Tiger global Mangement
-
జొమాటోలో కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో టైగర్ గ్లోబల్, డీఎస్టీ గ్లోబల్ మొత్తం 1.8 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాకు సమానమైన 12,34,86,408 షేర్లను విక్రయించింది. ఇక డీఎస్టీ గ్లోబల్ 0.4 శాతం వాటాకు సమానమైన 3,19,80,447 షేర్లను అమ్మివేసింది. షేరుకి రూ. 90–91 సగటు ధరలో విక్రయించిన వీటి మొత్తం విలువ రూ. 1,412 కోట్లు. యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రులైఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 92.3 వద్ద ముగిసింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా అప్
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఇందుకు 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు) వెచి్చంచినట్లు తెలుస్తోంది. 35 బిలియన్ డాలర్ల విలువలో 4 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం 2021లో 37.6 బిలియన్ డాలర్ల విలువలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసినట్లు వాల్‌మార్ట్ ప్రతినిధి ధ్రువీకరించినప్పటికీ డీల్ విలువను వెల్లడించకపోవడం గమనార్హం! ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ తొలి దశ(2009)లో 9 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి 2017కల్లా 1.2 బిలియన్ డాలర్లకు పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా అతిపెద్ద వాటాదారు సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది. 2018లో వాల్‌మార్ట్‌కు అత్యధిక వాటాను విక్రయించినప్పటికీ తిరిగి 2021లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యాక్సెల్ పార్టనర్స్ సైతం 35 కోట్ల డాలర్లకు 1 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఏం జరుగుతోంది? ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న టైగర్ గ్లోబల్ వాటాల్ని వాల్‌మార్ట్ 1.4 బిలియన్ డాలర్ల (రూ.11.5 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోళ్లను వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తాజా నిర్ణయంతో 2021లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్,యూఎస్ రిటైలర్ వాల్‌మార్ట్, ఇతర పెట్టుబడిదారులకు తన వాటాలను విక్రయించిన తర్వాత ఈ-కామర్స్ సంస్థ విలువ దాదాపు 38 బిలియన్ల నుండి 35 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యాక్సెల్, టైగర్ గ్లోబల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్ధికంగా మద్దతిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని తమ వాటాల్ని వాల్‌మార్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో ఎకనామిక్స్ టైమ్స్ (ఈటీ) రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది.ఈటీ నివేదిక ప్రకారం టైగర్ గ్లోబల్ కంపెనీలో దాదాపు 4% (1.4 బిలియన్ డాలర్ల )వాటాను కలిగి ఉంది. 2018లో 16 బిలియన్ డాలర్లు వెచ్చించి వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు డబుల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది మంచి జోరు చూపించింది. చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ఇళ్ల విక్రయాలు ఏకంగా రెట్టింపై 10,330 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,280 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం మీద హైదరాబాద్‌లో మార్కెట్లో 35,370 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021లో అమ్మకాలు 22,240 యూనిట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. 2021 చివరి మూడు నెలలతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఈ వివరాలను హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎనిమిది పట్టణాల్లో మొత్తం మీద 80,770 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 67,890 యూనిట్లుగా ఉన్నాయి. ఇక 2022 మొత్తం మీద ఈ ఎనిమిది పట్టణాల్లో 3,08,940 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2021లో అమ్మకాలు 2,05,940 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 50 శాతం వృద్ధి నమోదైంది. పట్టణాల వారీగా అమ్మకాలు ► అహ్మదాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం అధికంగా 6,640 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది మొత్తం మీద 62 శాతం అధికంగా 27,310 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► బెంగళూరులో అమ్మకాలు డిసెంబర్ క్వార్టర్లో 30 శాతం తగ్గి 6,560 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద 22 శాతం వృద్ధితో 30,470 యూనిట్లు విక్రయమయ్యాయి. ► చెన్నైలో డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం తగ్గి 3,160 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం అధికంగా 14,100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 3 శాతం తగ్గి డిసెంబర్ త్రైమాసికంలో 4,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధితో 19,240 ఇళ్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి. ► కోల్‌కతా మార్కెట్లో 18 శాతం క్షీణించి ఇళ్ల అమ్మకాలు 2,130 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం పెరిగి 10,740 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో 40 శాతం పెరిగాయి. 31,370 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 87 శాతం అధికంగా 1,09,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► పుణెలో క్యూ4లో ఒక శాతం పెరిగి 16,300 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద అమ్మకాలు 62,030 యూనిట్లుగా ఉన్నాయి. కొనుగోలు శక్తిపై ధరల ప్రభావం: నైట్‌ఫ్రాంక్ దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో గృహ రుణ రేట్లు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఇళ్ల కొనుగోలు శక్తి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అయితే సగటు కుటుంబ ఆదాయం ప్రకారం చూస్తే.. ఇప్పటికీ గృహ రుణాలు పొందే శక్తి వారికి ఉన్నట్టు పేర్కొంది. వార్షిక ప్రాపర్టీ అధ్యయన నివేదికను ‘ద అఫర్డబులిటీ ఇండెక్స్ 2022’ పేరుతో నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సగటు కుటుంబ ఆదాయంతో ఈఎంఐ మొత్తం నిష్పత్తిని ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుంటుంది. అలాగే, ఇళ్ల ధరలు, గృహ రుణాల వడ్డీ రేట్లు, కుటుంబ ఆదాయాన్ని విశ్లేషించి ఏటా గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది మొత్తం మీద ఆర్బీఐ 2.25 శాతం రెపో రేటు పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీని కారణంగా గృహ రుణాల రేట్లు పెరగడం, నిర్మాణ సామాగ్రి వ్యయాలు అధికం కావడం వల్ల పెరిగిన ప్రాపర్టీ ధరలతో కొనుగోలు శక్తి క్షీణించినట్టు వివరించింది. కాకపోతే కరోనా ముందు 2019తో పోలిస్తే కొనుగోలు శక్తి ఇప్పటికీ మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో ఒక్క ముంబై ఈ విషయంలో బలహీనంగా ఉంది. -
జొమాటోకు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరో షాక్ తగిలింది. పెట్టుబడి సంస్థ టైగర్ గ్లోబల్ బహిరంగ మార్కెట్లో 18.45 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కంపెనీలో దాదాపు సగం వాటాను 2.77 శాతానికి తగ్గించుకున్నట్లు జోమాటో గురువారం తెలిపింది. న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ కంపెనీ టైగర్ గ్లోబల్ తన వాటాను దాదాపు సంగానికి తగ్గించుకుంది. జూలై 25 నుంచి ఆగస్ట్ 2 మధ్య ఓపెన్ మార్కెట్లో 18.45 కోట్ల షేర్లను విక్రయించడంతో టైగర్ గ్లోబల్‌కు చెందిన ఇంటర్నెట్ ఫండ్-6 వాటా 5.11 నుంచి 2.77 శాతానికి వచ్చి చేరింది. (భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం) టైగర్ గ్లోబల్ మొదటిసారిగా సెప్టెంబర్ 2020లో జొమాటోలో 102.5 మిలియన్లడాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. ఫిబ్రవరి 2021లో 250 మిలియన్ల డాలర్లు ఫండింగ్ చేసింది. ఆగస్ట్ 3 నాటికి జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 5.74 బిలియన్ డాలర్లుగాఉంది. కాగా, జొమాటోలో రూ.3,088 కోట్ల విలువైన 61.2 కోట్ల షేర్లను ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్ ఓపెన్ మార్కెట్లో బుధవారం విక్రయించిన సంగతి తెలిసిందే. (OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది!) (ఇదీ చదవండి: అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త) -
స్వదేశీ ట్విటర్ "కూ" యాప్ లో భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్రానికి, ట్విటర్ కి మధ్య టూల్ కిట్ విషయంలో ఘర్షణ జరుగుతున్న ఈ కీలక సమయంలో దేశీయ మైక్రో బ్లాగింగ్ "కూ" యాప్ సిరీస్ బి నిధుల కింద 30 మిలియన్లను సేకరించింది. అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ పెట్టుబడి నిదుల కోసం ఈ రౌండ్ కి నాయకత్వం వహించింది. ప్రస్తుత పెట్టుబడిదారులు అక్సెల్ పార్టనర్స్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ మరియు డ్రీమ్ ఇంక్యుబేటర్ కూడా ఈ రౌండ్ లో పాల్గొన్నారు. దీంతో "కూ" యాప్ విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగి 100 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఐఎఫ్ఎల్, మిరే ఎస్టేట్స్ ఈ రౌండ్‌తో క్యాప్ టేబుల్ పైకి వచ్చిన ఇతర కొత్త పెట్టుబడిదారులు. "కూ" యాప్ అనేది భారతీయ భాషలలో అభిప్రాయాలు పంచుకునేందుకు ఉన్న ఒక మైక్రోబ్లాగింగ్ సైట్. ఇది కేవలం ఒక సంవత్సర కాలంలో దాదాపు 6 మిలియన్ల డౌన్లోడ్లను సంపాదించి ప్రతిరోజూ కమ్యూనిటీ పోస్ట్ చేసే కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ మరియు స్మృతి ఇరానీ వంటి అనేక మంది ప్రముఖులు ఇందులో ఉన్నారు. "కూ"ని టాక్సీ ఫర్ స్యూర్ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ, గతంలో మీడియా యాంట్ & గుడ్ బాక్స్ వంటి సంస్థలను స్థాపించిన మయాంక్ బిదావత్కా కలిసి స్థాపించారు. కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఎదగడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు దగ్గరికి చేరుకోవాలని ఉత్సాహంగా ఉన్నామని. ఈ కలను సాకారం చేసుకోవడానికి టైగర్ గ్లోబల్ సరైన భాగస్వామి” అని అన్నారు. చదవండి: బంగారం ప్రియులకు భారీ షాక్ -
ఫ్లిప్ కార్ట్ కు ఏమైంది?
న్యూయార్క్: భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటోందా.. ఇప్పటికే వివిధ కంపెనీల్లో తన వాటాలను తగ్గించుకుంటూ వస్తున్న కంపెనీ ఇపుడు మరో అడుగు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికాలో తన ప్రధాన పోటీదారు అమెజాన్ లో రెండింట మూడో వంతు వాటాలను 2016 జనవరి-మార్చి క్వార్టర్ లో తగ్గించుకున్నట్లు యూఎస్ సెక్ తెలిపింది. 618 మిలియన్ డాలర్ల విలువ చేసే 1.04 మిలియన్ల షేర్లను వదులుకున్నట్లు వివరించింది. అమెజాన్ తో పాటు ఆలీబాబా గ్రూప్ లో కూడా ఫ్లిప్ కార్ట్ బాగా వాటాలను తగ్గించినట్లు సెక్ తెలిపింది. చైనీస్ ఈ-టెయిలర్ జేడీ.కామ్ లో 25 శాతం, ఆపిల్ లో 46 శాతం, జిల్లో గ్రూప్ లో 23.6 మిలియన్ల వాటాలను తగ్గించుకున్నట్లు సెక్ వివరించింది. భారతీయ ఈ-కామర్స్ రంగాన్ని శాసించేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాస్ డీల్ కంపెనీలు పోటీ పడుతుండగా.. గత కొద్దికాలంగా ఫ్లిప్ కార్ట్ మార్కెట్ ఒడిదుడుకులకు గురౌతున్న విషయం తెలిసిందే.