న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఇందుకు 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు) వెచి్చంచినట్లు తెలుస్తోంది. 35 బిలియన్ డాలర్ల విలువలో 4 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం 2021లో 37.6 బిలియన్ డాలర్ల విలువలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసినట్లు వాల్‌మార్ట్ ప్రతినిధి ధ్రువీకరించినప్పటికీ డీల్ విలువను వెల్లడించకపోవడం గమనార్హం! ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ తొలి దశ(2009)లో 9 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి 2017కల్లా 1.2 బిలియన్ డాలర్లకు పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా అతిపెద్ద వాటాదారు సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది. 2018లో వాల్‌మార్ట్‌కు అత్యధిక వాటాను విక్రయించినప్పటికీ తిరిగి 2021లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యాక్సెల్ పార్టనర్స్ సైతం 35 కోట్ల డాలర్లకు 1 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment