stolen
-
గుడ్ల దొంగలొచ్చారు
పాత తెలుగు సినిమాల్లో కామెడీ దొంగలుంటారు. వాళ్ల పని ఊళ్లో కోళ్లు పట్టడమే. ఎత్తుకొచ్చిన, కొట్టుకొచ్చిన కోళ్లను చక్కగా వండుకు తినే వాళ్లు కొందరైతే వాటిని ఎంతకో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్లు ఇంకొదరు. అలాంటి దొంగలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పడ్డారు. అయితే వాళ్లు దొంగకోళ్లు పట్టేవాళ్లు కాదు. కోడిగుడ్లు కొట్టేసేవాళ్లు. పెరుగుతున్న కోడి గుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఈ ‘గుడ్ల గుటకాయస్వాహ’పథకానికి వ్యూహ రచన చేశారు. అనుకున్నదే తడవుగా ఒకే దెబ్బకు 1,00,000కుపైగా గుడ్లను కొట్టేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్ నగరంలో పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీ సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు ఈ గుడ్లను దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపు రూ.35 లక్షలు. కొండెక్కుతున్న గుడ్డు ధర ఎవరైనా కోళ్లను దొంగతనం చేస్తారు. వీళ్లేంటి కోడిగుడ్ల వెంట పడ్డారని అనుమానం రావొచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి బర్డ్‌ఫ్లూ. రెండోది పెరుగుతున్న గుడ్ల ధర. అమెరికాలో గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలో ఇంతటి విస్తృత స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి. గతనెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్‌ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం ‘బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లు’అని భావించి ఎవరూ కొనక పోవచ్చు. బర్డ్‌ఫ్లూ భయంతో జనం చికెన్‌లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. ఇందుకు పెరుగుతున్న కోడి గుడ్ల ధరలే ప్రబల తార్కాణం. మొత్తంగా చూస్తే కోడి గుడ్డు ధర రెట్టింపు అయినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తే దొంగలను గుడ్ల చోరీకి ఉసిగొల్పింది. దుకాణాల్లో పంపిణీ కోసం లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను శనివారం రాత్రి ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదుచేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే దొంగలు ఈపాటికి గుడ్లను ఇష్టమొచ్చిన అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీ నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సరదా వ్యాఖ్యల పోస్ట్‌లు పెట్టారు. గుడ్ల కొరత ఏర్పడటంతో గుడ్లతో చేసే వంటకాల ధరలూ రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికాలో 25 రాష్ట్రాల్లో దాదాపు 2,000 చోట్ల వ్యాపారం చేస్తున్న ప్రఖ్యాత వేఫుల్ హౌస్ రెస్టారెంట్ తమ గుడ్ల వంటకాల ధరను కాస్తంత పెంచింది. ‘‘మార్కెట్లో గుడ్లు దొరకట్లేవు. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నాం. అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నాం’’అని రెస్టారెంట్ తాపీగా చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కి‘లేడీ’ పనిమనిషి.. చోరీ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి..
ముంబై: ఓ పని మనిషి.. తాను పనిచేసే ఓనర్లో ఇంట్లో చోరీ చేసి పరార్ అయ్యారు. దొంగిలించిన కొత్త వాచ్, చీర ధరించిన ఫొటోలు సదరు పని మనిషి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోగా. ఓనర్ దంపతులకు తెలిసిపోయింది. దీంతో పనిమనిషి రూపాలి సింగ్‌పై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కండివ్లిలోని ఓ దంపతుల ఇంట్లో.. రూపాలి సింగ్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ జంట ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారం చేస్తున్నారు. వారి ఇంట్లో రూపాలి పనిమనిషిగా చేరారు.ఇక.. ఇంటిని శుభ్రం చేయటం, వారి పిల్లలను చూసుకోవడం ఆమె పని. అక్టోబరు 7న రూపాలి.. తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారని పని మానేసి.. తన సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు.అయితే.. ఓనర్ భార్య దసరాకు కొత్త చీర కట్టుకోవాలని భావించించారు. ఆమెకు కొత్త చీర అల్మారాలో కనిపించలేదు. చీర ఎక్కడ ఉందని.. ఆమె పనిమనిషి రూపాలికి ఫోన్ చేసి కనుకున్నారు. తాను ఇస్త్రీ చేసి అల్మారాలో ఉంచానని రూపాలి చెప్పారు. ఇంట్లో ఎక్కడ చూసినా ఓనర్ భార్యకు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఓనర్ దంపతులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యజమాని ఇంటి నుంచి పనిమనిషి రూపాలి.. బ్యాగుల్లో ఏదో తీసుకుని వెళ్తున్నట్లు కనిపించారు. యజమాని భార్య తన వాట్సాప్‌ను తనిఖీ చేస్తుండగా.. సింగ్ స్టేటస్ చూసి అవాక్కయ్యారు.వాట్సాప్‌లో స్టేటస్‌లో పనిమనిషి తన యజమానికి సంబంధించిన వాచ్, దుస్తులను ధరించి కనిపించారు. కొత్త చీర, వాచ్ కాకుండా ఇంట్లో పలు విలువైన వస్తువులు కనిపించలేదు. ఆభరణాలు, వాచ్, చీరలు, సన్ గ్లాసెస్, శాలువా, మేకప్ కిట్, పెర్ఫ్యూమ్లు, పిల్లల బ్యాగ్ కనిపించలేదు. వీటి విలువ సమారు 2.4 లక్షల ఉంటుందని ఓనర్ జంట తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ పనిమనిషి కోసం వెతుకుతున్నారు. -
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 3.1 కోట్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన పాలైనట్టు యూకే కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ ఆరోపించారు. కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి 3.1 కోట్ల కస్టమర్లకు సంబంధించి మొబైల్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను విక్రయించినట్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడో పక్షం నుంచి మోసపూరిత చర్యలకు (ఉల్లంఘైన డేటా ఆధారంగా) అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు స్టార్ హెల్త్ సంస్థ ఈ మెయిల్ ద్వారా హెచ్చరించడం ఉల్లంఘన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. యూకేకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ షెంజెన్ అనే హ్యాకర్ స్టార్ హెల్త్ నుంచి పొందిన డేటాను వెబ్సైట్లో పెట్టినట్టు ప్రకటించారు. ‘‘స్టార్ హెల్త్ ఇండియా కస్టమర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి సున్నితమైన డేటాను లీక్ చేస్తున్నాను. ఈ డేటాను నాకు నేరుగా విక్రయించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీదే ఇందుకు బాధ్యత’’అంటూ షెంజెన్ పోస్ట్‌ను పార్కర్ ప్రస్తావించారు. టెలీగ్రామ్ బోట్లను సృష్టించడం ద్వారా 2024 జూలై నాటికి 3,12,16,953 మంది కస్టమర్ల డేటాను, 57,58,425 క్లెయిమ్‌ల డేటాను హ్యాకర్ పొందినట్టు చెప్పారు. డేటా లీకేజీకి గాను 1,50,000 డాలర్ల డీల్ కుదిరినట్టు కూడా పార్కర్ తెలిపారు. అప్రమత్తత.. స్టార్ హెల్త్ ఉద్యోగులమని చెబుతూ ప్రస్తుత పాలసీని నిలిపివేయండనే చర్యలకు థర్డ్ పారీ్టలు పాల్పడొచ్చంటూ స్టార్ హెల్త్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ తరహా మోసపూరిత చర్యలు వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించడంతోపాటు, దీర్ఘకాలంలో పాలసీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. క్లెయిమ్‌ల డేటాను అనధికారికంగా పొందినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు మెయిల్స్ కూడా వచి్చనట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు కంపెనీ సమాచారం ఇచి్చంది. ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా తగిన సైబర్ భద్రతా వ్యవస్థలు, నియంత్రణలను అమలు చేస్తున్నామని, దీనిపై మళ్లీ తాజా సమాచారం విడుదల చేస్తామని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది. -
Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ
బెగుసరాయ్: బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురయ్యింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. అందులో ఒక వృద్ధ మహిళ శిశును తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఒక నవజాత శిశువును ఒక వస్త్రంలో చుట్టి తీసుకువెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది.వివరాల్లోకి వెళితే బెగుసరాయ్‌లోని లోహియా నగర్‌కు చెందిన నందనీ దేవి డెలివరీ కోసం ఒక ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ శిశువు అదృశ్యమయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి -
దొంగలించి పడ్డ మీఫోన్ ఎలా గుర్తించాలి...!
-
3 నగరాలు 4 దేశాలు
సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే ఒకటీ రెండు రోజులు బాధపడతాం. కాస్త విలువైన ఫోన్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దొరికితే దొరుకుతుంది లేదా కొద్దిరోజుల తర్వాత మర్చిపోతాం. కానీ ఈ సెల్ఫోన్ల చోరీ వెనుక పెద్ద వ్యవస్థీకృత దందా దాగి ఉందంటే మాత్రం విస్తుపోక తప్పదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో దొంగల ముఠాల ద్వారా చోరీ అవుతున్న సెల్ఫోన్లు సీ ఫుడ్ ముసుగులో ఏకంగా దేశం దాటేస్తు న్నాయి. ప్రధానంగా మూడు నగరాల మీదుగా నాలుగు దేశాలకు తరలిపోతున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో స్థానికుల నుంచి విదేశీయుల వరకు ఉంటున్నారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా చోరీ ఫోన్ల ఫొటోలు షేర్ చేసుకుని, క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఓడ రేవుల్లో కార్యకలాపాలు సాగించే వారితో పాటు ఆయా దేశాల సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ మొత్తం దందా మూడు దశల్లో కొనసాగుతోంది. తొలుత దొంగల నుంచి స్థానిక వ్యాపారుల వద్దకు చేరుతున్న సెల్ఫోన్లు, అక్కడి నుంచి మెట్రో నగరాలకు చేరుకుని ఆ తర్వాత దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఫస్ట్ స్టేజ్..⇒ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు కలిసి ముఠాలుగా ఏర్పడుతున్నారు. బస్సుల్లో, బస్టాపులు, వైన్ షాపులు, బహి రంగ సభలు జరిగే చోట్ల, ఇతర రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఈ చోరీ ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలోని కొందరు వ్యాపారులకు విక్రయి స్తున్నారు.ఈ ఫోన్లు అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు టెక్నీషియన్లు పని చేస్తుంటారు. వీళ్లు చోరీ ఫోన్లు అన్‌లాక్ చేయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపరింగ్ చేస్తారు. నగరంలో చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న వ్యాపారులు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ‘హోల్‌సేల్ వ్యాపారులకు’ కలిపి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఇక్కడ ఫోన్లు కొంటున్న వ్యాపారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఫోన్ల ఫొటోలను వాటిల్లో పోస్టు చేస్తున్నారు.థర్డ్ స్టేజ్..⇒ చోరీ సెల్ఫోన్లు సూడాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లకు ఎక్కువగా వెళ్తు న్నాయి. విదేశీ వ్యాపారులు ఎంపిక చేసు కున్న సెల్ఫోన్లను ఇక్కడి వ్యాపారులు ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేస్తున్నారు. ఐదేసి ఫోన్లు చొప్పున తొలుత ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో పార్శిల్ చేస్తున్నారు. తర్వాత ఇలాంటి 20 నుంచి 25 బాక్సులను థర్మా కోల్ పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. సీ ఫుడ్‌గా చెబుతూ ఓడ రేవుల ద్వారా సూడాన్, శ్రీలంక దేశాలకు పంపిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు మాత్రం థర్మాకోల్ పెట్టె ల్లోనే పార్శిల్ చేసి సరిహద్దు గ్రామాలకు చెందిన వారి ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు.రెండు వైపులా ఉండే సరిహద్దు గ్రామాలకు చెందిన కమీషన్ ఏజెంట్లు ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారు. కోల్‌కతా నుంచి తమ వద్దకు వస్తున్న ఫోన్లను ఆవలి వైపు ఉన్న వారికి చేరవేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. వీరికి ఒక్కో ఫోన్‌కు దాని మోడల్ ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు కమీషన్‌గా లభిస్తోంది. సీ ఫుడ్ పేరుతో వెళ్తున్న థర్మాకోల్ బాక్సుల్ని తనిఖీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తు న్నారా? లేక స్మగ్లర్లతో మిలాఖత్ అయ్యారా? తేలాల్సి ఉందని నగర పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని, ఇప్పటివరకు తాము పట్టుకున్న ముఠాల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను ఆయా ఏజెన్సీలకు పంపిస్తామని పేర్కొంటున్నారు.సెకండ్ స్టేజ్..⇒ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఇతర నగరాలకు చెందిన వ్యాపారులు తమకు నచ్చిన, అవసరమైన సెల్ఫోన్లను ఆ ఫొటోల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. బేరసారాల తర్వాత ఇక్కడి వ్యాపారులు అక్కడి వారు కోరిన వాటిని పార్శిల్ చేసి తమ మనుషులకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని వ్యాపారుల వద్దకు చోరీ సెల్ఫోన్లు చేరుతున్నాయి. సూడాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఉన్న వ్యాపారులు, ఈ నగరాల్లోని వ్యాపారులకు ఉమ్మడి వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. వాటిలో పోస్టు అవుతున్న ఫొటోల ఆధారంగా విదేశీ వ్యాపారులు ఫోన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.వరుస అరెస్టులతో అదుపులోకి చోరీలు⇒ నగరంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఫోన్ల కోసం దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు హత్యలూ జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక అదేశాలు జారీ చేశారు. నగరంలో వ్యవస్థీకృతంగా సాగుతున్న సెల్‌ఫోన్ చోరీలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ముఠాలను పట్టుకున్నారు.మే ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా«ధీనం చేసుకున్నారు. గత నెల మొదటి వారంలో ముగ్గురిని పట్టుకుని 43 సెల్ఫోన్లు సీజ్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల 31 మందిని అరెస్టు చేసి 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ వరుస అరెస్టులతో నగరంలో సెల్‌ఫోన్ చోరీలు అదుపులోకి వచ్చాయి. దీంతోనీ వ్యవస్థీకృత ముఠాల వెనుక ఉన్న వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ దిశగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
చైన్ స్నాచింగ్‌కు మహిళ బలి
గజ్వేల్‌రూరల్: మహిళ మెడపై ఉన్న బంగారు ఆభరణాలను ఓ ఆగంతకుడు చోరీకి యత్నించాడు. ప్రతిఘటించేక్రమంలో ఆమెకు గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో చోటు చేసుకుంది. అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం..కొల్గూరుకు చెందిన చెన్న శ్రీనివాస్– శ్యామలత(55) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగ్గా, కొడుకు హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటూ కిరాణ దుకాణం నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచిన శ్యామలత ఇంటి వెనుక భాగంలో ఉన్న డోర్ తీసి బాత్రూమ్కు వెళ్లింది. ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. శ్యామలత భర్త శ్రీనివాస్ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా, ఆగంతకుడు తలుపు లకు గొళ్లెం పెట్టాడు. బాత్ రూమ్ నుంచి శ్యామలత ఇంట్లోకి వస్తున్న సమ యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొ లుసు, చెవికి ఉన్న అరతులం కమ్మలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్యామలత ప్రతిఘటిండంతో ఆమె ముఖంపై దిండు(మెత్త)ను అదిమి పట్టి ఆభరణాలను దొంగిలించాడు. ఈ క్రమంలోనే ఆమె చెవికి గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భారతమ్మ పాలు పోసేందుకు వస్తుండగా, మంకీ క్యాప్ పెట్టుకున్న ఆగంతకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ గొళ్లెం తీయగా భర్త శ్రీనివాస్ బయటకు వచ్చాడు. శ్యామలతను వెంటనే గజ్వేల్‌లోని ప్రైవే టు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స అవసరమని చెప్పడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ శ్యామలత మృతి చెందింది. -
Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు
కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది... ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. అచ్చం తనలా ఉండటంతో అవాక్కై.. పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి అవాక్కైంది. కలిపిన టిక్‌టాక్ అమీకి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేసింది. అది తెగ వైరల్ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నంబర్ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది. ఎన్నెన్నో పోలికలు వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్ ఇష్టం. హెయిర్ స్టైల్ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. మూడో తోబుట్టువు! ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్.. అమీకి ఫోన్ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది. లక్షల శిశు విక్రయాలు ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..!
కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్ప్రైజ్ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్ బ్యాగ్‌ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్‌ని ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్‌పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్ కావాలా అంటూ కౌట్స్ ఆ బ్యాగ్‌ని అందుకుంది. అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్‌స్టిక్, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్‌కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్‌ని తన ఆఫీస్ డెస్క్ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్ కంప్లైయింట్ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్‌ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది. ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్‌ని యజమానికి అందించిన కిమ్ సోషల్ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్. (చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?) -
పచ్చ పార్టీకి దొంగఓట్లే పెద్దదన్ను
ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం... చేసిన పనులు సగర్వంగా చెప్పుకోవడం... తద్వారా ఎన్నికల సమయంలో ఓట్లడగటం నిజమైన నాయకుడి లక్షణం. అదే దొంగ ఓట్లను నమ్ముకోవడం... అధికారంకోసం అడ్డదారులు ఎంచుకోవడం... అందుకోసం కుట్రలు, కుతంత్రాలకు తెరతీయడం... ఎంతటి అక్రమానికైనా వెరవకపోవడం కుటిల నీతికి నిదర్శనం. రెండో కేటగిరీకి చెందినవారే మన పచ్చనేతలు. విజయమే పరమావధిగా దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేరి్పంచేసి వారిద్వారా గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలే సాక్ష్యం. అక్కడ అధికారుల తనిఖీల్లో వేలాది దొంగఓట్లు బహిర్గతమయ్యాయి. వాటి ద్వారానే గతంలో వారు విజయం సాధించారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దొంగ ఓట్లతోనే గత ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారపార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుదఫాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాటి తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు పెట్టారు. జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఓట్లున్నవారికీ ఇక్కడ ఓట్లుండటం, స్థానికంగా ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం, చని పోయినవారి ఓట్లు జాబితాలో ఉండటం బయటపడింది. ఈ విధంగా బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46,116 దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా బయటపడ్డాయి. అక్రమ ఓట్ల వల్లే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో వారి విజయం ప్రశ్నార్థకంగా మారనుంది. పర్చూరులో పదివేలకు పైగా దొంగ ఓట్లు పర్చూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. 2014లో 10,775 ఓట్లు, 2019లో 1647 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 1967, 1991, 2004, 2019లో మాత్రమే పదివేలకుపైబడి మెజార్టీవచ్చింది. మిగిలిన 11 ఎన్నికల్లో 7 వేలకు మించలేదు. తాజాగా అధికారులు ఈ నియోజకవర్గంలో 10,468 దొంగ ఓట్లను తొలగించారు. మరిన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దీన్నిబట్టి పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లవల్లే గెలుపొందినట్లు తెలుస్తోంది. రేపల్లెలోనూ దొంగ ఓట్ల హవా... రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2014లో 13,355 ఓట్లు, 2019లో 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన 15 ఎన్నికల్లో 8 సార్లు 10 వేలకు మించి మెజార్టీ రాగా 7 సార్లు 10వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓట్ల విచారణ పూర్తికాక ముందే 8,880 దొంగ ఓట్లను గుర్తించారు. ఇంకా మరికొన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దొంగ ఓట్ల తొలగింపు రాబోయే ఎన్నికల్లో పచ్చపార్టీపై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. అద్దంకిలోనూ అదే తీరు... అద్దంకి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్(ఐ), వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 12,991 మెజార్టీ వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 10 వేలకు మించి మెజార్టీ వచ్చింది. మిగిలిన 12 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సగటున 5 వేలకు మించి మెజార్టీ రాలేదు. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలో అధికారులు 7,207 దొంగ ఓట్లను తొలగించారు. విచారణ పూర్తయితే మొత్తం 8 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించే అవకాశముంది. -
రాత్రికి రాత్రే చెరువు మాయం! తెల్లారేసరికి అక్కడ..!
కొన్ని రాష్ట్రాల్లో జరిగే వింత ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి అనిపిస్తుంది. సాధారణంగా దొంగలు చైన్లు, పర్సులు, ఇళ్లు దోచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ బిహార్‌లో మాత్రం దొంగలు చాలా వెరైటీగా ఉంటారు. అక్కడ ఒక్కసారి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఓ సొరంగం మార్గం ద్వారా బెగుసరాయ్‌లోని రైల్వే యార్డ్ నుంచి ఏకంగా రైలు ఇంజన్ని ఎత్తుకుపోయారు. ఇలాంటి విచిత్రమైన చోరీలతో బిహార్ తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడూ ఈ చెరువు కారణంగా మరోసారి హాట్‌టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. ఎక్కడైన చెరువుని ఎత్తుకెళ్లడం గురించి విన్నారా! అదికూడా ఒక్కరాత్రిలో మాయం చేయడం అంటే నమ్ముతారా?. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ దుండగలు ఎవరో గానీ ఎత్తుకెళ్లే దమ్ముంటే ఏదైనా చెయ్చొచ్చు అన్నా రేంజ్లో చేసి చూపించారు!. ఈ విచిత్ర ఘటన బిహార్‌లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. తెల్లారేసరికి ఆ ప్రదేశంలో నీళ్లు లేకుండా మట్టితో పూడుకుపోయి, అక్కడ ఒక గుడిసె మాత్రమే కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చెరువుని చేపలు పట్టడానికి, వ్యవసాయానికి వినియోగించేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. ఇంతకమునుపు మండల అధికారులు చెరువు పూడిక తీత పనులు మొదలుపెట్టారని తాము అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పనులు నిలిపేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నాది తామకిప్పటికీ అంతుపట్టడం లేదన్నారు. అంతేగాదు రాత్రికి రాత్రే ఎలా చెరవు మాయం చేశారన్నది తమకు తెలియదని ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రదేశంలో రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది తమకు మాత్రం తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అంతేగాదు ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా దుండగుల దృష్టి ఈ చెరువుపై పడిందని అంటున్నారు. అందుకే ఇంతలా పకడ్బంధీగా చీకట్లోనే చెరువు కబ్జా చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, చెరువుని మాయం చేసేలా మట్టిని ఎలా నింపారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది మాములు మిస్టరీ కాదు. ఎదుకంటే? కటిక చీకటిలోనే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు దుండగలు. (చదవండి: New Year 2024: ఇవాళ ఇవి తింటే..లక్కే లక్కు..డబ్బే..డబ్బు..) -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
ఏకంగా బస్‌షెల్టర్‌నే మాయం చేశారు
శివాజీనగర: ఇనుప వంతెనలు, భారీ వస్తు సామగ్రిని మాయం చేస్తున్న దొంగల కళ్లు..ఇప్పుడు బస్ షెల్టర్‌పై పడ్డాయి. బెంగళూరు నగరం నడిబొడ్డున నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న సిటీ బస్ షెల్టర్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన రూ.10 లక్షలతో స్థానిక కన్నింగ్హం రోడ్డులో బెంగళూరు మెట్రో సిటీ బస్ సంస్థ (బీఎంటీసీ) ఏడాదిన్నర క్రితం స్టీల్, ఇనుప రాడ్లు, షీట్లతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నిరోజులుగా అక్కడ బస్సు షెల్టర్ స్థానం ఖాళీగా కనిపిస్తుండటంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. సదరు ప్రైవేటు సంస్థకు విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులను ఆరా తీశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారం క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
రాత్రికి రాత్రే రూ. 10 లక్షల బస్ షెల్టర్ మిస్సింగ్: షాక్‌లో పోలీసులు
కర్నాటకలోని బెంగళూరు నగరంలో మరో బస్షెలర్ట్ మాయం కావడం కలకలం రేపింది. సిలికాన్ సిటీ కన్నింగ్‌హామ్ రోడ్లో నిర్మించిన వారం రోజులకే రూ. 10 లక్షల విలువైన ఈ షెల్టర్ ఉన్నట్టుండి కనపించకుండా పోయింది. బస్ట్ స్టాండ్ మాయం ఏంటి అనిఆశ్చర్య పోతున్నారా? ఇక్కడ బస్ షెల్టర్ అదృశ్యమవడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి వరుస సంఘటనలు ఇక్కడ నమోదుకావడం గమనార్హం. ముప్పయేళ్ల నాటి HRBR లేఅవుట్లోని బస్టాండ్ మార్చిలో రాత్రికి రాత్రే మాయమైంది. ఇపుడు మరో బస్టాండ్. స్టెయిన్లెస్-స్టీల్ స్ట్రక్చర్‌తో, రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్ రోడ్లో బస్ షెల్టర్ ఆగస్ట్ 21న ఏర్పాటు చేయగా ఆగస్ట్ 28న కనిపించకుండా పోయింది. ఈ సంఘటన జరిగిన నెల తర్వాత బస్ట్ స్టాప్తోపాటు, స్టీల్ స్ట్రక్చర్ దొంగతనంపై సెప్టెంబర్ 30న ఫిర్యాదు దాఖలైంది. దీంతో బెంగళూరు పోలీసులు బిఎమ్‌టిసి బస్ షెల్టర్ల నిర్మాణాల కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమీపంలోని భవనాల నుండి CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ బస్ షెల్టర్‌ను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్మించింది. ఇది బెంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం వెనుక, విధాన సౌధ నుండి కేవలం 1 కి.మీ దూరంలో ఉండటం పోలీసులకు మరింత సవాల్‌గా మారింది. ఇక ఇలాంటి వరుస సంఘటల విషయానికి వస్తే..అంతకుముందు 1990లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇచ్చిన కళ్యాణ్‌నగర్ బస్టాండ్ అదృశ్యమైంది. మరేదో వ్యాపార సముదాయ నిర్మాణం కోసం ఈ చోరీ జరిగిందని ఆ ప్రాంత నివాసితులను ఉటంకిస్తూ మీడియా నివేదికను ఉటంకిస్తూ ఇండియా టుడే నివేదించింది. 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్ స్టాప్ రాత్రిపూటఅదృశ్యమైందని నివేదిక పేర్కొంది. గతంలో 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్ లేఅవుట్ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్ కనిపించకుండా పోయింది. -
బిహార్‌లో పోలీసు స్టేషన్లో దొంగతనం
పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్‌ను టార్గెట్ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్‌లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్‌లోని స్టోర్‌రూమ్‌లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్‌రూమ్‌లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. -
రూ.12.5 కోట్ల బుద్ధుడి విగ్రహం చోరీ.. కానీ అమ్మడం కష్టమేనట!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఆర్ట్ గ్యాలరీలో 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపాన్ కాంస్య బుద్ధ విగ్రహం ఇటీవల చోరీకి గురైంది. ఆ చోరీకి సంబంధిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ గ్యాలరీలో 113 కిలోల బరువున్న ఈ శిల్పం చోరీకి గురైందని లాస్ ఏంజిల్స్ పోలీసు విభాగం మీడియాకు తెలిపింది. గ్యాలరీ గేట్‌ను బద్దలు కొట్టి ట్రక్కుతోపాటు లోపలికి దుండగుడు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ చూపిస్తోంది. ఈ పురాతన బుద్ధుడి విగ్రహం 1603-1867 నాటిదని గ్యాలరీ యజమాని ఫయేజ్ బరాకత్ చెప్పారు. అద్భుతమైన ఈ కళాఖండం 55 సంవత్సరాల క్రితం ఆయన స్వాధీనంలోకి వచ్చింది. ఇలాంటిది మరెక్కడైనా ఉంటుందని తాను అనుకోనని గ్యాలరీ డైరెక్టర్ పాల్ హెండర్సన్ న్యూయార్క్ పోస్ట్‌తో తెలిపారు . నాలుగు అడుగుల పొడవు, లోపుల బోలుగా ఉండే ఈ కాంస్య విగ్రహం చాలా ప్రత్యేకమైందని, దీన్ని చోరీ చేసిన వ్యక్తి అమ్మడం చాలా కష్టమని ఆయన అన్నారు. -
కెనడాలో చోరీ, అఫ్రికాలో ప్రత్యక్ష్యం.. ఈ కార్లు ఎలా వస్తున్నాయబ్బా?
కెనడాలో చోరీ అయిన వాహనాలు చివరికి ఆఫ్రికాలో ప్రత్యక్షం అవుతున్నాయి. కెనడాలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఈ సమస్యను పట్టించుకోకపోవడమే దీనికి కారణమని ఆఫ్రికా దేశాల్లోని అధికారులు ఆరోపిస్తున్నారు. సీబీసీ మీడియా ఇటీవల జరిపిన పరిశోధనలో పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమైన ఘనాలో డజన్ల కొద్దీ చోరీకి గురయిన వాహనాలు అంటారియో, క్యూబెక్ లైసెన్స్ ప్లేట్లతో కనిపించాయి. ఈ వాహనాలలోని కొన్నింటికి కెనడియన్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. కొనుగోలుదారులు మార్కెట్ ధరకు దగ్గరగా వీటికి ధరను చెల్లిస్లున్నారని తేలింది. సోషల్ మీడియాతో సహా వివిధ ఆన్లైన్ ఛానళ్ల ద్వారా ఈ కార్ల విక్రయాలకు సంబంధించిన ప్రకటలు వెలువడుతున్నాయి. కెనడాలో 2022లో పెరిగిన కార్ల చోరీలు ‘తాము చోరీ అయిన వాహనాల విషయంలో ప్రపంచ దాతగా మారామని కెనడియన్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ అసోసియేషన్ ప్రతినిధి మైఖేల్ రోత్ సీబీసీకి చెప్పారు. కాగా బీమా పరిశ్రమ గ్రూప్ ఈక్విటీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాలో వాహనాల దొంగతనాలు 2022లో పెరిగాయి. క్యూబెక్, అంటారియోలో దాదాపు 50 శాతం మేరకు కార్ల చోరీలు పెరిగాయి. అట్లాంటిక్ కెనడాలో కార్ల చోరీ 34 శాతానికిపైగా పెరిగింది. దీనివెనుక మాంట్రియల్‌లోని వ్యవస్థీకృత నేరగాళ్లు కారణమనే ఆరోపణలున్నాయి. చోరీ అయిన వాహనాలు మాంట్రియల్ పోర్ట్ నుంచి విదేశాలలోని గమ్యస్థానాలకు తరలిపోతున్నాయి. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస చోరీలు ఈ సంవత్సరం ప్రారంభంలో పీల్ ప్రాంతీయ పోలీసులు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ సంయుక్తంగా పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ అండ్ ఎక్విట్ అసోసియేషన్ సహాయంతో 10 మిలియన్ డాలర్లకు మించి విలువచేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో వరుస దొంగతనాల నేపధ్యంలో ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ పేరుతో విచారణ మొదలయ్యింది. ఈ వాహనాలను షిప్పింగ్ కంటైనర్లలోకి ఎక్కించి, ట్రక్కులు లేదా రైళ్ల ద్వారా మాంట్రియల్ పోర్ట్‌కు తరలిస్తున్నట్లు విచారణతో తేలింది. 300 శాతం మేరకు పెరిగిన వాహన చోరీలు నెల రోజుల క్రితం హాల్టన్ పోలీసులు చోరీకి గురయిన 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఆరు నిమిషాలకు ఒక వాహనం చోరీకి గురవుతుండటంతో రికవరీలు సమస్యగా పరిణమిస్తున్నాయి. గత జూన్‌లో కెనడియన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ అసోసియేషన్ అందించిన వచ్చిన ఒక నివేదిక ప్రకారం టొరంటోలో 2015 నుండి 2022 వరకు వాహనాల దొంగతనాలు 300 శాతం మేరకు పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. 2022లో ఒక్క టొరంటోలోనే 9,600 వాహనాలు చోరీ అయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత సమన్వయంతో జాతీయస్థాయిలో ప్రయత్నాలు జరగాలని నివేదిక పిలుపునిచ్చింది. వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ను అప్డేట్ చేయాలి కెనడాలో వాహనాల దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవస్థీకృత నేరాగాళ్లు చోరీ చేసిన వాహనాలతో తమ ఆదాయాన్ని పెంచుకోవడంలో మరింత ప్రవీణులుగా మారారు. దొంగతనాల నివారణకు తక్షణమే పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం అవసరం అని సీఎఫ్ఎల్ఏ ప్రెసిడెంట్ మైఖేల్ రోతే అన్నారు. అలాగే ఈక్విట్ అసోసియేషన్ వంటి ఇతర సంస్థలు.. కెనడాలోని ఫెడరల్ మోటార్ వెహికల్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ను అప్డేట్ చేయాలని కెనగా ట్రాన్స్పోర్ట్ విభాగానికి పిలుపునిచ్చాయి. విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు నేరస్తులు ఇప్పుడు పాత ప్రమాణాలను సద్వినియోగం చేసుకుంటున్నారని విచారణాధికారి బ్రయాన్ గాస్ట్ పేర్కొన్నారు. వారు వ్యవస్థలోని లోపాలను త్వరగా , సులభంగా ఉపయోగించుకుంటున్నారని, ఇది కెనడా అంతటా వాహనాల దొంగతనాల పెరుగుదలకు దారితీస్తున్నదన్నారు. అంటారియో ప్రభుత్వం వాహనాల దొంగతనాలను ఎదుర్కొనేందుకు రాబోయే మూడు సంవత్సరాల్లో 51 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా క్రిమినల్ సంస్థలపై దర్యాప్తు , విచారణ కోసం ప్రాసిక్యూషన్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. చాలా తక్కువ మాత్రమే రికవరీ కెనడియన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన హువ్ విలియమ్స్ మాట్లాడుతూ కెనడాలో గృహాలు, డీలర్షిప్ షోరూమ్‌ల నుండి కార్లు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా తక్కువ మాత్రమే రికవరీ అవుతున్నాయని తెలిపారు. యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ పనిని సమర్థవంతంగా చేస్తోంది. కానీ కెనడాలో అలా జరడం లేదన్నారు. కాగా ఘనాకు చెందిన ఎకనామిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దులై బషీరు దపిలా మాట్లాడుతూ వాహన దొంగతనాలకు సంబంధించి ఏ కెనడియన్ ఏజెన్సీ కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించలేదని, నేరుగా అధికారిక ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కార్లను వెదుక్కుంటున్న వాహనయజమానులు కొన్ని సందర్భాల్లో కెనడియన్లు చోరీకి గురయిన కారు కోసం తామే ప్రయత్నిస్తున్నారు. గత జూలైలో టొరంటోకు చెందిన ఒక వ్యక్తికి చెందిన రేంజ్ రోవర్ చోరీ జరిగాక అతను దానిని ట్రాక్ చేసి, మాంట్రియల్లో ఉందని, దానిని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లారు. 64 ఏళ్ల స్టీఫెన్ టౌబ్ రేడియో-ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ పరికరం సాయంతో తన కారు వాహనం టొరంటో తూర్పు చివరలో ఉందని తెలుసుకున్నారు. తరువాత పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ వద్ద షిప్పింగ్ కంటైనర్‌లోకి చేరుకుందని తెలిపారు. ట్రాకింగ్ డివైజ్ ప్రొవైడర్ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ కారు లొకేషన్‌ను షేర్ చేసిందని టౌబ్ కెనడియన్ ప్రెస్‌కు తెలిపారు. అయితే సిబ్బంది కొరత కారణంగా కంటైనర్‌ను తెరవడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని, ఈలోపునే కంటైనర్‌ను రవాణా జరగవచ్చని టౌబ్ పేర్కొన్నాడు. ఈ నేపధ్యంలో టౌబ్ మాంట్రియల్‌లోని సంబంధింత కార్యాలయానికి వెళ్లి అక్కడి ఏజెన్సీని కలిశాడు. మరుసటి రోజు తన రేంజ్ రోవర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తాను అక్కడికి వెళ్లకపోతే తన కారును తిరిగి పొందేవాడిని కాదని టౌబ్ మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: విటమిన్ టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. తరువాత? -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
దొంగ ఓట్ల పాపం చంద్రబాబుదే
మడకశిర/హిందూపురం: రాష్ట్రంలో దొంగ ఓట్ల పాపం చంద్రబాబు దేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో స్థానిక మాజీ ఎమ్మెల్యే దివంగత వైసీ తిమ్మారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. వారి హయాంలో నమోదు చేసిన దొంగ ఓట్లను కాపాడుకోవడానికే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వీటిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎంపీల బృందంతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మడకశిర ప్రాంతంలో వన్యప్రాణుల మృతిపై విచారణ చేయిస్తామని తెలిపారు. వన్యప్రాణుల మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం, హిందూపురమూ మనవే: పెద్దిరెడ్డి ‘కలసికట్టుగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పం మనదే. హిందూపురమూ మనదే...’ అని పెద్దిరెడ్డి అన్నారు. హిందూపురంలోని బైపాస్ రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. టీఎన్ దీపిక, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు శంకరనారాయణ, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర, మునిసిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ పాల్గొన్నారు. -
దొంగ ఓట్ల పేరుతో బాబు కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల వివరాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తోందని.. ఆ సర్వేలోనే దొంగ ఓట్లు, అసలు ఓట్ల సంగతేంటో తెలిసిందని.. అలాంటిది టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై కొత్తగా డ్రామాలాడటమేంటని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక డ్రామా ఆడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈసీకి లేఖలు, ఢిల్లీ పర్యటనలు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డేటాను టీడీపీ చౌర్యం చేసి, ఎలా దొరికిపోయిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన మాటలు నమ్మే పరిస్థితిలేదు. బౌన్సర్లతో, కిరాయి జనంతో, రాజకీయ కూలీలతో లోకేశ్ చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది? ధర్మ ప్రచార పర్యవేక్షణకు ఏడుగురితో కమిటీ.. సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈనెల 6న అన్నవరంలో ప్రారంభమైన ధర్మ ప్రచార కార్యక్రమం అన్నిచోట్లా కొనసాగుతాయి. ఈ ధర్మ ప్రచార కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాం. అలాగే, ఐదు లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటివరకు వంశపారంపర్య ధర్మకర్తలు లేదా అర్చకుల నుంచి 37 దరఖాస్తులు అందాయి. -
ఖరీదైన చాక్లెట్ చోరీ.. పరారైన అమ్మాయిల కోసం పోలీసుల గాలింపు!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు అమ్మాయిలు ఒక దుకాణంలో ఖరీదైన చాక్లెట్ చోరీ చేసి పరారయ్యారు. దుకాణదారు తెలిపిన వివరాల ప్రకారం ఆ చాక్లెట్ ఖరీదు రూ.500. ఈ ఘటన మొత్తం సీసీటీవీలొ రికార్డయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ చోరీ పట్టణంలోని డీడీ నగర్ గేట్ వద్దనున్న డిపార్ట్మెంటల్ స్టోర్‌లో జరిగింది. ఈ స్టోర్‌కు వచ్చిన నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి ఆ చాక్లెట్‌ను తన జీన్స్ ప్యాంటు జేబులో దాచుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు మిగిలినవారు కూడా పరారయ్యారు. ఈ చాక్లెట్ చోరీ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిలో ఆ ఆమ్మాయి చోరీ ఎలా చేసిందీ రికార్డయ్యింది. కౌంటర్లో డబ్బులు చెల్లించకుండా ఎలా తప్పించుకున్నదీ దానిలో రికార్డయ్యింది. వారు ఇక్కడికి సమీపంలోని ఏదో హాస్టల్‌కు చెందినవారిగా స్టోర్ యజమాని అనుమానిస్తున్నారు. దుకాణదారుని ఫిర్యాదు మేరకు మహరాజ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాక్లెట్ ఖరీదు రూ. 500 ఉంటుందని దుకాణదారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్టోర్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 2013 నుంచి 2023 వరకు జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనాను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ.. 2013లో కేవలం మూడునెలల వ్యవధిలోనే సుమారు 20 వేల దొంగ ఓట్లు చేర్చగా.. అప్పటి ఆర్ఓ ఈ అవకతవకలపై విచారణ చేయమని క్రిమినల్ కేసు పెట్టారన్నారు. అప్పటి నుంచీ అది పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఆర్ఓ ఆఫీస్ నుంచి నివేదిక లేదంటూ కోర్టుకు అప్పటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 2018లో సుమారు 15 వేల దొంగ ఓట్లు చేర్చారన్నారు. ఇలా ఇప్పటికి 2013 నుంచి 2023 జనవరి 1వ తేదీ కొత్త ఓటరు జాబితా ప్రకారం, సప్లిమెంటరీ ఓటరు జాబితా వరకు సుమారు 40వేల దొంగ ఓట్లు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేర్చి అక్రమ పద్ధతిలో స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారన్నారని ఆరోపించారు. వీటితోపాటు విదేశాలలో ఉంటున్న వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, దేశంలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారి ఓట్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపడచుల ఓట్లు తొలగించకుండా వాటిపేరుతో దొంగ ఓట్లతో అప్రజాస్వామికంగా ఎన్నికలు పర్చూరులో జరుగుతోందని వివరించారు. మార్టూరు ప్రస్తుత ఏఈఆర్ఓ తన లాగిన్‌లోని డేటాను ఏలూరికి ఎలా ఇచ్చారని ప్రశి్నంచారు. ఒక ప్రత్యేక అధికారి బృందంతో ఇంటింటికి సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక ఓటరు ధ్రువీకరణ చేయాలని, ఓట్లు చేర్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. -
మణిపూర్‌లో ఆయుధాల లూటీ
ఇంఫాల్: మణిపూర్‌లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్ జిల్లా నారన్‌సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్స్‌ను దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు. -
400 కిలోల టమాటాలు చోరీ
పుణే: టమాటాల ధర ఆకాశాన్నంటుతున్న వేళ ఈ కూరగాయ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ రైతు ఇంట్లో ఉంచిన నాలుగు క్వింటాళ్ల టమాటాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు షిరూర్ తహశీల్‌కు చెందిన రైతు అరుణ్ ధోమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తన పొలంలో పండించిన 400 కిలోల టమాటాలను కోసి 20 క్రేట్లలో ఇంటికి తీసుకువచ్చాడు. తెల్లారాక చూస్తే అవి కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఇటీవలి పుణేకే చెందిన ఓ రైతు తను పండించిన 18 వేల క్రేట్ల టమాటాలను రూ.3 కోట్లకు అమ్మి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. -
6 టన్నుల ఐరన్ బ్రిడ్జి అలా మాయమైంది!
ముంబై: ముంబై శివారు మలాడ్(పశ్చిమ)లో 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను మాయం చేసిన ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ విద్యుత్ కేబుళ్లను అటూఇటూ జరిపేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. అక్కడే శాశ్వత వంతెనను నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని గత కొన్ని నెలల క్రితం మరో ప్రాంతంలోని మురుగు కాల్వపైకి తరలించారు. ఈ వంతెన కనిపించకుండా పోయిందంటూ అదానీ సంస్థ జూన్ 26న బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూన్ 6వ తేదీ నుంచే ఆ బ్రిడ్జి మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రాంతంలో సీసీటీ కెమెరాలు లేవు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జూన్ 11వ తేదీన వంతెన వైపుగా ఒక భారీ లారీ వచ్చిన విషయం రికార్డయింది. ఆ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కూపీ లాగారు. అందులోనే గ్యాస్ కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి 6 టన్నుల ఇనుప వంతెనను కట్ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగే సూత్రధారి అని తేలడంతో అతడిని, సహకరించిన మరో ముగ్గురిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకుపోయిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
6000 కేజీల అదానీ ఐరన్ బ్రిడ్జ్ మాయం.. ఏమైందో తెలిస్తే..
Adani Iron Bridge Stolen: అదానీ కంపెనీ గత సంవత్సరం మలాద్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెన నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఒక శాశ్వత వంతెనను ఏర్పాటు చేసింది. శాశ్వత వంతెన ఏర్పాటైన తరువాత తాత్కాలిక వంతెనను వినియోగించడం మానేశారు. నిరుపయోగంగా ఉన్న 6000 కీజాల తాత్కాలిక వంతెన తాజాగా కనిపించకుండా పోయింది. దీంతో అదానీ కంపెనీ ఈ విషయం మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు వంతెన దొంగతనానికి కారకులైన నలుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు. సుమారు 90 అడుగుల పొడవున్న ఈ వంతెనను అదానీ సంస్థ గతంలో భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడానికి నిర్మించినట్లు తెలిసింది. వంతెన నిర్మాణ సమయంలో సంబంధమున్న ఒక వ్యక్తి ప్రధాన నిందితుడుగా తెలిసింది. ఈ దొంగతనం జరగటానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఎటువంటి సీసీ కెమరాలు లేకపోవడమే. ఈ ఘటన జూన్ 26న వెలుగులోకి వచ్చింది. (ఇదీ చదవండి: వాట్సాప్, ఫేస్బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!) పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించి జూన్ 11న ఒక భారీ ట్రక్కు వెళ్లడం గమనించి, దాని ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు దానిని గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి భారీ ట్రక్కు ద్వారా తలచినట్లు విచారణలో తేలికైనది. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటన బీహార్ ప్రాంతంలో కూడా వెలుగులోకి వచ్చింది. -
మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె క్రెడిట్ కార్డు చోరీ
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నమ్మిన యజమానురాలిని మోసం చేసిన డ్రైవర్ ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును చోరీ చేసి డబ్బులు డ్రా చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాలివీ.. మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూతురు డీకే శృతిరెడ్డి బంజారాహిల్స్ రోడ్ నంబర్.14లోని ప్రేమ్‌పర్వత్ విల్లాస్‌లో నివసిస్తుంది. గతేడాది డిసెంబర్ నుంచి చిన్నా అలియాస్ కె. బీసన్న ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆమెకు చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించి శ్రీమహవీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ. 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శృతిరెడ్డి సదరు డ్రైవర్‌ను ప్రశ్నించింది. చదవండి: హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్ అబద్దాలు చెప్పడమే కాకుండా రకరకాల కథలతో ఆమెను నమ్మించాలని చూసినా చివరకు తన క్రెడిట్ కార్డును దొంగిలించి డబ్బు వాడుకున్న విషయం వెల్లడైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చిన్నా అలియాస్ బీసన్నపై ఐపీసీ 420, 408ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే..
కొన్న వస్తువులు ఏవేవో కారణాల రీత్యా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎంతగా ప్రయంత్నించినా దొరికే అవకాశం గానీ వాటి ఆచూకీ గానీ కానరాదు. అలాంటి వస్తువు సడెన్‌గా దొరికినా లేదా చాలా ఏళ్లక్రితం మిస్ అయ్యిన వస్తువు అనుకోకుండా మనకు లభించిన లేదా బయటపడ్డ మన ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి విచిత్ర ఘటనే యూఎస్ఏలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ స్టేట్స్‌లోని కాన్వాస్‌కు చెందిన 45 ఏళ్ల జాన్ మౌన్స్ ఫాక్స్ అనే వ్యక్తి మంచి చేపలను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మే 29(మెమోరియల్ డే)న చెనీ సరస్సు వద్దకు వెళ్లాడు. సరస్సు వద్ద అనువైన చోటును వెదుకుతుండగా..ఓ విచిత్రమైన వస్తువు కంట పడింది. మొదట అర్థం కాలేదు. తన వద్ద ఉన్న సోనార్ పరికరాల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుని నిశితంగా చూశాడు. ఏవో టైర్లు, రోల్‌బార్, స్టీరింగ్ వీల్ వంటి వాటితో కూడిన ఓ జీప్ లాంటి వస్తువును చూశాడు. ఎలాగైనా సరస్సు నుంచి తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్రేన్ల సాయంతో తీసేందుకు అధికారుల అనుమతి తీసుకుని మరీ ఆ వస్తువుని బయటకు తీశాడు. అతను ఊహించినట్లుగానే అది జీప్. 1990ల నాటి ఓల్డ్ జీప్ అని తేలింది. నిజానికి అతను ఏదో పెద్ద చేప ఏమో అనుకున్నాడు. బయటకు తీయాలనే ఆత్రుతలో అదే ఏంటో చూడగా అసలు విషయం బయపడింది. ప్రస్తుతం ఆ జీప్ని చూసేందుకు అధికారులు, ప్రజలు అతని ఇంటికి ఎగబడుతున్నారు. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్‌ను పైలట్‌గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్‌కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్‌ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్‌వర్క్‌లకు ఉంటుంది. అంటే తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
ఫోన్ పోతే.. ఇలా వెతకండి!
షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన వసుధ తెచ్చిన వస్తువులన్నీ లోపల సర్దేసి, వచ్చి కూచుంది. సడెన్‌గా ఏదో గుర్తుకువచ్చినట్టు అయ్యి ఫోన్ కోసం వెతికింది. చూస్తే, ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్, ఇంటిలోపల అంతా చెక్ చేసింది. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఖరీదైన ఫోన్, అందులో వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. అనుకునేసరికి కాసేపటి వరకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన ముఖ్యమైన డేటా పోతే వచ్చే సమస్యలు తలుచుకుని చెమటలు పట్టేశాయి. ∙∙ వసుధ సమస్య చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్రాక్ చేయాలన్నా, మన వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండటానికి మార్గమే లేదా? అనుకునేవారికి సరైన సమాధానంగా సిఇఐఆర్ వరదాయినిగా మారింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ∙∙ నకిలీ మొబైల్ ఫోన్ల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయడానికి, మొబైల్ ఫోన్ దొంగతనాన్ని అరికట్టడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కలిగించడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఏర్పాటు చేసింది. సిఇఐఆర్ పోర్టల్ ప్రయోజనాలు: https://ceir.gov.in పోర్టల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఐఎమ్ఇఐ నంబర్‌ను ఉపయోగిస్తుంది. సిఇఐఆర్ ద్వారా మొబైల్ పరికరం బ్లాక్ చేశాక, అది ఏ భారతీయ నెట్వర్క్ కంపెనీకి కనెక్ట్ చేయలేరు. ఆ పరికరాన్ని ఇక తిరిగి ఉపయోగించలేనిదిగా మార్చేస్తుంది. పోర్టల్‌లో మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడానికి.. ►ముందుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. లేదా కోల్పోయిన డివైజ్ సర్టిఫికెట్ లేదా మీ అక్నాలెడ్జ్ కాపీని తీసుకోవాలి. ►మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి. ►సిఇఐఆర్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ కాపీ, ఐడెంటిటీ (ఆధార్ కార్డ్) ప్రూఫ్‌ని యాడ్ చేయాలి. https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp ►మీ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఐడీ జనరేట్ అవుతుంది. ►మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడానికి తగిన కారణం ఏంటో తెలియజేయాలి. ►మీ రిజిస్టర్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఐఎమ్ఇఐ నంబర్‌ను చెక్ చేయడానికి.. ►ముందు పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/ Device/CeirIMEI Verification.jsp ►మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ►మీ మొబైల్‌కి ఓటీపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ►15 అంకెల ఐఎమ్ఇఐ నంబర్‌ను నమోదు చేసి, చెక్ రిక్వెస్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. ►ఐఎమ్ఇఐ నంబర్ ధ్రువీకరణ అవుతుంది. సిఇఐఆర్ పోర్టల్‌లో మీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడానికి.. ►పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp ►రిక్వెస్ట్ స్టేటస్ ఆప్షన్‌ను చెక్ చేస్తే, తెలిసిపోతుంది. పోర్టల్‌లో రికవరీ మొబైల్ ఫోన్‌ని అన్‌బ్లాక్ చేయడానికి.. https://ceir.gov.in/ Request/CeirUser UnblockRequest Direct.jsp పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. ►రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి. ►మొబైల్ నంబర్‌ను అన్‌బ్లాక్ చేయడానికి కారణాన్ని ఇవ్వాలి. డివైజ్‌ను గుర్తించాక డేటాను తొలగించడానికి.. ►ఆండ్రాయిడ్ డివైజ్ డేటాను లాక్ లేదా ఎరేజ్ చేయడానికి https://support.google.com/ accounts/answer/6160491?hl=en ►ఐ ఫోన్ అయితే.. iCloud.com లో ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసి, డేటా తొలగించాలి. https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud పోయిన మొబైల్ డేటా సురక్షితంగా ఉంచడానికి.. ►ఈ పోర్టల్ పూర్తిగా చట్టబద్ధమైనది. ఫోన్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మీ డేటా, యాప్స్‌ను డీకంపైల్ చేయదు. https://reports.exodus-privacy.eu.org/en/ ►మీ మొబైల్ నంబర్లను నిర్ధారించడానికి, తీసేయడానికి టెలికాం విభాగాం అనుమతిస్తుంది. https://tafcop.dgtelecom.gov.in ►ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపినవారిని గుర్తించడానికి అనుమతిస్తుంది. https://smsheader.trai.gov.in ►ఎస్సెమ్మెస్, వాట్సప్, ఇమెయిల్‌లో వచ్చిన షార్ట్ లింక్స్ మీ వ్యక్తిగత డేటాను డామేజీ చేయవచ్చు. అందుకని, షార్ట్ లింక్స్ పూర్తి యుఆర్ ఎల్ వివరాలను https://isitphishing.org/ ద్వారా చెక్‌చేయవచ్చు. ►యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, సెక్యూరిటీ యాప్‌లను ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. ∙అన్ని అప్లికేషన్లు, సోషల్‌మీడియా, ఇమెయిల్ అకౌంట్స్ కోసం రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగిస్తే, డేటా సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ చేస్తే.. పనిచేయదు బ్లాక్ లిస్ట్ చేసిన మొబైల్ పరికరాలను షేర్ చేయడానికి నెట్వర్క్ ఆపరేటర్లకు సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్‌గా సేవలందిస్తూ, అన్ని మొబైల్ ఆపరేటర్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఇఐ) డేటాబేస్లకు లింక్ చేస్తుంది. సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) కార్డ్ మార్చినప్పటికీ ఒక నెట్‌వర్క్‌లోని బ్లాక్ చేసిన పరికరాలు ఇతర నెట్‌వర్క్‌లలో పనిచేయవని ఇది నిర్ధారిస్తుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
కర్ణాటకలో అదృశ్యమైన బస్.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది!
రాయచూరు రూరల్: కర్ణాటకలో అదృశ్యమైన కేఎస్ ఆర్టీసీ బస్ తెలంగాణలో దొరికింది. కలబుర్గి డివిజన్లోని కలబుర్గి జిల్లా చించోళి బస్టాండ్‌లో నిలిపిన కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ బస్‌ను దొంగలు నకిలీ తాళాలతో స్టార్ట్ చేసుకుని ఉడాయించారు. బీదర్ రెండవ డిపోకు చెందిన కేఏ 38 ఎఫ్ 971 బస్సు ఇది. బీదర్ నుంచి చించోళికి వచ్చి తెల్లవారుజామున 3.30 గంటలకు బస్సు మాయమైంది. మంగళవారం విధులకు వెళ్లాలని డ్రైవర్, కండక్టర్ వచ్చి చూడగా బస్సు లేకపోవడంతో కంగుతిన్నారు. పలుచోట్ల గాలించి చివరకు చించోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు మార్గాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి బస్సు వెళ్లిన దిశను గుర్తించారు. బస్సు బుధవారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు తాలూకా భూకైలాస తాండాలో లభించింది. దొంగల ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు! -
చీకోటి ప్రవీణ్ కారు చోరీ
-
వింత ఘటన: పెంపుడు పిల్లిని దొంగిలించి.. తిన్న ముగ్గురు వ్యక్తులు..
సాక్షి, అల్వాల్: పెంపుడు పిల్లిని దొంగిలించి..కోసుకుని తిన్న ముగ్గురు నిందితులను నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ జీకే కాలనీలో నివాసం ఉండే తాలూరి రూత్‌వర్ష పెంచుకుంటున్న పిల్లి గత నెల 29వ తేదీ నుండి కనిపించడం లేదు. ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో చొరబడి పిల్లిని అపహరించి సంచిలో వేసుకొని పారిపోయినట్లు గుర్తించారు. దీంతో నేరేడ్మెట్ పోలీసులకు రూత్‌వర్ష ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వినాయక్‌నగర్‌కు చెందిన నర్సింహ, కిరణ్, శంకర్ నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని నిందితులు తెలిపారు. (చదవండి: తెలంగాణ కొత్త సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్) -
దారుణం: శస్త్ర చికిత్స చేసినట్లు చేసి..అవయవాలు దొంగలించారు
శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఓ బాలిక శరీరంలో ఏకంగా అవయవాలనే తొలగించేశారు వైద్యులు. దీంతో సదరు బాలిక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిన రెండు రోజులకే చనిపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న అడ్మిట్ అయ్యింది. దీంతో ఆమెకు జనవరి 24న శస్త్ర చికిత్స చేశారు. చికిత్స చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26న ఆమె చనిపోయింది. తొలుత బాలిక కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు. అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఆమె మృతదేహంపై చిల్లులు చిల్లులుగా ఉండి ఏవో సంచులుగా కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది మృతదేహం నుంచి అవయవాలు తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉంచినట్లు అనిపించి వెంటనే వారు ఆ కార్యక్రమాలను నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌కి సంబంధించిన కేసుగా నమోదు చేశారు. ఆ బాలికకు శస్త్ర చికిత్స చేసిన హిందూ రావు ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురుతేగ్ బహుదూర్ ఆస్పత్రి వద్ద ఉంచారు. ఆ బాలికకు పోస్ట్‌మార్టం చేసేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును నియమించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీసీపీ కల్సి ఈ కేసును పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు) -
Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అరుదైన జాతికి చెందిన ఓ పెంపుడు పిల్లిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... చింతలకుంట జహంగీర్‌కాలనీలో ఎస్.కె.గజాన మహ్మద్(22) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. థాయిలాండ్‌లోని కాహో మనీ బ్రీడ్‌కు చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. 18 నెలల వయసు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి కండ్లు ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి బ్లూ కలర్లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్రత్యేకత. అయితే ఆదివారం రాత్రి పిల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడంతో స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు
దొంగలు డబ్బులు, నగలు దొంగతనం చేస్తారని విన్నాం. అంతేందుకు స్ట్రీట్ లైట్లు, మొక్కలను కూడా ఎత్తుకుపోవడం గురించి కూడా విని ఉంటాం. కానీ ఏకంగా రెండు కిలోమీటర్ల రహదారిని దొంగలించడం గురించి విన్నారా!. అదీ కూడా రెండు గ్రామాలను కలిపే రహదారిని రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని బంకా జిల్లా, రాజౌన్ ప్రాంతంలోని ఖరౌనీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఐదు రోజులు క్రితం వరకు ప్రజలు ఏళ్ల తరబడి వినయోగించినా.. ఖాదంపూర్, ఖరౌనీ అనే రెండు గ్రామాలను కలిపే రహదారిని ఉపయోగించారు. ఒక రోజు ఉదయం ప్రజలు అటుగా వెళ్తున్నప్పుడూ...రోడ్డు మొత్తం మాయమై దాని స్థానంలో పంటలు వేసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గరయ్యారు గ్రామస్తులు. మొదట్లో వారు దారి తప్పాం అనుకున్నారు. ఆ తర్వాత గానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. ఖైరానీ గ్రామానికి చెందిన గూండాలు, రాత్రికి రాత్రే ట్రాక్టర్‌తో రహదారిని దున్ని గోధుమ పంటలను విత్తారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వ్యరేకించడంతో.. గుండాలు కొట్లాటకు దిగి కర్రలు, రాడ్లతో ప్రజలను బెదిరించారు. దీంతో ఖాదంపూర్ గ్రామానికి చెందిన దాదాపు 35 మంది ప్రజలు సర్కిల్ పోలీస్ అధికారి మహ్మద్ మెయినుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆక్రమణకు పాల్పడినట్లు తేలితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోలీసు అధికారి హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయానికి వినియోగిస్తున్న ఆక్రమిత భూమిని తొలగించి తిరిగి రోడ్డు వేస్తామని కూడా చెప్పారు. (చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్) -
రూ.100 గిరాకీ చేసి.. రూ.10000 విలువైనవి ఎత్తుకెళ్లారు..
సాక్షి, నిజామాబాద్: ఓ బట్టల దుకాణంలో రూ.100ల గిరాకీ చేసి, రూ.10000 విలువ గల దుస్తులను చోరీ చేసిన ఘటన శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని ఓ బట్టల దుకాణంలోకి గుర్తు తెలియని ముగ్గురు మహిళలు వచ్చి స్కార్ఫ్ కావాలని అడిగారు. యజమాని స్కార్ఫ్‌ను చూపిస్తుండగా.. మరో మహిళ ఇద్దరు పురుషులతో కలిసి దుకాణంలోకి వచ్చారు. తమకు బెడ్ షీట్లు కావాలని, తొందరగా చూపించాలని ఒత్తిడి తెచ్చారు. సదరు యజమాని మొదట వచ్చిన మహిళలను కొద్దిసేపు ఆగమని చెప్పి దుకాణంలోని రెండో గదిలోకి వెళ్లాడు. ఇదే సమయంలో మొదట వచ్చిన మహిళలు అక్కడ ఉన్న 10చీరెలున్న కట్ట, ఐదు ప్యాంట్ షర్టుల కట్టలను తమ చీర లోపల పెట్టుకున్నారు. తమకు స్కార్ఫ్ ఇవ్వాలని లేకుంటే వెళ్లిపోతామని యజమానిని తొందర చేశారు. దీంతో యజమాని ముందు రూంలోకి వచ్చి వారికి స్కార్ఫ్‌ను ఇవ్వగా.. వారు యజమానికి రూ.వంద నోటు ఇచ్చి వెళ్లి పోయారు. తదుపరి వచ్చిన మహిళ ఇద్దరు పురుషులకు యజమాని బెడ్షీట్లు చూపించగా అవి తమకు నచ్చిన రంగులో లేవని వెళ్లిపోయారు. వారందరూ వెళ్లిపోయిన తర్వాత దుకాణంలోని 10 చీరెల కట్ట, ఐదు ప్యాంటు షర్టుల కట్ట కనిపించకపోవడంతో సదరు యజమాని ఆందోళన చెందాడు. చుట్టుపక్కల దుకాణదారులకు విషయం వివరించగా.. సదరు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలించారు. వారు దొరకకపోవడంతో యజమాని వేదనకు గురయ్యా డు. రెండేళ్ల క్రితం కూడా భిక్కనూరులోని ఓ బట్టల దుకాణంలో ఇదేవిధంగా చీరలను ఎత్తుకెళ్లారు. -
రాజ్‌భవన్ ప్రాంగణంలోని చందనం చెట్టు మాయం
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్ ఆవరణలో ఉన్న అరుదైన చందనం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న చెట్టును మంగళవారం దుండగులు నరికేసి, ఎత్తుకుపోయారు. గవర్నర్ అధికార నివాసంలో చోటుచేసుకున్న ఘటనపై రాజ్‌భవన్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా కొందరు అనుమానితులపై నిఘా పెట్టామని, దోషులెవరో త్వరలోనే తేలుస్తామని పోలీసులు గురువారం చెప్పారు. చందనం చెట్ల పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. చందనం కలపను కోతకు, రవాణాకు అటవీ శాఖ నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
లండన్‌లో మాయమైన కారు... పాకిస్తాన్లో ప్రత్యక్షం
లండన్: అది దాదాపు రూ.2.4 కోట్ల విలువైన ఖరీదైన బెంట్లీ కారు. దాన్ని బ్రిటన్‌లో మాయం చేసిన దొంగలు పాకిస్తాన్లో అమ్మేశారు. అయితే అధునాతన సాంకేతికత సాయంతో దాని జాడను బ్రిటన్ అధికారులు కనుగొన్నారు. మూడు లక్షల డాలర్ల విలాసవంత బెంట్లీ కారు కొన్ని వారాల క్రితం లండన్‌లో చోరీకి గురైంది. ఎట్టకేలకు దాని జాడను బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్తాన్లో కనుగొంది. బ్రిటన్ అధికారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంపన్నులుండే డీహెచ్ఏ ప్రాంతంలో కారు దాచిన విషయం తెల్సుకున్నారు. ఓ ఖరీదైన భవంతి ప్రాంగణంలో చేసిన సోదాల్లో కారు దొరికింది. అయితే, పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో యజమాని అది పాక్ వాహనమని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే, బ్రిటన్ అధికారులు ఇచ్చిన ఛాసిస్ నంబర్ వివరాలు ఈ కారుతో సరిపోలాయి. సరైన వాహన పత్రాలు ఇవ్వడంలో యజమాని విఫలమవడంతో కారును అధికారులు సీజ్ చేశారు. అతడిని, విక్రయించిన బ్రోకర్‌ను అరెస్ట్‌చేశారు. తూర్పు యూరప్‌లోని ఒక దౌత్యవేత్త పత్రాలను అడ్డుపెట్టుకుని కారును అక్రమంగా పాకిస్తాన్‌కు తరలించారని తేలింది. బెంట్లీ కారులోని ట్రేసింగ్ ట్రాకర్‌ను దొంగలు స్విఛ్ ఆఫ్ చేయడం మరిచిపోయారని, అందుకే అధునిక ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా జాడ ఎక్కడుంతో ఇట్టే కనిపెట్టారని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖరీదైన వాహనాన్ని అక్రమంగా పాక్‌కు తీసుకురావడంతో ఆ దేశం 30 కోట్ల పాక్ రూపాయల పన్నును కోల్పోయింది. ఈ స్మగ్లింగ్ రాకెట్ సూత్రధారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
వినాయక చవితి రోజు షాకింగ్ ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మండపం నుండి వినాయకుని ప్రతిమను దొంగలు ఎత్తుకెళ్లారు. వీధిలోని చిన్న పిల్లలు తొలిసారి ప్రతిష్ఠించిన గణనాథుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రాత్రి 12 గంటల వరకూ జనాలు, పిల్లలు అక్కడే ఉండగా, అర్థరాత్రి తర్వాత ప్రతిమ చోరీకి గురైంది. ఘటన పట్ల కాలనీ కాలనీ వాసుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం దొంగతనం వ్యవహారం వైరల్‌గా మారింది. మరో చోట తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. గోపాల్ నగర్లో చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! -
నిందితుడిని దొంగతనం ఎందుకు చేశావ్ అంటే... రీజన్ వింటే అవాక్కే!
రోజు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులందరికీ బైక్‌లు ఉండవు. కొంతమంది బస్సుల్లోనూ, క్యాబ్‌ల్లోనూ ఆఫీసులకు వెళ్తుంటారు. ఐతే గంటల తరబడి వెయిట్ చేసి బస్సులో వెళ్లటం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మహానగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఇబ్బంది పడ్డాడు. అందుకని ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా!... వివరాల్లోకెళ్తే...చెన్నైలోని ఒక వ్యక్తికి ప్రతిరోజు బస్సులో వెళ్లడం ఇష్టం లేక ఏకంగా బైక్‌ని దొంగలించాడు. ఈ మేరకు దినేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆగస్టు 14న స్పెన్సర్ ప్లాజాలోని షాపు వద్ద ఉన్న పార్కంగ్ ప్రాంతంలో పార్క్ చేసి షాప్‌కి వెళ్లాడు. అంతే షాప్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి దినేష్ బైక్ ఉండదు. దీంతో సదరు వ్యక్తి పార్కింగ్ ఏరియాలో పెట్టిన బైక్‌ని దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఏరియాలోని పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా సదరు వ్యక్తిని నెరుకుండ్రం పార్థసారథిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడిపై హత్యనేరం ఉందని, ఈ కేసు విషయమై రోజు సంతకం చేసేందుకు అన్నాసలై పరిధిలోని పోలీస్టేషన్‌కి వస్తుంటాడని తెలిపారు. ఐతే నిందితుడు పార్థసారథికి ఈ కేసు విషయమై సంతకం కోసం నెరుకుండ్రం నుంచి అన్నాసలైకి ప్రతి రోజు బస్సులో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో విసుగు చెందిన నిందితుడు బైక్‌ని ఎత్తుకోపోవాలని డిసైడ్ అయ్యి ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. (చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను) -
రూ.13 కోట్లు విలువైన ‘వైన్’ చోరీ.. మెక్సికన్ బ్యూటీ క్వీన్ జంట అరెస్ట్!
మాడ్రిడ్: అత్యంత విలువైన పాతకాలపు వైన్ బాటిళ్ల చోరీని తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. 1.7 మిలియన్ డాలర్లు(సుమారు రూ.13.57 కోట్లు) విలువైన ప్రఖ్యాత వైన్ బాటిళ్ల చోరీ కేసులో మాజీ మెక్సికన్ బ్యూటీ క్వీన్, రోమానియా డచ్ వ్యక్తిని పోలీసులు క్రోయేషియాలో అరెస్ట్ చేశారు. ఈ విలువైన మద్యం బాటిళ్లు 9 నెలల క్రితం స్పెయిన్‌లో మాయమయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు యూరప్ మొత్తం జల్లెడపట్టినట్లు చెప్పారు పోలీసులు. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది స్పెయిన్ జాతీయ పోలీసు విభాగం. ‘2021, అక్టోబర్ 21న పశ్చిమ నగరం కేసర్స్లో 1.65 మిలియన్ యూరోలు విలువ కలిగిన 45 వైన్ బాటిళ్లు చోరీకి గురయ్యాయి. అందులో 19వ శతాబ్దానికి చెందిన ఓ ప్రత్యేకమైన బాటిల్ సైతం ఉంది. దాని విలువ 3.10 లక్షల యూరోలు. వాటిని ప్రముఖ హోటల్ రెస్టారెంట్ ఈఐ అట్రియోలోని సెల్లార్ నుంచి పక్కా ప్రణాళికతో ఎత్తుకెళ్లారు.’ అని తెలిపారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. స్పానిష్ డైలీ ఈఐ పైస్‌కు చెందిన 29 ఏళ్ల మెక్సికన్ యువతి.. అట్రియోలోని వెయిటర్స్‌ను రూమ్ సర్వీస్ అంటూ దారి మళ్లించింది. ఆ సమయంలోనే ఆమెతో ఉన్న 47 ఏళ్ల వ్యక్తి వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్లోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న మాస్టర్ కీతో బాక్సులను తెరిచి మూడు బ్యాగుల్లో నింపాడు. వాటిని టవల్స్‌లో చుట్టారు. ఆ మరుసటి రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బ్యాగులతో సెక్యూరిటీని తప్పించుకుని హోటల్ నుంచి వెళ్లిపోయారు. హోటల్లోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రాథమికంగా ఓ గ్యాంగ్ పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు భావించారు. ఈ చోరీ జరగక ముందు ఇరువురు మూడు సార్లు అట్రియో హోటల్‌కి వచ్చారు. అందరిలాగే వారికి సైతం వైన్ బాటిళ్లు ఉన్న సెల్లార్‌ను చూపించారు హోటల్ సిబ్బంది. చోరీకి గురైన వాటిలో 200 ఏళ్ల నాటి బాటిల్.. చోరీకి గురైన వాటిలో 1806 నాటికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ బోర్డియాక్స్ యక్వెమ్ బాటిల్ ఉంది. దాని విలువ భారీగా ఉంటుందని ఎల్ అట్రియో సహ యజమాని సొమెలియర్ జోస్ పోలో చెప్పారు.‘ఆ బాటిల్ నా వ్యక్తిగత చరిత్రలో భాగం. ఆ బాటిల్ అట్రియో, కేసర్స్, ఇక్కడి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ ప్రేమికుల చరిత్రలో ఒకటి.’ అని పోలో పేర్కొన్నారు. చోరీ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే దొంగలిద్దరు స్పెయిన్ దాటి వెళ్లారు. నెలల తరబడి వారికోసం యూరప్ మొత్తం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇటీవలే మొంటెనెగ్రో నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నించగా పట్టుబడ్డారు. వారిని పట్టుకునేందుకు నెదర్లాండ్స్, క్రొయేషియా, రొమానియా పోలీసులతో పాటు ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పటికీ చోరీకి గురైన వైన్ మాత్రం తిరిగి స్వాధీనం చేసుకోలేదు. ఇదీ చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా! -
ఈ దొంగలు మహాముదుర్లు.. 'ఎమ్మెల్యే' కారునే ఎత్తుకెళ్లారు!
జైపూర్: ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆయన చుట్టూ పటిష్ఠ భద్రత ఉంటుంది. ఆయన ఇంటి ముందు పోలీసులు పహారా కాస్తుంటారు. 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. అయితే.. అవేమీ తమను అడ్డుకోవన్నట్లు అలాంటి ఇంటికే కన్నం వేశారు దొంగలు. ఎమ్మెల్యే కారునే మాయం చేశారు. రాజస్థాన్‌లోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ఎమ్మెల్యే నారయన్ బెనివాల్‌కు చెందిన ఎస్యూవీ కారు చోరీకి గురైంది. జైపూర్‌లోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆయన అపార్ట్మెంట్ ముందు నిలిపి ఉంచిన కారును శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌తో పాటు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఎస్హెచ్ఓ శ్రీమోహన్ మీనా. చోరీకి పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పోలీసులపై ఎమ్మెల్యే ఆరోపణలు.. 'ఎప్పటిలాగే వివేక్ విహార్ ప్రాంతంలోని మా అపార్ట్మెంట్ ముందు వాహనాన్ని నిలిపాము. తెల్లవారి వచ్చి చూసే సరికి అక్కడ లేదు. దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఒక ఎమ్మెల్యే వాహనం ఈవిధంగా చోరీకి గురవుతుందా? ఒక సాధారణ పౌరుడి పరిస్థితేంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ దొంగలు దర్జాగా తిరుగుతున్నారు. ' అని ఎమ్మెల్యే బెనివాల్ ఆరోపించారు. ఇదీ చూడండి: Hyderabad: కొండాపూర్ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు -
పరుగులు పెట్టించిన ‘ఫిర్యాదు’.. తూచ్... బీరువాలోనే ఉన్నాయి..!
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): నగదు, బంగారం చోరీకి గురయ్యాయని పొరపాటున ఇచ్చిన ఫిర్యాదు పోలీసులను పరుగులు పెట్టించింది. తమ్మయ్యపాలేనికి చెందిన రొంగల బుల్లిబాబు శనివారం ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఉండడంతో ఇందులోని 25 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం.. దీంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తమ్మయ్యపాలెం చేరుకున్నాయి. ఏఎస్పీ మణికంఠచందోల్ కూడా వచ్చి పరిశీ లించారు. అయితే బీరువాలోని మరో అరలోనే బంగారం, నగదు ఉన్నట్టు క్లూస్ టీం గుర్తించింది. దీంతో బుల్లిబాబు సరిగా వెతకకుండా తొందర పడి ఫిర్యాదు చేశానని తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు. -
'మీ అభిమానం తగలెయ్య.. రెండున్నర కోట్ల వాచ్ కొట్టేశారు'
ఫార్ములా వన్ స్టార్ చార్లెస్ లెక్లెర్కు చేదు అనుభవం ఎదురైంది. తనను కలవడానికి వచ్చిన అభిమానుల్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి చార్లెస్ చేతికున్న ఖరీదైన వాచ్‌ను కొట్టేశాడు. కొట్టేసిన ఆ వాచ్ పేరు రిచర్డ్ మిల్లే.. దాని ఖరీదు ఇండియన్ కరెన్సీలో అక్షరాలా దాదాపు రూ.2.4 కోట్లకు పైగా. అభిమానం పేరుతో కలవడానికి వచ్చి విలువైన వస్తువును కొట్టేయడమేంటని చార్లెస్ తెగ బాధపడిపోయాడు. విషయంలోకి వెళితే.. వచ్చేవారం ఇటలీ వేదికగా జరగనున్న ఇమోలా గ్రాండ్ ప్రిక్స్ జరగనుంది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు చార్లెస్ లెక్లెర్ సోమవారం ఇటలీలో అడుగుపెట్టాడు. చార్లెస్‌తో పాటు స్నేహితులు, ట్రైనర్ ఆండ్రియా ఫెరారీ ఉన్నారు. టుస్కాన్ నగరం వియారెగియోలో చార్లెస్‌కు హోటల్ గది కేటాయించారు. అయితే అప్పటికే అతను ఉంటున్న హోటల్ ముందు తనను కలవడానికి జనాలు గూమికూడి ఉన్నారు. వారి అభిమానానికి మురిసిపోయిన చార్లెస్ స్వయంగా వారినిక కలవడానికి వచ్చాడు. అయితే ఆ గుంపులో నుంచే ఒక తెలియని వ్యక్తి చార్లెస్ చేతికున్న వాచ్‌ను కొట్టేశాడు. తన వాచ్ కొట్టేసిన విషయాన్ని చార్లెస్ స్వయంగా పోలీసులకు చెప్పి రిపోర్ట్ చేశాడు. చార్లెస్ రిపోర్డు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. కాగా నిజంగానే దొంగతనం చేశారా.. లేక ముందుస్తు ప్లాన్ అమలు చేసి ఈ పని చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి: Pele: మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం Wimbledon 2022: రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం! -
భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...
Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్‌తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్‌మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్ని స్వాహా చేశారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్ రిపబ్లిక్, యూఎస్‌లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్‌గా చేసే దొంగతనాలు పై బోర్ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు. Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie — ANI (@ANI) April 9, 2022 (చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్) -
నమ్మించి ఫోన్‌తో పరార్.. కట్ చేస్తే.. ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు’
సాక్షి, జోగిపేట(అందోల్): ‘నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు.. నీ ఫోన్ నీకు ఇస్తున్నా’ అని ఫోన్‌ను ఎత్తుకెళ్లిన వ్యక్తి ‘నమ్మించి.. సెల్ ఫోన్‌తో పరారు’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తను చదివి తిరిగి బాధితుడికి ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 27 గురువారం రోజున సంగుపేట గ్రామానికి చెందిన ఆదిత్య అనే యువకుడిని అపరిచిత వ్యక్తి(రమేశ్) మాయమాటల్లో దించి మళ్లీ వస్తానని చెప్పి ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. వారిద్దరు కలిసిన సమయంలో ఒకరికొకరు ఫోన్ నంబర్లను ఫీడ్ చేసుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదిత్య తను ఫీడ్ చేసుకున్న ఫోన్ నంబరును గూగుల్ అకౌంట్ కాంటాక్ట్స్‌లో సెర్చ్ చేశాడు. చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా? అందులో లభించిన నంబర్ ఆధారంగా శుక్రవారం అతడికి ఫోన్ చేశాడు. ‘నాపై ఎందుకు ఫిర్యాదు చేశావ్.. పేపర్లో ఎందుకు వేయించావు.. నీ ఫోన్ తీసుకెళ్లినందుకు క్షమించు నీ ఫోన్ నీకు ఇస్తున్నా’ అని రమేశ్ ఫోన్ పెట్టేశాడు. అదే సాయంత్రం ఎత్తుకెళ్లిన ఫోన్ ను ఫసల్‌వాదీలోని ఒక దుకాణంలో ఇచ్చి వెళ్లిపోయాడు. దుకాణదారుడు అదే రాత్రి ఆదిత్యకు ఫోన్ అప్పగించాడు. దీంతో బాధితుడు తన ఫోన్ లభించడంతో ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: మద్యం మత్తులో వికృత ప్రవర్తన.. శరీరంపై కాట్లు పెట్టి.. -
Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు!
లక్నో: కాస్త ఏమరుపాటుగా ఉంటే దొంగలు తమచేతి వాటం చూపిస్తారు. సాధారణంగా నగానట్రో, రోడ్డుపై ఉన్న వాహనాలనో మూడోకంటికి తెలీకుండా పనికానిచ్చేస్తారు. ఐతే ఓ దొంగల ముఠా ఏ కంగా విమానం టైర్‌ను ఎత్తుకెళ్లింది! లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుండి జోధ్‌పూర్ వైమానిక స్థావరానికి సైనిక వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కులో మిరాజ్ ఫైటర్ జెట్ విమానం టైర్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. నవంబర్ 27 అర్ధరాత్రి లక్నోలోని షాహీద్ పాత్లో జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న సమయంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే.. షాహీద్ పాత్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో స్కార్పియో వాహనంలో వెళ్తున్న దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్ పోలీసులకు విషయం తెలియజేసే సమయానికి దొంగలు పరారయ్యారు. అతను పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా షాహీద్ మార్గంలో జామ్ కావడంతో ట్రక్కు నెమ్మదిగా కదులుతున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి 12 గంటల 30 నిముషాల నుంచి 1 గంటల మధ్య చోరీకి పాల్పడ్డారని ట్రక్ డ్రైవర్ హేమ్ సింగ్ రావత్ తెలిపారు. బక్షి-కా-తలాబ్ వైమానిక స్థావరం నుండి సైనిక వస్తువుల సరుకును తీసుకువెళుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానానికి చెందిన ఐదు టైర్లు లక్నో ఎయిర్‌బేస్ నుండి అజ్మీర్‌కు ట్రక్కులో రవాణా అవుతున్నాయి. అందులో ఒక టైరును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నవంబర్ 27న చోటుచేసుకోగా.. డిసెంబర్ 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
దొంగతనం చేశావ్ అన్నారు!....అంతే ఆమె కోటీశ్వరురాలైంది!!
ఒక్కోసారి మన టైం బాగోలేకపోతే లేదా ఎవరైన మన మీద అసూయ ద్వేషాలతోనో మన పై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. దీంతో మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతుంటాం. కానీ ఇక్కడొకామెకు ఆ తప్పుడు ఆరోపణ ఆమెను కోటీశ్వరురాలుగా మార్చింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...అలబామా లెస్టీ నర్స్ అనే ఆమె వాల్‌మార్ట్ షాపులో దొంగతనం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు తమ షాపులో 48 డాలర్లు(రూ. 3000) ఖరీదు చేసే తృణధాన్యలు, క్రిస్మస్ లైట్లు వంటి వస్తువులు దొంగలించిందని ఆరోపించింది. పైగా దొంగతనం చేసినందుకుగానూ తమకు 200 డాలర్లు(రూ. 14,000) చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాల్‌మార్ట్ యాజామన్యం బెదిరించింది. దీంతో లెస్సీ జరిగిన విషయాన్ని ఆ షాపు వాళ్లకు వివరించినప్పటికి ఫలితం లేకపోయింది. పైగా ఆమెను అరెస్టు కూడా చేశారు. దీంతో లెస్టీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాదు పైగా తీర్పు ఆమెకు అనుకూలంగా రావడమే కాక అందులో ఆమె స్టోర్‌లోని అన్ని వస్తువులకు చెల్లించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆమెను దొంగతనం చేశావ్ అంటూ ఆరోపించి మానసిక ఆవేదనకు గురి చేసినందుకుగానూ నష్టపరిహారంగా వాల్‌మార్ట్ 2.1 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు)ను ఆమెకు చెల్లించవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) -
కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!
మన ఇళ్లలోని వస్తువులను కోతులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఆ వస్తువులను కోతులు తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాయి తప్ప అవి మనకు దొరికే అవకాశం కూడా ఉండదు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడోక కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అలా ఎలా ఇచ్చేసిందబ్బా అనిపిస్తుందా? అనుమానంగా ఉందా? అయితే తెలుసుకుందాం రండి. (చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?) వివరాల్లోకెళ్లితే.....ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ కళ్లజోడుని ఒక కోతి ఎత్తుకుపోతుంది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని ఒక మెస్‌పై కుర్చోంటుంది. దీంతో మొదట అతనికి ఏం చేయాలో తోచదు. ఆ తర్వాత ఆయన ఒక జ్యూస్ ప్యాక్‌ని తీసుకువచ్చి కోతికి ఇస్తాడు. కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్ ప్యాక్‌ని తీసుకుని కళ్లజోడుని మెస్ మీద నుంచి వదిలేస్తుంది. అయితే ఆ కళ్లజోడు మెస్‌లో ఇరుక్కుపోతుంది. అయినప్పటికీ ఆ తెలివైన కోతీ ఆ మెస్‌లో ఇరుక్కుపోతున్న కళ్లజోడుని తీసి మరీ శర్మకి తిరిగి ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోకి "ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది" అనే క్యాప్షన్ జోడించి ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు తినేందుకు ఏమి ఇవ్వకపోతే కోతులు మనవస్తువులను అంత తేలిగ్గా తిరగి ఇవ్వవు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’) Smart 🐒🐒🐒 Ek haath do, Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw — Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021 -
రాదనుకున్న సొమ్ము రాబట్టారు..
గచ్చిబౌలి: చోరీకి గురైన సొత్తును బాధితులకు అప్పగించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 176 కేసుల్లో కోటిన్నర విలువైన కిలో బంగారు ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి, రూ.30.67 లక్షల నగదు, 90 వాహనాలు బాధి తులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్య క్రమంలో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చోరీ జరిగిన సొమ్మును బాధితులకు అప్పగించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. చోరీ జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, క్లూస్ సేకరించి నిందితులను రిమాండ్ చేసి చార్జిషీట్ వేయడం వరకే ఆగిపోతున్నట్లు చెప్పారు. సొమ్ము గురించి అంతగా పట్టించు కోకపోవడంతో న్యాయపరంగా సొత్తు తీసుకోవట్లేదని తెలిపారు. చోరీ అయిన సొత్తును త్వరితగతిన ఇప్పించాలనే ఉద్దేశంతో కొద్ది నెలలుగా కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సొత్తును అప్పగించేందుకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, డీసీపీలు, సీసీఆర్బీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళాను నిరంతరం నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శంషాబాద్ జోన్ పోలీసులు 101 కేసుల్లో సొత్తు రికవరీ చేశారని తెలిపారు. -
రాతి విగ్రహాలను అపహరించిన దుండగులు : సిద్ధిపేట
-
56 కార్లు దొంగతనం.. పట్టుకోండంటూ పోలీసులకే సవాల్
హైదరాబాద్: ఎంత పెద్ద దొంగైనా ఎక్కడో ఒక దగ్గర తప్ప చేసి దొరకుతాడంటారు. ఆ మాట నాకు వర్తించదు అంటున్నాడు ఈ ఘరానా దొంగ. ఇతను ఇప్పటి వరకు ఒకటి కాదు..రెండు కాదు.. 56 కార్లు చోరీ చేసినా పోలీసులకు చిక్కలేదు. పైగా దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకే సవాల్ విసురుతున్నాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసుల ఈ దొంగ ఆటకట్టించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసలు ఈ దొంగ కథేంటే చూద్దాం... ఇప్పటివరకు 56 కార్లు.. ఇటీవల హైదరాబాద్ వచ్చి ఓ హోటల్లో బస చేసిన సినీ నిర్మాత మంజునాథ్ ఫార్చ్యూనర్ కారును చోరీ చేసింది ఇతనే. కారులో విలువైన స్థలాలకు చెందిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. దీంతో బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పార్క్ హయత్ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. యాప్ టెక్నాలజీతో కారు తాళం తీసి చోరి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజులకు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ నుంచి రాజస్థాన్ వైపు దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతను రాజస్తాన్ వాసిగా దర్యాప్తులో తేలింది. ఇక ఆ దొంగ ఆట కట్టించాలని రాజస్తాన్‌కు వెళ్లిన పోలీసులు అక్కడ అతని ఆచూకీ దొరక్క వట్టి చేతులతోనే హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. నన్ను మీరు పట్టుకోలేరు.. ఇలా హైదరాబాద్ వచ్చిన పోలీస్ అధికారికి ఏకంగా వాట్సప్ వీడియో కాల్ చేశాడు ఆ దొంగ. కావలంటే తన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోమని సూచించాడు. అంతేనా…కార్ల చోరీలో తాను అనుసరిస్తున్న టెక్నాలజీతోనే తప్పించుకుకోగలుతున్నానంటూ కాలరెగరేశాడు. తనను వెతుక్కుంటూ రాజస్థాన్ వరకు వచ్చినవారు మీరేనంటూ అభినందించాడు. కానీ మీరు ఎన్ని చేసినా నన్ను పట్టుకోలేరని సవాల్ విసిరాడు. ప్రస్తుతం తమకే సవాల్ విసిరిన రాజస్థానీ దొంగను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చదవండి: స్టాక్ మార్కెట్ పేరుతో మోసపోయిన నగరవాసి..! -
ఉంగరాలు మింగేసిన దొంగ
బనశంకరి: పోలీసులకు ఆధారాలు దొరకరాదని దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగిన దొంగకు డాక్టర్లు ఆపరేషన్ చేసి 35 గ్రాముల బంగారు ఉంగరాలు బయటికితీశారు. ఈ సంఘటన కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఐదురోజుల కిందట తంగచ్చయన్ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరికీ తెలియకుండా శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపునొప్పి రావడంతో పోలీసులు ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు. దొంగ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. -
ఆయిల్ మాఫియా ఆగడాలు: మరోసారి ‘వెల్’గులోకి..
సాక్షి, ఉప్పలగుప్తం: కోనసీమలో ఆయిల్మాఫియా ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు జోరుగా సాగే వైట్ ఆయిల్ రాకెట్ గుట్టురట్టు కావడంతో కొన్నాళ్లుగా ఆయిల్ చోరీకి బ్రేక్ పడింది. అప్పట్లో ఓఎన్జీసీ పైప్‌లైన్, ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆయిల్ చోరీ జరిగితే.. ఇప్పుడు ఏకంగా చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతకు డ్రిల్ చేసిన ప్రాంతాల్లోని వెల్(టెర్మినేటర్) నుంచి దర్జాగా పైపులైన్ వేసుకుని ఆయిల్ చోరీ చేసే స్థాయికి మాఫియా ఎదిగిపోయింది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ వాసాలతిప్ప తీరంలో గతేడాది ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన డ్రిల్ సైట్ ఈ ఆయిల్ మాఫియాకు అడ్డాగా మారింది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల లీటర్ల వైట్ ఆయిల్ అక్రమరవాణా అవుతోంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిపంచాయతీ వాసాలతిప్ప సముద్ర తీరంలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ 15 డ్రిల్ సైట్ నుంచి వెల్ నుంచి నేరుగా గోపవరం పంచాయతీలో ఉన్న జగ్గరాజుపేట స్టోరేజ్‌కు పైపులైన్ల ద్వారా క్రూడాయిల్, గ్యాస్‌లను తరలిస్తున్నారు. ఏడాదిగా వెల్ నుంచి ముడిచమురు గ్యాస్ పైపులైన్ల ద్వారా రవాణా అవుతుంది. గ్రామానికి దూరంగా ఉన్న ఈ సైట్‌ను కేంద్రంగా చేసుకుని ఆయిల్ మాఫియా ఆరు నెలల నుంచి చోరీకి పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 20న ఆయిల్ చోరీ జరుగుతుందని అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉంది. ఓఎన్జీసీ అధికారులు సెక్యూరిటీ ఏర్పాటుకు సదరు సంస్థకు ప్రతిపాదించి చేతులు దులుపుకొన్నారు. అయితే వాసాలతిప్ప గ్రామస్తులు మాత్రం ముఠాపై కన్నేశారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆయిల్ చోరీని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఠాను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు చోరీకి ఉపయోగించే మోటార్లు, పైపులు, స్టోరేజ్ టిన్నులు, మారుతీ ఓమ్నీ వ్యాను వదిలి పరారయ్యారు. చోరీ ముఠాలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. అయితే గురువారం తెల్లవారు జామున ఎస్సై జి.వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ అదుపులో ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు. అధికారుల పరిశీలన ఓఎన్జీసీ ఏరియా మేనేజర్ ప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు పరిశీలించి, ఓఎన్జీసీ సెక్యూరిటీ అధికారి తో మాట్లాడారు. ఓఎన్జీసీ ఐఎం జగన్నాథరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన వాసాలతిప్ప వచ్చిన ఓఎన్జీసీ అధికారులను స్థానికులు నిలదీశారు. స్థానిక సమస్యలపై మీరిచ్చిన హామీలు ఏం చేశారంటూ ఆందోళనకు దిగారు. స్థానిక నాయకులు పినిపే జయరాజ్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సంపదరావు, పట్టా శ్రీను తదితరులు నచ్చజెప్పి, డిమాండ్ల పరిష్కారానికి హామీ తీసుకున్నారు. రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ... రోజుకు రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 టిన్నులు(ఒక్కొక్కటి 50 లీటర్లు) ఆయిల్ ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. ఇక్కడి నుంచి మామిడికుదురు మండలంలో ఓ వ్యాపారి లీటరు ఆయిల్ రూ.50 నుంచి రూ.60కి హోల్‌సేల్ రేటుగా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయిల్ చోరీ ఆలస్యంగా బయటకు వచ్చినా దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ.. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ వెల్ నుంచి వెలువడే గ్యాస్, ముడిచమురు, నీరును చాకచక్యంగా విభజించి నేరుగా వైట్ ఆయిల్ టిన్నుల్లోకి నింపడం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పని. పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిలో (సెపరేటర్)గ్యాస్ విడిగా, వాటర్ విడిగా పోయి ఆయిల్ మాత్రమే నింపేలా తయారైన యంత్ర పరికరాలు లభించడం చోరీలో నైపుణ్యం గల వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
కవలలను ఎత్తుకెళ్లిన కోతులు.. ఆతర్వాత ఏం చేశాయంటే..
చెన్నై: తమిళనాడులోని తంజాపూర్‌లో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి, అందులో ఒక పసి పాపను నీళ్లలో పడేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వరి అనే మహిళకు 8 రోజుల కిందట ఇద్దరు కవల పిల్లలు(అమ్మాయిలు) జన్మించారు. శనివారం ఇద్దరు శిశువులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఓ వానర గుంపు ఇంటిపైకి చేరి, పెంకులు తొలగించి మరీ పసి బిడ్డలను ఎత్తుకెళ్లింది. ఇది గమనించిన భువనేశ్వరి కేకలు వేయడంతో కోతుల గుంపు ఒక పాపను అక్కడే పడేసి వెళ్లి పోయింది. తల్లి ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు స్పందించి, ఇంటి పైకప్పుపై ఉన్న పడివున్న చిన్నారిని రక్షించారు. మరో పాప కోసం గాలిస్తుండగా సమీపంలోని నీటిలో చిన్నారి శవమై కనిపించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్
-
ఇందిరా పార్కులో ‘గంధం’ దొంగలు
ముషీరాబాద్/కవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అర్ధరాత్రిపూట కొంతమంది స్మగ్లర్లు గంధపు చెట్లను రంపంతో కోసుకుని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హారి్టకల్చర్ అధికారులు గాం«దీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇందిరాపార్క్ నుంచి సందర్శకులు వెళ్లిన అనంతరం రాత్రి 10 గంటలకు సిబ్బంది లైట్లను ఆర్పి వారు వెళ్లేపోయేవారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లను అలాగే ఉంచేవారు. ఇటీవల ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల తర్వాత పార్క్ మొత్తం లైట్లను ఆరి్పవేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెలిగేలా సిస్టంను రూపొందించారు. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో లోయర్‌ట్యాంక్ కట్టమైసమ్మ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్‌లోకి చొరబడుతున్నారు. గంధం చెట్లను పెద్ద పెద్ద రంపాలతో నరికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పదేళ్ల క్రితం ఇదే తరహాలో స్మగ్లింగ్ పదేళ్ల క్రితం ఇదే పార్క్‌లో ఉన్న గంధం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని అక్రమంగా తరలించారు. దీనిపై అప్పట్లో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భద్రతను పెంచారు. రెండ్రోజుల కిత్రం.. గత ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు పార్క్‌లోకి చొరబడ్డారు. సుమారు 11 గంధపు చెట్లను రంపాలతో కోసి కొమ్మలను అక్కడే పడేసి దుంగలను మాత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ వైపుగా తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉదయం 4 గంటలకు ఇందిరాపార్క్‌కు వచ్చే వాకర్స్ కంటపడకుండా కొమ్మలను సైతం తీసివేసినట్లు తెలిసింది. అనంతరం గాం«దీనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్క్ సెక్యూరిటీని, అధికారులతో పాటు సమీపంలో నివసించే వారిని సైతం గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు. దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్‌కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. -
క్షణాల్లో 31.50 లక్షలు మాయం
కోటా : ఆనుపానూ చూసి, తమ చోర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే కేటుగాళ్లు నిరంతరం మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. క్షణం ఏమరుపాటు కారణంగా కిరాణా వ్యాపారి ఒకరు ఏకంగా 31.50 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆనక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన బారన్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు చార్ మూర్తి సర్కిల్ బ్రాంచ్‌లో సోమవారం జరిగింది. కోటాకు చెందిన కిరాణా వ్యాపారి మహావీర్ గోయల్ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడ పే-ఇన్-స్లిప్‌లో వివరాలు నింపి, దాన్ని పక్కనే ఉన్న కౌంటర్లో జమ చేయడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 31.50 లక్షల రూపాయలున్న బ్యాగును నగదు కౌంటర్ వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. అయితే ఈ అదును కోసమే ఎదురు చూస్తున్న మాయగాళ్లు బ్యాగు తీసుకొని ఉడాయించారు. ఇదంతా కొన్ని సెకన్ల సమయంలో జరిగిపోయిందని గోయల్ వాపోయారు. ఈ దొంగతనంలో ఒకటి కంటే ఎక్కువ మంది నిందితుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీస్ అధికారి మంగిలాల్ తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
బంజారాహిల్స్‌లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. బిల్డర్ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు 100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రివాల్వర్, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సుధీర్‌రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. -
దొంగతనం చేసిన మరుసటి రోజే..
వాషింగ్టన్: అమెరికాలోని ఓ డైరీ ఫామ్‌లో దొంగలు పడ్డారు. అయితే రోజు తిరిగేసరికి ఆ దొంగలు ఎత్తుకెళ్లిన మేకపిల్లలను పాకలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. దొంగల మనసు మారడానికి కారణమేంటా అని ఆలోచిస్తున్నారా.! ఎలాగో చదివేయండి.. జూన్ 22న అమెరికాలోని డైరీఫామ్ నుంచి చిన్నచిన్న మేకపిల్లలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వాటిని పెంచుచుతోన్న డైరీ ఫామ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. "గత రాత్రి కొందరు ఆరు మేక పిల్లలను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి నేను, నా కొడుకు పిచ్చివాళ్లమైపోయాం. వాటిని మా పిల్లల్లా చూస్తాం. దయచేసి వాటిని తిరిగిచ్చేయండి. వాటికి రెండు నెలల వయసు కూడా లేదు. (మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!) అసలే అవి ఆకలిగా ఉన్నాయి, ఇప్పుడింకా ఎంత భయపడుతున్నాయో! మేము వాటిని మిస్సవుతున్నాం. నా పిల్లలు తన స్నేహితులను(పెంపుడు మేకలు) కోరుకుంటున్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా తిరిగి ఇచ్చేస్తే మేము ఎక్కడా ఫిర్యాదు చేయమని రాసుకొచ్చింది. అయితే ఇది ఆ దొంగల కంట పడినట్టుంది. ఇది చదివి వారి హృదయం ద్రవించినట్లుంది. వెంటనే మరుసటి రోజు వాటిని ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేశారు. ఈ విషయాన్ని డైరీ ఫామ్ నిర్వాహకులు "మేకపిల్లలు తిరిగి ఇంటికి వచ్చేశాయ్" అంటూ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్లలు వాటిని హత్తుకుని ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!) -
గంభీర్ ఇంట్లో చోరీ.. పోలీసులకు సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి కారు చోరీకు గురైంది. తన ఇంటి ఆవరణలోని ఎస్యూవీ కారు దొంగతనానికి గురైందని గంభీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారుజామున ఈ కారు చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. ఎంపీ ఇంట్లో కారు చోరీకి గురికావడాన్ని రాజేంద్రనగర్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఢిల్లీ సెంట్రల్ డీసీపీ ఆధ్వర్యంలో పలు పోలీసు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూనే మరోవైపు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గౌతమ్ గంభీర్ తన తండ్రితో కలిసి రాజేంద్రనగర్‌లోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. (‘అవే గంభీర్ కొంప ముంచాయి’) ఇక ఢిల్లీలో ప్రముఖల ఇళ్లే లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు కూడా చోరీకి గురైన విషయం తెలిసిందే. తన బ్లూ కలర్ వాగనార్ కారు చోరీకి గురవడంపై సీఎం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుతో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేజ్రీవాల్ పలుసందర్బాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించడంతో కథ సుఖాంతమైంది. (సౌరవ్ గంగూలీ రేసులో లేడు..కానీ) -
టీషర్ట్స్ దాచి అడ్డంగా దొరికిపోయాడు
టీ.నగర్ : తిరుపూర్ సమీపంలో తాను పనిచేస్తున్న ఓ కంపెనీ నుంచి వేల రూపాయల విలువైన టీ షర్ట్‌లను దుస్తుల్లో దాచి చోరీ చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా పెరుమానల్లూర్ సమీపంలోని నేతాజీ అపేరెల్ పార్క్‌లో అనేక ఎక్స్పోర్ట్ బనియన్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. వీటిలో బయటి రాష్ట్రాలకు చెందిన అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులోని ఒక ఎక్స్పోర్ట్ సంస్థలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఒకడు పనిచేస్తున్నాడు. కాగా ఈ ఘటన జరిగిన రోజున ఆ వ్యక్తి తన విధులు ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో గేట్ వద్ద ఉన్న వాచ్‌మన్‌కు అతనిపై అనుమానం ఏర్పడింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడంతో వాచ్‌మన్ అతని వద్ద తనిఖీలు జరిపాడు. తను వేసుకున్న షర్ట్ లోపల టీషర్టులను ధరించినట్లు గుర్తించాడు. ప్యాంట్లో కూడా కొన్ని షర్ట్‌లను దాచుకున్నాడు. ఈ విధంగా మొత్తం 40 టీషర్ట్లను దాచినట్లు తెలిసింది. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న సంస్థ నిర్వాహకులు కార్మికుడిని హెచ్చరించి, ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
టీషర్ట్స్ దాచి దొరికిపోయాడు
-
మహానగరంలో ఉల్లిపాయల దోంగలు
-
చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...
సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు. అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రైల్వే బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు
మాస్కో : రష్యాలో ఇనుము దొంగలు బరితెగించారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని ఆర్కిటిక్ రీజియన్‌లోని ఉంబా నదిపై రైల్వే బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి పాత పడటంతో కొంతకాలంగా దానిని వినియోగించడం లేదు. అయితే ఇటీవల ఉన్నట్టుండి బ్రిడ్జి మధ్య భాగం అదృశ్యం అయింది. 75 అడుగుల పొడవు, 56టన్నుల బరువున్న వంతెన మధ్య భాగం అదృశ్యం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిడ్జి అదృశ్యానికి సంబంధించి తొలుత మే నెలలో రష్యాకు చెందిన వీకే సోషల్ మీడియా సైట్ వార్తలు ప్రచురించింది. అయితే స్థానికులు మాత్రం బ్రిడ్జిపై ఉన్న ఇనుము కోసమే దొంగలు దానిని కూలగొట్టారని ఆరోపించారు. మొదట వెలుబడిన ఫొటోలను చూస్తే బ్రిడ్జి నదిలో కూలిపోయినట్టుగా కనిపించింది. కానీ ఆ తర్వాత పదిరోజులకు విడుదలైన ఏరియల్ వ్యూ ఫొటోలను పరిశీలిస్తే నదిలో బ్రిడ్జి శకలాలు కనిపించలేదు. దీంతో బ్రిడ్జి సహజంగా కూలిపోలేదని తొలుత ఈ వార్తను ప్రచురించిన వీకే సైట్ తెలిపింది. అయితే ఇది దొంగల పనే అని భావిస్తున్న స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ చోరీ కలకలం
-
చోరీ అయిన ఆర్టీసీ బస్సును తుక్కు తుక్కుగా మార్చేశారు..
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్‌లో చోరీకి గురైన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకీ లభించింది. మంగళవారం రాత్రి చోరీకి గురయిన బస్సును నాందేడ్‌లోని ఓ షెడ్లో పోలీసులు గుర్తించారు. కానీ బస్సును ముక్కలు ముక్కలు చేసిన దుండగులు.. దాని గుర్తుపట్టలేని విధంగా మార్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ డిపో ఏపీ 11 జెడ్ 6254 నెంబర్ గల ఆర్టీసీ బస్సు అంబేడ్కర్ నగర్, అఫ్జల్‌గంజ్‌ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌హాల్ట్ కోసం డ్రైవర్ ఆ బస్సును సీబీఎస్‌లో నిలిపాడు. అయితే ఆ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు బస్సు కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్ ప్రాంతంలో తిరిగినట్టు ఆధారాలు సేకరించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు గురువారం నాందేడ్‌లో బస్సును గుర్తించారు. బస్సును అపహరించిన వ్యక్తులు దాని రూపురేఖలు మార్చేందుకు ఆ బస్సును క్రాష్ చేస్తున్న సమయంలో అఫ్జల్ గంజ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారు అయ్యారు. దీంతో బస్సు క్రాష్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
దొంగిలించలేదు.. జిరాక్స్ తీశారంతే!
న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాటమార్చారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పటేల్ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్ అబద్ధం చెప్పారన్నారు. -
రఫేల్ పత్రాలు చోరీ
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గరి నుంచి దొంగతనానికి గురయ్యాయని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆ చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగానే ‘ద హిందూ’ పత్రిక రఫేల్‌పై కథనాలు రాసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రఫేల్ వ్యవహారం మొత్తం రక్షణ పరికరాలను సమకూర్చుకోవడానికి సంబంధించినది కాబట్టి అసలు ఈ కేసుపై న్యాయసమీక్ష జరపడమే సాధ్యం కాదని ఏజీ అన్నారు. రఫేల్ ఒప్పందంపై వచ్చిన ప్రజాహిత వ్యాజ్యా(పిల్)లను గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ఆ సమయంలో కేంద్రం కొన్ని కీలక వాస్తవాలను దాచిపెట్టిందనీ, ఇప్పుడు ద హిందూ పత్రిక కథనాలతో అవన్నీ వెలుగులోకి వచ్చినందున పిల్లను విచారణకు స్వీకరించడంపై పునరాలోచించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు సంయుక్తంగా పిటిషన్ వేశారు. ఆ వాస్తవాలు అప్పుడే బయటకొచ్చి ఉంటే సుప్రీంకోర్టు ఆ పిల్లను కొట్టివేసేది కాదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఏజీ తన వాదన వినిపిస్తూ ‘రఫేల్ పత్రాల దొంగతనం కేసులో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. రఫేల్ ఒప్పందం వివరాలు రహస్యమైనవి. వాటిని ప్రజా బాహుళ్యంలో పెట్టడం ద్వారా అధికారిక రహ్యసాల చట్టాన్ని ఉల్లంఘించడం, కోర్టు ధిక్కార నేరాలకు పాల్పడినట్లైంది. రహస్యం అన్న పదాన్ని తొలగించి వారు కథనాలు ప్రచురించారు’ అని తెలిపారు. కోర్టు విచారణను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వార్తా కథనాలు వచ్చాయన్నారు. గత నెల 8 నుంచి ఇప్పటివరకు ద హిందూ పత్రిక రఫేల్‌పై పలు సంచలన కథనాలను ప్రచురించడం తెలిసిందే. ఈ వాదనలు జరిగిన బుధవారమే తాజాగా మరో కథనం వెలువడింది. అవినీతి జరిగితే చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? ఏజీ వాదనలపై న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చోరీకి గురైన పత్రాల్లోని సమాచారం ఆధారంగా కథనాలు వచ్చాయని ఏజీ వెల్లడించడంతో ‘ఆ విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రోజుల్లో ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పండి.’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగి ఉంటే, దానిని కప్పిపుచ్చుకోడానికి అధికారిక రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకుంటారా? అవినీతి జరిగిందని నేననడం లేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే, ప్రభుత్వం చట్టాన్ని తమకు రక్షణగా ఉపయోగించుకోజాలదు’ అని జస్టిస్ గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14న కొనసాగించనుంది. ఆ సమాచారం ఎక్కడిదో చెప్పం: ఎన్.రామ్ న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కీలక సమాచారాన్ని తమకు అందించిన వర్గాల వివరాల్ని బహిర్గతం చేయలేమని ది హిందూ దినపత్రిక చైర్మన్ ఎన్.రామ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)కు లోబడే రఫేల్ వివరాల్ని ప్రచురించామని సమర్థించుకున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాల్ని గోప్యంగా నిలిపి ఉంచే ప్రయత్నం జరిగిందని, అందుకే వాటిని బహిర్గతం చేశామని తెలిపారు. రఫేల్ పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రామ్ స్పందించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన పలు కథనాలు రాశారు. అందులో బుధవారం కూడా ఒకటి ప్రచురితమైంది. ‘ రఫేల్ ఒప్పంద పత్రాలు తస్కరణకు గురయ్యాయని భావిస్తే మాకేం సంబంధం లేదు. మాకు ఆ సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. మా వనరులను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నాం. వారి గురించి మా నుంచి ఎవరూ సమాచారం పొందలేరు. మేము ప్రచురించిన పత్రాలు యధార్థమైనవి. ప్రజా ప్రయోజనాల రీత్యానే వాటిని వెలుగులోకి తెచ్చాం. ముఖ్యమైన అంశాలపై సంబంధిత సమాచారాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడం పాత్రికేయుల విధి’ అని రామ్ అన్నారు. -
400 ఏళ్లనాటి చెట్టు చోరీ
టోక్యో: అప్పుడప్పుడూ విచిత్రమైన దొంగతనాలు జరుగుతుంటాయి. జపాన్ రాజధాని టోక్యోలో కూడా అలాంటిదే ఓ చోరీ జరిగింది. ఇంతకీ దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా? 400 సంవత్సరాలనాటి ఓ చెట్టు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీరు చదువుతోంది నిజమే. అయితే అది సాధారణ చెట్టుకాదు.. బోన్సాయ్ వృక్షం. సీజి ఇమురా, ఆయన భార్య ఈ చోరీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. తమ తోట నుంచి ఏడు బోన్సాయ్ వృక్షాలను ఎవరో అపహరించారని, దయచేసి వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందిగా దంపతులిద్దరూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. తెచ్చి ఇచ్చేదాకా వాటిని ఎలా సంరక్షించాలో కూడా వివరించారు. ఆ చెట్లు ఎంతో అపురూపమైనవని, డబ్బులతో వాటిని వెల కట్టలేమని, తమ బాధను అర్థం చేసుకొని వాటిని అప్పగించాలని వేడుకున్నారు. కాగా దొంగిలించిన బోన్సాయ్ చెట్లలో షింపాకు జూనిపర్ చెట్టుకు చాలా డిమాండ్ ఉంది. ఈ ఒక్క చెట్టు విలువే దాదాపు రూ. 65 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. మిగతా అన్ని చెట్ల విలువ కలిపితే దాదాపు కోటి రూపాయలు దాటవచ్చని చెబుతున్నారు. -
రూ.2.5 కోట్ల విలువైన టవల్స్, బెడ్షీట్లు దొంగతనం
న్యూఢిల్లీ : దేశీయ రైళ్లలో దొంగతనాలు భారీగానే జరుగుతున్నాయి. ప్రయాణికుల కోసం అందించే బెడ్షీట్లను, టవళ్లను, బ్లాంకెట్లను కూడా వదిలిపెట్టకుండా దొంగలిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల టవళ్లు, 7వేల బ్లాంకెట్లు, 81వేల బెడ్షీట్లు, 55,573 పిల్లో కవర్లు దొంగతనానికి గురైనట్టు వెల్లడైంది. పశ్చిమ రైల్వే నివేదికలో ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పశ్చిమ రైల్వే నివేదిక పేర్కొంది. దొంగతనానికి గురైన ఒక్కో బ్లాంకెట్ ఖరీదు 132 రూపాయలు, టవల్ ధర 22 రూపాయలు కాగా, పిల్లో ధర 25 రూపాయలు ఉంటుందని నివేదిక తెలిపింది. అంతేకాక 2018 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలోనే దాదాపు రూ.62 లక్షల ఇన్వెంటరీ దొంగతనానికి గురైనట్టు దేశీయ రైల్వే ప్రకటించింది. ఈ మధ్య కాలంలో ఏకంగా 79,350 హ్యాండ్ టవల్స్, 27,545 బెడ్షీట్లు, 21,050 పిల్లో కవర్లు, 2150 పిల్లోలు, 2065 బ్లాంకెట్లు దొంగతనానికి గురైనట్టు సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ సునిల్ ఉదాసి చెప్పారు. వీటి విలువ మొత్తం రూ.62 లక్షలు ఉంటుందన్నారు. పిల్లోలు, టవళ్లు, బ్లాంకెట్లు, బెడ్షీట్లు మాత్రమే కాక, మరుగుదొడ్లలో ఉండే 200 మగ్గులు, వేయి ట్యాప్‌లు, 300కు పైగా ఫ్లష్ పైపులు, స్నానం చేసే షవర్లు కూడా దొంగతనానికి గురయ్యాయని చెప్పింది. ప్రస్తుతం ఈ దొంగతనాలు జరగకుండా.. అన్ని రైళ్లో సెన్సార్లతో కూడిన ట్యాప్‌లను, సీసీటీవీ కెమెరాలను అమర్చతున్నట్టు దేశీయ రైల్వే తెలిపింది. అయితే ప్రయాణికుల కోసం అందిస్తున్న వీటిని ప్రయాణికులే చోరీ చేయడం, వాటిని ధ్వంసం చేయడంపై దేశీయ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మొదట్లో కూడా ప్రయాణికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హై-స్పీడ్ సెమీ లగ్జరీ రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ప్రయాణికులు బీభత్సం సృష్టించారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో అమర్చిన హెడ్ఫోన్లను ఎత్తుకెళ్లి, ఎల్సీడీ స్క్రీన్లను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లను కూడా మురికిమురికి చేశారు. ఇటీవల ముంబై-నాసిక్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇదే రకమైన విధ్వంసకర వాతావరణం సృష్టించారు. ఈ రైలు సర్వీసును అప్‌గ్రేడ్ చేసిన నాలుగు నెలల్లోనే, ట్రే టేబుల్స్‌ను, కర్టెన్లను చెల్లాచెదురు చేశారు. అంతేకాక కిటికీలను పగులగొట్టారు. హెల్త్‌కు చెందిన రెగ్యులేటర్లను, కుళాయిలను, లగేజ్ ర్యాక్‌ల గ్లాస్‌లను ప్రయాణికులు బ్రేక్ చేశారు. చెత్తాడబ్బాలను, అద్దాలను ఎత్తుకుపోయారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ రైల్వే రూ.4000 కోట్లు నష్టాలు పాలైంది. -
మ్యూజియంలో దొంగలుపడ్డారు
-
విమానంతో చక్కర్లు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో హారిజన్ ఎయిర్‌కు చెందిన ఖాళీగా ఉన్న క్యూ400 విమానాన్ని రిచ్(29) అనే మెకానిక్ సియాటెల్–టకోమా ఎయిర్‌పోర్టులో దొంగిలించి గాల్లో చక్కర్లు కొట్టించాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అనుమతి లేకుండా విమానం టేకాఫ్ విషయం తెల్సి రెండు ఎఫ్–15 యుద్ధవిమానాలు ఆ విమానాన్ని వెంబడించాయి. గంటన్నరపాటు గాల్లో విమానం చక్కర్లు కొట్టించిన మెకానిక్ చివరకు కెట్రాన్ ద్వీపంలోని అడవిలో కూల్చేశాడు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఏమీ లేదని అధికారులు తేల్చారు. ప్రమాదంలో రిచ్ చనిపోయినట్లు భావిస్తున్నారు. దింపుతా.. పైలట్ ఉద్యోగం ఇస్తారా? మెకానిక్ విమానానికి కొంచెం ఇంధనం నింపి వెంటనే టేకాఫ్ చేశాడు. ఆకాశంలో ఇష్టానుసారం చక్కర్లు కొడుతున్న రిచ్‌తో ఏటీసీ సిబ్బంది మాట్లాడేందుకు ప్రయత్నించారు. ‘విజయవంతంగా విమానాన్ని టేకాఫ్ చేసినందుకు అభినందనలు. విమానాన్ని వెనక్కి తిప్పి ఎవరికీ నష్టం కలగకుండా ల్యాండింగ్ చేయండి’ అని రిచ్‌ను ఏటీసీ అధికారి కోరారు. దీనికి రిచ్ స్పందిస్తూ..‘నాకు ల్యాండింగ్ చేయడం తెలీదు. నేను ల్యాండ్ చేయాలనుకోవడం లేదు’ అని చెప్పాడు. టేకాఫ్ సమయంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇంధనం ఖర్చయిందని చెప్పాడు. సమీపంలోని సైనికస్థావరంలో విమానాన్ని దింపాలని ఏటీసీ అధికారి రిచ్‌ను కోరాడు. దీంతో రిచ్ స్పందిస్తూ..‘ఆ పని మాత్రం చేయను. వాళ్ల దగ్గర విమాన విధ్వంసక క్షిపణులు, గన్స్ ఉంటాయి’ అని చెప్పాడు. ఇప్పుడు నేను దొరికితే జీవితాంతం జైల్లో పడేస్తారు కదూ! అంటూ నవ్వాడు. నేను విమానాన్ని ల్యాండ్ చేస్తే పైలట్ ఉద్యోగం ఇస్తారా? అని ఎక్కసెక్కాలు ఆడాడు. చివరికి ‘నన్ను ప్రేమించేవాళ్లు చాలామంది ఉన్నారు. నేను చేసిన పని తెలిస్తే బాధపడతారు. వాళ్లందరికీ నా క్షమాపణలు. మానసికంగా దెబ్బతిన్నవాడిని. కొన్ని స్క్రూలు లూజ్ అయ్యాయి’ అని సదరు ఏటీసీ అధికారితో వ్యాఖ్యానించాడు. అనంతరం విమానాన్ని కెట్రాన్ ద్వీపంలో కూల్చేశాడు. -
విమానాన్ని ఎత్తుకెళ్లి.. చక్కర్లు.. ఆపై క్రాష్!
వాషింగ్టన్ : విమానాయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉన్నట్టుండి విమానాన్ని ఎత్తుకెళ్లి షికార్లు కొట్టాడు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉన్న విమానాన్ని ఝామ్మని గగనతలంలోకి తోలుకెళ్లిన అతను.. ఆపై కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. శుక్రవారం సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా గాలిలోకి ఎగరడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాదుల చర్య అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వెంటనే జెట్ విమానాలతో ఆ విమానాన్ని వెంబడించారు. తీరా ఇది ఉగ్రవాద చర్య కాకపోవడంతో ఊపిరి తీసుకున్నారు. అలాస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ మోకానిక్ ఈ చర్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ సమయంలో విమానంలో అతను తప్ప ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. విమనాన్ని కొంతదూరం తీసుకెళ్లగలిగిన మోకానిక్ ఆ తరువాత కంట్రోల్ చేయలేకపోవడంతో వాషింగ్టన్ ప్రాంతంలో క్రాష్ చేశాడని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు. క్రాష్ అయిన విమానం 76 సీట్ల సామర్థ్యం గల విమానం అని, ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు. విమానం క్రాష్ కావడంతో అతని గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ విమానం గాలిలో చక్కర్లు కొడుతూ.. క్రాష్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మంచి దొంగ
అతనో అనాథ. ఆలనాపాలనా పట్టించుకునేవారుగానీ, ఆదరించేవారు గానీ లేరు. దాంతో పొట్టపోసుకోవడం కోసం చిన్నప్పటినుంచి చిన్నాచితకా దొంగతనాలు చేస్తుండేవాడు. ఒకరోజు రాత్రిపూట అతను పొరుగూరిలోని ఒక తోటకు వెళ్లాడు. అక్కడ చెరువులో చేపలు పట్టుకుందామని వల వేశాడు. చేపలు పడలేదుగాని, ఆ అలికిడికి తోట యజమాని లేచి, తన సేవకులను అప్రమత్తం చేశాడు. అందరూ కలిసి కాగడాలు Ðð లిగించుకుంటూ తోటంతా గాలిస్తున్నారు. ఈలోగా దొంగ, తన ఒంటి మీదున్న దుస్తులను తీసివేసి, మొలకు గోచి మాత్రమే ఉంచుకుని, ఒంటినిండా బూడిద పూసుకుని, తోటలో ఒక చెట్టుకింద కూర్చుని కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. దొంగకోసం వెతుకుతున్న వారికి చెట్టుకింద ధ్యానంలో మునిగి ఉన్న సాధువు తప్పితే ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్లు తమ చేతులలో ఉన్న కత్తులు, కర్రలు కింద పడేసి, తోటలో చెట్టుకున్న కాయలు కొన్ని కోసి, మూటకట్టి, సాధువు ముందుంచి, భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొందరపడి లేస్తే ఎవరైనా గమనిస్తారేమోనన్న భయంతో దొంగ కళ్లూ నోరూ తెరవకుండా సమాధి స్థితిలో ఉన్నట్లు అలాగే ఉండిపోయాడు. తెల్లారింది. ఊళ్లో అందరికీ తోటలో చెట్టుకింద ఉన్న సాధువు సంగతి తెలిసింది. అన్ని దిక్కుల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చారు. పళ్లు తెచ్చిన వారు కొందరు, చెంబులతో పాలు తెచ్చిన వారు కొందరు... వెండినాణేలే సమర్పించుకున్నవారు ఇంకొందరు, ఉన్నదానిలోనే కొంతయినా సాధువుకు సమర్పించుకుని ఆశీస్సులు అందుకుందామని మరికొందరు... ఇలా ఎవరికి తోచింది వాళ్లు స్వామికి చెల్లించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న దొంగ, ‘ఎంత మంచివాళ్లు వీళ్లంతా! కల్లాకపటం తెలియని వాళ్లు. నేను దొంగిలించవలసింది వీరి మంచితనాన్నే కానీ, డబ్బూ, నగలూ, మరోటీ కాదు. వీరిలోని మంచిని దోచుకుని, దానిని పదిమందికీ పంచిపెడితే, ఇక అప్పుడు నాలాగా దొంగతనం చేయవలసిన అవసరం బహుశా ఎవరికీ రాదేమో! అని ఆలోచించి, వైరాగ్యభావనలు తెచ్చుకుని, నిజమైన సాధువుగా పరివర్తన చెందాడు. – డి.వి.ఆర్. -
వాహనాల్లో డీజిల్ చోరీ
బయ్యారం(ఇల్లందు) : నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని రోజులుగా రాత్రివేళల్లో బయ్యారంలో డీజిల్ దొంగతనాలు జరుగుతున్నాయి. మానుకోటకు చెందిన వర్సటైల్ పాఠశాల బస్సును గత నెల 22న బయ్యారం సంత సమీపంలో నిలిపి ఉంచారు. రాత్రి వేళ బస్సు డీజిల్ ట్యాంకు మూతను పగులకొట్టి డీజిల్‌ను మాయం చేశారు. ఆ తర్వాత డీజిల్ చోరీకి మరో రెండు స్కూల్ బస్సుల ట్యాంకు మూతలను సైతం పగులకొట్టేందుకు విఫలయత్నం చేశారు. అలాగే గత నెల 30న మానుకోటకు చెందిన హోలీఏంజిల్స్ పాఠశాల బస్సు డీజిల్‌ట్యాంకు మూతను రాత్రి వేళ పగులగొట్టి డీజిల్‌ను అపహరించారు. శనివారం రాత్రి బయ్యారంలోని శ్రీనివాస్‌రావు తన ఇంటి సమీపంలో నిలిపి ఉన్న టిప్పర్ లారీ డీజిల్ ట్యాంకు మూత పగులగొట్టి వంద లీటర్ల వరకు డీజిల్ అపహరించారు. వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలతో తమ వాహనాలను బయటపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ చోరీలపై బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేశారు. కాగా ఈ విషయంపై ఎస్సై రవీందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, చోరీలకు పాల్పడుతున్న వారి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. -
కాళేశ్వరం అమ్మవారి పట్టుచీర చోరీ
-
బల్బు దొంగ.. భలే ఫీట్లు
కోయంబత్తూరు : విద్యుత్ బల్బు దొంగిలించడం కోసం ఓ వ్యక్తి నానా ఫీట్లు చేశాడు. తనను ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో వ్యాయామం చేస్తున్నట్టు నటించి.. చివరికి బల్బును దొంగిలించాడు. కానీ అక్కడ జరిగిందంతా సీసీటీవీల్లో రికార్డయింది. వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని చెరన్ మా నగర్‌లోని దుకాణల ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నిల్చున్న ఆ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను గమనిస్తూ వ్యాయామం చేస్తున్నట్టు నటించసాగాడు. తొలుత అటుగా ఎవరు రావడం లేదని నిర్ణయించుకుని బల్బు తీసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడు. మరికొద్దిసేపు వేచి చూసిన తర్వాత మరోసారి ప్రయత్నించి.. బల్బును దొంగిలించి.. దానిని జేబులో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం అతనిపై జాలి చూపెడుతూ కామెంట్లు చేస్తున్నారు.