ఆన్‌లైన్ ట్రావెల్‌టెక్ అగ్రిగేటర్ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip ) సహ ప్రమోటర్ నిశాంత్ పిట్టీ తాజాగా కంపెనీలో మైనారిటీ వాటాను (Sold shares) విక్రయించారు. వ్యక్తిగత కారణాల రీత్యా 1.4 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మివేశారు. నిశాంత్ ఇటీవలే కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేశారు. దీంతో వాటా విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిశాంత్ సోదరుడు, కంపెనీ సహవ్యవస్థాపకుడు రికాంత్ పిట్టీ జనవరి 1 నుంచి ఈ బాధ్యతలు స్వీకరించినట్లు సోషల్ మీడియా ద్వారా ఈజ్‌మైట్రిప్ వెల్లడించింది. కంపెనీ పటిష్ట వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మరోపక్క నిశాంత్ సైతం ఇకపై తన వాటాను అమ్మబోనని పేర్కొన్నారు.
ఇది కంపెనీపట్ల విశ్వాసం లేకపోవడంకాదని, వ్యక్తిగత అవసరాలరీత్యా మాత్రమే స్వల్ప వాటాను విక్రయించానని తెలియజేశారు. కంపెనీకి మంచి భవిష్యత్ ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాగా.. 1.4 శాతం వాటాకు సమానమైన 4.99 కోట్ల షేర్ల విక్రయం ద్వారా నిశాంత్ రూ. 78 కోట్లు అందుకున్నారు. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ మాతృ సంస్థ ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేరు 1 శాతం బలపడి రూ. 15.47 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment