ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్‌లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు.
భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్‌ఫారమ్‌లో తన యూజర్ నేమ్‌ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్‌ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్‌ను ఎలాన్ భాయ్‌గా మార్చకుండా భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు.
.@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai?
— Carl Bhai (@getpeid) February 18, 2024
ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది.
ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment