడులు పెట్టిన వారు తమ తండ్రి లేదా తల్లి లేదా సోదరుల్లో ఒకరి పేరును నామినీగా ఇచ్చి ఉండొచ్చు. వివాహం అయిన తర్వాత నామినీగా తన భార్యను చేర్చుకోవడం సరైన చర్య. మరో ప్రత్యామ్నాయంగా విల్లు రాసుకోవడం కూడా మంచిదే. తన తదనంతరం తన పేరిట ఉన్న పెట్టుబడులు, ఆస్తులు ఎవరికి ఎంత మేర చెందాలనేది విల్లులో స్పష్టం చేసినా సరిపోతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... విల్లు రాసినట్టయితే, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన నామినేషన్ రద్దయినట్టే. షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో మాత్రం నామినేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. భిన్న సాధనాల్లో నామినేషన్ , క్లెయిమ్ ప్రక్రియ వివరాలను పరిశీలిద్దాం... జీవిత బీమా కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల పాలవకుండా ఆదుకునే సాధనమే జీవిత బీమా. కనుక జీవిత బీమా పాలసీల్లో నామినీ పేరును నమోదు చేయడం ఎంతో అవసరం. ఎవరిని: పాలసీ హోల్డర్ మరణిస్తే బీమా పరిహారం ఎవరికి చెందాలని భావిస్తే వారి పేరును నామినీగా పేర్కొనాలి. సాధారణంగా వారసులు లేదా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులను బీమా సంస్థ సూచిస్తుంది. రక్త సంబంధీకులను అయినా నామినీగా నమోదు చేయవచ్చు. రక్త సంబంధీకులు కాని వారిని నామినీగా నమోదు చేయడానికి అవకాశం లేదు. నామినీ ఎన్ఆర్ఐ అయినా నమోదుకు అనుమతి ఉంటుంది. కాకపోతే క్లెయిమ్ మొత్తాన్ని భారత్‌లోని బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించడం జరుగుతుంది. ప్రక్రియ: నామినీ పూర్తి పేరు, వయసు, వారితో ఇన్వెస్టర్‌కు ఉన్న అనుబంధం వివరాలను బీమా పాలసీ తీసుకునే సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా నామినీలుగా పేర్కొనవచ్చు. అప్పుడు విడిగా ఒక్కో నామినీకి ఎంత మొత్తం అనేది శాతం వారీగా ఆప్షన్ ఇవ్వాలి. పాలసీ కాల వ్యవధిలో నామినీని ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. చివరిగా ఇచ్చిన నామినేషనే వ్యాలిడేషన్ లో ఉంటుంది. బీమా పాలసీ తీసుకున్న తర్వాత మూడేళ్లు ముగిసేలోపు క్లెయిమ్ దరఖాస్తు వస్తే బీమా సంస్థలు 120 రోజుల్లోపు పరిష్కరిస్తాయి. మూడేళ్లు దాటితే 15 రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కారాన్ని పూర్తి చేస్తాయి. ఎవరికి: నామినీకి క్లెయిమ్ హక్కు ఉంటుంది. ఒకవేళ విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తులకే పరిహారం చెల్లిం స్తారు. గందరగోళానికి అవకాశం లేకుండా ఉండాలంటే, నామినీగా, విల్లులోనూ ఒకే పేరును పేర్కొనడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనల మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు నామినీ ఆప్షన్ ఇవ్వాలి. అయితే, నామినేషన్తప్పనిసరేమీ కాదు. ఇన్వెస్టర్లు స్వీయ ప్రయోజనాల కోణంలోనే నామినీని తప్పనిసరిగా రికార్డు చేసుకోవడం అవసరం. ఎవరిని: ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వ్యక్తి ఎవరినైనా నామినీగా పేర్కొనవచ్చు. కాకపోతే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుంది. మైనర్లనూ నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఎన్ర్ఐలను కూడా నామినీగా నమోదు చేసుకోవచ్చు. అయితే, సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్త, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్లను నామినీగాలు పేర్కొనరాదు. నమోదు ప్రక్రియ: పెట్టుబడులకు సంబంధించి తొలుత దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ నామినేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లయినా నామినీలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒక్కో నామినీకి మొత్తం విలువలో ఎంత మేర చెల్లించాలన్న శాతాన్ని కూడా పేర్కొనవచ్చు. ఎంతన్నది పేర్కొనకపోతే ఒకరికి మించి నామినీలు ఉంటే అప్పుడు అందరు నామినీలకు సమానంగా చెల్లిస్తారు. నామినీ పేరును పేర్కొంటూ దరఖాస్తుపై ఇన్వెస్టర్ సంతకం చేయాలి. జాయింట్ హోల్డర్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే అందరి సంతకాలు అవసరం. ముఖ్యంగా ఫండ్స్‌లో ప్రతీ ఫోలియోకు విడిగా నామినేషన్ రిజస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అన్నింటికీ ఒకటే వర్తించదు. క్లెయిమ్: నామినీ ఎవరైనా కానీ, ఇన్వెస్టర్ మరణించిన తర్వాత క్లెయిమ్ చేసుకునే మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసులకు అందించాల్సి ఉంటుంది. అందుకే వారసులనే నామినీగా పేర్కొనడం మంచిదనేది నిపుణుల మాట. ఈక్విటీ షేర్లు కంపెనీల చట్టం, వాటాదారులు తమ పేరిట నామినేషన్ నమోదుచేసుకునేందుకు అనుమతిస్తోంది. కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నమోదు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు, జాయింట్ అకౌంట్ హోల్డర్స్ సైతం నామినేట్ చేయవచ్చు. అయితే, వ్యక్తులనే నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. సొసైటీ, ట్రస్ట్, బాడీ కార్పొరేట్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హిందూ అవిభాజ్య కుటుంబ కర్తను నామినీగా నమోదు చేయడం కుదరదు. గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా నమోదు చేయొచ్చు. నమోదు ప్రక్రియ: డీమ్యాట్ రూపంలో షేర్లను కలిగి ఉంటే డీమ్యాట్ ఖాతాను నిర్వహించే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) నామినేషన్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలో నామినీ కోసం ప్రత్యేకంగా ఒక పేజీ కూడా ఉంటుంది. అక్కడే నామినీ పేరు, ఫొటో, వయసు, ఈ మెయిల్ ఐడీ, అనుబంధం, బ్యాంకు ఖాతా, చిరునామా వివరాలు ఉంటాయి. ఖాతా ప్రారంభంలో నామినీ వివరాలను ఇవ్వని వారు ఆ తర్వాత ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లెయిమ్: ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లో నామినీ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే వారి పేరిట డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. నామినేషన్ లేకపోతే సంబంధిత షేర్లను ఇన్వెస్టర్ వారసులకు అందించడం జరుగుతుంది. ఇన్వెస్టర్ నామినేషన్ తోపాటు విల్లు కూడా రాసి ఉంటే కేవలం నామినేషన్నే పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాంకు డిపాజిట్లు గతంలో అయితే నామినేషన్‌ను బ్యాంకులు అంతగా పట్టించుకునేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో ఖాతా ప్రారంభ సమయంలో, డిపాజిట్ సమయంలోనూ బ్యాంకు సిబ్బంది నామినేషన్ గురించి కస్టమర్లకు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ నామినేషన్లేకుండానే ఖాతా తెరిచేందుకు, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. నామినీ ఎవరిని?: వ్యక్తులను నామినీగా నమోదు చేసుకోవచ్చు. అసోసియేట్, ట్రస్ట్, సొసైటీ లేదా ఇతర ఆర్గనైజేషన్ ఆఫీసుబేరర్ అయితే నామినీగా అవకాశం ఉండదు. ప్రక్రియ: నామినేషన్ నమోదు కోసం నామినీ పేరు, అనుబంధం, చిరునామా వివరాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు పాస్‌బుక్‌లో, అకౌంట్ స్టేట్మెంట్, డిపాజిట్లో నామినేషన్ రిజిస్టర్డ్ అని పేర్కొనడం తప్పనిసరి. నామినీ నమోదు, మార్పులకు, రద్దుకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. క్లెయిమ్: ఖాతాదారుడు లేదా డిపాజిట్ దారుడు మరణిస్తే నామినీలకు బ్యాంకులు బ్యాలన్స్‌ను చెల్లిస్తాయి. డిపాజిట్‌దారుని వారుసుల తరఫున ట్రస్టీగానే నామినీ వ్యవహరించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినట్టు బ్యాంకులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీకి సంబంధించి కేవైసీ ఇతర ధ్రువీకరణలు కూడా అవసరం. నామినేషనన్ రిజిస్టర్ కాకపోతే, వారసులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అందుకు వారసత్వ ధ్రువీకణ పత్రం, డెత్ సర్టిఫికెట్వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోవాలి... బీమా పాలసీలు, మ్యూచువల్ఫండ్స్, షేర్లు, బ్యాంకు డిపాజిట్లలో జాయింట్ అకౌంట్ హోల్డర్స్‌గా ఉంటే, అప్పుడు జాయింట్ హోల్డర్స్ అందరూ ఒకే సందర్భంలో మరణించినట్టయితేనే నామినేషన్ అమల్లోకి వస్తుంది. మైనర్‌ను నామినీగా నమోదు చేసేవారు, ఆ మైనర్ సంరక్షణ చూసే వారి పేరు వివరాలనూ నమోదు చేయాల్సి ఉంటుంది. బీమా పాలసీలయితే నామినీ క్లెయిమ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇందుకు క్లెయిమ్ ఫామ్‌ను పూర్తి చేసి, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం(ఒరిజినల్), పాలసీ డాక్యుమెంట్ ఒరిజినల్‌ను జత చేయాలి. ఒకవేళ ప్రమాదంలో మరణించినట్టయితే ఎఫ్ఐఆర్/పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నామినీ తనకు సంబంధించి కేవైసీ వివరాలను కూడా సమర్పించాలి. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ క్లెయిమ్ కోసం ఇవే పత్రాలు అవసరం అవుతాయి. అదే షేర్లు అనుకుంటే, నామినీ అకౌంట్ క్లోజర్ ఫామ్(మరణించిన ఇన్వెస్టర్ అకౌంట్), ట్రాన్సమిషన్ రిక్వెస్ట్ (ఇన్వెస్టర్ పేరిట ఉన్న షేర్లను బదిలీ కోరుతూ), డెత్ సర్టిఫికెట్, క్లయింట్ మాస్టర్ రిపోర్ట్(డీమ్యాట్ ఖాతాకు సంబంధించి) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, క్లెయిమ్ దాఖలు చేసే నామినీలు తమ డీమ్యాట్ ఖాతాను జాయింట్‌గా కలిగి ఉండరాదు. ఒకవేళ ఇన్వెస్టర్ నామినీని నమోదు చేసి లేకపోతే, ఇక్కడ పేర్కొన్న పత్రాలతోపాటు, వారసులు వారసత్వ సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధ వారసుల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ లేదా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ మైనర్ అయితే, గార్డియన్ గా ఉన్న వారు నామినీ తరఫున ఈ డాక్యుమెంట్లు అన్నీ ఇవ్వాలి. -
ఇంటికి వచ్చి.. ఆధార్‌కార్డు అడిగాడు!
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతున్నారా, అయితే మీ ఇంటికి ఎఫ్బీ ప్రతినిధి రావొచ్చు. సదరు పోస్ట్ మీరే పెట్టారా, లేదా అనేది ధ్రువీకరించుకోవడానికి ఫేస్బుక్ ప్రతినిధి మీ తలుపు తట్టొచ్చు. రాజకీయ పోస్ట్ పెట్టిన ఢిల్లీవాలా ఇంటికి ఎఫ్బీ ప్రతినిధి వచ్చి ఆరా తీసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఫేస్బుక్ ప్రతినిధి తనింటికి వచ్చి ఆధార్‌కార్డు అడిగినట్టు ‘ఐఏఎన్ఎస్’ వార్తా సంస్థతో ఢిల్లీవాసి ఒకరు చెప్పారు. ‘పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసులు వచ్చినట్టుగా ఫేస్బుక్ ప్రతినిధి మా ఇంటికి వచ్చారు. ఫేస్బుక్లో రాజకీయాలకు సంబంధించిన పోస్ట్ పెట్టింది నేనో, కాదో తెలుసుకునేందుకు నా ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు చూపించాలని అడిగారు. ఫేస్బుక్ ప్రతినిధి నేరుగా మా ఇంటికి రావడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఘటన ఎక్కడా జరిగినట్టు నేను వినలేదు. యూజర్ ప్రైవసీ మాటేంటి? ప్రభుత్వం తరుపున ఇదంతా చేస్తున్నారా’ అని ఆయన ప్రశ్నించారు. తన పేరు, వివరాలు వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు తాము పంపిన ఈ-మెయిల్స్‌కు ఫేస్బుక్ స్పందించలేదని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది. తమ ప్రతినిధిని పంపించి యూజర్ వివరాలు ప్రత్యక్షంగా తనిఖీ చేయడం ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుందని సైబర్ లా నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్ తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని వివరించారు. ఈ వ్యవహారంలో 2000 ఐటీ చట్టప్రకారం ఫేస్‌బుక్‌పై దావా వేయొచ్చని వెల్లడించారు. -
ప్రాంతీయ భాషలైతే మరింతమంది యూజర్లు
న్యూ ఢిల్లీ : ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. అయినా నేటికి ఎంతోమంది ఇంటర్నెట్ను వినియోగించలేని వారు ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఇంటర్నెట్లో ప్రాంతీయ భాషలను వాడే అవకాశం ఉండదు. ఐఏఎంఏఐ, కంతార్ ఐఎంఆర్బీ వారి రిపోర్టు ప్రకారం ఒకవేళ ఇంటర్నేట్లో ప్రాంతీయ భాషలు ఉపయోగించుకొనే వీలుంటే దాదాపు 205 మిలియన్ల నాన్-యూజర్లు కూడా ఇంటర్నెట్కు లాగ్ ఆన్ అవుతారని వెల్లడించింది. ‘ఇంటర్నెట్ ఇన్ ఇండిక్’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రస్తుతం భారతదేశంలో నగరాల్లో 193 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 141 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని తెలిపింది. 2017, డిసెంబరు నాటికి దేశంలో 481 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు పేర్కొంది. ఒకవేళ ఇంటర్నెట్ సమాచారం ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటే ప్రస్తుతం ఉన్న నాన్-యూజర్లలో 23 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సమాచారం పూర్తిగా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మెట్రో నగరాల వారికి ఇది సౌలభ్యంగానే ఉంటుంది. కానీ సమాజంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారు, చదువులేని వారు, వెనకబడిన వారే. వారంతా ఇంటర్నెట్ వాడాలంటే ప్రాంతీయ భాషలు ఉపయోగించే వీలుండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యూజర్లు 20 శాతం కన్నా తక్కువగా ఉన్నారు. డిజిటలైజేషన్‌ను పూర్తి స్థాయిలో సాధించాలన్నా, వీరిని ఇంటర్నెట్ వాడేలా చేయాలన్నా సమాచారం ఏ భాషలో లభిస్తుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ‘ఇండిక్ అప్లికేషన్’(భారతీయ భాషల్లో సెర్చ్ ఆప్షన్)లో మ్యూజిక్, పాటలతో పాటు ఈ-మెయిల్, చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ సెర్చింగ్, టికెట్ బుకింగ్, జాబ్ సెర్చింగ్ వంటివే ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిల్లో కూడా ప్రాంతీయ భాషలు తక్కువగానే వినియోగిస్తున్నారు. -
జొమాటోకు హ్యాకర్ల భారీ దెబ్బ
న్యూఢిల్లీ: కొనసాగుతున్న హ్యాకింగ్ భూతం మరో తీవ్రమైన రూపాన్ని తీసుకుంది. హ్యాకింగ్ తాజా బాధితుడు ఆన్లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమాటో. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటోకు హాకర్ల దెబ్బ భారీగా తగిలింది. ఈ సంస్థకు సంబంధించిన 17మిలియన్ల ఖాతాలు సైబర్ దాడికి గురయ్యాయి. తమ కంపెనీపై భారీ సైబర్ ఎటాక్ జరిగిందని సంస్థ బ్లాగ్ పోస్ట్ లో నిర్వాహకులు గురువారం తెలిపారు. తమ డేటా బేస్ నుంచి ఈ సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారని ప్రకటించింది. తమ ఖాతాదారుల పేర్లు, పాస్ వర్డులను వారు చేజిక్కించు కున్నారని నిర్వాహకులు ప్రకించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది. మొత్తం 120 మంది మిలియన్ యూజర్లలో సుమారు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులు చోరీకి గురైనట్టు తమభద్రతా సిబ్బంది గుర్తించారని జొమాటో వెల్లడించింది. దీంతో తమ సంస్థ యూజర్లు వెంటనే తమ పాస్ వర్దులను మార్చుకోవాలని, మల్టిపుల్ సైట్స్ లో ఒకే పాస్ వర్డ్ వినియోగించవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. పే మెంట్ డేటా సమాచారాన్ని మొత్తం అత్యంత భద్రతా (పీసీఐ సెక్యూరిటీ) వ్యవస్థలో ఉంచినందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ ను గానీ, క్రెడిట్ కార్డు డేటాను గానీ హ్యాకర్లు దొంగిలించలేకపోయారని స్పష్టం చేశారు. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని ఈ సంస్థ ఆర్గనైజర్లు తెలిపారు. అయితే పే మెంట్ డేటాను వేరు చేసి భద్రంగా ఉంచాం గనుక యూజర్లు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా వచ్చారు. మరో రెండు, మూడురోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టం ను మెరుగు పరుస్తామని వారు హామీ ఇచ్చారు. -
ఫేస్ బుక్... యూజర్లకు కొత్త సదుపాయం
ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్.. ఇప్పుడు ఖాతాదారులకు కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల అభిరుచులను సేకరిస్తున్న ఈ సామాజిక మాధ్యమం... యూజర్ల ఆసక్తికి అనుగుణంగా 'యాడ్ ప్రిఫరెన్సెస్' టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఫేస్ బుక్ పేజీలో వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్ బుక్ పేజ్ లో యూజర్లు ఎక్కువగా చూసే విషయాల ఆధారంగా సంబంధిత మాచారాన్ని సేకరించి ఆయా ప్రకటనలకు చెందిన పూర్తి సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతుంది. సాధారణంగా ఏ వెబ్ పేజీ తెరచినా పక్కనే అనేక ప్రకటనలు కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఫేస్ బుక్ ఇప్పుడు వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది. ప్రధానంగా మీ వయసు, ఫేస్ బుక్ వినియోగించే తీరు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని.. మీరు క్లిక్ చేసిన బటన్స్ ను బట్టి మీకేం కావాలో అంచనా వేస్తుంది. సైట్ నుంచి మీరు లాగౌట్ అయిపోయినా సమాచారం మాత్రం సేకరించి ఉంచుతుంది. ముఖ్యంగా ఈ టూల్... ఫేస్ బుక్ పేజీ శీర్షిక ఆధారంగా మీక్కావలసిన అంశాన్ని గుర్తిస్తుంది. వైవాహిక జీవితం, రాజకీయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీ ప్రాధాన్యతను అంచనా వేస్తుంది. క్లాత్, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ప్రకటనలను వాటికి సంబంధించిన ఫొటోలతో సహా పూర్తి సమాచారాన్ని మీ ముందుంచుతుంది. పేజీలో మీరు సబ్జెక్ట్ ను మార్చినప్పుడల్లా ఆయా విషయాలకు సంబంధించిన ప్రకటనలు పేజీలో మారుతుండటం ఈ 'యాడ్ ప్రిఫరెన్సెస్' ప్రత్యేకత. అంతేకాక ఈ సమయంలో కొత్త ప్రకటనలను వినియోగదారులకు పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నిస్తుంది. -
చేపకు చక్రాల కుర్చీ...
చేపకు చక్రాల కుర్చీ: పుట్టుకలోని లోపం వల్ల గానీ, ప్రమాదవశాత్తు గానీ మన ఇంట్లో వాళ్లెవరికైనా కాళ్లు దెబ్బతింటే ఊరికే వదిలేస్తామా? ఆస్పత్రుల చుట్టూ తిరిగి, ఆపరేషన్లు చేయిస్తాం. అవకాశం ఉంటే, కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయిస్తాం. తిరిగి నడవగలిగే పరిస్థితి వచ్చేంత వరకు వీల్‌చైర్‌ను ఏర్పాటు చేస్తాం. మనుషుల విషయంలో ఇదంతా మామూలు ప్రక్రియే. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ‘రెడిట్’ యూజర్ ఒకరు మాత్రం తన ఇంట్లో పెంచుకుంటున్న చేపకు వీల్‌చైర్ ఏర్పాటు చేశాడు. ఇతగాడు ఏ దేశానికి చెందినవాడో తెలియదు గానీ, ఇతడి యూజర్ నేమ్ ‘లీబిలిటీ’. నీటితొట్టెలో మిగిలిన చేపలతో పాటే పెంచుకుంటున్న గోల్డెన్ ఫిష్ ఈదడానికి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించి, ఈ వీల్‌చైర్‌ను రూపొందించి, అమర్చానని, ఇప్పుడిది ఈజీగా ఈదులాడుతోందంటూ వీడియో, ఫొటోలతో పోస్ట్ పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఐరన్ లంగ్ః62 పుట్టుకతో ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు ఉన్నా, నిండు నూరేళ్లూ ఊపిరి నిలిచి ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్ అనే ఈ ఆసామి వయసు ఇప్పుడు 68 ఏళ్లు. ఆరేళ్ల వయసులో పక్షవాతం సోకి, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. అప్పుడు వైద్యులు అతడికి ఐరన్ లంగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి... అంటే, గత 62 ఏళ్లుగా ఐరన్లంగ్తో ఊపిరి నిలుపుకుంటూ వస్తున్నాడు. ఈ ఐరన్ లంగ్‌లో మనిషి పూర్తిగా పడుకుంటేనే శ్వాస ఆడుతుంది. అలెగ్జాండర్ ఘనత ఇదొక్కటే కాదు. ఈ ఐరన్లంగ్తో ఊపిరి తీసుకుంటూనే మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. లా కోర్సు కూడా పూర్తిచేసి, లాయర్‌గా ప్రాక్టీసూ ప్రారంభించాడు. ఐరన్లంగ్లో ఉంటూనే, వాలంటరీ బ్రీతింగ్‌ను సాధన చేశాడు. ఇప్పుడు ఐరన్‌లంగ్ నుంచి కొన్ని గంటల సేపు బయట ఉండగలుగుతున్నాడు. వాలంటరీ బ్రీతింగ్‌ను విజయవంతంగా సాధించడం వల్లే రోజూ కొన్ని గంటల సేపు లాయర్‌గా కోర్టుకు హాజరు కాగలుగుతున్నాడు. అక్కడ దొరికే వజ్రాలు మీవే... ఔను! అక్కడ దొరికే వజ్రాలు అచ్చంగా మీవే. అయితే, ఆ గనిలో వాటిని మీరే ఏరుకోవాలి. ఇంతకీ ఈ వజ్రాల గని ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. అక్కడ మర్ఫ్రీబరోలో ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వజ్రాల గనికి ఎవరైనా వెళ్లవచ్చు. ఓపిక ఉన్నంత సేపు వజ్రాల వేట సాగించవచ్చు. ఒకటో రెండో... ఎన్నో కొన్ని వజ్రాలు దొరికితే మీ పంట పండినట్లే! వాటిని ఎవరికీ ఇవ్వక్కర్లేదు. వాటిపై ఎలాంటి పన్నులూ కట్టక్కర్లేదు. ఇక్కడ వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు మొట్టమొదటి సారిగా 1906లో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గనిలో 75 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. దీనిని 1972లో స్టేట్ పార్క్‌గా మార్చి, ప్రజలందరికీ ప్రవేశం కల్పించారు. అప్పటి నుంచి ఈ పార్కును సందర్శించిన వారిలో కొందరు అదృష్టవంతులు దాదాపు 19 వేలకు పైగా వజ్రాలను చేజిక్కించుకున్నారు. మీకూ ఈ వజ్రాలు కావాలా? అయితే, చలో అర్కాన్సాస్! గులాబీ యాపిల్... యాపిల్ అంటే ఎర్రగా నిగనిగలాడే పండు రూపమే మనకు గుర్తుకొస్తుంది. మార్కెట్లో ఎక్కువగా కనిపించేవి కూడా ఎర్రని యాపిల్సే. ఎర్ర ఎర్రని యాపిల్‌ను కోసి చూస్తే తెల్లగా కనిపిస్తుంది. ఎర్రని యాపిల్సే కాదు, ఆకుపచ్చని యాపిల్స్, పసుపుపచ్చని యాపిల్స్... ఇలాంటి ఎన్ని రకాల యాపిల్స్‌ను కోసి చూసినా, లోపలంతా తెల్లగానే ఉంటుంది. బ్రిటన్‌లో పండే ఈ విచిత్రమైన యాపిల్స్ మాత్రం చూడటానికి లేత కాషాయ ఛాయ కలగలసిన పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిని కోసి చూస్తే మాత్రం, లోపల గుజ్జంతా గులాబీ రంగులో కనిపిస్తుంది. రుచిలో ఈ గులాబీ యాపిల్స్ కూడా మామూలు యాపిల్స్ మాదిరిగానే ఉంటాయి. -
టెల్కోల కాల్ డ్రాప్స్‌పై యూజర్లకు పరిహారం!
ట్రాయ్ ప్రతిపాదన న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’... కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించటానికి సన్నద్ధమవుతోంది. టెల్కోలు వాటి నెట్వర్క్ సామర్థ్యపు వివరాలను క్రమానుగతంగా తెలియజేయటంతో పాటు, కాల్ డ్రాప్స్‌పై యూజర్లకు పరిహారం చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని ప్రతిపాదనలను తయారుచేసింది. వీటి ప్రకారం.. సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డ్రాప్స్‌పై వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. టెల్కోలు కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలి. కాల్ డ్రాప్ సందర్భంలో టెల్కోలు యూజర్ల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయకూడదు. అంటే కాల్ డ్రాప్ సమయంలో కట్ అయ్యే బ్యాలెన్స్‌ను టెల్కోలు యూజర్ల ఆకౌంట్‌కు బదిలీ చేయాలి. ట్రాయ్ తన ప్రతిపాదనలపై సెప్టెంబర్ 28 వరకు ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. కాగా కాల్ డ్రాప్ సమస్య వినియోగదారులదే కాబట్టి వారికి పరిహారం అందాలని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. టెల్కోలు నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమైతే... అప్పుడు ట్రాయ్ వాటిపై జరిమానా విధిస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. టెలికం సర్వీస్ ప్రాంతంలో ఒక నెట్వర్క్ సంబంధిత అన్ని కాల్స్‌లో కాల్ డ్రాప్ వాటా 2 శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని చాలా టెల్కోలు కాల్ డ్రాప్స్ సంబంధిత ప్రమాణాలను పాటించడం లేదని ట్రాయ్ పేర్కొంది. కాల్ డ్రాప్ సమస్య అనేది సామర్థ్యపు నిరోధానికి సంబంధించినది కాదని, కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సైట్ల ఏర్పాటుకు లేక స్పెక్ట్రమ్ కొరతకు సంబంధించిందని సీఓఏఐ అభిప్రాయపడింది. -
తగ్గుముఖంపట్టిన ఉల్లిధర
పరిగి, న్యూస్‌లైన్: రెండు నెలలకు పైగా వినియోగదారులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి కాస్త శాంతించింది. ఉల్లిధరలు కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉల్లి ధరలు కాస్తా దిగివచ్చాయి. గత వారం పరిగి మార్కెట్లో కిలో ఉల్లిధర రూ. 60 నుంచి 70 వరకు విక్రయించగా ఈ వారం ఆధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గాయి. శుక్రవారం పరిగి మార్కెట్లో తెల్లరకం ఉల్లిగడ్డ కిలో రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా, ఎర్రఉల్లిగడ్డలు కిలో రూ.30 చొప్పున విక్రయించారు. దీంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో టమాటా ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. గతవారం కిలో టమాటాలు రూ. 30కి విక్రయించగా ఈ వారం కిలో టమాటాలు రూ. 15నుంచి 20 వరకు విక్రయించారు. ఇదే సమయంలో మిర్చి ధరలు మాత్రం వినియోగదారులను ఆందోళనకు గురిచే స్తున్నాయి. గత వారం కిలో మిర్చి రూ. 50నుంచి రూ. 60కి విక్రయించగా ఈ వారం ఏకంగా ఆధరలు కిలో రూ.80కి పెరిగాయి. ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించటం, ప్రభుత్వమే డీసీఎంఎస్‌ల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవటంతోనే ఉల్లి ధరల్లో తగ్గుదల నమోదైందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.