బ్యాంక్ నుంచి వార్‌బర్గ్ పింకస్ ఔట్
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి పూర్తిగా వైదొలగింది. తాజాగా బ్యాంకులోగల మొత్తం 2.25 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 75.24 సగటు ధరలో 15.88 కోట్ల బ్యాంకు షేర్లను అమ్మివేసింది.
వీటి విలువ రూ. 1,195 కోట్లుకాగా.. క్లోవర్‌డెల్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా 2023 డిసెంబర్‌కల్లా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో 2.25 శాతం వాటాను కలిగి ఉంది. అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో 4.2% వాటాను వార్‌బర్గ్ పింకస్ రూ. 2,480 కోట్లకు విక్రయించిన విషయం విదితమే. కాగా.. గురువారం బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.1% క్షీణించి రూ. 75.4 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment