Wall Mart
-
గుడ్ న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్: ఏకంగా లక్ష ఉద్యోగాలు
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ రాబోయే పండుగ సీజన్లో నిరుద్యోగులకు భారీ ఉపశమనం కలిగించనుంది. రానున్న ఫెస్టివ్ సీజన్లో కస్టమర్ డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో తన సప్లయ్ చెయిన్‌లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. కిరాణా డెలివరీ ప్రోగ్రామ్ ద్వారా పండుగ ఈవెంట్లో 40శాతం కంటే ఎక్కువ షిప్మెంట్లను డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే పండుగల సీజన్లో వేలాది మందికి నైపుణ్యం , శిక్షణ అవకాశాలు కల్పించినట్టు చెప్పింది. ప్రధానంగా ఈ ఉద్యోగాలు తమ సప్లై చెయిన్‌లో ఉంటాయని కంపెనీ పేర్కొంది, ఇందులో ఫుల్ఫెల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లు, డెలివరీ హబ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, లాజిస్టిక్స్‌కు సహాయం చేయడానికి డెలివరీ భాగస్వాముల జాబ్స్ కూడా ఉంటాయి. సరఫరా గొలుసులో లక్షకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నమని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ రీకామర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , సప్లై చెయిన్ హెడ్ హేమంత్ బద్రీ తెలిపారు. ఇందులో భాగంగా హ్యాండ్‌హెల్డ్ పరికరాలు, PoS మెషీన్లు, స్కానర్లు, వివిధ మొబైల్ యాప్స్ నిర్వహరణలో తమ సిబ్బంది శిక్షణ పొందారని కంపెనీ పేర్కొంది. (కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?) ఉద్యోగాల కల్పనతో పాటు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అంతటా 19 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలాన్ని జోడించాలని యోచిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తమ గుర్తింపును మరింత బలోపేతం చేయడం ద్వారా ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి నైపుణ్యం కలిగిన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ హబ్‌లు, పెద్ద-స్థాయి నెరవేర్పు కేంద్రాలు, టైర్-III నగరాలు, బయట కూడా మరింత బలపడనున్నామనే సంకేతాలందించారు. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్!) -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా అప్
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఇందుకు 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు) వెచి్చంచినట్లు తెలుస్తోంది. 35 బిలియన్ డాలర్ల విలువలో 4 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం 2021లో 37.6 బిలియన్ డాలర్ల విలువలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసినట్లు వాల్‌మార్ట్ ప్రతినిధి ధ్రువీకరించినప్పటికీ డీల్ విలువను వెల్లడించకపోవడం గమనార్హం! ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ తొలి దశ(2009)లో 9 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి 2017కల్లా 1.2 బిలియన్ డాలర్లకు పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా అతిపెద్ద వాటాదారు సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది. 2018లో వాల్‌మార్ట్‌కు అత్యధిక వాటాను విక్రయించినప్పటికీ తిరిగి 2021లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యాక్సెల్ పార్టనర్స్ సైతం 35 కోట్ల డాలర్లకు 1 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఏం జరుగుతోంది? ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న టైగర్ గ్లోబల్ వాటాల్ని వాల్‌మార్ట్ 1.4 బిలియన్ డాలర్ల (రూ.11.5 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోళ్లను వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తాజా నిర్ణయంతో 2021లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్,యూఎస్ రిటైలర్ వాల్‌మార్ట్, ఇతర పెట్టుబడిదారులకు తన వాటాలను విక్రయించిన తర్వాత ఈ-కామర్స్ సంస్థ విలువ దాదాపు 38 బిలియన్ల నుండి 35 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యాక్సెల్, టైగర్ గ్లోబల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్ధికంగా మద్దతిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని తమ వాటాల్ని వాల్‌మార్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో ఎకనామిక్స్ టైమ్స్ (ఈటీ) రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది.ఈటీ నివేదిక ప్రకారం టైగర్ గ్లోబల్ కంపెనీలో దాదాపు 4% (1.4 బిలియన్ డాలర్ల )వాటాను కలిగి ఉంది. 2018లో 16 బిలియన్ డాలర్లు వెచ్చించి వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
మాల్లో గుచ్చుకున్న మేకు.. రూ.75 కోట్ల పరిహారం
అమెరికాలో ఓ మహిళ షాపింగ్ కోసం వాల్‌మార్టు మాల్‌కు వెళ్లితే అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె మాల్‌లోకి ప్రవేశించి షాపింగ్ చేస్తున్న సమయంలో కాలికి తుప్పుపట్టిన ఇనుప మేకు గుచ్చుకుంది. చిన్న గాయం కాస్త ఇన్ఫెక్షన్గా మారటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ కాలును కోల్పోవటంతో ఆరేళ్లపాటు వీల్‌ఛైర్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఘటన 2015 సౌత్ కరోలినాలోని వాల్ మార్టులో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలైన ఏప్రిల్ జోన్స్ అనే మహిళ 2017లో వాల్‌మార్టు యాజమాన్యంపై నష్టం పరిహారం కేసును ఫ్లోరెన్స్ కౌంటీలోని కోర్టులో దాఖలు చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 10 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని వాల్ మార్టును ఆదేశించింది. ఆమె తరఫున వాదనలు జరిపిన అనస్టోపౌలో న్యాయ సంస్థ న్యాయవాదులు.. ఏప్రిల్ జోన్స్ ఆరేళ్లపాటు వీల్ ఛైర్‌కే పరిమితమైందని, ఆమె జీవితం ఈ ఘటన ద్వారా చెల్లాచెదురై ఇబ్బందులు ఎదుర్కొందని కోర్టుకు వివరించారు. వారి వాదనలను సమర్ధిస్తూ బాధిత మహిళకు 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 75 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ప్రొస్తెటిక్ కాలును కొనుగోలు చేయడానికి.. భవిష్యత్తు వైద్య బిల్లులను కవర్ చేయడానికి నష్టం పరిహారం డబ్బును ఉపయోగిస్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె తరఫున వాదనలు వినిపించిన న్యాయసంస్థ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
దొంగతనం చేశావ్ అన్నారు!....అంతే ఆమె కోటీశ్వరురాలైంది!!
ఒక్కోసారి మన టైం బాగోలేకపోతే లేదా ఎవరైన మన మీద అసూయ ద్వేషాలతోనో మన పై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. దీంతో మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతుంటాం. కానీ ఇక్కడొకామెకు ఆ తప్పుడు ఆరోపణ ఆమెను కోటీశ్వరురాలుగా మార్చింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...అలబామా లెస్టీ నర్స్ అనే ఆమె వాల్‌మార్ట్ షాపులో దొంగతనం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు తమ షాపులో 48 డాలర్లు(రూ. 3000) ఖరీదు చేసే తృణధాన్యలు, క్రిస్మస్ లైట్లు వంటి వస్తువులు దొంగలించిందని ఆరోపించింది. పైగా దొంగతనం చేసినందుకుగానూ తమకు 200 డాలర్లు(రూ. 14,000) చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాల్‌మార్ట్ యాజామన్యం బెదిరించింది. దీంతో లెస్సీ జరిగిన విషయాన్ని ఆ షాపు వాళ్లకు వివరించినప్పటికి ఫలితం లేకపోయింది. పైగా ఆమెను అరెస్టు కూడా చేశారు. దీంతో లెస్టీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాదు పైగా తీర్పు ఆమెకు అనుకూలంగా రావడమే కాక అందులో ఆమె స్టోర్‌లోని అన్ని వస్తువులకు చెల్లించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆమెను దొంగతనం చేశావ్ అంటూ ఆరోపించి మానసిక ఆవేదనకు గురి చేసినందుకుగానూ నష్టపరిహారంగా వాల్‌మార్ట్ 2.1 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు)ను ఆమెకు చెల్లించవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) -
టాప్ 100లో రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మరోసారి ప్రపంచంలోనే అగ్రశ్రేణి 100 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. 2020 సంవత్సరానికి గాను ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది. ఫార్చూన్ గ్లోబల్ 500లో ఇప్పటివరకు ఒక భారతీయ సంస్థ దక్కించుకున్న అత్యధిక ర్యాంకు ఇదే. 2012లో రిలయన్స్ తొలిసారిగా 99వ ర్యాంకు దక్కించుకుంది. అయితే, 2016లో 215 ర్యాంకుకు తగ్గింది. ఆ తర్వాత నుంచి మళ్లీ క్రమంగా మెరుగుపడి, టాప్ 100లో చోటు దక్కించుకుంది. ఇక తాజా లిస్టులో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 34 ర్యాంకులు తగ్గి 151వ స్థానంలో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) 30 ర్యాంకులు తగ్గి 190వ స్థానంలో నిల్చాయి. ఎస్బీఐ 15 ర్యాంకులు మెరుగుపడి 221వ స్థానంలో ఉంది. భారత్ పెట్రోలియం (309), టాటా మోటార్స్ (337), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (462) కూడా లిస్టులో ఉన్నాయి. ఆదాయాల ప్రాతిపదిక..: 2020 మార్చి ఆఖరు లేదా అంతకు ముందు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయాల ప్రాతిపదికన కంపెనీల ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్లు ఫార్చూన్ తెలిపింది. రిలయన్స్ ఆదాయం 86.2 బిలియన్ డాలర్లు కాగా, ఐవోసీ 69.2 బిలియన్ డాలర్లు, ఓఎన్జీసీ 57 బిలియన్ డాలర్లు, ఎస్బీఐ 51 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాయి. అగ్రస్థానంలో వాల్‌మార్ట్.. ఫార్చూన్ 2020 లిస్టులో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. వాల్‌మార్ట్ ఆదాయం 524 బిలియన్ డాలర్లు. ఇక చైనాకు చెందిన సైనోపెక్ గ్రూప్, స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రిలయన్స్‌లో వాటాలపై ఆరామ్కో మదింపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపార విభాగంలో 20 శాతం వాటాల కొనుగోలుకు సంబంధించి మదింపు ప్రక్రియ జరుగుతోందని సౌదీ ఆరామ్కో సీఈవో అమీన్ నాసర్ తెలిపారు. ‘ఇది చాలా పెద్ద డీల్. సమీక్షించుకునేందుకు తగినంత సమయం అవసరం. మదింపు ప్రక్రియ పూర్తయ్యాక డీల్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాం‘ అని జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా నాసర్ చెప్పారు. చమురు, రసాయనాల విభాగం (ఓ2సీ) విలువ సుమారు 75 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఆర్ఐఎల్ గతేడాది లెక్కగట్టింది. దీని ప్రకారం ఈ డీల్ విలువ దాదాపు 15 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నాటికే ఒప్పందం కుదరాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. ఇంధన మార్కెట్లో పరిస్థితులు, కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో డీల్ కుదుర్చుకోవడంలో జాప్యం జరిగిందని ఇటీవల జరిగిన ఆర్ఐఎల్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
కరోనా వ్యాప్తి: భారీగా వాల్‌మార్ట్ నియామకాలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రిటైల్ దుకాణాలలో పనిచేసేందుకు లక్షమందికి పైగా కార్మికులను నియమిస్తామని రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తెలిపింది. కొత్తగా నియమించే ఉద్యోగులకు కంపెనీ వరాల జల్లు ప్రకటించింది. పూర్తి సమయం పనిచేసే కార్మికులకు 300 డాలర్లు, తాత్కాలికంగా పనిచేసే కార్మికులకు 150 డాలర్ల బోనస్ ప్రకటించాలని కంపెనీ భావిస్తోంది. కార్మికల నియామకాలను మే చివరి నాటికి పూర్తి చేస్తామని వాల్‌మార్ట్ పేర్కొంది. కొత్తగా విధుల్లో చేరిన కార్మికులు రిటైల్ స్టోర్స్, క్లబ్స్, పంపిణీ కేంద్రాల్లో విధులను నిర్వర్తిస్తారని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించే విధంగా ఈ నియామకాలను చేపడతామని కంపెనీ సీఈఓ డగ్ మెక్‌మిలన్ పేర్కొన్నారు. ఆహార, పరిశుభ్రతను పాటించడంలో భాగంగా అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని వాల్‌మార్ట్ వెల్లడించింది. -
వాల్‌మార్ట్ ల్యాబ్స్ చేతికి రెండు స్టార్టప్‌లు
సాక్షి, బెంగళూరు : అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ వాల్‌మార్ట్ ల్యాబ్స్ భారత్‌లోని రెండు స్టార్టప్‌లను కొనుగోలు చేసింది. బెంగళూరుకు చెందిన ఫ్లోకేర్, బిగ్ట్రేడ్ అనే కంపెనీలను వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. తద్వారా అయితే ఈ డీల్‌కు సంబంధించి నగదులావాదేవీల వివరాలు వెల్లడికాలేదు. గూగుల్ మాజీ ఉద్యోగులు స్థాపించిన హెల్త్‌కేర్ టెక్ కంపెనీ ఫ్లోకేర్. సరసమైన ధరల్లో ఇది ఒక వైద్యుడు చేయవలసిన అన్ని పనులను ఒకే చోట నిర్వహిస్తుంది. బిగ్ట్రేడ్ హోల్‌సేల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. "ఎండ్-టు-ఎండ్" బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తుంది. కాలిఫోర్నియాలో కూడా కార్యాలయం ఉన్న ప్లోకేర్ పాలో ఆల్టో వాల్‌మార్ట్ ల్యాబ్స్ కస్టమర్ టెక్నాలజీ బృందంలో చేరారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్టార్టప్‌లను వాల్‌మార్ట్ లాబ్స్ ఇండియా సొంతం చేసుకుంది. వాల్‌మార్ట్ ఆన్లైన్ ఫార్మసీ, సప్లయ్ ఛైన్ బిజనెస్ గ్లోబల్‌గా ప్రఖ్యాతి పొందిందనీ.. ఈ క్రమంలో ఈ రెండు స్టార్టప్‌లను సొంతం చేసుకోవడం తమకు చాలా ఉత్సాహాన్నిస్తుందని వాల్‌మార్ట్ లాబ్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హరి వాసుదేవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తాజా కొనుగోలుతో ప్లోకేర్, బిగ్ ట్రేడ్ బృందం తమ వ్యాపార సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఏం జరుగుతోంది? ఉద్యోగాల కోత?
దేశంలో ఆన్లైన్ కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మధ్య డీల్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. సుమారు ఆరు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను(80శాతం) వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో అమెజాన్ లాంటి గట్టి ప్రత్యర్థులకు ఎదురు దెబ్బేనని అంచనాలు కూడా భారీగానే వచ్చాయి. అయితే ఇంతలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తనవాటా మొత్తాన్ని అమ్ముకొని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ రాజీనామా చేసి వెళ్లిపోవడం ఊహించని పరిణామం. కానీ మరో ఫౌండర బిన్నీ బన్సల్ మాత్రం సీఈవోగా కొనసాగారు. ఇది ఇలా ఉండగానే మరో కీలక పరిణామం చోటు చేసుసుకుంది. తీవ్రమైన లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ పదవినుంచి వైదొలిగారు. వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు, స్వతంత్ర దర్యాప్తు అనంతరం ఆయన రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ అనూహ్య పరిణామం నుంచి ఇంకా తేరుకోక ముందే అదే సంస్థలో భాగమైన మింత్ర సీఈఓ అనంత నారాయణన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) దీపంజన్ బసు తమ రాజీనామా సమర్పించారన్న వార్తలు కార్పొరేట్ ప్రపంచాన్ని విస్మయ పరిచాయి. బిన్సీ బన్సల్ సంస్థను వీడిన అనంతరం ఫ్లిప్‌కార్ట్ గ్రూపునకు కళ్యాణ్ కృష్ణమూర్తి సీఈవోగా ఎంపికయ్యారు. అయితే ఇంతలోనే బిన్సీకి సన్నహితుడైన అనంత నారాయణన్ కూడా రిజైన్ చేశారనీ, ఈ మేరకు ఆయన రాజీనామాను కొత్త సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తికి పంపించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలను అనంత్ నారాయణన్ ఖండించారు. ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూనిట్లు మింత్రా-జబాంగ్‌లకు చీఫ్‌గా కొనసాగుతానని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని నారాయణన్ కొట్టి పారేశారు. ఉద్యోగాల కోత వాల్‌మార్ట్ డీల్ అనంతరం సంస్థ పునరుద్ధరణ, ఇతర ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా గుర్గావ్లోని జబాంగ్‌లో 40-50శాతం ఉద్యోగులపై వేటు వేయనుంది. దాదాపు 2వందలనుంచి 250మంది దాకా ఉద్యోగులను తొలగించనుంది. మింత్రా-జబాంగ్ సంయుక్తంగా బెంగళూరు నుంచి కార్యకలాపాలను నిర్వహించనున్న నేపథ్యంలో బెంగళూరుకు షిప్ట్ కావడానికి ఇష్టపడని ఉద్యోగులను కూడా మూడు నెలల జీతం, గ్రాట్యుయిటీ, ప్రతీ ఏడాదీ 15రోజుల జీతం చెల్లించి మరీ ఇంటికి పంపిస్తోందట. బిన్సీ రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే ఈ పరిణామం. గ్రూపు సీఈవో పదవి రద్దు బన్సల్ రాజీనామా తరువాత అసలు గ్రూప్ సీఈవో పదవినే రద్దు చేసి కొత్త నిర్మాణ వ్యవస్థపై వాల్‌మార్ట్ నియంత్రణలోని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. టాప్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా? ఇది ఇలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత సమస్యలు ముదురుతున్నాయనీ, దీంతో టాప్ గ్జిక్యూటివ్లు రాజీనామా బాట పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మింత్రా సీఈఓ, సీఎఫ్ఓ కంపెనీకి గుడ్‌బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడాయి. ఫ్లిప్‌కార్ట్‌లో భాగమైన జబాంగ్ సీఈఓ గుంజన్ సోనీ కూడా ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటూ కంపెనీ స్ట్రాటజీ అండ్ కేటగిరీ బిజినెస్ హెడ్ అనన్య త్రిపాఠీ కూడా కంపెనీకి గుడ్ బై చెప్పడంతో అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులంతా రాజీనామా బాట పడుతోంటే ఫిప్కార్ట్ పరిస్థితి ఏమిటి అనేది చర్చనీయాంశమైంది. అలాగే స్వతంత్ర విచారణలో బిన్సీ తప్పు నిరూపితం కాలేదని ప్రకటించిన వాల్‌మార్ట్, అతని రాజీనామాను ఎందుకు ఆమోదించింది అనేది అనేక అనుమానాలను రేకెత్తించింది. అయితే వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త నియామకం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కీలక నియామకాన్ని చేపట్టింది. దాదాపు 18నెలలుగా ఖాళీగా ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ను భర్తీ చేసింది. ఫ్లిప్‌కార్ట్ చీఫ హెచ్ఆర్గా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్‌లో పనిచేసిన స్మృతిసింగ్ను నియమించినట్టు తెలుస్తోంది. డిసెంబరు నుంచి స్మృతి సింగ్బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను కూడా ప్రస్తుత సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తే నిర్వర్తించారు. కాగా జబాంగ్ కాంట్రిబ్యూషన్ లేని కారణంగా2018 సంవత్సరానికి సంబంధించి మింత్ర ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. దీంతో ఇకపై స్వతంత్రగా వ్యవహరించాలని మింత్రా భావిస్తోందట. దీనిపై కూడా త్వరలోనే ఒక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. 2016, జులైలో జబాంగ్ మింత్రాలో విలీనమైంది. ఈ ఊహాగానాలపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
తెలంగాణలోమార్కెట్లు నెలకొల్పేందుకు వాల్‌మార్ట్ ఆసక్తి
హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాలలో మార్కెట్లు నెలకొల్పేందుకు వాల్‌మార్ట్ ఆసక్తి చూపుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ సీఈఓ డేవిడ్ చీజ్రైట్ ఈరోజు ఇక్కడ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులను మార్కెట్ చేయడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాల్‌మార్ట్‌కు సూచించారు. తెలంగాణలో అన్ని షాపులు, మాల్స్ 365 రోజులు పని చేసేలా విధానపరమైన మార్పులు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు.