న్యూఢిల్లీ: బిలియనీర్ కేపీ సింగ్‌సహా.. ప్రమోటర్ సంస్థలు మల్లికా హౌసింగ్ కంపెనీ, బెవర్లీ బిల్డర్స్.. రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ షేర్లను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1,087 కోట్ల విలువైన వాటాను మంగళవారం అమ్మివేశాయి. మల్లికా హౌసింగ్‌లో సింగ్ కుమార్తెలు పియా సింగ్, రేణుకా తల్వార్ ప్రధాన వాటాదారులుకాగా.. బెవర్లీ బిల్డర్స్‌లో సింగ్ ప్రధాన వాటాదారుగా ఉన్నారు.
డీఎల్‌ఎఫ్‌లో 0.24 శాతం వాటాకు సమానమైన 60 లక్షల షేర్లను మల్లికా హౌసింగ్, 0.04 శాతం వాటాకు సమానమైన 10.99 లక్షల షేర్లను బెవర్లీ బిల్డర్స్ విక్రయించాయి. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం కేపీ సింగ్ దాదాపు 1.45 కోట్ల షేర్ల(0.59 శాతం వాటా)ను విక్రయించారు. షేరుకి రూ. 504.21 ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 1,087 కోట్లు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 74.95 శాతం వాటా కలిగి ఉన్నారు.
బల్క్ డీల్స్ వార్తల నేపథ్యంలో డీఎల్‌ఎఫ్ షేరు బీ ఎస్‌ఈలో 1% నీరసించి రూ. 494 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment