
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా సన్‌ఫార్మా సొంతం కానుంది. ఇప్పటికే టారో ఫార్మాలో సన్ ఫార్మాకు 78.48% వాటా ఉంది. కంపెనీలో మిగిలిన 21.52% వాటాను కూడా కొనుగోలు చేయనున్నట్టు సన్ ఫార్మా ప్రకటించింది.
ఇందుకు రూ.2,891.76 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలిపింది. టారో ఫార్మాలో మిగిలిన షేర్లను ఒక్కోటీ 43 డాలర్ల చొప్పున సొంతం చేసుకునేందుకు అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. జనరిక్ డెర్మటాలజీ మార్కెట్లో టారో కీలక సంస్థగా ఉన్నట్టు సన్‌ఫార్మా తెలిపింది.
బీఎస్‌ఈలో సన్‌ఫార్మా షేరు 3 శాతం లాభపడి రూ.1,336 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment