ఒక్కోసారి మన టైం బాగోలేకపోతే లేదా ఎవరైన మన మీద అసూయ ద్వేషాలతోనో మన పై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. దీంతో మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతుంటాం. కానీ ఇక్కడొకామెకు ఆ తప్పుడు ఆరోపణ ఆమెను కోటీశ్వరురాలుగా మార్చింది.
(చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!)
అసలు విషయంలోకెళ్లితే...అలబామా లెస్టీ నర్స్ అనే ఆమె వాల్‌మార్ట్ షాపులో దొంగతనం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు తమ షాపులో 48 డాలర్లు(రూ. 3000) ఖరీదు చేసే తృణధాన్యలు, క్రిస్మస్ లైట్లు వంటి వస్తువులు దొంగలించిందని ఆరోపించింది. పైగా దొంగతనం చేసినందుకుగానూ తమకు 200 డాలర్లు(రూ. 14,000) చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాల్‌మార్ట్ యాజామన్యం బెదిరించింది. దీంతో లెస్సీ జరిగిన విషయాన్ని ఆ షాపు వాళ్లకు వివరించినప్పటికి ఫలితం లేకపోయింది. పైగా ఆమెను అరెస్టు కూడా చేశారు.
దీంతో లెస్టీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాదు పైగా తీర్పు ఆమెకు అనుకూలంగా రావడమే కాక అందులో ఆమె స్టోర్‌లోని అన్ని వస్తువులకు చెల్లించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆమెను దొంగతనం చేశావ్ అంటూ ఆరోపించి మానసిక ఆవేదనకు గురి చేసినందుకుగానూ నష్టపరిహారంగా వాల్‌మార్ట్ 2.1 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు)ను ఆమెకు చెల్లించవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది.
(చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది)
Comments
Please login to add a commentAdd a comment