shares sold
-
ఐడీఎఫ్సీ ఫస్ట్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి పూర్తిగా వైదొలగింది. తాజాగా బ్యాంకులోగల మొత్తం 2.25 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 75.24 సగటు ధరలో 15.88 కోట్ల బ్యాంకు షేర్లను అమ్మివేసింది. వీటి విలువ రూ. 1,195 కోట్లుకాగా.. క్లోవర్‌డెల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 2023 డిసెంబర్‌కల్లా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో 2.25 శాతం వాటాను కలిగి ఉంది. అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో 4.2% వాటాను వార్బర్గ్ పింకస్ రూ. 2,480 కోట్లకు విక్రయించిన విషయం విదితమే. కాగా.. గురువారం బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.1% క్షీణించి రూ. 75.4 వద్ద ముగిసింది. -
టారో.. సన్ ఫార్మా సొంతం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా సన్‌ఫార్మా సొంతం కానుంది. ఇప్పటికే టారో ఫార్మాలో సన్ ఫార్మాకు 78.48% వాటా ఉంది. కంపెనీలో మిగిలిన 21.52% వాటాను కూడా కొనుగోలు చేయనున్నట్టు సన్ ఫార్మా ప్రకటించింది. ఇందుకు రూ.2,891.76 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలిపింది. టారో ఫార్మాలో మిగిలిన షేర్లను ఒక్కోటీ 43 డాలర్ల చొప్పున సొంతం చేసుకునేందుకు అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. జనరిక్ డెర్మటాలజీ మార్కెట్లో టారో కీలక సంస్థగా ఉన్నట్టు సన్‌ఫార్మా తెలిపింది. బీఎస్ఈలో సన్‌ఫార్మా షేరు 3 శాతం లాభపడి రూ.1,336 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్ షేర్లు విక్రయించిన సింగ్
న్యూఢిల్లీ: బిలియనీర్ కేపీ సింగ్‌సహా.. ప్రమోటర్ సంస్థలు మల్లికా హౌసింగ్ కంపెనీ, బెవర్లీ బిల్డర్స్.. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1,087 కోట్ల విలువైన వాటాను మంగళవారం అమ్మివేశాయి. మల్లికా హౌసింగ్‌లో సింగ్ కుమార్తెలు పియా సింగ్, రేణుకా తల్వార్ ప్రధాన వాటాదారులుకాగా.. బెవర్లీ బిల్డర్స్‌లో సింగ్ ప్రధాన వాటాదారుగా ఉన్నారు. డీఎల్ఎఫ్లో 0.24 శాతం వాటాకు సమానమైన 60 లక్షల షేర్లను మల్లికా హౌసింగ్, 0.04 శాతం వాటాకు సమానమైన 10.99 లక్షల షేర్లను బెవర్లీ బిల్డర్స్ విక్రయించాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం కేపీ సింగ్ దాదాపు 1.45 కోట్ల షేర్ల(0.59 శాతం వాటా)ను విక్రయించారు. షేరుకి రూ. 504.21 ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 1,087 కోట్లు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 74.95 శాతం వాటా కలిగి ఉన్నారు. బల్క్ డీల్స్ వార్తల నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు బీ ఎస్ఈలో 1% నీరసించి రూ. 494 వద్ద ముగిసింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా అప్
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. ఇందుకు 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు) వెచి్చంచినట్లు తెలుస్తోంది. 35 బిలియన్ డాలర్ల విలువలో 4 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక్రితం 2021లో 37.6 బిలియన్ డాలర్ల విలువలో ఫ్లిప్‌కార్ట్ నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసినట్లు వాల్‌మార్ట్ ప్రతినిధి ధ్రువీకరించినప్పటికీ డీల్ విలువను వెల్లడించకపోవడం గమనార్హం! ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ తొలి దశ(2009)లో 9 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి 2017కల్లా 1.2 బిలియన్ డాలర్లకు పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా అతిపెద్ద వాటాదారు సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది. 2018లో వాల్‌మార్ట్‌కు అత్యధిక వాటాను విక్రయించినప్పటికీ తిరిగి 2021లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యాక్సెల్ పార్టనర్స్ సైతం 35 కోట్ల డాలర్లకు 1 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) .. తాజాగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని శుక్రవారం వెల్లడించింది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం మరో 26% వాటా (సుమారు 2.17 కోట్ల షేర్లు) కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. జస్ట్ డయల్‌లో ఇన్వెస్ట్ చేసే నిధులతో కంపెనీ సమగ్రమైన లోకల్ లిస్టింగ్, కామర్స్ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు విస్తరించగలదని పేర్కొంది. లక్షల కొద్దీ లఘు, చిన్న, మధ్య స్థాయి భాగస్వామ్య వ్యాపార సంస్థలకు డిజిటల్ ఊతమిచ్చేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. తమ లక్ష్యాల సాధనకు, వ్యాపార పురోగతికి రిలయన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడగలదని వీఎస్ఎస్ మణి తెలిపారు. డీల్ స్వరూపం ఇలా..: ఆర్ఆర్వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయిస్తారు. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ. 1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తుంది. జస్ట్‌డయల్ కార్యకలాపాలు 1996లో ప్రారంభమయ్యాయి. మొబైల్, యాప్స్, వెబ్సైట్, టెలిఫోన్ హాట్‌లైన్ వంటి మాధ్యమాల ద్వారా జస్ట్‌డయల్ సర్వీసులను పొందే యూజర్ల సంఖ్య మూడు నెలల సగటు సుమారు 13 కోట్ల దాకా ఉంటుంది. -
కొటక్ మహీంద్రాలో సుమిటొమొ వాటాల విక్రయం
విలువ రూ. 2,069 కోట్లు ముంబై: జపాన్ దిగ్గజం సుమిటొమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ) మంగళవారం కొటక్ మహీంద్రా బ్యాంకులో దాదాపు 1.78 శాతం మేర వాటాలను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 2,069 కోట్లు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎస్ఎంబీసీ ఈ వాటాలు విక్రయించింది. కొటక్ మహీంద్రాలో ఎస్ఎంబీసీకి 3.58 శాతం వాటాలుండేవి. తాజాగా బీఎస్ఈలో 1.81 కోట్ల షేర్లను (0.98%) రూ. 1,152 కోట్లకు, ఎన్ఎస్ఈలో 1.47 కోట్ల షేర్లను (0.80 శాతం) రూ.917 కోట్లకు విక్రయించింది. బీఎస్ఈలో షేర్లు సగటున రూ. 636.25 రేటుకి, ఎన్ఎస్ఈలో రూ.623.95 ధరకి అమ్ముడయ్యాయి. 1.81 కోట్ల షేర్లను కెనడాకు చెందిన సీపీపీ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కొనుగోలు చేసింది. 2015 ఆఖరు నాటికి కొటక్ మహీంద్రా బ్యాంకులో సీపీపీకి 3.91% వాటాలు ఉన్నాయి.