కబాలీ బాహుబలికా బాప్: వర్మ
ముంబయి: తాను స్పందించే ప్రతి విషయంలో పరోక్షంగా సెటైర్ జొప్పించే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ రజినీ కాంత్ విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించారు. రజనీ తాజా చిత్రం కబాలీకి సంబంధించిన అధికారిక టీజర్ విడుదలైన నేపథ్యంలో దానిపై వర్మ స్పందించాడు.
'ఒక్క రజనీ కాంత్ సర్ తప్ప ఏ ఒక్క సూపర్ స్టార్ కూడా వెండితెరను ఈ విధంగా వైబ్రేటే చేయలేరు. విడుదలైన రోజే నేను కబాలీ చిత్రాన్ని వరుసగా నాలుగుసార్లు చూస్తాను. కబాలీ బాహుబలికా బాప్ లాగా కనిపిస్తోంది. ఒక్క రజనీకాంత్ మాత్రమే ఇలా చేయగలరు' అని చెప్పాడు.
No superstar except RAJNI sir can make a screen vibrate like this..I want to watch this film 4 times on 1st day https://t.co/My2eS0fzLB
— Ram Gopal Varma (@RGVzoomin) 1 May 2016
KABALI is looking like BAHUBALI ka BAAP....one and only RAJNIKANT https://t.co/My2eS0fzLB
— Ram Gopal Varma (@RGVzoomin) 1 May 2016