ప్రేమ మరీ ఎక్కువైపోతే? ఆసక్తికరంగా ఆర్జీవీ 'శారీ' టీజర్ | Ram Gopal Varma Saaree Movie Teaser | Sakshi
Sakshi News home page

Saaree Teaser: ఆర్జీవీ లేటెస్ట్ మూవీ 'శారీ'.. రిలీజైన టీజర్

Published Sun, Sep 15 2024 7:33 PM | Last Updated on Mon, Sep 16 2024 9:54 AM

Ram Gopal Varma Saaree Movie Teaser

సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ'. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అంటే ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో నవంబరులో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించగా.. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)

ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన ఎంతో మంది మహిళలని 'శారీ కిల్లర్' అతి క్రూరంగా మానభంగం చేసి చిత్ర హింసలకు గురిచేసి హత్యలు చేశాడు. ఆ మృగాడికి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉండేదో అనే పాయింట్‌తో శారీ మూవీ తీశారు. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో హానికరంగా, డేంజరస్‌గా ఓ అబ్బాయి ఎలా మారిపోయాడనేది టీజర్‌లో చూపించారు.

ఇందులో అబ్బాయిగా సత్య యాదు, అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. ఆరాధ్య దేవి స్వస్థలం కేరళ. నిజానికి ఆరాధ్యని వర్మ ఎవరో ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్‌లో తొలుత చూశారు. అలా ఆమెని ప్రధాన పాత్ర కోసం తీసుకుని ఏకంగా శారీ సినిమా తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement