KP Singh
-
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
డీఎల్ఎఫ్ షేర్లు విక్రయించిన సింగ్
న్యూఢిల్లీ: బిలియనీర్ కేపీ సింగ్‌సహా.. ప్రమోటర్ సంస్థలు మల్లికా హౌసింగ్ కంపెనీ, బెవర్లీ బిల్డర్స్.. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 1,087 కోట్ల విలువైన వాటాను మంగళవారం అమ్మివేశాయి. మల్లికా హౌసింగ్‌లో సింగ్ కుమార్తెలు పియా సింగ్, రేణుకా తల్వార్ ప్రధాన వాటాదారులుకాగా.. బెవర్లీ బిల్డర్స్‌లో సింగ్ ప్రధాన వాటాదారుగా ఉన్నారు. డీఎల్ఎఫ్లో 0.24 శాతం వాటాకు సమానమైన 60 లక్షల షేర్లను మల్లికా హౌసింగ్, 0.04 శాతం వాటాకు సమానమైన 10.99 లక్షల షేర్లను బెవర్లీ బిల్డర్స్ విక్రయించాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం కేపీ సింగ్ దాదాపు 1.45 కోట్ల షేర్ల(0.59 శాతం వాటా)ను విక్రయించారు. షేరుకి రూ. 504.21 ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 1,087 కోట్లు. జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్లు 74.95 శాతం వాటా కలిగి ఉన్నారు. బల్క్ డీల్స్ వార్తల నేపథ్యంలో డీఎల్ఎఫ్ షేరు బీ ఎస్ఈలో 1% నీరసించి రూ. 494 వద్ద ముగిసింది. -
91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్ షీనా లవ్‌లో బిజినెస్ టైకూన్
సాక్షి, ముంబై: రియల్ ఎస్టేట్ గ్రూప్ డీఎల్ఎఫ్ ఎమెరిటస్ చైర్మన్ కుశాల్ పాల్ సింగ్ (91) మళ్లీ ప్రేమలో పడ్డారు. తనకు ప్రేమ లభించిందంటూ సీఎన్బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2018లో కేన్సర్‌తో తన భార్య చనిపోయిన తరువాత ఒకటి రెండేళ్లు ఒంటరితనంతో బాధపడ్డానని కానీ ఆ తరువాత చాలా గొప్ప వ్యక్తిని కలుసుకోవడం అదృష్టమంటూ తన కొత్త ప్రేమను పరిచయం చేయడం బిజినెస్ వర్గాల్లో విశేషంగా నిలిచింది. 65 ఏళ్ల తరువాత భార్య ఇందిర క్యాన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఒంటరి తనం కుదిపేసిందని చెప్పుకొచ్చారు. ఆమెతో అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడిపాను. ఆమె భార్య మాత్రమే కాదు, స్నేహితురాలు కూడా. కానీ ఆమెను రక్షించు కోలేకపోయాం. అయితే చని పోవడానికి ఆరు నెలల ముందు, జీవితాన్ని వదులు కోవద్దని కోరిందనీ, తన జీవితం ఎలాగూ తిరిగి రాదు.. కానీ మీ జీవితం ఇంకా చాలా ఉంది.. దాన్ని వదులుకోవద్దంటూ తనతో వాగ్దానం చేయించు కుందని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఈ మాటలు నాతోనే ఉండిపోయాయన్నారు. కానీ ఈ విషయంలో తాను అదృష్టంతుడినని, ప్రస్తుతం షీనాతో కలిసి జీవిస్తున్నానని వెల్లడించారు. షీనా చాలా ఎనర్జిటిక్. అందుకే తానెఫ్పుడైనా డల్‌గా ఉన్నా యాక్టివ్‌గా మార్చేస్తుంది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్నేహితులు ఆమెకు ఉన్నారని ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె చాలా ప్రేరణ నిస్తుంది. తన జీవితంలో ముఖ్య భాగమైన షీనా అండతో తానిపుడు చలాకీగా పనిలో నిమగ్నమయ్యానని చెప్పడం విశేషం. దీంతో పాటు కరియర్ ప్రారంభలో తన అనుభవాలను కూడా పంచుకున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం సింగ్ నికర విలువ 8.81 బిలియన్ డాలర్లు. 1946లో తన మామగారు ప్రారంభించిన డీఎల్ఎఫ్ అనే కంపెనీలో చేరడానికి ముందు 1961లో ఆర్మిలో పనిచేశారు. ఆ తరువాత రైతుల నుండి భూమిని సేకరించడం ద్వారా ఢిల్లీ శివార్లలో తన షోపీస్ టౌన్షిప్ గుర్గావ్లో డీఎల్ఎఫ్ సిటీని నిర్మించారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆ పదవిలో ఉన్న ఆయన జూన్ 2020లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇపుడు ఆయన కుమారుడు రాజీవ్ చైర్మన్‌గా ఉన్నారు. -
అదానీ- హిండెన్‌బర్గ్ వివాదం.. డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి గాధపై అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ వివాద ప్రభావమేమీ ఉండబోదని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కార్పొరేట్ గ్రూప్‌నకు మాత్రమే పరిమితమైన విషయమే తప్ప, దీనితో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌పై నమ్మకమేమీ సడలబోదని పేర్కొన్నారు. పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉంటాయనే అభిప్రాయాలను సింగ్ తోసిపుచ్చారు. అయితే అధిక వృద్ధి బాటలో ముందుకెళ్లాలంటే అదానీ గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకుని, పెట్టుబడిని పెంచుకోవాలని సూచించారు. భారీగా షేర్ల విక్రయాల సమయంలో కొందరు బ్లాక్‌మెయిలర్లు నివేదికలతో బైటికొస్తుంటారని చెప్పారు. -
అమితాబ్ టు ఐశ్వర్య.. నల్లడబ్బు గుట్టురట్టు!
జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు వెల్లడించి, సంచలనం సృష్టించగా తాజాగా వెల్లడైన పనామా పత్రాలు పెనుదుమారం రేపుతున్నాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. వారు పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు ఏర్పాటు చేయడంలో దిట్టగా పేరొందిన ఈ లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. నల్లడబ్బు సర్గధామలైన దేశాల్లో కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు ఈ కంపెనీకి పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు డబ్బు చెల్లించినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు ఉండగా, 234 మంది భారతీయులు ఈ కంపెనీల ఏర్పాటు కోసం తమ పాస్‌పోర్టులను కూడా సమర్పించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ పత్రాలను పరిశీలించి వెల్లడించింది. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ తోపాటు, డీఎల్ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా, ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయ నేత శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్‌సత్తా చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. అలాగే ముంబై గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చితోపాటు పంచుకులా, డెహ్రాడూన్, వడోదర, మంద్‌సౌర్‌కు చెందిన పలువురు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఐశ్వర్యరాయ్.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని కంపెనీ ఐశ్యర్య రాయ్, ఆమె తండ్రి రమణరాజ్ కృష్ణరాయ్, తల్లి విందాకృష్ణ రాజ్ రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్ హోల్డర్‌గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది. అమితాబ్.. బహమస్ కంపెనీలు కనీసం విదేశీ నాలుగు షిప్పింగ్ కంపెనీల్లో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్‌గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్‌లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉండేది.