X Twitter user ask her height people tell her with help of her iPhone - Sakshi
Sakshi News home page

‘ఫొటో చూసి ఎత్తు చెప్పండి’ అమ్మడి ప్రశ్నకు ఐఫోన్‌తో నెటిజన్‌ సమాధానం!

Published Mon, Aug 14 2023 1:35 PM | Last Updated on Mon, Aug 14 2023 2:16 PM

twitter user ask her height people tell her with help of her iphone - Sakshi

సోషల్‌ మీడియాలో రోజురోజుకూ విచిత్రమైన  పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా x (గతంలో ట్విట్టర్‌)లో ఒక యువతికి సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. దీనిలో ఆమె యూజర్స్‌కు ఒక ప్రశ్న సంధించింది. వెంటనే దీనికి సమాధానాలు, కామెంట్ల వెల్లువ మొదలయ్యింది. తన ఎత్తు ఎంతో చెప్పమన్న ఆ అమ్మడిని  కంగుతినిపిస్తూ యూజర్స్‌ సమాధానాలిస్తున్నారు. 

xలో దాల్‌మఖనీ పేరు కలిగిన యూజర్‌ తనకు సంబంధించిన ఒక ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫొటోలో ఆమె ఒక ఐఫోన్‌ పట్టుకుంది. ‘నా హైట్‌ ఎంతో చెప్పండి’ అని అడిగింది. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ లక్షల్లో సమాధానాలు వచ్చాయి. 1500కు పైగా యూజర్స్‌ ఈ పోస్టును లైక్‌ చేశారు. 

సాగర్‌ అనే యూజర్‌ చేసిన కామెంట్‌ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆమె చేతిలోని ఐఫోన్‌-12 పొడవు 14.6 సెంటీమీటర్లు అని పేర్కొంటూ, ఆమె ఫొటో పక్కన అంటే తల మొదలు కొని పాదాల వరకూ ఒక్కొక్కటిగా  9 ఫోన్లను పెడుతూ వచ్చాడు. దీనిని మొత్తం లెక్కించాక ఆమె ఎత్తు 4 అడుగుల 31 ఇంచీలు అని తేల్చిచెప్పాడు.  రాహుల్‌ అనే యూజర్‌ ఎన్నో దుర్గుణాలు కలిగిన రావణుడు కూడా ఏనాడూ ఇటువంటి ‍ప్రశ్న అడగలేదని కామెంట్‌ చేశాడు. 
ఇది కూడా చదవండి: ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్‌.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement