ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ తన చమురు, రసాయనాల విభాగంలో మైనారిటీ వాటా విక్రయానికి సంబంధించి సౌదీ అరాంకోతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందంపై ఆరాంకో అధికారులు, బ్యాంకర్లు ఈ నెలలో ముంబైలోని రిలయన్స్ కార్యాలయాలకు చేరుకుని విలువ మదింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని సమాచారం. ఈ భారీ ఒప్పందంపై తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీలు సంసిద్ధమయ్యాయి. సెప్టెంబర్ మాసాంతంలో జరిగే వార్షిక వాటాదారుల సమావేశం లోగా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆర్‌ఐఎల్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు.
చదవండి : భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ
గత ఏడాది ఆగస్ట్‌లో తన ఆయిల్, పెట్రోకెమికల్స్ డివిజన్ విలువ 7500 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. ఆ ప్రకారం 20 శాతం వాటా 1500 కోట్ల డాలర్లు పలకనుంది. ఈ విలువ ప్రామాణికంగా విక్రయ ప‍్రక్రియ పూర్తయితే ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా కొనుగోలు అనంతరం ఇదే భారీ అతిపెద్ద లావాదేవీగా నమోదవనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రిలయన్స్ ఆయిల్, పెట్రోకెమికల్ డివిజన్‌లో 20 శాతం వాటా విక్రయానికి ఆర్‌ఐఎల్, సౌదీ ఆరాంకో అంగీకరించాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ఆర్‌ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment