జొమాటోకు హ్యాకర్ల భారీ దెబ్బ
న్యూఢిల్లీ: కొనసాగుతున్న హ్యాకింగ్ భూతం మరో తీవ్రమైన రూపాన్ని తీసుకుంది. హ్యాకింగ్ తాజా బాధితుడు ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమాటో. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటోకు హాకర్ల దెబ్బ భారీగా తగిలింది. ఈ సంస్థకు సంబంధించిన 17మిలియన్ల ఖాతాలు సైబర్ దాడికి గురయ్యాయి. తమ కంపెనీపై భారీ సైబర్ ఎటాక్ జరిగిందని సంస్థ బ్లాగ్ పోస్ట్ లో నిర్వాహకులు గురువారం తెలిపారు. తమ డేటా బేస్ నుంచి ఈ సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారని ప్రకటించింది. తమ ఖాతాదారుల పేర్లు, పాస్ వర్డులను వారు చేజిక్కించు కున్నారని నిర్వాహకులు ప్రకించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.
మొత్తం 120 మంది మిలియన్ యూజర్లలో సుమారు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులు చోరీకి గురైనట్టు తమభద్రతా సిబ్బంది గుర్తించారని జొమాటో వెల్లడించింది. దీంతో తమ సంస్థ యూజర్లు వెంటనే తమ పాస్ వర్దులను మార్చుకోవాలని, మల్టిపుల్ సైట్స్ లో ఒకే పాస్ వర్డ్ వినియోగించవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. పే మెంట్ డేటా సమాచారాన్ని మొత్తం అత్యంత భద్రతా (పీసీఐ సెక్యూరిటీ) వ్యవస్థలో ఉంచినందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ ను గానీ, క్రెడిట్ కార్డు డేటాను గానీ హ్యాకర్లు దొంగిలించలేకపోయారని స్పష్టం చేశారు. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని ఈ సంస్థ ఆర్గనైజర్లు తెలిపారు. అయితే పే మెంట్ డేటాను వేరు చేసి భద్రంగా ఉంచాం గనుక యూజర్లు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా వచ్చారు. మరో రెండు, మూడురోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టం ను మెరుగు పరుస్తామని వారు హామీ ఇచ్చారు.