share sale
-
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, లిస్టెడ్ ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలకు ఆహ్వానం పలికింది. రెండు రకాల ప్రతిపాదనల(రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్–ఆర్ఎఫ్పీ)కు తెరతీసింది. దీనిలో భాగంగా మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను మూడేళ్ల కాలానికి దీపమ్ ఎంపిక చేయనుంది. గడువును మరో ఏడాది పొడిగించేందుకు వీలుంటుంది. ఎంపికైన సంస్థలు వాటాల విక్రయం విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించవలసి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో వాటాల విక్రయంలో ప్రభుత్వానికి తగిన విధంగా సహకారం అందించవలసి ఉంటుంది. ఇందుకుగాను మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 27వరకూ దీపమ్ గడువు ప్రకటించింది. అయితే రెండు కేటగిరీలలో మర్చంట్ బ్యాంకర్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్లస్ విభాగంకింద రూ. 2,500 కోట్లు లేదా అంతకుమించిన పరిమాణంగల లావాదేవీల నిర్వహణ ఉంటుంది. ఏ కేటగిరీలో రూ. 2,500 కోట్ల విలువలోపు వాటాల విక్రయంలో ప్రభుత్వానికి మద్దతివ్వవలసి ఉంటుందని దీపమ్ తెలియజేసింది. ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ప్రభుత్వ రంగ సంస్థలలో వాటా విక్రయ వ్యవహారాలను పర్యవేక్షించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను పలు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమలు చేయవలసి ఉంది. ఇందుకు ప్రభుత్వం 2026 ఆగస్ట్ 1వరకూ గడువునిచ్చింది. తద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడంతోపాటు.. పబ్లిక్ వాటా పెంచవలసి ఉంది. ఐదు బ్యాంకులు ప్రధానంగా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 98.3 శాతంకాగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 96.4 శాతం, యుకో బ్యాంక్‌లో 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.1 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.5 శాతం చొప్పున వాటా కలిగి ఉంది. ఇదే విధంగా ఐఆర్ఎఫ్సీలో 86.36 శాతం, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 82.4 శాతం చొప్పున ప్రభుత్వానికి వాటా ఉంది. వెరసి ఈ సంస్థలలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. -
జీవిత బీమా ఐపీవోపై కన్ను
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సీఆర్ఏఎంసీలోనూ...మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(సీఆర్ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది. నిధుల సమీకరణబాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది. -
జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం.. అమ్మకానికి అమెజాన్ షేర్లు!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న 12 నెలల కాలంలో ఏకంగా 50 మిలియన్ల అమెజాన్. కామ్ షేర్లను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఆయన ప్రథమ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణుల అంచనా. మహమ్మారి ప్రారంభంతో అమెజాన్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఆ సంస్థ షేర్లు సైతం భారీగా లాభపడ్డాయి. దీంతో దాదాపు 8 శాతం లాభపడి షేర్ ధర 172 డాలర్లకి చేరింది. ఈ క్రమంలో జెఫ్‌బెజోస్ అమెజాన్ షేర్లు అమ్మాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బెజోస్ నిర్ణయం అనంతరం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద శుక్రవారం 12.1 బిలియన్ డాలర్లు లాభపడింది. బిలియనీర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ అధిగమించాలంటే బెజోస్‌కు 8.1 బిలియన్ డాలర్లకు కావాల్సి ఉంది. కాగా, బెజోస్ 2021 నుండి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతూ వస్తున్నారు. కానీ అదెప్పుడ సాధ్యపడలేదు. -
ఏం జరుగుతోంది? ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాని కొనుగోలు చేసిన వాల్‌మార్ట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న టైగర్ గ్లోబల్ వాటాల్ని వాల్‌మార్ట్ 1.4 బిలియన్ డాలర్ల (రూ.11.5 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోళ్లను వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తాజా నిర్ణయంతో 2021లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్,యూఎస్ రిటైలర్ వాల్‌మార్ట్, ఇతర పెట్టుబడిదారులకు తన వాటాలను విక్రయించిన తర్వాత ఈ-కామర్స్ సంస్థ విలువ దాదాపు 38 బిలియన్ల నుండి 35 బిలియన్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు యాక్సెల్, టైగర్ గ్లోబల్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్ధికంగా మద్దతిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లోని తమ వాటాల్ని వాల్‌మార్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో ఎకనామిక్స్ టైమ్స్ (ఈటీ) రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది.ఈటీ నివేదిక ప్రకారం టైగర్ గ్లోబల్ కంపెనీలో దాదాపు 4% (1.4 బిలియన్ డాలర్ల )వాటాను కలిగి ఉంది. 2018లో 16 బిలియన్ డాలర్లు వెచ్చించి వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్ యూ దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రమోటర్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు . తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నాయి. -
మరోసారి భారీ సేల్: మునుగుతున్న టెస్లా, ట్విటర్ కోసమే? ఇన్వెస్టర్లు గగ్గోలు
న్యూఢిల్లీ: ట్విటర్ డీల్ తరువాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్లాలో వరుసగా బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించడం కలకలం రేపుతోంది. ఇటీవలే ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్ హోదాను కోల్పోయిన మస్క్ మరోసారి 3.5 బిలియన్ల డాలర్ల విలువైన 22 మిలియన్ల టెస్లా షేర్లను విక్రయించారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం డిసెంబర్ 12-15 నుండి మూడు రోజుల మధ్య స్టాక్లను అమ్మేశారు. అయితే ఈ విక్రయానికి గల కారణాలను మస్క్ వెల్లడించలేదు. నవంబర్ 2021 నుండి, మస్క్ సుమారు 40 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీంతో టెస్లాలో ఏడాది క్రితం 17 శాతంగా ఉన్న మస్క్ వాటా ఇపుడు 13.4 శాతానికి చేరింది. ఖర్చులను తగ్గించుకునే పనిలో వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్, ట్విటర్ ఆఫీసుల్లో చాలావరకు అద్దె చెల్లిపులను కూడా నిలిపి వేసిందట. అటు 44 బిలియన్ డాలర్లకుఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత నుంచి ప్రకటనదారులు ఒక్కొక్కరూ వైదొలగు తున్నారు. నవంబర్‌లో అంతకుముందు సంవత్సరం కంటే 85 శాతం పడిపోయాయని తెలుస్తోంది. ట్విటర్ ఆదాయంలో 89 శాతం ప్రకటనలదే. దీంతో మస్క్ సకక్షోభంలో పడిపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కొనుగోలులో భాగంగా ట్విటర్ సంవత్సరానికి సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అప్పిచ్చిన బ్యాంకులు ఈ త్రైమాసికంలో నష్టాల బుకింగ్‌కు సిద్ధమవుతున్నాయి. మస్క్ నవంబర్‌లో 3.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, అంతకుముందు ఏప్రిల్‌లో 8.4బిలియన్ డాలర్లు, ఆగస్టులో 6.9 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించారు. మరోవైపు ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా షేర్లు 28 శాతం పతనాన్ని నమోదు చేశాయి. తాజాగా రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో టెస్లా కంటే ట్విటర్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారంటూ టెస్లా పెట్టుబడిదారులు మస్క్పైమండిపడుతున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐఆర్సీటీసీలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: రైల్వే రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీలో ప్రభుత్వం 5 శాతంవరకూ వాటాను విక్రయించనుంది. ఇందుకు షేరుకి రూ. 680 ఫ్లోర్ ధరను ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇన్వెస్టర్ల నుంచి అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను సైతం ఆఫర్ చేయనుంది. వెరసి 4 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు సమకూరే వీలుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 735తో పోలిస్తే ఇది 7.5 శాతం డిస్కౌంట్. నేడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం రిటైలర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి రానుంది. వాటా విక్రయ నిధులు ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్‌కింద జమకానున్నాయి. -
నైకాలో నాలుగు సంస్థల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: లాకిన్ వ్యవధి ముగిసిన నేపథ్యంలో బ్యూటీ ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్‌లో ఇన్వెస్ట్ చేసిన నాలుగు సంస్థలు ఓపెన్ మార్కెట్లో షేర్లను విక్రయించాయి. తద్వారా రూ. 693 కోట్లు సమీకరించాయి. లైట్‌హౌస్ ఇండియా ఫండ్ త్రీ, మాలా గోపాల్ గావ్కర్, నరోత్తమ్ షఖ్సారియా 2.84 కోట్ల షేర్లను రూ. 491.35 కోట్లకు విక్రయించారు. షేరు ఒక్కింటికి రూ. 171.75–173.70 రేటు చొప్పున విక్రయించగా సెగంటీ ఇండియా మారిషస్, నార్జెస్ బ్యాంక్, అబర్డీన్ స్టాండర్డ్ సంస్థలు కొనుగోలు చేశాయి. అటు టీపీజీ గ్రోత్ 4 ఎస్ఎఫ్ రెండు విడతల్లో రూ. 202 కోట్లకు మొత్తం 1.08 కోట్ల షేర్లను విక్రయించింది. షేరు ఒక్కింటికి రూ. 186.4 రేటుతో అమ్మగా సొసైటీ జనరల్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా (సింగపూర్) కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ షేరు 10 శాతం పెరిగి రూ. 208 వద్ద ముగిసింది. -
డబ్బు లేదు, టెస్లా షేర్లను మళ్లీ అమ్మేసిన ఎలాన్ మస్క్!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆస్తులు మంచులా కరిగిపోతున్నాయి. ఇప్పటికే మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌పై న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈ జులై నెలలో బిలియన్ డాలర్ల ఖరీదైన షేర్లను అమ్మారు. తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ తన షేర్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. 44 బిలియన్ల డాలర్ల డీల్ అంశంలో ట్విట్టర్‌తో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో టెస్లా స్టాక్స్ అమ్మడం చాలా ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. మున్ముందు టెస్లా షేర్లను అమ్మే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. @elonmusk are you done selling? — Sawyer Merritt 📈🚀 (@SawyerMerritt) August 10, 2022 ఈ ఏడాది ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు మొత్తం 7.9 మిలియన్ షేర్లను అమ్మేసినట్లు సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ వెబ్సైట్లో పేర్కొంది. కాగా, ఈ జులై నెలలో మస్క్ 8.5 బిలియన్ డాలర్ల ఖరీదైన షేర్లను అమ్మేశారు. తాజాగా 6.7 బిలియన్ డాలర్ల టెస్లా షేర్లను సేల్ చేయడం సంచలనంగా మారింది. Yes. In the (hopefully unlikely) event that Twitter forces this deal to close *and* some equity partners don’t come through, it is important to avoid an emergency sale of Tesla stock. — Elon Musk (@elonmusk) August 10, 2022 చదవండి👉 Elon Musk:'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'! -
హింద్ జింక్‌కు సర్కారు గుడ్‌బై
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. హింద్ జింక్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 38,000 కోట్లు సమకూరే అవకాశముంది. బుధవారం సమావేశమైన సీసీఈఏ ఇందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపు లభించనున్నట్లు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లలో వాటాల వ్యూహాత్మక విక్రయం ద్వారా ఈ ఏడాది రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. రూ. 305 ధరలో..: బుధవారం ట్రేడింగ్‌లో హింద్ జింక్ షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 305 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 317ను అధిగమించింది. ప్రభుత్వం 29.5 శాతం వాటాకు సమానమైన దాదాపు 125 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ. 38,000 కోట్లు లభించే వీలుంది. కాగా.. 2002 వరకూ హింద్ జింక్ ప్రభుత్వ రంగ సంస్థగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 26 శాతం వాటాను స్టెరిలైట్ అపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించింది.డీల్ విలువ రూ. 445 కోట్లుకాగా.. తద్వారా వేదాంతా గ్రూప్ యాజమాన్య నియంత్రణను చేపట్టింది. తదుపరి వేదాంతా గ్రూప్ ఓపెన్ మార్కెట్ ద్వారా 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2003 నవంబర్‌లో ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఫలితంగా హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి ఎగసింది. కాగా.. హెచ్‌జెడ్‌ఎల్‌లో అదనంగా 5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఇటీవలే వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ పేర్కొనడం గమనార్హం! -
ఓఎన్జీసీ ఓఎఫ్ఎస్కి భారీ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 1.5 శాతం వాటాల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. వారికి 8.49 కోట్ల షేర్లను కేటాయించగా 3.57 రెట్లు అధికంగా 30.35 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి ప్రతిపాదించిన రూ. 159 రేటు ప్రకారం వీటి విలువ రూ. 4,854 కోట్లుగా ఉంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఓఎఫ్ఎస్ కింద ఓఎన్జీసీలో 1.5 శాతం వాటాల (9.43 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా కేంద్రం సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 94.35 లక్షల షేర్లను కేటాయించారు. ఈ విభాగం ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభమవుతుంది. ఆఫర్ ఫర్ సేల్కు నాన్–రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. షేరు 5 శాతం డౌన్.. ఓఎఫ్ఎస్ కోసం షేరు ధరను మంగళవారం నాటి ముగింపు రేటు రూ. 171.05తో పోలిస్తే 7 శాతం డిస్కౌంటుతో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం బీఎస్ఈలో ఓఎన్జీసీ షేరు 5 శాతం క్షీణించి రూ. 162.25 వద్ద ముగిసింది. ఫలితంగా రూ. 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. -
ఓఎన్జీసీ ఫర్ సేల్.. వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్ఎస్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్ఈలో స్టాక్ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఓఎన్జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్ఎస్ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది. -
చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..!
Elon Musk Sell Tesla Shares: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెప్పినట్లే చేశాడు..అన్నట్లుగానే టెస్లా 10 శాతం షేర్లను పూర్తిగా అమ్మేశాడు.ఈ ఏడాది నవంబర్ ప్రారంభం నుంచి టెస్లాకు చెందిన 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. మస్క్ తన షేర్ల అమ్మకాలను దాదాపు పూర్తి చేసినట్లు బుధవారం చెప్పాడు. నియమాల ప్రకారమే..! టెస్లాకు చెందిన పదిశాతం షేర్లను పూర్తిగా అమ్మేసినట్లు మంగళవారం అమెరికాకు చెందిన వెబ్సైట్ బాబిలోన్ బీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నాడు. షేర్ల అమ్మకాలకు సంబంధించిన నియమాల మేరకు షేర్లను విక్రయించనట్లు తెలిపాడు. కారణం అదే..! ఇటీవల వాషింగ్టన్లో డెమోక్రాట్లు బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం.. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు. దీంతో పన్నుల భారం తగ్గించుకునేందుకే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. 10 శాతం టెస్లా షేర్లను అమ్మకాలతో స్పేస్ఎక్స్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఎలన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. టెస్లా షేర్ల అమ్మకాలపై విచారణ..! టెస్లా షేర్ అమ్మకాల విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్, టెస్లా, ఎలన్ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశాడు. ఈ దావా అమెరికాలోని డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వ్యాజ్యం దాఖలు చేశారు. స్టాక్ విక్రయాలపై ఎలన్ వేసిన ట్విట్స్పై సమీక్ష జరపాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. చదవండి: ‘ఎలన్‌మస్క్, టెస్లాపై విచారణ చేయాల్సిందే..!’ -
త్వరలో టాటాల చేతికి ఎయిరిండియా
Rajiv Bansal About Air India Disinvestment: ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను డిసెంబర్‌కల్లా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు. నష్టాలతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన కంపెనీ ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను త్వరితగతిన పూర్తి చేసే సన్నాహాల్లో ప్రభుత్వమున్నట్లు తెలియజేశారు. ఎయిరిండియా కొనుగోలు రేసులో టాటా గ్రూప్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం గత నెల 25న ఎయిరిండియా విక్రయానికి టాటా సన్స్‌తో రూ. 18,000 కోట్ల విలువైన వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా టాటా గ్రూప్ రూ. 2,700 కోట్లు నగదు రూపేణా చెల్లించడంతోపాటు.. మరో రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. అంతేకాకుండా ఎయిరిండియాతోపాటు చౌక ధరల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను, ఏఐఎస్ఏటీఎస్లో ఎయిరిండియాకుగల 50 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనుంది. కంపెనీ నెలకు రూ. 600 కోట్లకుపైగా నష్టాలు నమోదు చేస్తోంది. -
హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి లైన్‌క్లియర్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్‌క్లియర్ అయ్యింది. ఇందుకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. పేర్లు వ్యాఖ్యానించడానికి నిరాకరణ ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయంపై దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని కూడా అత్యున్నత స్థాయి ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వాటాలు ఇలా... హిందుస్తాన్ జింగ్‌లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అతల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) కేంద్రం విక్రయించింది. 2002 ఏప్రిల్ 10న ఎస్‌ఓవీఎల్ ఓపెన్ మార్కెట్లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్ అగ్రిమెంట్ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వద్ద హిందుస్తాన్ జింక్‌లో 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గురువారం ట్రేడింగ్ ముగిసే నాటికి ఎస్‌ఓవీఎల్ వాటా 64.92 శాతం కాకుండా, డీఐఐ, ఎఫ్ఐఐ, రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద వరుసగా 32.32 శాతం, 0.83 శాతం, 1.93 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో షేర్ ధర క్రితంలో పోల్చితే 2.92 శాతం (రూ.9.70) తగ్గి రూ.322.95 వద్ద ముగిసింది. -
వైజాగ్ స్టీల్ విక్రయానికి సలహా సంస్థల క్యూ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్ చేసినట్లు దీపమ్ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్ అండ్ యంగ్‌సహా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ చేరినట్లు వెబ్సైట్లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్ బిడ్స్‌ను ఆహా్వనించింది. ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్ ఒకే అడ్వయిజర్ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్ అండ్ మహాజన్, ఎకనమిక్ లాస్ ప్రాక్టీస్, జే సాగర్ అసోసియేట్స్, కొచ్చర్ అండ్ కంపెనీ, లింక్ లీగల్ ఉన్నాయి. జనవరిలోనే.. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. -
త్వరలోనే రిలయన్స్ భారీ డీల్..!
ముంబై: విదేశీ చమురు దిగ్గజం సౌదీ అరామ్ కోతో, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటాను దక్కించుకునే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ చమురు- కెమికల్స్ వ్యాపారంలో సుమారు 20 శాతం వాటాల అమ్మకంకోసం గతంలోనే సౌదీ అరామ్కోతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ కుదుర్చుకునే బాటలో సాగింది. ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ వాటాను కొనుగోలు చేసే విషయంలో ఇరు కంపెనీల మధ్య అదనపు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. రిలయన్స్, ఆరామ్కో కంపెనీల మధ్య డీల్ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చునని తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే రిలయన్స్ కంపెనీ షేర్లను ఆరామ్కో కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం గురించి వార్తలు రావడంలో రిలయన్స్ కంపెనీ షేర్లు ఏకంగా 2.6 శాతం మేర లాభాలను గడించాయి. ఈ డీల్ ప్రకారం ఏడ్‌నాక్, రిలయన్స్ సంయుక్తంగా క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ని ఉత్పత్తి చేయనున్నాయి. దీనికి సంబంధించి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఓసి) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిలయన్స్ 44 వార్షిక సమావేశంలో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సౌదీ కంపెనీ ఆరామ్కోతో భాగస్వామ్యాన్ని వెల్లడించారు. రిలయన్స్ అంతర్జాతీయీకరణకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్‌ను రిలయన్స్ వార్షిక సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్‌గా చేర్చుకున్న విషయం తెలిసిందే. -
రెన్యూ పవర్ చేతికి ఎల్అండ్టీ హైడ్రో ప్రాజెక్టు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) తమ అనుబంధ సంస్థకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంటులో 100 శాతం వాటాలను రెన్యూ పవర్ సర్వీసెస్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 985 కోట్లు. ఇతర వ్యాపారాల నుంచి తప్పుకుని ప్రధాన వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టాలనే ప్రణాళికకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ డీకే సెన్ వెల్లడించారు. ఎల్అండ్టీ ఉత్తరాంచల్ హైడ్రోపవర్ (ఎల్‌టీయూహెచ్‌పీఎల్)కి చెందిన ఈ ప్రాజెక్టు విక్రయ డీల్ సెప్టెంబర్ 30లోగా పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టును కొనుగోలు చేయడం వల్ల తమకు అదనపు ప్రయోజనాలు లభించగలవని, రిస్కు స్థాయి కూడా తక్కువగా ఉండగలదని రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రో ప్రాజెక్టులన కొనుగోలుపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. -
ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్‌సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్‌గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. -
అమెజాన్ ఏమాత్రం సహాయం చేయలేదు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో వాటాల విక్రయ వివాదానికి సంబంధించి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా వాటాదారైన అమెజాన్‌పై ఫ్యూచర్ మరిన్ని ఆరోపణలు గుప్పించింది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ అమలైన సమయంలో తాము తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ .. అమెజాన్ పైపై మాటలు చెప్పడం తప్ప ఏమాత్రం సహాయం అందించలేదని ఆరోపించింది. మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో అమెజాన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసమైనదిగా లేదని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లు.. డిసెంబర్ 31న ఈ మేరకు అమెజాన్‌కు లేఖ రాశారు. వాటాల విక్రయం కోసం రిలయన్స్‌తో తాము చర్చలు జరుపుతున్నామని తెలిసినప్పటికీ అమెజాన్ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తీసుకురాకుండా.. ఆ తర్వాత మోకాలడ్డే ప్రయత్నం చేయడం సరికాదని ఫ్యూచర్ గ్రూప్ ఆక్షేపించింది. తోసిపుచ్చిన అమెజాన్: మరోవైపు, ఫ్యూచర్ ఆరోపణలను అమెజాన్ తోసిపుచ్చింది. ఫ్యూచర్ రిటైల్‌కు తాము సహాయం చేసేందుకు ప్రయత్నించలేదన్న ఆరోపణలు సరికాదని వ్యాఖ్యానించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఎఫ్‌సీపీఎల్‌కు లిస్టెడ్ సంస్థ ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్ఆర్ఎల్) వాటాలు ఉన్నాయి. గతేడాది ఎఫ్‌సీపీఎల్‌లో వాటాలు కొనుగోలు చేయడం వల్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు దఖలు పడ్డాయి. -
పీఎస్‌యూ వాటాల విక్రయంలో ముందుకే
న్యూఢిల్లీ, కోల్‌కతా: కేబినెట్ ఆమోదించిన ప్రభుత్వరంగ సంస్థల్లో (సెంట్రల్ పీఎస్‌యూ) వాటాల విక్రయాన్ని మరింత ముందుకు తీసుకెళతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వర్ధమాన దేశాల్లో భారత్‌కే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌డీఐ) అధికంగా ఉందని గుర్తు చేస్తూ.. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, సంస్కరణలు చేపట్టగల సామర్థ్యాలు, స్థిరమైన ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అంశాలుగా పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలోనూ పెద్ద కంపెనీల్లో కొన్నింటిలో వాటాలను విక్రయించాలన్నది మా ప్రయత్నం. ఆసక్తి వ్యక్తీకరణలు అందాయి. తదుపరి దశ ఆరంభమవుతోంది. కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసిన ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి వాటాల విక్రయాలను దీపమ్ ( పెట్టుబడుల ఉపసంహరణ విభాగం) మరింత చురుగ్గా నిర్వహించగలదని భావిస్తున్నాము’’ అని మంత్రి చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్‌కామర్స్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం రూపంలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటి వరకు సమకూరింది కేవలం రూ.11,006 కోట్లే కావడం గమనార్హం. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ సహా 25 ప్రభుత్వరంగ సంస్థల్లో పాక్షికంగా, పూర్తిగా వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం కూడా తెలియజేసింది. ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయి. పలు సావరీన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌కు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల అవి మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రగతిశీల సంస్కరణల వైపు ప్రభుత్వం చూస్తోంది. బలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదు. స్పష్టమైన పెట్టుబడుల ఉపసంహరణ అంజెండాను ప్రకటించాము’’ అని మంత్రి వివరించారు. ఏ చర్య తీసుకున్నా సరిపోదు ఆర్థిక రంగ పురోగతికి మద్దతుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్య అయినా సరిపోదన్నారు. కాకపోతే ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. -
సోమవారం నుంచీ క్యామ్స్ పబ్లిక్ ఇష్యూ
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈకి భారీ వాటా ఉన్న కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్- క్యామ్స్(CAMS) పబ్లిక్ ఇష్యూని చేపడుతోంది. సోమవారం (ఈ నెల 21న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. బుధవారం(23న) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా క్యామ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 667 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 1230 ధరలో 35 సంస్థలకు షేర్లను విక్రయించింది. క్యామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, అబుదభీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు 13 దేశీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం క్యామ్స్‌లోల మొత్తం 37.48 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి ఎన్ఎస్ఈ వైదొలగనుంది. క్యామ్స్‌లో ప్రధాన ప్రమోటర్ కంపెనీ గ్రేట్ టెరైన్‌కు 43.53 శాతం వాటా ఉంది. ఐపీవో తదుపరి ఈ వాటా 30.98 శాతానికి పరిమితంకానుంది. పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌కు చెందిన కంపెనీ ఇది. ఇతర వివరాలు.. 1988లో ఏర్పాటైన క్యామ్స్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)కి 37.48 శాతం వాటా ఉంది. ప్రధాన ప్రమోటర్ గ్రేట్ టెరైన్ 43.53 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. దేశీ ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల సగటు రీత్యా చూస్తే క్యామ్స్ 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 జులైకల్లా దేశంలోని అతిపెద్ద 15 ఫండ్ హౌస్‌లలో 9 సంస్థలను క్లయింట్లుగా కలిగి ఉంది. టాప్-5 ఎంఎఫ్‌లలో నాలుగింటికి సేవలందిస్తోంది. -
ఎల్ఐసీలో వాటా విక్రయం 25%
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోందన్న వార్తలు రాగానే భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ అనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే అందరి అంచనాలను మించిన ఐపీఓ ఇదే కానున్నదని సమాచారం. ఐపీఓ ద్వారా 10% వాటాను కేంద్రం విక్రయించగలదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఐపీఓ ద్వారా 25% వాటా విక్రయించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకేసారి 25 శాతాన్ని విక్రయిస్తారా, లేక 2–3 దఫాలుగా విక్రయిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. అయితే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి షేర్ ధరలో డిస్కౌంట్‌ను ఇవ్వాలని, బోనస్ షేర్లను కూడా జారీ చేయాలని ఒక ముసాయిదా కేబినెట్ నోట్ సిఫార్సు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల విభాగం ఇటీవలే ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను రూపొందించింది. ఎల్ఐసీలో ప్రభుత్వానికున్న 100% వాటాను 75%కి తగ్గించుకోవాలని, 25 శాతాన్ని దశలవారీగా విక్రయించాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. కరోనా కల్లోలంతో ప్రభుత్వానికి రాబడి తగ్గింది. బడ్జెట్ లోటు మరింతగా పెరిగింది. ఈ సమస్యను ఎల్ఐసీ ఐపీఓతో అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముసాయిదా కేబినెట్ నోట్లో ఏముందంటే... ► ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను ఆర్థిక శాఖ ఆధ్వర్వంలోని ఆర్థిక సేవల విభాగం రూపొందించింది. సంబంధిత కేంద్ర మంత్రులు, సెబీ, నీతి ఆయోగ్, ఐఆర్డీఏఐ పరిశీలన నిమిత్తం ఈ ముసాయిదాను తయారు చేసింది దీని ప్రకారం... ► ఎల్ఐసీలో ప్రభుత్వానికున్న వంద శాతం వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలనుకుంటున్న 25 శాతం వాటాను ఒకేసారి గానీ, దశలవారీ గానీ విక్రయించాలి. ► ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించిన ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులకు 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇవ్వాలి. ► ఎల్ఐసీ లిస్టయిన తొలి రోజుల్లోనే బోనస్ షేర్లను జారీ చేయాలి. ► దీనికి సంబంధించి 1956 నాటి ఎల్ఐసీ చట్టంలో మొత్తం ఆరు సవరణలను చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదిస్తే రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎల్ఐసీ చట్ట సవరణల బిల్లును కేంద్ర ం తెచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్నందున దీన్ని ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదం పొందాలనేది సర్కారు ప్రణాళిక. 10 శాతం డిస్కౌంట్!! ఎల్ఐసీ ఐపీఓలో 10 శాతం వాటానే విక్రయించి, ఆ తర్వాత ఒకటి లేదా రెండు దఫాల్లో మిగిలిన 15 శాతం మేర వాటాను విక్రయించే అవకాశాలే అధికంగా ఉన్నాయని నిపుణులంటున్నారు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత కనీస ప్రజా వాటాను మూడేళ్లలో 25 శాతం మేర తగ్గించుకోవాలన్న సెబీ నిర్ణయమే దీనికి ఆధారమని వారంటున్నారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇష్యూ ధరలో 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా ఈ డిస్కౌంట్ లభించవచ్చు. బోనస్ షేర్ల బొనంజా...! ఎల్ఐసీ చెల్లించిన మూలధనం రూ.100 కోట్లు. ఇంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న మూలధనం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే బోనస్ షేర్లు జారీ చేయడం ద్వారా కంపెనీ రిజర్వ్‌లను పాక్షికంగానైనా మూలధనంగా మార్చుకునే వీలు కలుగుతుందని, ఆ విధంగా చెల్లించిన మూలధనం పునర్వ్యస్థీకరించుకునే వీలు కలుగుతుందని ప్రభుత్వ ఆలోచన. బోనస్ షేర్లను జారీ చేయడం వల్ల రిజర్వ్(మిగులు నిధుల)ను మూలధనంగా మార్చుకునే వెసులుబాటుతో పాటు, రిటైల్ ఇన్వెస్టర్లను ఇట్టే ఆకర్షించవచ్చు కూడా ! ఐపీఓ సైజు ఎంత? ఎల్ఐసీ సంస్థ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల రేంజ్లో ఉండొచ్చని ఒక అంచనా. 10% వాటా విక్రయం ప్రకారం.. ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చనేది గత అంచనా. తాజా వార్తల ప్రకారం ఇష్యూ సైజు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
ఎస్బీఐ లాభాల ఖాతా
న్యూఢిల్లీ: ఎస్బీఐ లాభం జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బ్యాంకు 2.1 శాతం వాటాను జూన్ క్వార్టర్లో విక్రయించడం ద్వారా రూ.1,540 కోట్లను సమకూర్చుకుంది. దీంతో బ్యాంకు స్టాండలోన్ లాభం రూ.4,189 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,312 కోట్లుగా ఉంది. వాటాల విక్రయం అనంతరం ఎస్బీఐ లైఫ్‌లో ఎస్బీఐ వాటా 55.60 శాతానికి తగ్గింది. ఇక బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.70,653 కోట్ల నుంచి రూ.74,458 కోట్లకు వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 36 శాతం పెరిగి రూ.18,061 కోట్లుగా ఉంటే, వడ్డీ ఆదాయం సైతం రూ.62,638 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.66,500 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.24 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గిపోయింది. తగ్గిన మొండిబకాయిలు.. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) గతేడాది ఇదే త్రైమాసికంలో 7.53 శాతంగా ఉంటే, తాజాగా 5.44 శాతానికి క్షీణించాయి. అదే విధంగా నికర ఎన్పీఏలు కూడా 3.07 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమయ్యాయి. ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు కూడా రూ.9,420 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఎన్పీఏలకు బ్యాంకు రూ.11,648 కోట్లను పక్కన పెట్టడం గమనార్హం. ముఖ్యంగా కరోనా కారణంగా ఎగవేతలను దృష్టిలో ఉంచుకుని రూ.1,836 కోట్లను కేటాయించింది. ప్రొవిజన్ కవరేజీ రేషియో 86.32 శాతానికి చేరింది. సీఏఆర్ 13.40 శాతానికి పెరిగింది. సబ్సిడరీలతో కలసి చూస్తే.. కన్సాలిడేటెడ్‌గా ఎస్బీఐ నికర లాభం 62 శాతం దూసుకుపోయింది. రూ.4,776 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.2,950 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.83,274 కోట్ల నుంచి రూ.87,984 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో రుణ వృద్ధి 6.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా రిటైల్ విభాగంలో (వ్యక్తిగత రుణాలు) 12.85 శాతం, విదేశీ బ్రాంచ్‌ల ద్వారా 11 శాతం మేర అధిక రుణాలు పంపిణీ చేసింది. నిధుల సమస్య లేదు.. మూలధన నిధుల పరంగా అదనపు మద్దతు సాయం, క్షీణిస్తున్న నగదు ప్రవాహాల రూపంలో తమకు సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. -
మెగా డీల్ : ఆర్ఐఎల్, ఆరాంకో చర్చలు ముమ్మరం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ తన చమురు, రసాయనాల విభాగంలో మైనారిటీ వాటా విక్రయానికి సంబంధించి సౌదీ అరాంకోతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందంపై ఆరాంకో అధికారులు, బ్యాంకర్లు ఈ నెలలో ముంబైలోని రిలయన్స్ కార్యాలయాలకు చేరుకుని విలువ మదింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని సమాచారం. ఈ భారీ ఒప్పందంపై తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీలు సంసిద్ధమయ్యాయి. సెప్టెంబర్ మాసాంతంలో జరిగే వార్షిక వాటాదారుల సమావేశం లోగా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆర్ఐఎల్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు. చదవండి : భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ గత ఏడాది ఆగస్ట్‌లో తన ఆయిల్, పెట్రోకెమికల్స్ డివిజన్ విలువ 7500 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. ఆ ప్రకారం 20 శాతం వాటా 1500 కోట్ల డాలర్లు పలకనుంది. ఈ విలువ ప్రామాణికంగా విక్రయ ప్రక్రియ పూర్తయితే ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా కొనుగోలు అనంతరం ఇదే భారీ అతిపెద్ద లావాదేవీగా నమోదవనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రిలయన్స్ ఆయిల్, పెట్రోకెమికల్ డివిజన్లో 20 శాతం వాటా విక్రయానికి ఆర్ఐఎల్, సౌదీ ఆరాంకో అంగీకరించాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!
ముంబై: ఎయిరిండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం.... ఎయిరిండియా, బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ కంపెనీల వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక వివరాలను సిద్ధం చేస్తున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదనపు వివరాలను అడుగుతున్నాయని వివరించారు. మరోవైపు భారత్ బాండ్ ఈటీఎఫ్ స్వల్ప నష్టంతో ఎన్ఎస్ఈలో లిస్టయింది. సగం కూడా సాకారం కాని లక్ష్యం..... ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ దీంట్లో సగం కూడా సమీకరించలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.12,359 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరోవైపు ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలను మించింది. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికి, ఇప్పటికే ద్రవ్యలోటు 115%కి ఎగబాకింది. బీపీసీఎల్ వాటా రూ.60,000 కోట్లు. బీపీసీఎల్(భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు లభించనున్నాయి. ఇక కంటైనర్ కార్పొ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.13,000 కోట్లు లభించే అవకాశాలున్నాయి. -
మాల్యా కేసు: రూ 1008 కోట్లు రికవరీ
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్ల రుణ ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కంపెనీ యూబీఎల్ నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం రూ 1008 కోట్లు రాబట్టగలిగింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్ షేర్ల విక్రయంతో ఈ మొత్తాన్ని రికవరీ అధికారి వసూలు చేశారు. యస్ బ్యాంక్ వద్ద యూబీ షేర్లు పెద్దమొత్తంలో తనఖా కింద ఉన్నాయని విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి చెల్లించిందని, రుణ మొత్తంలో కొద్ది భాగమే పెండింగ్‌లో ఉందని తదుపరి దర్యాప్తులో ఈడీ తేల్చింది. దీంతో యస్ బ్యాంక్ వద్ద కుదువ పెట్టిన షేర్లపై బ్యాంకుకు నియంత్రణ ఉండే అవకాశం పెద్దగా ఉండబోదని దర్యాప్తు ఏజెన్సీ భావించి ఆ దిశగా పావులు కదిపింది. వీటి స్వాధీనం కోసం ఈడీ దరఖాస్తు మేరకు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్ఏ కోర్టు ప్రకటించింది. ఈడీ వినతితో తనఖాతో కూడిన, తనఖా లేని 74,04,932 యూబీఎల్ షేర్లను కోర్టు అటాచ్ చేసింది. అయితే ఈ షేర్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి తనఖాగా యస్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. పీఎంఎల్ఏ కోర్టు నిర్ణయం మేరకు యూబీఎల్ షేర్లను డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన రికవరీ అధికారికి బదలాయించాలని యస్ బ్యాంక్‌కు గత ఏడాది జులై 9న నోటీసులు జారీ అయ్యాయి. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ యస్ బ్యాంక్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా వాదప్రతివాదనలు పూర్తయిన మీదట యూబీఎల్ షేర్లను రికవరీ అధికారికి మూడు వారాల్లోగా బదలాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న యస్ బ్యాంక్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్ధానం నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో రికవరీ అధికారి బుధవారం షేర్లను విక్రయించడంతో రూ 1008 కోట్లు రికవరీ అయ్యాయి. -
ఆర్ఈసీలో వాటా విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకా రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు మొత్తం 52.63% వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, ఈటీఎఫ్ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్ఈసీలో కేంద్రం హోల్డింగ్ 52.63 శాతానికి తగ్గింది. మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ అగ్రి–ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు. -
నాలుగు డిఫెన్స్ కంపెనీల్లో వాటా విక్రయం
► ఐపీవో ద్వారా 25 శాతం వాటా ఉపసంహరణ ► రిజిస్ట్రార్ల కోసం బిడ్లు ఆహ్వానం; గడువు తేదీ 18 న్యూఢిల్లీ: రక్షణ రంగానికి చెందిన నాలుగు కంపెనీల్లో 25 శాతం వరకు వాటాలను ఐపీవో ద్వారా ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఉన్నాయి. వీటిలో 25 శాతం వరకు వాటాల ఉపసంహరణకు సంబంధించి రిజిస్ట్రార్లను ఆహ్వానిస్తూ పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీలోపు బిడ్లు సమర్పించాలని కోరింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారాలను ఈ విభాగం చూస్తుంటుంది. ఈ నాలుగు కంపెనీల్లో వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అనుమతించింది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ విభాగం మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల కోసం బిడ్లు కూడా పిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,000 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకుంది. ఇందులో రూ.46,500 కోట్లను మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, రూ.15,000 కోట్లు వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా, రూ.11,000 కోట్లు బీమా కంపెనీల లిస్టింగ్ ద్వారా సమీకరించనుంది. ఇప్పటికే పలు కంపెనీల్లో వాటాల విక్రయంతో రూ.8,000 కోట్ల సమీకరణ పూర్తయింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మినీరత్న ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీడీఎల్ హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తోంది. గైడెడ్ క్షిపణులు, వాటి అనుబంధ రక్షణ పరికరాల తయారీలో ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి అధీకృత మూలధనం రూ.125 కోట్లు. 2015–16లో రూ.563 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ నికర విలువ రూ.1,652 కోట్లు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ... నేవీ, కోస్ట్‌గార్డ్‌లకు యుద్ధనౌకలు, సహాయక నౌకలను తయారు చేస్తోంది. అధీకృత మూలధనం రూ.125 కోట్లు. 2015–16లో లాభం 160 కోట్లు. నికర విలువ 1,064 కోట్లు. మజగాన్ డాక్ (ఎండీఎల్) ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మినీరత్న కంపెనీ ఇది. ప్రస్తుతం 3 భారీ యుద్దనౌకలు, ఒక సబ్‌మెరైన్ నిర్మాణ పనులను చూస్తోంది. 2016 మార్చికి అధీకృత మూలధనం రూ.323.72 కోట్లు. పెయిడప్ క్యాపిటల్ రూ.249 కోట్లు. 2015–16లో 637 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నికర విలువ రూ.2,846 కోట్లు. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్న ఈ సంస్థ... మెటల్స్, అలాయ్స్ తయారీలో ఉంది. అధీకృత మూలధనం రూ.200 కోట్లు. 2015–16లో లాభం రూ.118 కోట్లు. నికర విలువ రూ.576 కోట్లు. -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు జీవీకే టాటా
♦ మిగిలిన 10 శాతం వాటాలు కూడా విక్రయం ♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయం; విలువ రూ.1,290 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలిగింది. ఇందులో మిగిలి ఉన్న 10 శాతం వాటాను కెనడాకి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త ప్రేమ్‌వత్స సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు రూ.1,290 కోట్లకు విక్రయించింది. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో వత్స వాటాలు 48 శాతానికి పెరిగాయి. ఇంకా సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కి 26 శాతం, ఎయిర్పోర్ట్ అథారిటీ.. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెరి 13 శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం రుణభారాన్ని తగ్గించుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు విమానాశ్రయం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నామని జీవీకే గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే, విమానాశ్రయాల వ్యాపార విభాగం తమకు కీలకంగానే కొనసాగుతుందని ఆయన తెలియజేవారు. ముంబై విమానాశ్రయంతో పాటు ఇటీవలే బిడ్డింగ్‌లో దక్కించుకున్న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారాయన. ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు. దాదాపు రూ. 22,000 కోట్ల మేరకు పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో జీవీకే గ్రూప్ పలు ఆస్తుల విక్రయానికి ప్రయత్నాలు చేస్తోంది. రద్దీ విమానాశ్రయాల్లో మూడోది బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నిర్మించింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మూడోది. గతేడాది మార్చిలో ఈ ఎయిర్పోర్ట్ విలువ రూ.6,500 కోట్లుగా లెక్కగట్టారు. 10% వాటా, యాజమాన్య నియంత్రణనను తన దగ్గరే అట్టి పెట్టుకుని, రూ.2,202 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33% వాటాను విక్రయించేట్లుగా జీవీకే విక్రయించింది. దీంతో పాటు ఫ్లూగాఫెన్ జ్యూరిక్ ఏజీ నుంచి మరో 5 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రేమ్ వత్స బెంగళూరు విమానాశ్రయంలో తన వాటాలను 38 శాతానికి పెంచుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు మిగిలి ఉన్న 10 శాతం వాటాలను, యాజమాన్య నియంత్రణను కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియాకి విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు జీవీకే జూన్‌లో ప్రకటించింది. -
ఇన్ఫీ వ్యవస్థాపకులు వాటాలను అమ్మేస్తే..పరిస్థితేమిటి?
వేతన ప్యాకేజీ విషయంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో గతకొంతకాలంగా సాగిన అలజడి తెలిసిందే. ఈ అలజడి కొంత సద్దుమణిగింది అనగానే, మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బోర్డు సభ్యులతో పొంతన కుదరని కంపెనీ వ్యవస్థాపకులు, పూర్తిగా ఇన్ఫోసిస్ తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయిస్తున్నారని, వారి 28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను అమ్మేస్తున్నారని వార్తలొచ్చాయి. ప్రస్తుతానికైతే ఆ వార్తలను ఇరువైపుల నుంచి అంటే ఇన్ఫోసిస్ కంపెనీ, వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి తీవ్రంగా ఖండించారు. కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే పరిస్థితేమిటి? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వ్యవస్థాపకులు స్టేక్ ను అమ్మేయబోతున్నారని తెలియగానే కంపెనీ షేర్లు ఢమాల్ మన్నాయి. నిన్న ప్రారంభ ట్రేడింగ్ లో 3.5 శాతం మేర పడిపోయిన షేర్లు, అనంతరం కొంత కోలుకున్నాయి. 1 శాతం నష్టంలో 948.65 వద్ద ముగిశాయి. కంపెనీ పరంగా చూసుకుంటే ఈ రూమర్లు అత్యంత కష్టకాలంలో వచ్చినట్టే తెలిసింది. అసలకే ఐటీ రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఓ వైపు నుంచి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, మరోవైపు నుంచి ఆటోమేషన్ వంటి ప్రభావాలతో ఐటీ రంగ షేర్లు గత కొంత కాలంగా అస్థిరంగా ట్రేడవుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, ఈ కంపెనీ షేరు ధర మరింత పడిపోయేదని అంబిట్ కాపిటల్ అనాలిస్ట్ సాగర్ రస్తోగి చెప్పారు. ఎంతో గౌరవప్రదయమైన వ్యక్తులు, వినమ్రతతో నడుచుకునే ఫౌండర్లు ఈ నిర్ణయం తీసుకుంటే షేర్ హోల్డర్స్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసేదని అనాలిస్టులంటున్నారు. అయితే దీర్ఘకాలంగా కొంత ప్రయోజనం కూడా చేకూరనుందట. గతకొంతకాలంగా కంపెనీ యాజమాన్యానికి, వ్యవస్థాపకులకు మధ్య సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడేదని పలువురంటున్నారు. వ్యవస్థాపకుల నిర్ణయంతో మేనేజ్ మెంట్ ఎక్కువగా కంపెనీపై దృష్టిసారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వ్యవస్థాపకులు వాటాను అమ్మేయనున్నట్టు వచ్చిన వార్తలు తమల్ని తీవ్రంగా బాధించాయని ఇన్ఫోసిస్ తెలిపింది. మరోవైపు నుంచి వ్యవస్థాపకులు షేరును అమ్మాలనుకోవడం మరి అంత చెత్త నిర్ణయమేమి కాదని మరో ప్రముఖ ఇన్వెస్టర్ చెబుతున్నారు. అయితే ఇది దేశీయ రెండో అతిపెద్ద సర్వీసు ప్రొవైడర్ లో కీలకమైన క్షణంగా పరిగణించారు. ఐటీ ఇండస్ట్రి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులతో ఒక్క ఇన్ఫోసిస్ లో మాత్రమే కాక, విప్రో కంపెనీపైనా ఇదే తరహాలో రూమర్లు వచ్చాయి. విప్రోలో అయితే ఏకంగా ప్రమోటర్లు కంపెనీనే అమ్మేయాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలను విప్రో సైతం కొట్టిపారేసింది. -
భారీ క్యూఐపీకి తెరతీసిన ఎస్బీఐ
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీకి క్యూఐపీ లాంచ్ చేసింది. ప్రైవేటు ప్లేస్మెంట్ ద్వారా రూ .287.58 కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు సోమవారం ప్రకటించింది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించే ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రారంభించినట్టు మార్కెట్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థాగత కొనుగోలుదారులకు రూ .1 ముఖ విలువ గల షేర్ల 'క్వాలిఫైడ్ సంస్థాగత ప్లేస్మెంట్' ప్రారంభించినట్టు ఎస్బీఐ చెప్పింది. సెబీ ధరల సూత్రం ఆధారంగా ఈ సమస్యపై ఫ్లోర్ ధర, బ్యాంకు యొక్క ఈక్విటీ వాటాకి 287.58 రూపాయలు ( 5 జూన్, 2017)గా నిర్ణయించింది. . అలాగే ఫ్లోర్ ధరకి 5 శాతానికి తగ్గకుండా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా ద్వారా రూ .11వేల కోట్లు నిధులు సేకరించాలని ఎస్బీఐ యోచిస్తోంది. కాగా గత మార్చి ఎస్బీఐ సెంట్రల్ బోర్డు 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15వేలకోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ని పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ , రైట్స్ ఇష్యూ, అమెరికన్ డిపాజిటరీ రిసీప్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్, ఉద్యోగి స్టాక్ ఆప్షన్స్ ద్వారా బ్యాంకు నిధులను సేకరించటానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలతో ఎస్బీఐ బ్యాంకు స్టాక్ బిఎస్ఇలో 0.02 శాతం నష్టపోయి 287.35 వద్ద ముగిసింది. -
బీఈఎల్ వాటాల విక్రయం ప్రారంభం
⇒ 2.3 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయిన సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ⇒ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయం ⇒ ఫ్లోర్ ధరలో 5 శాతం డిస్కౌంట్ న్యూఢిల్లీ: వైమానిక, రక్షణ రంగ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) వాటా విక్రయానికి బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. బీఈఎల్‌లో 5 శాతం వాటాను (1.11 కోట్ల షేర్లు)ను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ప్రభుత్వం విక్రయిస్తున్నది. ఒక్కో షేర్‌కు కనీస బిడ్డింగ్(ఫ్లోర్) ధర రూ.1,498గా వుంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1,600 కోట్లు సమకూరుతాయని అంచనా. మొత్తం వాటా విక్రయంలో సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 89.34 లక్షల షేర్లకు గాను 2.09 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. వీటి విలువ రూ.3,100 కోట్లు. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2.34 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు(గురువారం) రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయించనున్నారు. షేర్ అలాట్మెంట్ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో బీఈఎల్ షేర్ 3% క్షీణించి రూ.1,510 వద్ద ముగిసింది. బీఈఎల్‌లో ప్రభుత్వానికి 74.41 శాతం వాటా ఉంది. -
కేంద్రానికి ‘ఐటీసీ’ పంట!
• 2 శాతం వాటా విక్రయం • రూ.6,700 కోట్లు సమీకరణ • వాటా కొనుగోలు చేసిన ఎల్ఐసీ... న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి ‘ఐటీసీ’ పంట పండింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో 2 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాలోకి ఏకంగా రూ.6,700 కోట్లు వచ్చిపడ్డాయి. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(ఎస్‌యూయూటీఐ) నుంచి ఈ వాటాను కేంద్రం మంగళవారం విక్రయించింది. బ్లాక్ డీల్స్ రూపంలో జరిగిన ఈ లావాదేవీలో మొత్తం 2 శాతం వాటాను ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ‘కేంద్రం ఒక్కో షేరుకు ఆఫర్ చేసిన రూ.275.85 ధరకు ఎల్ఐసీ ఈ వాటాను దక్కించుకుంది. ఈ డీల్‌తో ప్రభుత్వానికి దాదాపు రూ.6,700 కోట్లు లభించాయి’ అని ఆయా వర్గాలు వెల్లడించాయి. ఇంకా 9.17 శాతం కేంద్రం వద్దే... ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(యూటీఐ) నుంచి కొన్ని ఆస్తులు, అప్పులను టేకోవర్ చేసుకొని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే ఎస్‌యూయూటీఐ. వివిధ ప్రైవేటు రంగ కంపెనీల్లో ఉన్న వాటాల్లో చాలా వరకూ ఎస్‌యూయూటీఐ ద్వారానే కేంద్రం కలిగి ఉంది. ప్రస్తుతం ఐటీసీలో దీనికి 11.17 శాతం వాటా ఉండగా.. తాజాగా 2 శాతం వాటా విక్రయం తర్వాత ఇది 9.17 శాతానికి తగ్గింది. కాగా, ఐటీసీతో పాటు మొత్తం 51 కంపెనీల్లో ఎస్‌యూయూటీఐకి వాటాలున్నాయి. ఇందులో ఎల్ అండ్ టీలో 6.53 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 11.53 శాతం వాటాలు ప్రధానమైనవి. ఈ కంపెనీల్లో కొంత వాటాలను విక్రయించడం కోసం కేంద్రం మూడేళ్ల ప్రణాళికను నిర్ధేశించింది. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే మర్చెంట్ బ్యాంకర్లను కూడా నియమించింది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్‌లో ఎల్ అండ్ టీలో 1.63 శాతం, యాక్సిస్‌లో 9 శాతం చొప్పున వాటాలను విక్రయించింది. దీని ద్వారా రూ.5,500 కోట్లను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటా అమ్మకాల ద్వారా రూ.45,000 కోట్లను సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం(సవరించిన అంచనాల ప్రకారం). ఇందులో ఇప్పటివరకూ 12 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 39,000 కోట్లు ఖజానాలోకి చేరాయి. ఆల్‌టైమ్ గరిష్టానికి ఐటీసీ షేరు.. ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో ఐటీసీ షేరు దూసుకెళ్లింది. మంగళవారం బీఎస్ఈలో ఒకానొక దశలో 5.6 శాతం ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్టాన్ని(రూ.291.95) తాకింది. అయితే, చివరకు స్వల్ప లాభంతో(0.25%) రూ.277.10 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. రూ.3,36,015 కోట్లకు చేరింది. కొత్త ఈటీఎఫ్‌లో సర్కారీ బ్యాంకులు, ఎయూయూటీఐ వాటా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లకు సంబంధించిన రెండో ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)పై మోదీ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో ప్రారంభించనున్న కొత్త ఈటీఎఫ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు, గతంలో పీఎస్యూలుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల్లోని వాటాలతోపాటు ఎస్‌యూయూటీఐ ద్వారా వివిధ కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా చేర్చాలని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పది పీఎస్‌యూలకు(ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) చెందిన షేర్లతో 2014లో ఏర్పాటు చేసిన తొలి సీపీఎస్ఈ ఈటీఎఫ్ మెరుగైన పనితీరును కనబరుస్తుండటంతో రెండో ఈటీఎఫ్ కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఏ కంపెనీల షేర్లను చేర్చాలనేది పరిశీలిస్తోంది. గతంలో పీఎస్యూలుగా ఉన్న హిందుస్థాన్ జింక్ వంటి కంపెనీల్లో ప్రభుత్వానికి ఉన్న మైనారిటీ వాటాను రెండో ఈటీఎఫ్‌లో చేర్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తొలి ఈటీఎఫ్ దాదాపు మూడేళ్లలో 14.4 శాతం రాబడిని అందించినట్లు ఆయన వెల్లడించారు. 2014 మార్చిలో ఆరంభం సందర్భంగా దీని ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లను సమీకరించింది. తాజాగా గత నెలలో రెండో దశలో రూ.6,000 కోట్లు ఖజానాకు లభించాయి. కాగా, రెండో సీపీఎస్ఈ ఈటీఎఫ్ నిర్వహణ కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కొత్త సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎంఓఐఎల్ వాటా విక్రయం... హిట్
కేంద్ర ఖజానాకు రూ.480 కోట్లు న్యూఢిల్లీ: ఎంఓఐఎల్ వాటా విక్రయానికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో రిటైల్ ఇన్వెస్టర్లకు 26.63 లక్షల షేర్లు కేటాయించగా, 1.42 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. వీరికి కేటాయించిన వాటా 5.3 రెట్లు సబ్‌స్క్రైబయ్యింది. వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.480 కోట్లు లభిస్తాయి. ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్ల)ను రూ.365 ఫ్లోర్ ధరకు ప్రభుత్వం ఆఫర్ చేసింది. మంగళవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.51 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయ్యింది. ఇతర కంపెనీల ఆఫర్ ఫర్‌సేల్‌తో పోల్చితే ఎంఓఐఎల్కు మంచి స్పందన లభించిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో ఎంఓఐఎల్ షేర్ 1 శాతం లాభపడి రూ.372 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంఓఐఎల్ షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓఎఫ్ఎస్ విధానంలో వాటా విక్రయంచిన నాలుగో సంస్థ ఎంఓఐఎల్. ఇంతకు ముందు ఎన్బీసీసీ, హిందుస్తాన్ కాపర్, ఎన్‌హెచ్‌పీసీల్లో వాటాలను విక్రయించింది. -
నేటి నుంచి ఎంఓఐఎల్ వాటా విక్రయం
• ఒక్కో షేర్ ఆఫర్ ధర రూ.365 • రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మాంగనీస్ కంపెనీ, ఎంఓఐఎల్‌లో 10 శాతం వాటా(1.33 కోట్ల షేర్లు)ను ప్రభుత్వం నేటి(మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు విక్రయించనున్నది. మొదటి రోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు, రెండో రోజు(రేపు–బుధవారం–జనవరి 25) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్లను విక్రయిస్తారు. రూ. 10 ముఖవిలువగల ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ధరను రూ.365గా(సోమవారం ముగింపు ధర రూ.383లో 5% డిస్కౌంట్ ఇది)ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఫ్లోర్ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.480 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. గతంలో మాంగనీస్ ఓర్ ఇండియాగా వ్యవహరించిన ఎంఓఐఎల్‌లో ప్రభుత్వానికి ప్రస్తుతం 75.58% వాటా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్ ద్వారా రూ.794 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం, షేర్ల బైబ్యాక్, సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించింది. -
ఎన్‌బీసీసీలో 15% వాటా విక్రయానికి ఓకే..
రూ.1,700-1,800 కోట్లు రావచ్చని అంచనా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీలో 15% వాటా విక్రయించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలి పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ.13,788 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.1,700- 1,800 కోట్లు సమకూరవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయ వ్యవహారాల మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. డిజిన్వెస్ట్‌మెంట్ సమయంలో మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ఈ వాటా విక్రయం ద్వారా ఎంత లభిస్తుందనేది తేలనుందని తెలిపారాయన. ఈ వాటా విక్రయంలో భాగంగా అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న ఎన్బీసీసీ ఉద్యోగులకు ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 11 శాతం పతనమై ఎన్బీసీసీ ప్రభుత్వం ఈ కంపెనీలో అధిక వాటాను విక్రయించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ 15 శాతానికే పరిమితమవటంతో స్టాక్ ఎక్స్చేంజీలలో ఎన్బీసీసీ షేర్ బుధవారం 11 శాతం క్షీణించి రూ.230 వద్ద ముగిసింది. మూడు ఎరువుల ప్లాంట్ల పునరుద్ధరణ గోరక్‌పూర్, సింద్రి, బరౌనిల్లో మూతపడిన యూరియా ప్లాంట్లను పునరుద్ధరించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కోటి 1.27 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మూడు ప్లాంట్ల పునరుద్ధరణ వ్యయం రూ.18,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఈశాన్య రాష్ట్రాల డిమాండ్‌ను తట్టుకోవడానికి, యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడానికి మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. -
హడ్కోలో 10 శాతం వాటా విక్రయానికి ఓకే
♦ ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ ♦ రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కొ)లో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి(క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఆఫైర్స్-సీసీఈఏ).. హడ్కోలో పెయిడప్ ఈక్విటీ(చెల్లించిన మూలధనం)లో 10 శాతం వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయానికి సంబంధించి ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు 5 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వాలని కూడా సీసీఈఏ నిర్ణయించిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీ రికమండేషన్ల ఆధారంగా ఆల్టర్నేటివ్ మెకానిజమ్ ప్రాతిపదికన రిటైల్ ఇన్వెస్టర్లకు ఇచ్చే వాస్తవ డిస్కౌంట్‌ను నిర్ణయిస్తారు. ప్రస్తుతం హడ్కో కంపెనీ షేర్ ముఖ విలువ రూ.10. కాగా నెట్‌వర్త్ రూ.7,800 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటా విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌హెచ్‌పీసీలో 11.36 శాతం వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వాటా విక్రయంతో రూ.2,700 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నాల్కో, వంటి మరో 15 పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను విక్రయించనున్నది. -
టాటా టెలికం భారత్ డేటా సెంటర్ విక్రయం!
♦ డీల్ విలువ రూ.3,150 కోట్లు ♦ సింగపూర్ టెక్నాలజీస్ చేతికి 74% వాటా న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ సంస్థ, తన భారత, సింగపూర్‌లకు చెందిన డేటా సెంటర్ వ్యాపారంలో 74% వాటాను విక్రయించింది. ఈ వాటాను ఎస్టీ (సింగపూర్ టెక్నాలజీస్ )టెలిమీడియాకు రూ.3,150 కోట్లకు విక్రయించామని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ విక్రయానంతరం భారత్‌లో హైదరాబాద్‌తో సహా ఉన్న 14 సింగపూర్‌లోని మూడు డేటా సెంటర్లకు సంబంధించిన వ్యాపారంలో 26% వాటా ఈ కంపెనీకి ఉంటుంది. ఈ లావాదేవీకి సంబంధించి ఒప్పందాన్ని ఎస్టీ టెలిమీడియా పూర్తి అనుబంధ సంస్థ ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్(ఎస్టీటీ జీడీసీ)తో రానున్న వారాల్లో కుదుర్చుకుంటామని పేర్కొంది. రుణ భారం తగ్గించుకోవడానికి, విస్తరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని వివరించింది. సముద్ర అంతర్భాగ, భూగోళ కేబుల్ నెట్వర్క్ ద్వారా టెలికం, డేటా సర్వీసుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టాటా టెలికమ్యూనికేషన్స్ అందిస్తోంది. ఈ కం పెనీకి ప్రపంచవ్యాప్తంగా 45 డేటా సెంటర్లున్నాయి. డీల్ నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ బీఎస్ఈలో 1.6% నష్టపోయి రూ.443కు చేరింది. -
ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు
న్యూఢిల్లీ: ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆహ్వానించింది. ఎన్ఎండీసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,900 కోట్లు వస్తాయని అంచనా. ఈ 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ఆర్థిక సంస్థలు వచ్చే నెల 16లోగా తమ బిడ్లను సమర్పించాలని దీపం పేర్కొంది. -
కెయిర్న్ ఇండియాలో వాటా విక్రయానికి సిద్ధం: కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: చమురు ఉత్పాదక కంపెనీ కెయిర్న్ ఇండియాలో వున్న 9.82 శాతం వాటాను విక్రయించడానికి బ్రిటన్ ఆయిల్ కంపెనీ కెయిర్న్ ఎనర్జీ సిద్ధమయ్యింది. ఈ విక్రయం కోసం షేర్‌హోల్డర్ల అనుమతి కోరడంతో పాటు ఇతర అంశాలు చర్చించేందుకు మే 12వ తేదీన కెయిర్న్ ఎనర్జీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఏర్పాటుచేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 29,000 కోట్ల రెట్రోస్పెక్టివ్ టాక్స్ డిమాండ్ నోటీసును అందుకున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టాక్స్ డిమాండ్ నోటీసుతో పాటు మరో రూ. 10,200 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలన్న నోటీసు కూడా ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ క్రితంరోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంతకు 2011లో కెయిర్న్ 8.67 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇంకా ఇండియా కంపెనీలో కెయిర్న్ ఎనర్జీకి 9.82 శాతం వాటా వుంది. రెట్రోస్పెక్టివ్ టాక్స్ చెల్లింపునకు సంబంధించిన వివాదం కారణంగా ఈ వాటా విక్రయాన్ని భారత్ ఆదాయపు పన్ను శాఖ నిషేధించిందంటూ ఏజీఎం నోటీసులో షేర్హోల్డర్లకు కెయిర్న్ తెలిపింది. వాటా విక్రయంపై ఐటీ శాఖ నుంచి భవిష్యత్తులో కంపెనీకి స్వేచ్ఛ లభిస్తే, షేర్హోల్డర్లకు విలువను అందిస్తామన్న విశ్వాసాన్ని కెయిర్న్ ఈ నోటీసులో వ్యక్తంచేసింది. -
ఎయిరిండియాలో 49% వాటా విక్రయానికి కసరత్తు
న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాలో 49 శాతం దాకా వాటాలను విక్రయించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందుకోసం నలుగురైదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో ఆర్థిక , పౌర విమానయాన శాఖల అధికారులతో పాటు క్యాబినెట్ సెక్రటేరియట్, కంపెనీ అధికారులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. ఎయిరిండియా చిట్టచివరిసారిగా 2007లో లాభాలు చూసింది. అప్పట్నుంచీ ప్రైవేట్ కంపెనీల మార్కెట్ వాటా పెరుగుతుండగా.. సంస్థ వాటా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ వాటా ప్రకారం ఎయిరిండియా 3వ స్థానంలో ఉంది. -
‘కాంకర్’తో ఖజానాకు 1,195 కోట్లు
♦ వాటా విక్రయం విజయవంతం ♦ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచీ మంచి స్పందన న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) 5 శాతం వాటా విక్రయం పూర్తిగా విజయవంతమైంది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం 2 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం షేర్లు గురువారం 1.26 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 19.49 లక్షల షేర్లు కేటాయించగా, 24.49 లక్షల షేర్లకు బిడ్లు వచ్చాయి. 1.84 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.438 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఆఫర్ ధర(రూ.1,195)లో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభించింది. రెండు వారాల వ్యవధిలో ప్రభుత్వం చేపట్టిన రెండో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. గత నెల 23న జరిగిన ఎన్టీపీసీ వాటా విక్రయానికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి తగిన స్పందన రాలేదు. కాంకర్ కంపెనీకి సంబంధించి ఒక్కో షేర్‌ను రూ.1,195 ధరకు ఈ 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.1,165 కోట్లు సమీకరించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు (ఐఓసీ, ఎన్టీపీసీ, ఈఐఎల్, పీఎఫ్సీ, ఆర్ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, కాంకర్) ప్రభుత్వ రంగ సం స్థల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.19,517 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం గా పెట్టుకుంది. కాగా రైల్వేల నిర్వహణలో ఉన్న కాంకర్లో ప్రభుత్వ వాటా 61.8%. 5 శాతం వాటా విక్రయం ఇది 56.80 శాతానికి తగ్గుతుంది. -
కాంకర్ ఆఫర్ కు సంస్థల భారీ స్పందన
నేడు రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విక్రయం న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) వాటా విక్రయం మొదటి రోజు శుభారంభం చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన షేర్లకు రెట్టింపు బిడ్డింగ్‌లు వచ్చాయి. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.1,195 ధరకు ప్రభుత్వం కాంకర్లో 5 శాతం వాటా(97,48,710 షేర్ల)ను విక్రయిస్తోంది. ఈ ధరకు ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1,165 కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ 5 శాతం వాటా విక్రయంలో సంస్థాగత ఇన్వెస్టర్లకు 77.8 లక్షల షేర్లను కేటాయించగా, రూ.1,887 కోట్ల విలువైన 1.57 కోట్ల షేర్లకు ( 2.02 రెట్లు అధికంగా) బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రమేయం లేకుండా అంచనా వేసిన రూ.1,165 కోట్ల కంటే అధికంగా బిడ్లు రావడం విశేషం. అన్ని వర్గాల సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా బిడ్లు వేశారని డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి గుప్తా పేర్కొన్నారు. ఎఫ్ఐఐలు 40%, ఎల్ఐసీ, ఇతర ప్రైవేట్ బీమా కంపెనీలు 125 %, మ్యూచువల్ ఫండ్స్ 30 శాతానికి బిడ్లు వేశాయని, బ్యాంక్‌లు మాత్రం 1 శాతానికే బిడ్లు సమర్పించాయని వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ ఇక ఈ 5 శాతం వాటా విక్రయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు 19.4 లక్షల షేర్లను కేటాయించారు. ఈ షేర్ల విక్రయం నేడు(గురువారం) జరగనున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ధరలో(రూ.1,195) 5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బీఎస్ఈలో కాంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ 2.5 శాతం నష్టపోయి రూ.1,196 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం విక్రయిస్తున్న ఏడో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. రైల్వేల నిర్వహణలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా 61.8 శాతంగా ఉంది. ఈ 5 శాతం వాటా విక్రయం తర్వాత ప్రభుత్వ వాటా 56.80 శాతానికి తగ్గుతుంది. -
నేటి నుంచి కాంకర్లో 5% వాటా విక్రయం
ఆఫర్ ధర రూ.1,195; రిటైలర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో 5% వాటా విక్రయం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. రూ.1,195 ధరకు 97,48,710 షేర్లను ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తుంది. మంగళవారం బీఎస్ఈలో ఈ షేర్ ముగిసిన ధర(రూ.1,227)తో పోల్చితే ఇది 2.58% తక్కువ. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఆఫర్ చేసే ధరలో 5% డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం 5% వాటాలో 20% వాటా రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మొత్తం ఈ 5% వాటా విక్రయం కారణంగా ప్రభుత్వానికి రూ.1,165 కోట్లు సమకూరుతాయని అంచనా. మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు మినహా మరే ఇతర సంస్థ కూడా మొత్తం ఆఫర్లో 25 శాతానికి మించి బిడ్ చేయడానికి వీలు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం విక్రయిస్తున్న ఏడో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. రైల్వేల నిర్వహణలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా 61.8%గా ఉంది. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయం వద్దు
ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం * చట్ట ఉలంఘనలు జరుగుతున్నాయని * పిటిషనర్ ఆరోపణ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వంవద్ద మిగిలి ఉన్న వాటాలను విక్రయించవద్దని (డిజిన్వెస్ట్‌మెంట్) అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఈ సంస్థలో మెజారిటీ వాటాను (64.92 శాతం) వేదాంతాకు ప్రభుత్వం 14యేళ్ల క్రితం విక్రయించింది. వేదాంతా అనుంబంధ సంస్థ స్టెరిలైట్ వేదాంత యాజమాన్య నియంత్రణలో ప్రస్తుతం హిందుస్తాన్ జింక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా సుప్రీం ఆదేశంతో వ్యూహాత్మక ఖనిజాలతో ముడివడిఉన్న కంపెనీలో విలువైన 29.54 శాతం వాటాల విక్రయానికి బ్రేక్ పడినట్లయ్యింది. ఈ వాటాలకు సంబంధించి యథాతథ పరిస్థితిని కొనసాగించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంబంధిత పక్షాలను ఆదేశించింది. పిటిషన్ దాఖలు కారణం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల సంఘాల జాతీయ సమాఖ్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. తొలి దఫా పెట్టుబడుల ఉపసంహరణల సమయంలోనే చట్ట సంబంధ ఉల్లంఘనలు జరిగాయని సమాఖ్య తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి గతంలో ఒక ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌లో చట్ట ఉల్లంఘనల విషయం స్పష్టమైనట్లు వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాససం, ‘సంబంధిత చట్ట సవరణలు చేయనిదే తిరిగి తాజా వాటాలను ఎలా విక్రయిస్తారు’ అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. వేదాంతాకు విలువైన ఆస్తులు అప్పగించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోతాంగీని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం... విచారణ పూర్తయ్యే వరకూ ఎటువంటి తదుపరి వాటాల విక్రయం జరగరాదని స్పష్టం చేసింది. తొందరలేదు: ప్రభుత్వం కాగా ప్రస్తుత వాటాల విక్రయంపై తొందరలేదని గనుల వ్యవహారాల కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. ఇందుకు న్యాయ, మార్కెట్ ఒడిదుడుకుల కారణాలను తెలిపారు. -
మైక్రోమాక్స్ ప్రమోటర్లకు జాక్‌పాట్!
మొబైల్ అమ్మకాల్లో దూసుకెళుతున్న దేశీ దిగ్గజం మైక్రోమాక్స్.. త్వరలో చేతులు మారనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం టాప్‌గేర్‌లో ఉండటంతో ఇదే అవకాశంగా మంచి రేటుకు విక్రయించి బయటపడేలా ప్రమోటర్లు ప్రణాళికలు వేస్తున్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ.21,000 కోట్ల వేల్యుయేషన్ లభించినట్లు సమాచారం. కేవలం మొబైల్స్‌ను అసెంబుల్ చేసి విక్రయించే దేశీ కంపెనీకి ఇంత భారీ విలువ రావటం... మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ⇒వాటా విక్రయానికి తహతహ.. ⇒కంపెనీ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా ⇒సాధ్యమైతే పూర్తిగా కంపెనీని అమ్మేసే ప్రణాళిక! ⇒అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు దేశీ మొబైల్స్ మార్కెట్లో మైక్రోమాక్స్ ఒక కెరటం. శామ్సంగ్ లాంటి దిగ్గజాలతో పోటీగా సెల్ఫోన్లను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్న ఈ కంపెనీ ప్రమోటర్లు... సరైన భాగస్వామి లభిస్తే కొంత వాటాను విక్రయించాలని, లేదంటే పూర్తిగా వేరొకరికి అమ్మేసి కంపెనీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ప్రపంచ ఈ-కామర్స్ అగ్రగామి అలీబాబా, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం కంపెనీ విలువను ప్రమోటర్లు 3-3.5 బిలియన్ డాలర్లుగా (గరిష్టంగా రూ.21,000 కోట్లు) లెక్కగట్టారు. ఇది 2013-14లో మైక్రోమాక్స్ ఆదాయానికి 2.5-2.9 రెట్లు కావడం గమనార్హం. ఐదేళ్లలో 14 రెట్లు జూమ్... మైక్రోమాక్స్ వాటా విక్రయంతో అటు ప్రమోటర్లతో పాటు పెట్టుబడిపెట్టిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండనుంది. ప్రస్తుతం ప్రమోటర్ల తర్వాత మైక్రోమాక్స్‌లో టీఏ అసోసియేట్స్ 15 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 2010లో ఈ కంపెనీ రూ.225 కోట్లను పెట్టుబడిగా పెట్టి బోర్డులో చోటు దక్కించుకుంది. అప్పటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మైక్రోమాక్స్ వేల్యుయేషన్ రూ.1,500 కోట్లు మాత్రమేనని అంచనా. ఇప్పుడు ఏకంగా దీనికి 14 రెట్ల విలువను ప్రమోటర్లు ఆశిస్తుండటం గమనార్హం. సెకోయా క్యాపిటల్, శాండ్‌స్టోన్ క్యాపిటల్‌తో పాటు మాడిసన్ ఇండియా క్యాపిటల్‌కు స్వల్ప వాటాలున్నాయి. చైనాకు చెందిన స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్స్ కోటి డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రమోటర్ల అంచనా ప్రకారం సంస్థ అమ్ముడుపోతే ఇన్వెస్టర్లకు బొనాంజా తగిలినట్లే. పదిహేనేళ్ల ప్రస్థానం... 2000వ సంవత్సరంలో నోకియా కంపెనీకి మొబైల్ విడిభాగాల సరఫరాదారుగా మైక్రోమాక్స్ ప్రస్థానం మొదలైంది. రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్... ఈ నలుగురూ దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో హ్యాండ్సెట్ విక్రయాల్లోకి అడుగుపెట్టింది. అనేక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ హ్యాండ్సెట్లను చౌక రేటుకు అందించడంతో మైక్రోమాక్స్‌కు విశేష ఆదరణ లభించింది. తర్వాత స్మార్ట్ఫోన్లలోనూ వేగంగా కొత్త మోడళ్లను పరిచయం చేయడం కంపెనీకి కలిసొచ్చింది. ప్రస్తుతం నెలకు 30 లక్షలకుపైగా హ్యాండ్సెట్లను విక్రయిస్తోంది. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతంగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా దాదాపు 80 శాతం. అంటే తాజా వేల్యుయేషన్ ప్రకారం ఈ నలుగురికీ రూ.16,000 కోట్లకుపైగా లభిస్తాయి. మరోవంక మొబైల్స్ రంగంలో ఉద్ధండులైన ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడం ద్వారా వాటా విక్రయానికి ముందు బ్రాండ్ విలువను మరింత పెంచుకునేలా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. భారతీ ఎయిర్టెల్ సీఈఓ సంజయ్ కపూర్, శామ్సంగ్ ఇండియా మొబైల్ హెడ్ వినీత్ తనేజా తదితరులు గతేడాది మైక్రోమాక్స్‌లో చేరారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లను సమీకరించేందుకు సన్నాహాలు కూడా చేశారు. అయితే, ఇప్పుడు ప్రమోటర్లు ఐపీఓ కంటే వ్యూహాత్మక భాగస్వామి లేదా పూర్తి వాటా విక్రయంపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు వృద్ధి పథంలో కంపెనీని ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్(కంపెనీ) చేతికి అప్పగించాలనేది ప్రమోటర్ల వ్యూహంగా చెబుతున్నారు. ⇒ భారత్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి మొబైల్ ఫోన్ కంపెనీగా... డ్యుయల్ సిమ్ ఫోన్లను దేశంలో ప్రవేశపెట్టిన తొలి హ్యాండ్సెట్ సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది. ⇒ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సైనోజెన్ ఓఎస్‌తో(యురేకా బ్రాండ్) తొలిసారిగా చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. ⇒ భారత్‌లో పెట్టుబడులకు ఉరకలేస్తున్న అలీబాబా... ఇటీవలే ఎం-కామర్స్ దిగ్గజం పేటీఎంలో 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దేశీ మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టింది. ⇒ సాఫ్ట్‌బ్యాంక్ కూడా వచ్చే కొన్నేళ్లలో భారతీయ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల్లో 10 బిలియన్ డాలర్లను వెచ్చించే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే స్నాప్‌డీల్, హౌసింగ్.కామ్, ఓలా క్యాబ్స్ తదితర కంపెనీల్లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుపెట్టింది. ⇒ దాదాపు ఏడాది క్రితం భారత్‌లోకి అడుగుపెట్టిన చైనా ‘యాపిల్’ షియోమి ప్రస్తుత వేల్యుయేషన్ 45 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012లో దీని విలువ 4 బిలియన్ డాలర్లే. -
వాటా విక్రయం బాటలో పాజిటివ్ లైఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ సంస్థ వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. పలు ప్రైవేటు ఈక్విటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్న ఈ సంస్థ... మెజారిటీ వాటాను తమ వద్దే ఉంచుకుని, 49 శాతం వరకూ విక్రయించాలని భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పాజిటివ్ హోమియోపతి, పాజిటివ్ డెంటల్ బ్రాండ్లతో సేవలందిస్తున్న ఈ సంస్థ.. వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులను విస్తరణపై వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన పాజిటివ్ లైఫ్‌సెన్సైస్... ఉత్తరాదికీ శాఖలను పరిచయం చేయనుంది. అలాగే 2016 మార్చికల్లా దుబాయి, శ్రీలంకతోపాటు ఇతర దేశాల్లోనూ అడుగు పెడుతోంది. కొత్తగా 70కిపైగా శాఖల్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. బ్రాండ్ విలువ రూ. 200 కోట్లు.. పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో పాజిటివ్ హోమియోపతి బ్రాండ్ కింద 40 కేంద్రాలను నిర్వహిస్తోంది. పాజిటివ్ డెంటల్ బ్రాండ్‌లో హైదరాబాద్‌లో 5, కర్నూలులో ఒక కేంద్రం ఉంది. ఆన్లైన్ ద్వారా అమెరికాలోని రోగులకూ సేవలందిస్తోంది. వైద్యులైన ఏఎం రెడ్డి, టి.కిరణ్‌కుమార్, ఏ.సృజన సంస్థ ప్రమోటర్లుగా ఉన్నారు. కంపెనీ 2014-15లో రూ.40 కోట్ల టర్నోవర్‌పై రూ.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక సంస్థ విలువను ఆకాశం కన్సల్టింగ్ రూ.200 కోట్లుగా లెక్కగట్టినట్లు పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ ఎండీ ఎ.ఎం.రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘‘దక్షిణాదిన హోమియోతోపాటు దంత వైద్య రంగంలో సుస్థిర వాటా దక్కించుకున్నాం. పెద్ద ఎత్తున విస్తరించాలన్న లక్ష్యంతోనే వాటా విక్రయానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విస్తరణకు రూ.60 కోట్ల దాకా అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని వివరించారు. భారీ విస్తరణ దిశగా.. ఈ ఏడాదే ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో శాఖలను తెరుస్తామని ఎ.ఎం.రెడ్డి చెప్పారు. పాజిటివ్ హోమియోపతి బ్రాండ్‌లో కొత్తగా 60 శాఖలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పాజిటివ్ డెంటల్‌లో 2015లో 5, 2016లో 7 శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, వరంగల్, వైజాగ్, విజయవాడ, గుంటూరులలో ఇవి రానున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక టెక్నాలజీతో ఒక్కోటి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామని, ఒక్కో డెంటల్ కేంద్రం రెండేళ్లలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని తెలియజేశారు. హోమియో వైద్య కళాశాల ఏర్పాటును వేగవంతం చేశామన్నారు. -
ఇక సర్కారీ షేర్ల జాతర..!
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా దిగ్గజ కంపెనీలు ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీలలో వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇందుకు ఓకే చెప్పింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ మూడు కంపెనీలలో ప్రతిపాదిత ప్రభుత్వ వాటాలను విక్రయిస్తే రూ. 43,000 కోట్లకుపైగా నిధులు సమకూరనున్నాయి. కోల్ ఇండియాలో ప్రతిపాదిత 10% వాటాకు ప్రస్తుత ధరూ. 374 ప్రకారం రూ. 23,000 కోట్లు లభించనుండగా, ఓఎన్జీసీలో 5% వాటాకు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 445 ప్రకారం రూ. 18,000 కోట్లు, ప్రస్తుత రూ. 22 ధర ప్రకారం ఎన్‌హెచ్‌పీసీలో 11.36% వాటాకుగాను రూ. 2,800 కోట్లు చొప్పున ప్రభుత్వానికి లభిస్తాయి. తద్వారా బడ్జెట్లో ప్రతిపాదించినమేరకు ప్రభుత్వం నిధులను సమీకరించగలుగుతుంది. కాగా, ఈ సంస్థలలో వాటాలను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బాటలో ఇప్పటికే ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక ప్రక్రియను సైతం మొదలుపెట్టింది. ఈ నెలలో సెయిల్... డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా స్టీల్ రంగ దిగ్గజం సెయిల్‌లో 5% వాటాను విక్రయించేందుకు గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సెయిల్ ఇష్యూని ప్రభుత్వం ఈ నెలలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 81 ప్రకారం సెయిల్‌లో 5% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లవరకూ లభించవచ్చు. కాగా, వరుసగా గత ఐదేళ్లలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరడంలో విఫలమవుతూనే వస్తోంది. నిజానికి ప్రతీ బడ్జెట్లో ప్రభుత్వం రూ. 40,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ 2010-11లో రూ. 22,144 కోట్లు, 2011-12లో రూ. 13,894 కోట్లు చొప్పున మాత్రమే సమీకరించగలిగింది. ఇక 2012-13లో లక్ష్యం రూ. 30,000 కోట్లుకాగా రూ. 23,956 కోట్లు సమకూర్చుకుంది. 2013-14లో రూ. 40,000 కోట్ల ల క్ష్యానికిగాను రూ. 16,027 కోట్లు మాత్రమే సమీకరించింది.