సాక్షి, న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విటర్ తప్పులో కాలేసింది. ఐఫోన్ 12 మినీ వీడియోను అప్‌లోడ్ చేసినందుకు ఒక యూజర్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ వీడియోను పోర్న్ వీడియోగా పొరబడి అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో సదరు లబోదిబోమన్నాడు.
వివరాల్లో వెళ్లితే నిఖిల్ చావ్లా అనే యూజర్, ఐఫోన్ 12 మినీ వీడియో టీజర్‌ను తన ట్విటర్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. అంతే పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత అతని ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ ఉందంటూ ఈ వీడియోను తొలగించింది. ఆ తరువాత ఖాతాను అన్‌లాక్ చేసి, అభ్యంతరమైన, అశ్లీల కంటెంట్‌ను తొలగించడమో,రిపోర్ట్ చేయడమో చేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చేలోపే తన అకౌంట్‌ను మరో 24 గంటలు బ్లాక్ చేశారని వాపోయాడు. చివరకు ట్విటర్ పాలసీ టీంను సంప్రదించి తన ఖాతా అన్‌లాక్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
అయితే యూజర్ పోస్ట్ చేసిన ఐఫోన్ 12 మినీ టీజర్ వీడియో కంటెంట్‌ను ట్విటర్ అల్గోరిథం అభ్యంతరకరమైందిగా గుర్తించిందని ట్విటర్ తెలిపింది. ఇలాంటి వాటిని నిరోధించేందుకు వినియోగదారులు సేఫ్టీ సెటింగ్స్‌లో మీడియా సెన్సెటివ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది.
Working with the @Twitter @Policy team to get our founder @nikhilchawla’s account back with the iPhone 12 Mini video tweet that was erroneously marked as intimate content.
— The Unbiased Blog (@TheUnbiasedBlog) January 5, 2021
We have filed an appeal! @TwitterIndia @manishm @keyamadhvani @jack
Thank you all for your support! pic.twitter.com/ZgKiJtOzmL
Comments
Please login to add a commentAdd a comment