Walmart Buys 1.4 Billion Dollars Tiger Global Stake in Flipkart - Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది? ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్‌ గ్లోబల్‌ వాటాని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌!

Published Mon, Jul 31 2023 1:26 PM | Last Updated on Mon, Jul 31 2023 2:19 PM

Walmart buys 1.4 billion Tiger Global stake in Flipkart - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న టైగర్‌ గ్లోబల్‌ వాటాల్ని వాల్‌మార్ట్‌ 1.4 బిలియన్‌ డాలర్ల (రూ.11.5 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోళ్లను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. 

తాజా నిర్ణయంతో 2021లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్,యూఎస్‌ రిటైలర్ వాల్‌మార్ట్, ఇతర పెట్టుబడిదారులకు తన వాటాలను విక్రయించిన తర్వాత ఈ-కామర్స్ సంస్థ విలువ దాదాపు 38 బిలియన్ల నుండి 35 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది.

ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యాక్సెల్, టైగర్ గ్లోబల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్ధికంగా మద్దతిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని తమ వాటాల్ని వాల్‌మార్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో ఎకనామిక్స్ టైమ్స్ (ఈటీ) రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది.ఈటీ నివేదిక ప్రకారం టైగర్ గ్లోబల్ కంపెనీలో దాదాపు 4% (1.4 బిలియన్‌ డాలర్ల )వాటాను కలిగి ఉంది. 2018లో 16 బిలియన్‌ డాలర్లు వెచ్చించి వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement