mukhesh ambani
-
అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వాచ్‌ల వరకు ప్రతీదీ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాటి ధరలన్ని కోట్లలోనే. అలానే ప్రస్తుతం అంబానీ కుటుంబం తాగే పాల గురించి ఓ టాపిక్ నెట్టింట తెగ వైరల్‌గా అవుతోంది. వాళ్లు తాగే అదే పాలను కొందరూ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా తాగుతారట. మరీ అవి ఏ పాలు, వాటి ప్రత్యకతలేంటో చూద్దామా..!సాధారణంగానే ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమేనట. వారు తాగే పాలు పూణే నుంచి వస్తాయట. నెదర్లాండ్స్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు జాతి పాలను తాగుతారట. ఈ జాతికి చెందిన ఆవులను పూణేలోని భాగ్యలక్ష్మి డెయిరీలో పెంచుతారు. ఈ డెయిరీ ఏకంగా 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా ఈ జాతి ఆవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పాడి పరిశ్రమలోని ప్రధానమైన జాతి. వీటిని అత్యధిక పాలను ఉత్పత్తి చేసే జాతిగా పిలుస్తారు. ఈ పాలల్లో ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ ఆవుల సంరక్షణ కోసం కేరళ నుంచి వచ్చే ప్రత్యేక రబ్బరు పూతతో కూడిన దుప్పట్లు ఉపయోగిస్తారట. ఇవి మాములు వాటర్ తాగవు..ఆర్ఓ వాటర్‌ని మాత్రమే తాగుతాయట. ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట. సాధారణంగా హోల్‌స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తాయట. ఈ పాల ధర ఏకంగా రూ. 152లు పైనే పలుకుతుందట.ఈ పాలల్లో ఉండే పోషకాలు..హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవు పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A1, A2 బీటా-కేసిన్ (ప్రోటీన్) వంటివి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ పాలల్లో ఉంటాయట. (చదవండి: మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!) -
ఛాట్‌జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న వేళ భారత్ కూడా దీనికి పోటీగా.. అలాంటి సేవలని అందించాలనే ఉద్దేశ్యంగా అంబానీకి చెందిన రిలయన్స్, ఇతర ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన 'భారత్ జీపీటీ' వచ్చే నెలలో కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేయడానికి సంకల్పించింది. భారత్ జీపీటీ లాంచ్ చేయనున్న ఏఐ మోడల్‌కు 'హనూమాన్' (Hanooman) అని నామకరణం చేశారు. ఈ హనుమాన్ ఏఐ మోడల్ మొత్తం 11 భాషల్లో సేవలను అందించనున్నట్లు సమాచారం. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, పరిపాలన రంగాలకు చెందినవి ఉంటాయి. ఇప్పటికే భారత్ జీపీటీ హనూమాన్ ఏఐ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను ప్రదర్శించింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా స్పీచ్ టు టెక్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చని సమాచారం. భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ను డెవలప్ చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. రిలయన్స్ కంపెనీ ఇప్పటికే తమ సబ్స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు 'జియో బ్రెయిన్' పేరిట ఓ మోడల్‌ను తయారు చేస్తోంది. మరోవైపు ఇండియన్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వం, కృత్రిమ్ వంటి సంస్థలు కూడా ఏఐ మోడల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ఇదీ చదవండి: మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం! ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, ఏఐ గ్రోక్ వంటివి పుట్టుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి సన్నద్ధమయ్యే అవకాశం ఉంది, ఇదే జరిగితే మరిన్ని ఏఐ మోడల్స్ పుట్టుకొస్తాయని పలువురు చెబుతున్నారు. -
అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!
బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు, వ్యాపారవేత్త అనంత్అంబానీ, రాధిక మర్చంట్ మూడుముళ్ల వేడుక అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే అంబానీ చేతితో రాసారని చెబుతున్న ఇన్విటేషన్ కార్డ్ ఒకటి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే, అంబానీ కుటుంబం ఈ వార్తలను ధృవీకరించలేదు అలాగని ఖండించనూ లేదు.దీంతో మరిన్ని ఊహాగానాలు, అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. జూలైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్ అంబానీ ఫ్యాన్ పేజీలలో ప్రకారం, అనంత్ ,రాధిక జూలై 2024లో ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.జూలై 10, 11 , 12 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి VIP గెస్ట్ హౌస్‌లతో పాటు 1200 మంది అతిథులు రానున్నారు. సింగర్, దిల్జిత్ దోసాంజ్ వారి వివాహానికి ముందు ఉత్సవాల్లో అనేక మంది ప్రదర్శనకారులలో ఉంటారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అవుతాయి.దీంతో పాటు అనంత్ అంబానీ , రాధిక డిజైనర్ దుస్తులు, విందు, ఇలా పెళ్లికి సంబంధించి అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలైందని కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. ఇందులో వధువు తండ్రి, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ రాధిక స్నేహితులతో కలిసి పోజులిచ్చాడు. ఎంబ్రాయిడరీ నెహ్రూ జాకెట్, బ్లాక్ కలర్ బంద్‌గాలా షేర్వాణిలో వీరేల్ హుందాగా కనిపించాడు. Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! దివ్యాంగులు తయారు చేసిన స్పెషల్ క్యాండిల్స్ మరో ఇంట్రస్టింగ్ వార్త ఏంటంటే..పెళ్లికి వచ్చిన అతిథులకు మహాబలేశ్వర్‌లోని అంధ ళాకారుల తయారు చేసిన ప్రత్యేక కొవ్వొత్తులను బహుమతిగా ఇస్తారట. స్వదేశీ పురాతన హస్తకళ, అమూల్యమైన వారసత్వ సంపదకు ఇషా అంబానీ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలంకరణకు కూడా వీటిని ఎక్కువగా వాడనున్నారట. ( ‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది) -
భారత్‌లో ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయ్ - ముకేశ్ అంబానీ
గాంధీనగర్: ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత ఇంధన అవసరాలు రెట్టింపవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం 3.5 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌లో అసాధారణ స్థాయిలో ఆర్థికాభివృద్ధి జరగనుందని ఆయన చెప్పారు. పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన, సమ్మిళిత అభివృద్ధిలో అంతర్జాతీయంగా దిగ్గజంగా ఎదిగేందుకు భారత్ మెరుగైన పరిష్కార మార్గాలను రపొందించగలదని అంబానీ ధీవ వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సామర్ధ్యాలు, నైపుణ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని సూంచారు. ‘ధైర్యమనేది అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని కూడా దాటించగలిగే పడవలాంటిది. మీరు తప్పులు చేయొచ్చు. కానీ వాటి గురిం ఆందోళన చెందుతూ, వెనుకడుగు వేయకండి. తమ తప్పులను సరి చేసుకుని, లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేసేవారే విజయం సాధిస్తారు. పెద్ద కలలు కనండి. అవే మీ జీవితాన్ని ముందుకు నడిపించే చోదకాలవుతాయి. మీ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు నిబద్ధతతో వ్యవహరించండి. రిస్కులు తీసుకోండి. కానీ నిర్లక్ష్యం వహించకండి‘ అని అంబానీ చెప్పారు. -
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్‌లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్‌లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
మనవడు, మనవరాలి పుట్టినరోజు వేడుకలో అంబానీ దంపతులు
రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు మనవడు, మనవరాలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబానీ కుమార్తె ఈశా అంబానీ-ఆనంద్ పిరమాల్ దంపతులకు గతేడాది కవలలు జన్మించారు. వారికి కృష్ణ, అదియాగా పేరు పెట్టారు. వారి మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం నిర్వహించారు. -
అంబానీ యాంటిలియాలో ఫుట్‌బాల్ లెజెండ్ 'బెక్‌హామ్' - ఫోటోలు వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' ఇటీవల ఫుట్‌బాల్ లెజెండ్ 'డేవిడ్ బెక్‌హామ్'కు తన యాంటిలియాలో ఆతిధ్యమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గట్టి విజయం సాధించిన తర్వాత డేవిడ్ బెక్‌హామ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో థ్రిల్లర్ మ్యాచ్‌ను వీక్షించారు. డేవిడ్ బెక్‌హామ్‌కు అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం, యాంటిలియాలో ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో నీతా అంబానీ, కుమార్తె ఇషా, కుమారుడు ఆకాష్‌తో కలిసి శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ కూడా ఉన్నారు. వాంఖడే స్టేడియంలో ఆకాష్ అంబానీ, డేవిడ్ బెక్‌హామ్ కలిసి మ్యాచ్ వీక్షించారు. నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ ఇక్కడ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్! బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా డేవిడ్ బెక్‌హామ్‌కి వారి ముంబై నివాసంలో వెల్కమ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి అనిల్ కపూర్, ఫర్హాన్ అక్తర్, కరిష్మా కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు మిస్టర్ బెక్‌హామ్‌తో హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
Disney India: అమెరికన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముందు వరుసలో రిలయన్స్.. నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్‌తో జియో టీవీకి సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. -
మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్
దాదాపు పదకొండు ఏళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసింది. మంగళవారం మెగా కుటుంబానికి సెంటిమెంట్.. అదేరోజు వారి ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడంతో సంబురాలు చేసుకున్నారు. దీంతో లక్ష్మీ దేవిలా వారి కుటుంబంలో సందడి తెచ్చిందని బావించారు. ఆమె రాకతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ సైతం సంతోషంతో సంబురాలు చేసుకున్నారు. ఇక పాప జాతకం కూడా చాలా బాగుందని చిరంజీవి కూడా అన్నారు. పలువురు జ్యోతిష్యులు కూడా పాప జాతకం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు కూడా. (ఇదీ చదవండి: రామ్ చరణ్-ఉపాసన కూతురి పేరు ఫైనల్ చేసేశారు) తాజాగా మెగా ప్రిన్సెస్‌కు నేడు (జూన్ 30)న పేరు పెట్టబోతున్నట్లు ఉపాసన తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి ఒక కానుక వచ్చిందని ప్రచారం జరుగుతుంది. బంగారంతో తయారు చేసిన ఊయలను పాప కోసం అంబానీ పంపారట. అందుకోసం కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారికంగా ఎవరూ ప్రకటన చేయలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా, ఎక్కడంటే?) -
కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - వారెవరో తెలుసా?
ప్రపంచంలోని చాలామంది ధనవంతులు ఖరీదైన లగ్జరీ కార్లను వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే వారు ఎవరు, వారు ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విఎస్ రెడ్డి - బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ EWB భారతదేశంలో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉపయోగించే వారి జాబితాలో మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'VS రెడ్డి' ఉన్నారు. ఈయన ఉపయోగించే బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యుబి ధర సుమారు రూ. 14 కోట్లు. బెంట్లీ కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా 100 యూనిట్లకు మాత్రమే పరిమతమై ఉంది. ఇది 6.75 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 506 హెచ్‌పి పవర్ 1020 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 296 కిలోమీటర్లు. ముఖేష్ అంబానీ - రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB & మెర్సిడెస్ S600 గార్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఈయన గ్యారేజిలో ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ సిరీస్ VIII EWB. దీని ధర రూ. 13.5 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 563 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మెర్సిడెస్ S600 గార్డ్ అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్600 గార్డ్. ఇది ముఖేష్ అంబానీకి కోసం ప్రత్యేకంగా తాయారు చేసిన కారు. దీని ధర సుమారు రూ. 10 కోట్లు. ఈ కారుని ముఖేష్ అంబానీ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ కలిగిం ఈ కారు బాడీ షెల్ రీన్ఫోర్స్డ్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది ట్విన్ టర్బోచార్జ్ 6 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 523 బిహెచ్పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్ ఫాంటమ్, కల్లినన్స్, గోస్ట్స్ వంటి కార్లతో పాటు ఇతర బెంజ్, ఆడి, బెంట్లీ కార్లు ఉన్నాయి. వీరి సెక్యురిలో కూడా అత్యంత ఖరీదైన కార్లు వినియోగించడం గమనార్హం. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) నసీర్ ఖాన్ - మెక్లారెన్ 765 LT స్పైడర్ అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో హైదరాబాద్ నగరానికి చెందిన 'నసీర్ ఖాన్' కూడా ఉన్నారు. ఈయన వద్ద ఉన్న ఖరీదైన కారు మెక్లారెన్ 765 LT స్పైడర్. దీని ధర రూ. 12 కోట్లు. ఈ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 765 పిఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సూపర్ కారు 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్: నసీర్ ఖాన్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర సుమారు రూ. 8.20 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 600 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
గిఫ్ట్ ఇవ్వడంలో అంబానీ స్టైలే వేరు - ఇదే నిదర్శనం
పండగలకో పబ్బాలకో బోనస్ ఇచ్చే యజమానులను చూసుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేసే యజమానులు చూసుంటారు. కానీ అపర కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్తగా కీర్తించబడుతున్న అంబానీ ఈ విషయంలో కూడా 'అంతకు మించి' అనే చెప్పాలి. తన ఉద్యోగికి ఏకంగా రూ. 1,500 కోట్లు ఖరీదు చేసే ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 'రైట్ హ్యాండ్'గా పిలువబడే 'మనోజ్ మోదీ'కి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. ఇందులో అధునాతన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) మనోజ్ మోదీకి ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ కూడా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అంతే కాకుండా ఈయన ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్ ఇంబానీ మరియు ఇషా అంబానీలతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ సాధించిన అనేక విజయాల్లో మనోజ్ మోదీ హస్తం ఉంది. మనోజ్ మోదీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ అండ్ రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!
కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కీర్తి పొందిన 'ముఖేష్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపార ప్రపంచంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ముందుకు సాగుతున్న ఈ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా.. పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 13వ అత్యంత సంపన్న బిలియనీర్ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు ఇటీవల ఫోర్బ్స్ నివేదించింది. ఈయన నికర ఆస్తుల విలువ 84.1 బిలియన్ డాలర్లు అని అంచనా. అంబానీ పిల్లలు కూడా తండ్రి వ్యాపారాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ.. తండ్రికి తగ్గ పిల్లలుగా ఖ్యాతి పొందారు. ఇంతకీ ముఖేష్ అంబానీ పిల్లలు రిలయన్స్ గ్రూప్‌లో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆకాష్ అంబానీ: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో చైర్మన్. భారతదేశంలో అతి పెద్ద టెలికాం బిజినెస్ ఆకాష్ నియంత్రణలో ఉంది. అంతే కాకుండా ఈయన ముంబై IPL జట్టుకు కో-ఓనర్ కూడా. ముంబైలోని క్యాంపియన్ స్కూల్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన ఆకాష్ అంబానీ 2013లో యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత తండ్రి వ్యాపార రంగంలో అడుగులు వేశారు. మొదట్లో జియో ఇన్ఫోకామ్‌లో స్ట్రాటజీ చీఫ్‌గా ప్రారంభమై దానిని వేగంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ప్రస్తుతం ఆతని ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) ఇషా అంబానీ: ముఖేష్, నీతా అంబానీల కవల పిల్లలు ఇషా, ఆకాష్. వీరి ముగ్గురు పిల్లల్లో 'ఇషా' ఒక్కగానొక్క అమ్మాయి. ఈమె ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తోంది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్తి చేసిన తరువాత మిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇషా అంబానీ ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?) అనంత్ అంబానీ: ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు అనంత్ అంబానీ. ఈయన రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారానికి బాధ్యతలు వహిస్తూ.. రిలయన్స్ 02C & రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని అంచనా. ఇటీవల అనంత్ అంబానీకి రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. -
ఐస్‌క్రీమ్ అమ్మబోతున్న అంబానీ: రూ. 20వేల కోట్లతో..
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ కంపెనీ అధినేత 'ముఖేష్ అంబానీ' త్వరలో భారతదేశంలో మరో కొత్త బిజినెస్ ప్రారంభించనున్నట్లు సమాచారం. పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ వంటి మరెన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మరో రంగంపై కన్నేసింది. నివేదికల ప్రకారం, రిలయన్స్ సంస్థ త్వరలో ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో రూ. 20,000 కోట్ల టర్నోవర్‌తో ఐస్‌క్రీమ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేస్తోంది. గత సంవత్సరం గుజరాత్‌లోనే రిలయన్స్ కంపెనీ ఈ బ్రాండ్ విడుదల చేసింది, కాగా ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలోకి ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్లో పోటీ భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ఐస్ క్రీమ్ పరిశ్రమలో ఐసిస్ క్రీమ్, స్టార్మి ఇండస్ట్రీస్, అమూల్ సంస్థలు అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కంపెనీలు రిలయన్స్‌తో పోటీ పట్టడానికి సిద్దమవ్వాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: Flipkart Offers: మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం) రిలయన్స్ సంస్థ కొన్ని రోజుల క్రితం డెయిరీ రంగంలోని ఆర్ఎస్ సోధి కంపెనీని కొనుగోలు చేసింది. అమూల్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఈ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో జియో పేరుతో ప్రవేశించినప్పుడు ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అలంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఈయన అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లను గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే కంపెనీలలో చెప్పుకోదగ్గది రోల్స్ రాయిస్. ఈ సంస్థకు చెందిన ఫాంటమ్ SUV ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 13.50 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్660 గార్డ్: జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 'మేబ్యాచ్ ఎస్660' ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 10.50 కోట్లు. ఈ కారు అత్యంత సురక్షితమైన, అధిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది బుల్లెట్లు, బాంబులు ఇతర ప్రాణాంతక ప్రమాదాల్లో రక్షించడానికి ప్రత్యేకంగా తయారుచేశారు. బిఎండబ్ల్యు 760ఎల్ఐ సెక్యూరిటీ: రూ. 8.9 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ సెక్యూరిటీ కూడా ముఖేష్ అంబానీ వినియోగించే కార్లలో ఒకటి. ఈ లగ్జరీ సెడాన్ 6 లీటర్ V12 ఇంజన్ కలిగి 544 బిహెచ్పి పవర్, 880 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధిక భద్రతా ఫీచర్స్ కలిగిన కార్లలో ఇది ఒకటి. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్: అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్. దీని ధర రూ. 7.50 కోట్లు. ఈ స్పోర్ట్స్ కారు 2019లో ప్రారంభమై హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి కారు. ఇది 4 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 769 బిహెచ్పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్: బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ధర రూ. 3.69 కోట్లు. ఇది 2005లో బెంట్లీ ఆర్నేజ్కు వారసుడిగా పరిచయమైంది. కావున ఇది కూడా అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 6 లీటర్ డబ్ల్యు12 ఇంజన్‌తో అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కార్లతో పాటు ముఖేష్ అంబానీ గ్యారేజిలో మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. -
ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు, భవనాలు, సంపద ఇలా ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తూనే ఉండడం షరా మామూలే. అయితే ఒక్కోసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి దగ్గర పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి విషయాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ సాలరీపై సోషల్‌మీడియాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం.. అంబానీ డ్రైవర్‌కు ఏడాదికి రూ.24 లక్షలు. ఐటీ రంగంలో కొన్ని కంపెనీల సీఈఓలకు, ఇతర సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. అయితే 2023లో అతని జీతం ఎంత అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారి ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. వామ్మో.. అంత సాలరీ ఎందుకు సెలబ్రిటీల కుటుంబానికి డ్రైవర్‌గా జీవితం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రపంచకుబేరుడు ఇంట్లో సిబ్బందిగా పనిచేయాలంటే.. వాళ్లు చేసే పనికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. వివరాల ప్రకారం వీరిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకుంటారట. కేవలం వీరికి డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా నడుచుకోవడం, యజమానుల వద్ద అనుసరించాల్సిన విధివిధానాలు, క్రమ శిక్షణ కూడిన ప్రవర్తనతో పాటు మరికొన్ని అంశాలతో కఠినమైన శిక్షణను కూడా అందిస్తారు. వీటితో పాటు లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా నడపాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయని సమాచారం. అంతేకాకుండా ఏ తరహా రోడ్ల పై, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంత తతంగం ఉంది కనుకే వారి జీతం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో సెలబ్రీటల ఇంట పని చేస్తున్న సిబ్బంది జీతాలు ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే? -
అలా కలిసొచ్చింది.. ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్టు పరిణామాలతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. దీంతో ఆ లిస్టులో ఆసియా దేశాల నుంచి ఏకైక కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిల్చారు. ఫోర్బ్స్ వెబ్సైట్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగిన అదానీ ర్యాంకు తాజాగా 15వ స్థానానికి తగ్గింది. ఆయన సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది. -
‘భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలి’
ముకేశ్ అంబానీ. భారతదేశంలో ఈ పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత. రిటైల్ రంగాన్ని పరుగులు తీయిస్తున్న కార్పొరేట్ దిగ్గజం. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 5G సేవలను అందించేందుకు శ్రమిస్తున్న వ్యాపారవేత్త. ‘రిలయన్స్ ఇండియా’ను హరిత కార్పొరేట్‌గా మలచాలని కలలు కంటున్న వ్యూహకర్త. ఏటా తన తండ్రి ధీరూబాయి పుట్టిన రోజును ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’ గా నిర్వహిస్తారు. కంపెనీలోని అన్ని స్థాయుల ఉద్యోగులతో సంభాషిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. గత ఏడాది ఇదే కార్యక్రమంలో తన పిల్లలు ముగ్గురికి కంపెనీ వారసత్వ పగ్గాలను అప్పగించారు. టెలికాం, డిజిటల్ బిజినెస్ పెద్ద కొడుకు ఆకాశ్‌కి, కవల సోదరి ఇషాకు రిటైల్, చిన్న కొడుకు అనంత్‌కు ఎనర్జీ బిజినెస్ అప్పగించారు. ఈ సారి ఫ్యామిలీ డే సందర్భంగా ఆయన ప్రసంగం మరింత ఉత్తేజ భరితంగా సాగింది. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, సంస్థల్లోని నాయకులు, ఉద్యోగులు అంతా అంచనాలను అందుకోవాలని చెప్పారు. అర్జెంటీనా జట్టును ప్రేరణగా తీసుకుని ముందుకు సాగిపోవాలని చెప్పారు. భారతీయుల హృదయాల్లో రిలయన్స్ చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాక్షించారు. ఇతర అంశాలు ఆయన మాటల్లోనే... జనహృదయాల్లో చిరస్థాయిగా రిలయన్స్ ‘‘కాలం పరిగెడుతుంది. రిలయెన్స్ సంస్థ మర్రిచెట్టు మాదిరిగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. దాని కొమ్మలు విశాలమవుతాయి. వేళ్లు మరింత లోతుకు చొచ్చుకుపోతాయి. ఎందరో భారతీయుల జీవితాలను అది స్పృశిస్తుంది. సుసంపన్నం చేస్తుంది. వారికి సాధికారతను ఇస్తుంది. పెంచి పోషిస్తుంది. సంరక్షిస్తుందన్నారు ముకేశ్ అంబానీ. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5G సేవలు ‘ఆకాశ్ నేతృత్వంలో జియో ప్రపంచంలోని ఏ ఇతర దేశాలలో కంటే భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2023 నాటికి 5G మోహరింపు పూర్తవుతుంది. జియో ప్లాట్ ఫామ్స్ అన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను, పరిష్కారాలను అందిస్తూ తమకు దక్కిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ప్రతి గ్రామానికి 5జీ కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీనివల్ల గ్రామీణ-పట్టణ అన్న అంతరం తొలుగుతుంది. అత్యున్నత విద్య, అత్యున్నత ఆరోగ్య సంరక్షణ, అత్యున్నత వాణిజ్య కలపాలు సాధ్యమవుతాయి. జియో వల్ల సంఘటిత అభివృద్ధి వేగవంతం అవుతుందని’ అన్నారు. భారత సంఘటిత అభివృద్ధిలో పాత్ర ‘ఇషా ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారం కూడా విస్తృతంగా, మరింత లోతుగా చొచ్చుకుపోతోంది. మరింత ఉన్నతమైన లక్ష్యాలు, గమ్యాలను వెతుక్కుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అధిక ఉపాధి కల్పన, రైతులకు అధిక ఆదాయం, చిన్న, మధ్యతరహా తయారీ రంగం మరింత ఉత్పాదను సాధించటం, వ్యాపారులు మరింత సంపన్నులు కావటం ద్వారా భారత్ లోని సంఘటిత అభివృద్ధిలో రిటైల్ వ్యాపారం కూడా పరోక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు’ ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్సు, పెట్రో కెమికల్ ప్లాంటులతో ఆయిల్–టు-కెమికల్ వ్యాపారంలోనూ గ్రూపు తన నాయకత్వ స్థానాన్ని నిలుపుకుంటోంది. అలాగే మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను డిజిటల్ సర్వీసెస్ తో అనుసంధానం చేయటం వల్ల పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఎనర్జీ బిజినెస్‌లో.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయటంతో పాటు, హైడ్రోజన్ బిజినెస్ లోకి ప్రవేశించటం వంటి అంశాలు కంపెనీ స్వరూప స్వభావాలనే మార్చివేస్తాయి. కొత్తతరం వ్యాపార ప్రపంచంలోకి అనంత్ ప్రవేశించారు. జామ్ నగర్లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు వేగవంతంగా ముందుకు వెళుతున్నాం. విస్తృతిలోనూ, విలువ పరంగానూ ఖ్యాతి గడించిన రిలయెన్స్ ‘గ్రీన్ కార్పొరేట్’గా దిశగా అడుగులు వేస్తోంది. ఇంధన రంగంలో స్వయంసమృద్ధి ఇంధనరంగం ముందు స్పష్టమైన లక్ష్యాలున్నాయి. దిగుమతులపైన ఆధారపడటం తగ్గించి భద్రతను, స్వయంసమృద్ధిని సాధించాలి. చురుగ్గా, సాంకేతికంగా ముందుండటం వల్ల దీనిని సాధించవచ్చుని అన్నారు. అర్జెంటీనా విజయమే ప్రేరణ వ్యాపార రంగంలో విజయం సాధించాలంటే, నాయకత్వం, బృంద సభ్యుల పనితీరు ముఖ్యం. అర్జెంటీనానే అందుకు గొప్ప ఉదాహరణ. నాయకత్వం, మంచి బృందం కలవటం వల్లనే ఫుట్‌బాల్‌లో ఆ దేశం ప్రపంచకప్ గెల్చుకోగలిగింది. మెస్సీ తను సొంతంగా కప్ గెల్చుకోలేదు. అదే సమయంలో మెస్సీలాంటి సమర్థ నాయకత్వం లేకపోతే అర్జెంటీనా జట్టు విజయం సాధించి ఉండేది కాదు. మొదటి గేమ్‌లో వారు అపజయం పాలయ్యారు. విజయాన్ని శ్వాసించి.. విజయాన్ని కలగని.. విజయం సాధించేందుకు అవసరమైనదంతా చేసి.. చివరి పెనాల్టీ షాట్ వరకూ విజయాన్ని వెంటాడుతూ.. చివరికి గెలుపును సొంతం చేసుకున్నారు. వివేకానందుని మంత్రం మా తండ్రి ధీరుబాయి అంబానీ మాదిరిగానే నేనూ వివేకానందుని నుంచి ప్రేరణ పొందుతాను. ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంగా మలుచుకోండి. దాని గురించి ఆలోచించండి. దానిపైనే జీవించండి. మీ మనసు, శరీరం, నరాలు, కండరాలు, మీ శరీరంలోని అణువణువునూ అదే ఆలోచనతో నింపి, మిగిలిన ఆలోచనలన్నింటిని పక్కన పెట్టండి. అదే విజయానికి మార్గం. అదే గెలుపు మంత్రమంటూ ముగించారు ముకేశ్ అంబానీ. చదవండి: కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్! -
అంబానీ ఇంట నిశ్చితార్థ సంబరాలు!
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మొగనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో గురువారం (డిసెంబర్ 29) నిశ్చితార్థం జరిగింది. ఈమె వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె. రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయంలో వీరువురు సంప్రదాయబద్ధంగా రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో నాథ్ద్వారాలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుక కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో చదువును పూర్తి చేశాడు. అప్పటి నుంచి జియో ప్లాట్‌ఫాంతో పాటు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యునిగా సహా వివిధ హోదాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ఆర్ఐఎల్ (RIL) ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నాడు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి రాధిక బోర్డ్ ఆఫ్ ఎన్కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
గురువాయూర్ శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కేరళలోని గురువాయూర్ శనివారం శ్రీకృష్ణుని స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు. అంబానీ సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలలో గురువాయుర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఆయన కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఆలయంలోని సోపానం (అంతర్గత గర్భగుడి) వద్ద నెయ్యి సమర్పించడంతో పాటు ఆలయ ఏనుగులు చెంతమరక్షన్, బలరామన్‌లకు నైవేద్యాలు సమర్పించారు. కాగా కొన్ని రోజులుగా రిలయన్స్ అధినేత కాబోయే కోడలితో కలిసి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే తిరుపతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే. -
రిలయన్స్ సబ్సిడరీకి ‘సిన్‌గ్యాస్’ బదిలీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జామ్‌నగర్ సిన్‌గ్యాస్ ప్రాజెక్టును పూర్తి స్థాయి అనుబంధ సంస్థకు బదలాయించనుంది. ఈ ప్రాజెక్టుకు మరింత విలువను చేకూర్చడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని రిలయన్స్ ప్రకటించింది. ఇంధన ఉత్పత్తిలో ఉపయోగించే ఈ సిన్‌గ్యాస్ (సింథసిస్ గ్యాస్) అనేది హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అలాగే కొంత మొత్తంలో కార్బన్ డయాక్సై డ్లతో కూడిన సమ్మేళనం. ఘన హైడ్రోకార్బన్ ఇంధనాన్ని గ్యాసిఫికేషన్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ‘ఈ బదలాయింపు అనేది సిన్‌గ్యాస్ విలువను అన్‌లాక్ చేయడానికి తోడ్పడుతుంది అలాగే కంపెనీ ప్రధాన ఇంధన వనరుగా పునరుత్పాదకాల వైపు మళ్లడానికి సహాయపడుతుంది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇంధన వ్యయాల్లో తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించడానికి అలాగే నమ్మకమైన ఇంధన సరఫరాకు సిన్‌గ్యాస్ భరోసాగా నిలుస్తోంది. జామ్‌నగర్ రిఫైనరీలో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. -
అంబానీ కారు బాంబు కేసులో మరో పోలీస్ అరెస్టు
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట దొరికిన కారు బాంబు కేసులో ఎన్ఐఏ అధికారులు మరో పోలీసు సునీల్ మానెను అరెస్టు చేశారు. కారు ఓనర్ హిరానీ హత్యకు సునీల్ మానెకు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు వివరించి ఈ నెల 28 వరకూ కస్టడీలోకి తీసుకుంది. సునీల్‌ను ఈ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, దాంతో పాటు ఆయనకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను, కాల్ రికార్డులను పరిశీలించాలని భావిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది. ( చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! ) -
మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ!
భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ప్రపంచ కుబేరులైన ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ కంటే అదానీ 2021లో ఎక్కువ సంపదను సంపాదించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించే వ్యక్తిగా నిలిచారు. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలిన అన్నీ షేర్ల ధరలు 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం విశేషం. అదానీ భారతదేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. అదానీ గ్రూప్ కు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. గత నెలలో 1 గిగావాట్ సామర్థ్యం డేటా సెంటర్‌ను దేశంలో అభివృద్ధి చేయడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒక ఒప్పందంపై కూడా సంతకం చేసింది. దింతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్ అడుగుపెట్టినట్లయ్యింది. ఈ సంవత్సరం అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 పెరిగితే ప్రధానమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 90 శాతం పురోగతి సాధించింది. అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ షేర్లు 79 శాతం, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ షేర్లు 52శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు గత ఏడాది 500 శాతం పైగా పెరిగిన మళ్లీ ఈ ఏడాదిలో 12 శాతం పెరిగింది. చదవండి: ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త! నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు! -
అంబానీ ఇంటి వద్ద కలకలం: వెలుగులోకి ఐఎం ఉగ్రవాది
ముంబై: ఆసియా కుబేరుడు, పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుండగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపింది తామే అంటూ ఓ ఉగ్రవాద సంస్థ గతంలో ప్రకటించుకుంది. జైషే ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ టెలిగ్రాం వేదికగా ఈ ప్రకటన చేసింది. కాగా, ఈ టెలిగ్రాం మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. ఇక్కడ శిక్ష అనుభవిస్తోన్న ఉగ్రవాదులు కొందరు ఈ టెలిగ్రామ్ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గురువారం తీహార్ జైలు అధికారులను కలిశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ ప్రమోద్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘టెలిగ్రాం మెసేజ్ ఆధారంగా ముంబై పోలీసులు ఓ ప్రైవేట్ సైబర్ ఏజెన్సీ సాయంతో లోకేషన్‌ని ట్రేస్ చేయగా.. తీహార్ జైలు వెలుగులోకి వచ్చింది. దాంతో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్పెషల్ సెల్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్ జైలు అధికారులు సోదాలు నిర్వహించగా.. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహిసీన్ అఖ్తర్ సహా అల్‌ఖైదాతో సంబంధాలున్నవారు, అండర్‌వరల్డ్ డాన్లు ఉంటున్న బ్యారక్‌లో మొబైల్ ఫోన్ ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఉగ్రవాది అఖ్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అతడినే అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ క్రమంలో తీహార్ జైలులో కనీసం 11 మంది జైలు ఖైదీలను ప్రశ్నించినట్టు జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొబైల్ నంబరు వినియోగదారు టెలిగ్రామ్ ఖాతాను సృష్టించడానికి వర్చువల్ నంబర్లను వినియోగించాడు.. అంతేకాకుండా, అనుమానితుడు నెట్లో ఐపీ అడ్రస్‌ను గుర్తించకుండా ఉండేందుకు టీఓఆర్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులు నియమించిన సైబర్ నిపుణులు టెలిగ్రామ్ ఛానల్ గురించి సమాచారం పొందడానికి ట్రోజన్లను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఈ టెలిగ్రాం గ్రూప్‌ను క్రియేట్ చేసినట్టు కనుగొన్నారు. అంబానీ నివాసం వెలుపల వాహనాన్ని నిలిపి ఉంచిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ ఉగ్రవాద గ్రూపు ఫిబ్రవరి 27న టెలిగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది. కానీ ముంబై పోలీసులు దీన్ని ఫేక్ అంటూ కొట్టి పారేశారు. ఇక తెహిసీన్ అఖ్తర్ 2014, నరేంద్ర మోదీ ర్యాలీ సందర్భంగా పాట్నాలో సీరియల్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినందుకు గాను ఇతడిని అరెస్ట్ చేశారు. అఖ్తర్‌కు గతంలో హైదరాబాద్, బోధ్‌గయాలో జరిగిన పేలుళ్లతో కూడా సంబంధం ఉంది. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’ జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’ -
అంబానీ ఇంటి వద్ద కారుబాంబు.. ‘ఏదో తేడా కొడుతోంది’
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారుబాంబు కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం స్పందించారు. రాష్ట్ర పోలీసు శాఖ విచారించగల కేసును ఎన్ఐఏకు అప్పగించడం చూస్తే ఏదో తేడా కొడుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ అధికారులు ఎల్లప్పుడూ ఉంటారని ఎన్ఐఏను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఆటో పార్ట్స్ డీలర్ మన్సుఖ్ హిరాన్ మరణోదంతాన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించామని, ఈ నేపథ్యంలో ఎన్ఐఏకు కేసు వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హిరాన్ మరణంపై ఏటీఎస్ ఆదివారమే కేసు నమోదు చేసిందని, దానిపై ఏటీఎస్ విచారణ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర యంత్రాంగం ఈ కేసును విచారించగలదని ప్రతిపక్ష బీజేపీ విశ్వసించడం లేదని, అది పనిచేయడం లేదని చూపించాలని అనుకుంటోందని విమర్శించారు. ఒకవేళ వారు అలా భావిస్తే ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వమే పన్నులను తగ్గించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన మోహన్ దేల్‌కరంద్ ఆత్మహత్య చేసుకోవడంపై కూడా రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారని, అన్ని వివరాలను బయటపెడతామని అన్నారు. అన్నిసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి మరణంపై బీజేపీ ఎందుకు వ్యూహాత్మక మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి -
అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. గత నెల 26న ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోని నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. వాహనం లోపల ఒక బ్యాగును, లేఖను కనుగొన్నారు పోలీసులు. ‘ముఖేశ్ భయ్యా, నీతా బాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’’ అని లేఖలో రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత యాంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దుండగులు వాడిన స్కార్పియోను విఖ్రోలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో. తాజాగా దాని ఓనర్ మరణించడం సంచలనం సృష్టిస్తోంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం.. ఇది ట్రైలర్ మాత్రమే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు -
తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు
ముంబై: అంబానీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. నీతా- ముఖేష్ అంబానీ దంపతులు బామ్మ- తాతయ్యలుగా ప్రమోషన్ పొందారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. నీతా- ముఖేష్ అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు. ధీరూభాయి- కోకిలాబెన్ మునిమనవడికి స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది’’ అంటూ శుభవార్తను పంచుకుంది. కాగా గతేడాది మార్చిలో ఆకాశ్- శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటయ్యారు. శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అన్న విషయం తెలిసిందే.(చదవండి: ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు) ఇక ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన సంతానం కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లైన ఆయన కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
5జీ సేవలకు సన్నద్ధం : ముఖేష్ అంబానీ
ముంబై : రిలయన్స్ జియో కేవలం మూడేళ్లలోనే 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించగా, ఇతర టెలికాం కంపెనీలకు 2జీ నెట్వర్క్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీని ఉద్దేశించి ముఖేష్ మాట్లాడుతూ జియో ప్రస్ధానాన్ని వివరించారు. జియో 4జీ నెట్వర్క్ ద్వారా భారతీయులకు అల్ట్రా హైస్పీడ్ కనెక్టివిటీ, సహేతుకమైన ధరల్లో ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తీరును ముఖేష్ అంబానీ గుర్తుచేశారు. జియోకు ముందు భారత్ 2జీ టెక్నాలజీకే పరిమితమైందని, భారత్ డేటా కష్టాలకు ముగింపు పలకాలని జియో నిర్ణయించుకుని డిజిటల్ విప్లవాన్ని చేపట్టిందని చెప్పారు. దేశమంతటా అత్యధిక వేగంతో పాటు మెరుగైన కవరేజ్‌తో ప్రపంచ శ్రేణి డిజిటల్ నెట్‌వర్క్‌ను సృష్టించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను తాము ప్రవేశపెట్టామని, జియో యూజర్లకు వాయిస్ సేవలను పూర్తి ఉచితంగా అందించామని చెప్పుకొచ్చారు. జియోకు ముందు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్ ఫోన్లతో సాధ్యంకాక వందకోట్ల భారతీయుల్లో సగానికి పైగా డిజిటల్ ఉద్యమానికి దూరంగా ఉన్నారని అన్నారు. 2016లో టెలికాం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్ధానంలో ఉన్న భారత్ అగ్రస్ధానానికి ఎగబాకిందని తెలిపారు. జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లో చేరుతున్నారని చెప్పారు. భారత్‌లో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి ఎగబాకిందని, ఇక అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని వివరించారు. దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం జరుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి : రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్.. -
కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద
ముంబై : భారత్‌లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి, కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 8,800 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ 2020 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్‌ను మళ్లీ నిలుపుకున్నారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్‌లో కొనసాగడం గమనార్హం. ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్ ఇండియా జాబితాలో ముఖేష్ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్‌లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్ వ్యాఖ్యానించింది. ముఖేష్ అంబానీ వరుసగా 13వ సారి భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా ఆరో ర్యాంక్‌ను సాధించి టాప్ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడికి కీలకమైన మందులు, వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన ఫార్మా దిగ్గజాల సంపద అనూహ్యంగా పెరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా సంపద శాతాల ప్రాతిపదికన అత్యధికంగా ఎగిసిందని, కొద్దిమంది బిలియనీర్ల సంపద మాత్రం గత ఏడాదితో పోలిస్తే 2020లో తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. చదవండి : ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు -
ముకేశ్ ఈ ఏడాది కూడా 15 కోట్లే తీసుకున్నారు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాది కూడా జీతభత్యాల కింద రూ. 15 కోట్లే తీసుకున్నారు. కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో వ్యాపారాలు గాడిన పడేంత వరకూ ఈ ఏడాది .. పూర్తి వేతనాన్ని వదులుకోనున్నారు. సంస్థ తాజా వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2008–09 ఆర్థిక సంక్షోభ కాలం నుంచి ముకేశ్ అంబానీ తన జీతభత్యాలపై స్వయంగా నియంత్రణ విధించుకున్నారు. (ముఖేష్ అంబానీని ముందుండి నడిపించినా..) మరింత అధికంగా పొందే అవకాశాలు ఉన్నా.. అప్పట్నుంచీ రూ. 15 కోట్ల జీతభత్యాలకే పరిమితమయ్యారు. 2019–20లో అంబానీ రూ. 4.36 కోట్లు వేతనం, అలవెన్సుల కింద, కమీషను రూపంలో రూ. 9.53 కోట్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 71 లక్షలు అందుకున్నారు. మరోవైపు, బోర్డులోని ఆయన కుటుంబ సభ్యులు నిఖిల్ మేస్వాని, హితల్ మేస్వానిల జీతభత్యాలు రూ. 20.57 కోట్ల నుంచి రూ. 24 కోట్లకు పెరిగింది. అటు కీలక ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ జీతభత్యాలు రూ. 10.01 కోట్ల నుంచి రూ. 11.15 కోట్లకు చేరింది. దేశీయ కుబేరుడు అంబానీయే భారతీయ కుబేరుడిగా ముకేశ్ అంబానీ హరూన్ జాబితాలో కొనసాగారు. ఈ ఏడాది మార్కెట్ల పతనంలో రిలయన్స్ అధినేత సంపద తొలి 2 నెలల్లో (ఫిబ్రవరి–మార్చి) 19 బిలియన్ డాలర్లు (రూ.1.42 లక్షల కోట్లు) పడిపోయినా కానీ.. తర్వాతి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) 18 బిలియన్ డాలర్లు (రూ.1.35 లక్షల కోట్లు) కోలుకుందని ఈ నివేదిక ప్రస్తావించింది. 2020 మే చివరికి ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ 8వ స్థానానికి చేరినట్టు పేర్కొంది. టాప్–100 ప్రపంచ సంపన్నుల్లో హెచ్‌సీఎల్‌కు చెందిన శివ్‌నాడార్ రూ.1.2 లక్షల కోట్లు (16 శాతం తగ్గుదల), గౌతం అదానీ రూ.1.05 లక్షల కోట్లతో (18 శాతం తగ్గుదల) చోటు దక్కించుకున్నారు. (ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్..) -
ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ కొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచ టాప్-10 కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. తాజాగా ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం లభించింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ఆయనకు 9వ స్థానం దక్కింది. ముకేశ్ అంబానీ నికర సంపద 64.5 బిలియన్ డాలర్లుగా సదరు సంస్థ పేర్కొన్నది. ప్రపంచ సంపన్నుల జాబితాలోకెక్కే క్రమంలో ముకేశ్ అంబానీ.. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్లను అధిగమించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్ బుక్) ఉన్నారు. (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ) ప్రస్తుతం కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్నప్పటికి ముకేశ్ అంబానీ జియో ప్లాట్ ఫామ్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్‌లో 42 శాతం వాటాలు ఉన్న ముఖేశ్ అంబానీ ఇటీవల పెట్టుబడుల పుణ్యమా అని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చేశారు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు రైట్స్ ఇష్యూ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ 115,693.95 కోట్ల రూపాయలు సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడం మరో విశేషం. దీని ద్వారా 53,124.20 కోట్ల రూపాయలను సాధించింది. కేవలం 58 రోజుల్లో 168,818 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకోవడంతో రిలయన్స్ నిర్దేశిత లక్ష్యం నెరవేరింది.() ఇక ముకేష్ అంబానీకి ముంబైలో 4 లక్షల చదరపు అడుగుల్లో 27 అంతస్తుల ఇంద్రభవనం అంటిలియా ఉంది. అంటిలియా నిర్మాణ వ్యయం వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల డాలర్లుంటుందని అంచనా. ఈ ఇంటిలో పార్కింగ్ కోసమే ఆరు అంతస్తులు కేటాయించారు. మూడు హెలిప్యాడ్లు, 68 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, క్రిస్టల్ షాన్డిలియర్లతో కూడిన గొప్ప బాల్రూమ్, బాబిలోన్ ఊగే తోటల స్ఫూర్తితో మూడు అంతస్తుల హ్యంగింగ్ గార్డెన్, యోగా స్టూడియో, హెల్త్ స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి సకల హంగులతో వెలుగొందుతోంది. -
ముఖేష్ అంబానీని ముందుండి నడిపించినా..
ముంబై : ఆయనకు కెమేరాల మెరుపులంటే మోజులేదు..టీవీ స్క్రీన్లపై మెరవాలనే ఆసక్తీ లేదు. ఒంటిచేత్తో రూ వేల కోట్ల కార్పొరేట్ డీల్స్‌ను ఖరారు చేయగల సత్తా ఉన్నా నలుగురిలో పేరుకోసం తహతహలాడే తత్వం కాదు. భారత కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీని ముందుండి నడిపించే శక్తే అయినా ప్రచార పటాటోపాలకు వెనుకుండే వ్యక్తి..ఆయనే మనోజ్ మోదీ. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీకి మనోజ్ మోదీ కుడిభుజం అని కార్పొరేట్ వర్గాలు చెబుతుంటాయి. గుంభనంగా, బహిరంగ వేదికల్లో పెద్దగా కనబడని మోదీని ముఖేష్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతారు. ఫేస్‌బుక్‌తో 570 కోట్ల డాలర్ల భారీ డీల్ సంప్రదింపుల్లో మోదీ కీలక పాత్ర పోషించారు. పెట్రోకెమికల్స్ నుంచి ఇంటర్నెట్ టెక్నాలజీలకు ముఖేష్ తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించాలనే లక్ష్యంలో మనోజ్ మోదీ చురుగ్గా వ్యవహరించారు. రిలయన్స్ జియోలో మరికొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు పెట్టుబడులు పెట్టే ఒప్పందాల్లోనూ ఆయనదే కీలక పాత్రని కార్పొరేట్ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మోదీ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారు. సంస్ధాగత నిర్మాణంపై రిలయన్స్ ప్రచారం చేసుకోకున్నా అంబానీ, మనోజ్ మోదీల సాన్నిహిత్యం ఎలాంటిదో పరిశ్రమ వర్గాలకు తెలుసని, కీలక ఒప్పందాలను ఇరువురు ఖరారు చేస్తూ పకడ్బందీగా వాటి అమలుతీరుకు పూనుకుంటారని వెంచర్ క్యాపిటల్ సంస్థ కలారి క్యాపిటల్ పార్టనర్స్ ఎండీ వాణి కోల పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోల్లో డైరెక్టర్‌గా వ్యవహరించే మనోజ్ మోదీ కంపెనీ ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దడంలోనూ ముందుంటారు. చదవండి : ఫోర్భ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్ -
ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూకు భారీ స్పందన
ముంబై : రూ 53,124 కోట్లతో తాము జారీచేసిన దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ విజయవంతంగా ముగిసిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. రైట్స్ ఇష్యూకు మదుపుదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇష్యూ 1.59 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని తెలిపింది. దేశ, విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లతో పాటు లక్షలాది చిన్న మదుపుదారులు ఈ ఇష్యూ పట్ల ఆసక్తి కనబరిచారు. రైట్స్ ఇష్యూలో ప్రజల వాటా 1.22 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. ఈనెల 10 నుంచి షేర్ల కేటాయింపు జరగనుంది. జూన్ 12న రైట్స్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వద్ద లిస్ట్ కానున్నాయి. రైట్స్ ఇష్యూపై కంపెనీ చేపట్టిన వినూత్న ప్రచారం మంచి ఫలితాలను రాబట్టింది. రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ రైట్స్ ఇష్యూలో పాల్గొన్న వాటాదారులకు ధన్యవాదాలు తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో రైట్స్ ఇష్యూ మైలురాయిలా నిలిచిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో సతమతమవుతున్న సమయంలో ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతమని ముఖేష్ అన్నారు. చదవండి : మరో మెగా డీల్: అంబానీ కల నెలవేరినట్టే! -
జియోలో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు
ముంబై : రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా జియోలో అమెరికన్ కంపెనీ రూ 6549 కోట్లు వెచ్చించనుంది. గత నాలుగు వారాల్లో ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ వంటి టెక్ దిగ్గజాల నుంచి జియో రూ 67,194 కోట్లు సమీకరించింది. భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు డిజిటల్ కనెక్టివిటీ కీలకమనే ముఖేష్ అంబానీ విజన్‌ను తాము పంచుకుంటున్నామని, భారత్‌లో డిజిటల్ విప్లవానికి ముందుండి చొరవ చూపిన జియోతో కలిసి పనిచేస్తామని జనరల్ అట్లాంటిక్ సీఈఓ బిల్ పోర్డ్ అన్నారు. ఇక ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులతో భారత్‌లో డిజిటల్ సొసైటీని పటిష్టపరిచేందుకు మార్గం సుగమం అవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్ -
ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్..
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్బ్స్ 2020 భారత బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ 2.7 లక్షల కోట్ల సంపదతో అగ్ర స్ధానాన్ని నిలుపుకున్నారు. ఏడాది కిందటితో పోలిస్తే రూ 99,000 కోట్ల మేర ఆయన సంపద తరిగిపోయినా నెంబర్ వన్ స్ధానాన్ని ముఖేష్ నిలబెట్టుకున్నారు. ఇక స్టాక్‌మార్కెట్ కుదేలవుతున్నా రిటైల్ దిగ్గజం డీ మార్ట్ అధిపతి రాధాకృష్ణన్ దామాని రూ 1.3 లక్షల కోట్ల సంపదతో భారత్‌లో అత్యంత సంపన్నుల్లో రెండవ స్ధానంలో నిలిచారు. దామాని సంపద 25 శాతం పెరగడంతో ఈ జాబితాలో తొలిసారిగా ఆయన రెండో స్ధానానికి ఎగబాకారు. కోవిడ్-19 ప్రభావం వెంటాడినా దామాని సంపద ఎగబాకడం గమనార్హం. ఓవైపు స్లోడౌన్ సెగలు ఆపై కోవిడ్-19 లాక్డౌన్లతో 2020లో భారత సంపన్నుల రాబడి గణనీయంగా తగ్గిందని ఫోర్బ్స్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గగా బిలియనీర్ల మొత్తం సంపద ఏకంగా 23 శాతం పడిపోయింది. చదవండి : ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా ఇక హెచ్‌సీఎల్ వ్యవస్ధాపకుడు శివ్‌నాడార్ రూ 89,250 కోట్ల సంపదతో భారత బిలియనీర్ల జాబితాలో మూడవ స్ధానం దక్కించుకున్నారు. ఇక ఫోర్బ్స్ జాబితాలో నాలుగో అత్యంత భారత సంపన్నుడిగా రూ 78,000 కోట్ల సంపదతో ఉదయ్ కొటక్ నిలవగా, గౌతం ఆదాని రూ 66,700 కోట్లతో ఐదవ స్ధానంలో ఉండగా, టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ వ్యవస్ధాపకుడు సునీల్ మిట్టల్ రూ 67,000 కోట్ల సంపదతో ఆరో స్ధానంలో నిలిచారు. ఇక సైరస్ పూనావాలా, కుమార్ బిర్లా, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్‌జీ-దిలీప్ సంఘ్వీలు టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటుదక్కించుకున్నారు. -
కోవిడ్-19పై పోరు : ఉద్యోగులకు ముఖేష్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే విపత్కాలంలో ధైర్యంగా సేవలందిస్తున్న తమ ఉద్యోగులను ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసించారు. దేశమంతా లాక్డౌన్లో ఉంటే కోవిడ్-19పై ఆర్ఐఎల్ సమరంలో గ్రూపు సంస్థల ఉద్యోగులు యోధులా నిలిచారని బిలియనీర్ ముఖేష్ ప్రస్తుతించారు. మహమ్మారి కోరల్లో దేశం చిక్కుకున్న ఈ విపత్తు వేళ ఉద్యోగులంతా అంకితభావంతో సేవలందిస్తున్నారని రెండు లక్షలకు పైగా ఆర్ఐఎల్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో 130 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా రిలయన్స్ జియో 40 కోట్ల మందికి నిరంతర వాయిస్ కాల్స్, మొబైల్‌పై ఇంటర్నెట్ సేవలను అందించిందని, రిలయన్స్ రిటైల్ ద్వారా లక్షలాది మందికి నిత్యావసరాలు, ఆహారం సరఫరా సమకూరిందని చెప్పారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు టెస్టింగ్ సామర్థ్యాల పెంపునకు రిలయన్స్ లైఫ్‌సైన్సెస్ సన్నాహాలు చేస్తోందని గుర్తుచేశారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి ముంబైలో కేవలం పదిరోజుల్లోనే వంద పడకల కరోనావైరస్ చికిత్సా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. కంపెనీ రిఫైనరీలు ఇంధన అవసరాలను తీర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇక సిబ్బంది తమ ఆలోచనలు పంచుకునేందుకు మైవాయిస్ వేదికను లాంఛ్ చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించి మనం సురక్షితంగా, ఆరోగ్యకరంగా ముందుకెళతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : కరోనా: థాంక్స్ చెప్పిన ముఖేష్ అంబానీ! -
ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా
న్యూఢిల్లీ : ముడిచమురు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రపంచ కుబేరుల స్ధానాలనూ కదిలించింది. ఆసియాలో అత్యంత సంపన్నుడి స్ధానాన్ని భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ కోల్పోయారు. షేర్‌మార్కెట్ కుదేలవడంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్ధానాన్ని అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా ఆక్రమించారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ముఖేష్ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారని పేర్కొంది. కరోనా వైరస్ భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్న క్రమంలో 30 ఏళ్ల కనిష్టస్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. రిలయన్స్ షేర్లు సైతం ఏకంగా 12 శాతం పతనమయ్యాయి. అయితే ప్రతికూల పరిణామాలు తాత్కాలికమేనని ముఖేష్ అంబానీ (62) తిరిగి సత్తా చాటుతారని ఈక్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌కు చెందిన హరీష్ హెచ్వీ అన్నారు. అంబానీ టెలికాం బిజినెస్ రానున్న సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకొచ్చారు. చదవండి : కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే? -
టాప్ 3 ఎకానమీల్లోకి భారత్
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్.. కచ్చితంగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ డిజిటల్ సమాజంగా భారత్ రూపొందుతుందని ఆయన చెప్పారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుందన్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘ప్రపంచంలోని టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. ఇందుకు అయిదేళ్లు పడుతుందా లేక పదేళ్లు పడుతుందా అన్నది చెప్పలేము కానీ.. కచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. అప్పటికల్లా మన దేశం సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందినదిగా ఉంటుందా? అభివృద్ధి పనుల్లో టెక్నాలజీ వాడకం ఎలా ఉంటుంది? టెక్నాలజీ వినియోగం విషయంలో మనం మిగతా వాళ్లకు దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉండగలమా? ఇలాంటి విషయాలను మనం తేల్చుకోవాలి. ప్రపంచంలోనే ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఎదిగేందుకు భారత్ ముందు అద్భుతమైన అవకాశం ఉంది. మనం అస్త్రశస్త్రాలన్నీ అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్లడమే తరువాయి‘ అని అంబానీ చెప్పారు. 300 బిలియన్ డాలర్ల నుంచి ..3 ట్రిలియన్ డాలర్లకు.. సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు భారత ఎకానమీ పరిమాణం 300 బిలియన్ డాలర్లుగా ఉండేదని.. ప్రస్తుతం ఇది 3 ట్రిలియన్ డాలర్లకు ఎగిసిందని ముకేశ్ అంబానీ చెప్పారు. టెక్నాలజీ ఊతంతోనే ఇది సాధ్యపడిందన్నారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టాక పురోగతి మరింత వేగవంతం అయిందన్నారు. ‘జియో రాక ముందు దేశీయంగా డేటా ఖరీదు జీబీకి రూ. 300 నుంచి రూ. 500 దాకా ఉండేది. 2జీ ఫోను ఉపయోగించే అత్యంత సామాన్యుడికైతే ఏకంగా రూ. 10,000 దాకా జీబీ ధర ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత ఇది జీబీకి రూ. 12–14 స్థాయికి తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో 38 కోట్ల మంది కస్టమర్లు 4జీ టెక్నాలజీకి మారారు. సగటు నెట్ స్పీడ్ 256 కేబీపీఎస్ నుంచి ఇప్పుడు 21 ఎంబీపీఎస్‌కు చేరింది‘ అని ఆయన తెలిపారు. ట్రంప్ చూస్తున్నది.. నవ భారతం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను కూడా అంబానీ ప్రస్తావించారు. గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షులు కార్టర్ గానీ బిల్‌క్లింటన్.. ఆఖరుకు ఇటీవలి బరాక్ ఒబామా కూడా చూడని ఒక కొత్త భారత్‌ను ట్రంప్ నేడు చూస్తున్నారని ఆయన చెప్పారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు, తండ్రి ధీరూభాయ్ అంబానీ అప్పట్లో ఒక టేబులు, కుర్చీ, చేతిలో రూ. 1,000 పెట్టుబడితో ప్రారంభించిన స్టార్టప్ సంస్థ నేడు దిగ్గజంగా వృద్ధి చెందిందని తెలిపారు. చిన్న వ్యాపారస్తులైనా.. ధీరూభాయ్ లేదా బిల్‌గేట్స్ స్థాయికి ఎదిగేందుకు భారత్‌లో పుష్కలమైన అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని తెలియజెప్పడానికి ఇది నిదర్శనంగా అంబానీ వివరించారు. నాదెళ్లపై ప్రశంసలు.. మైక్రోసాఫ్ట్‌కి సత్య నాదెళ్ల సారథ్యం వహించడం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని అంబానీ చెప్పారు. సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవాలి ముంబై: సమ్మిళిత వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెట్టాలని, సొంతంగా సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భారతీయ సంస్థలకు సూచించారు. గత దశాబ్దంలో మొబైల్ ద్వారా స్మార్ట్ టెక్నాలజీలు విరివిగా వాడకంలోకి వచ్చాయన్నారు. అయితే, అగ్రిగేటర్ సంస్థలు మాత్రమే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందాయని పేర్కొన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవోల సదస్సులో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. టెక్నాలజీ భవిష్యత్తు, భారతీయ కంపెనీలతో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేసే తీరుతెన్నులు మొదలైన వాటి గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘మనం ఏదైనా టెక్నాలజీని రూపొందించినప్పుడు.. సమ్మిళిత ఆర్థిక వృద్ధికి అది ఏవిధంగా ఉపయోగపడుతుందన్నది కూడా దృష్టిలో ఉంచుకోవాలి‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. నాయకత్వ హోదాల్లో ఉన్న సంస్థలు ఓవైపు సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకుంటూనే మరోవైపు టెక్నాలజీపరమైన మార్పులను సాధ్యమైనంత త్వరగా అందిపుచ్చుకోవాలని చెప్పారు. గడిచిన దశాబ్దంలో వినియోగదారుల వ్యయాల ధోరణులే ప్రధానమన్న రీతిగా ఎకానమీ నడిచిందని.. కానీ ఆర్థిక వ్యవస్థ అంటే అదొక్కటే కాదని నాదెళ్ల తెలిపారు. టెక్నాలజీని వివిధ ప్రక్రియల్లో విరివిగా వాడే కంపెనీలన్నీ కూడా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మొదలైన అంశాల్లో సంబంధిత వర్గాల విశ్వాసం చూరగొనే విధంగా వ్యవహరించాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీ ఉద్యోగాల తీరు.. సాంకేతిక రంగంలో ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతున్నాయని, కొంగొత్త నైపుణ్యాల్లో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతుండటం కీలకంగా మారిందని ఆయన చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సుమారు 72 శాతం ఉద్యోగాలు.. టెక్నాలజీయేతర కంపెనీల్లోనే ఉంటున్నాయన్న నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ డేటా ఇందుకు నిదర్శనమని చెప్పారు. పిరమల్ గ్లాస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీల్లో సాంకేతికత వినియోగాన్ని నాదెళ్ల ప్రస్తావించారు. రిలయన్స్‌తో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం .. రాబోయే దశాబ్దంలో అత్యంత కీలకమైనదిగా ఆయన అభివర్ణించారు. -
మెగా డీల్ : ఆర్ఐఎల్, ఆరాంకో చర్చలు ముమ్మరం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ తన చమురు, రసాయనాల విభాగంలో మైనారిటీ వాటా విక్రయానికి సంబంధించి సౌదీ అరాంకోతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందంపై ఆరాంకో అధికారులు, బ్యాంకర్లు ఈ నెలలో ముంబైలోని రిలయన్స్ కార్యాలయాలకు చేరుకుని విలువ మదింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని సమాచారం. ఈ భారీ ఒప్పందంపై తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీలు సంసిద్ధమయ్యాయి. సెప్టెంబర్ మాసాంతంలో జరిగే వార్షిక వాటాదారుల సమావేశం లోగా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆర్ఐఎల్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు. చదవండి : భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ గత ఏడాది ఆగస్ట్‌లో తన ఆయిల్, పెట్రోకెమికల్స్ డివిజన్ విలువ 7500 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. ఆ ప్రకారం 20 శాతం వాటా 1500 కోట్ల డాలర్లు పలకనుంది. ఈ విలువ ప్రామాణికంగా విక్రయ ప్రక్రియ పూర్తయితే ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా కొనుగోలు అనంతరం ఇదే భారీ అతిపెద్ద లావాదేవీగా నమోదవనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రిలయన్స్ ఆయిల్, పెట్రోకెమికల్ డివిజన్లో 20 శాతం వాటా విక్రయానికి ఆర్ఐఎల్, సౌదీ ఆరాంకో అంగీకరించాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడటం కోసం ఫిబ్రవరి 25న ఢిల్లీలో ఆయన కార్పొరేట్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయన్ను కలిసేందుకు సిద్ధంగా ఉన్న దిగ్గజ సీఈఓల జాబితాలను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్‌ను కలవనున్న ప్రముఖుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఎల్అండ్టీ చైర్మన్ ఏ.ఎం నాయక్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. -
అదరగొట్టిన రిలయన్స్..
ముంబై : డిసెంబర్ క్వార్టర్లో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రోత్సాహకర త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో ఆర్ఐఎల్ నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లు ఆర్జించింది. కన్జ్యూమర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ సామర్థ్యం కనబరిచింది. ఇక ఈ త్రైమాసంలో కన్సాలిడేటెడ్ ఫలితాలను పరిశీలిస్తే ఆదాయం 1.4 శాతం తగ్గి రూ 1,68,858 కోట్లుగా నమోదైంది. పన్నుకు ముందు లాభాలు 3.6 శాతం పెరిగి రూ 14,962 కోట్లు కాగా నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లుగా నమోదయ్యాయి. మూడో క్వార్టర్లో తమ ఇంధన వ్యాపారంపై గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం కనిపించిందని, అయితే రిఫైనింగ్ విభాగంలో మెరుగైన సామర్ధ్యం కనబరిచామని ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. మరోవైపు కన్జూమర్ వ్యాపారాలు ప్రతి క్వార్టర్లో నూతన మైలురాళ్లను నెలకొల్పుతూ పురోగతి సాగిస్తున్నాయని అన్నారు. కొనసాగిన జియో జోష్.. దేశంలో 4జీ దిశగా మార్పునకు వేగంగా అడుగులు వేస్తూ జియో డిసెంబర్ త్రైమాసంలో అన్ని విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. మూడవ క్వార్టర్లో అదనంగా 3.7 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు జియో నెట్‌వర్క్‌కు తోడయ్యారు. ఆదాయం రూ 13,968 కోట్లకు పెరగడంతో నికర లాభం గత క్వార్టర్‌తో పోలిస్తే 36.4 శాతం వృద్ధితో రూ 13.50 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మెరుగైన మొబైల్ కనెక్టివిటీ సేవలతో కస్టమర్లను ఆకర్షిస్తూ జియో తన విజయవంతమైన ప్రస్ధానం కొనసాగిస్తోందని అన్నారు. అందుబాటైన ధరలో ప్రజలకు అసాధారణ డిజిటల్ అనుభూతిని అందించడంపై జియో దృష్టిసారిస్తుందని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా నెట్వర్క్ సామర్ధ్యాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు. చదవండి : జియో ఫైబర్ సంచలన ఆఫర్లు -
సత్తా చాటిన ఆర్ఐఎల్
ముంబై : స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరడంతో ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10 లక్షల కోట్లకు చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా సత్తా చాటింది. గురువారం ఉదయం పది గంటలకు ఆర్ఐఎల్ షేర్ రూ 1579కు చేరగానే అదేసమయంలో కంపెనీ షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ 10 లక్షల కోట్లు పలికింది. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేర్ 41 శాతం పెరగ్గా, బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 12 శాతం పైగా లాభపడింది. ఈ ఏడాది అక్టోబర్ 18న ఆర్ఐల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 9 లక్షల కోట్లకు చేరగా మరో నెలలోనే మరో రూ లక్ష కోట్ల మేర తన విలువను పెంచుకోగలిగింది. రూ 7.81 లక్షల కోట్లతో ఆర్ఐఎల్ తర్వాత టీసీఎస్ రెండో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీగా నమోదైంది. -
భారత్ అలీబాబాకు పారిశ్రామిక దిగ్గజం సన్నాహాలు
ముంబై : పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చైనాలో అలీబాబా తరహాలో భారత్‌లో ఈకామర్స్ దిగ్గజ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ షాపింగ్ మార్కెట్లో కీలక వాటా దక్కించుకోవాలన్న తన కలను పండించుకునేందుకు రూ 1.73 లక్షల కోట్లతో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నారు. రూ 65,000 కోట్లతో ఏర్పడే హోల్డింగ్ కంపెనీకి రిలయన్స్ జియోలో కంపెనీకి ఉన్న రూ 65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని తరలిస్తారు. మరోవైపు జియో రుణాలన్నింటినీ మాతృసంస్థకు తరలిస్తారు. దీంతో 2020 మార్చి నాటికి జియో పూర్తిగా రుణ రహిత కంపెనీగా ఎదుగుతుంది. మరోవైపు ముఖేష్ ఈకామర్స్ ప్రణాళికలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు గ్రీన్‌సిగ్నల్ లభించింది. చమురు పెట్రోకెమికల్ గ్రూప్‌తో లాభాల వేటలో ముందున్న ఆర్ఐఎల్ను రానున్న రోజుల్లో వృద్ధి బాటన పరుగులు పెట్టించేందుకు డేటా, డిజిటల్ సర్వీసులపై ముఖేష్ అంబానీ దృష్టిసారించారు. అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లతో తలపడేందుకు భారీ పెట్టుబడులతో ఈకామర్స్ ఫ్లాట్‌ఫాం ముఖేష్ అడుగుపెడుతుండటంతో ఈ-మార్కెట్లో రసవత్తర పోరుకు తెరలేవనుంది. రిలయన్స్ రాబడుల్లో ప్రస్తుతం 32 శాతంగా ఉన్న రిటైల్ సహా నూతన వ్యాపారాలు రానున్న కొన్నేళ్లలో దాదాపు సగానికి పెరుగుతాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ పేర్కొనడం గమనార్హం. ఈకామర్స్ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు కొన్ని సంస్థల్లో వాటా కొనుగోళ్లు, స్వాధీనాలపైనా ముఖేష్ కసరత్తు సాగిస్తున్నారు. ఈకామర్స్ ప్రణాళికల దిశగా వ్యూహాత్మక భాగస్వాములు ఆసక్తి కనబరిచారని ముఖేష్ అంబానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఫోర్బ్స్ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ 2019 ఏడాదికిగాను ఫోర్బ్స్ ప్రకటించిన భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచారు. 51.4 బిలియన్ డాలర్ల (రూ 3.85 లక్షల కోట్ల) విలువైన నికర ఆస్తులతో ముఖేష్ అంబానీ వరుసగా 12వ సారి భారత సంపన్నుల్లో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది సంక్లిష్ట సంవత్సరమైనా ఆర్ఐఎల్ టెలికాం విభాగం జియో సత్తా చాటడంతో ముఖేష్ అంబానీ సంపదకు 400 కోట్ల డాలర్లు పైగా తోడయ్యాయని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక ముఖేష్ తర్వాత బిజినెస్ దిగ్గజాలు గౌతం ఆదాని, హిందుజా బ్రదర్స్, పలోంజి మిస్త్రీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్‌ల సంపద కూడా ఈ ఏడాది గణనీయంగా వృద్ధి చెంది వరుసగా రెండు నుంచి ఐదు స్ధానాల్లో నిలిచారని తెలిపింది. ఇంకా ఈ జాబితాలో టాప్ 10 స్ధానాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడార్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ అధినేత దమాని, గోద్రెజ్ కుటుంబం, పారిశ్రామిక దిగ్గజాలు కుమార మంగళం, బిర్లా ఫ్యామిలీలు నిలిచాయి. విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ టాప్ 17వ స్ధానం దక్కించుకున్నారు. -
జియో ఫైబర్ : సంచలన ఆఫర్లు
న్యూఢిల్లీ: 4జీ మొబైల్ సేవల్లో చౌక టారిఫ్‌లతో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్లో మరొ కొత్త సంచలనానికి తెరతీసింది. దేశీ నెట్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జియో ఫైబర్ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో గురువారం ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్(మెగాబైట్స్ పర్ సెకన్) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్(గిగాబైట్స్ పర్ సెకన్) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అన్లిమిటెడ్ బ్రాండ్‌బాండ్‌తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాలింగ్, టీవీ ద్వారా వీడియోకాలింగ్/కాన్ఫరెన్స్ సదుపాయం వంటి అనేక సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఆరు రకాల ప్లాన్లు.. ఫైబర్ నెట్ సేవలకు మొత్తం ఆరు రకాల ప్లాన్లను రిలయన్స్ జియో ఆవిష్కరించింది. ఇందులో కనీస నెలవారీ చార్జీ(బ్రాంజ్ ప్లాన్) రూ.699 (స్పీడ్ 100 ఎంబీపీఎస్) కాగా, గరిష్టంగా రూ.8,499 (టైటానియం ప్లాన్-స్పీడ్ 1 జీబీపీఎస్) చార్జీ చేయనుంది. ఇంకా సిల్వర్ ప్లాన్ అయితే నెలకు రూ.849 (100 ఎంబీపీఎస్ స్పీడ్); గోల్డ్ ప్లాన్‌కు రూ.1,299 (స్పీడ్ 250 ఎంబీపీఎస్); డైమండ్ ప్లాన్‌కు రూ.2,499 (స్పీడ్ 500 ఎంబీపీఎస్); ప్లాటినం ప్లాన్‌కు రూ.3,999 (స్పీడ్ 1 జీబీపీఎస్) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆరు ప్లాన్లపైనా అదనంగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఏ ప్లాన్ తీసుకున్నా సేవలు పొందాలంటే ముందుగా (వన్‌టైమ్) రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్, రూ.1,000 నాన్-రిఫండబుల్ ఇన్స్టలేషన్ చార్జీల రూపంలో కంపెనీ వసూలు చేస్తుంది. కాగా, ఫెయిర్ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ) కింద డౌన్లోడ్ పరిమితిని గనుక దాటితే నెట్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. బ్రాంజ్ ప్లాన్‌లో డౌన్లోడ్ ఎఫ్‌యూపీ పరిమితి 100 జీబీ కాగా, అదనంగా మరో 50 జీబీ(ప్రారంభ ఆఫర్ కింద 6 నెలలు మాత్రమే ఇస్తారు) లభిస్తుంది. ఇక సిల్వర్ ప్లాన్‌లో డౌన్లోడ్ పరిమితి 200 జీబీ(మరో 200 జీబీ అదనం), గోల్డ్ ప్లాన్‌లో 500+250 జీబీ, డైమండ్ ప్లాన్‌లో 1250+250 జీబీ, ప్లాటినం ప్లాన్‌లో 2,500 జీబీ, టైటానియం ప్లాన్‌లో 5,000 జీబీ చొప్పన ఎఫ్‌యూపీ డౌన్లోడ్ పరిమితి ఉంటుంది. ఇక ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.699 ప్లాన్ తీసుకున్నవారికి మూడు నెలల పాటు జియో సినిమా, జియో సావన్‌లు ఉచితంగా లభిస్తాయి. రూ.849 ప్లాన్‌కు మూడు నెలలు వీడియో ఎంటర్టైన్మెంట్ యాప్స్ వాడుకోవచ్చు. హోమ్ నెట్వర్కింగ్, వీఆర్, వీడియో కంటెంట్ సేవల కోసం, అదేవిధంగా టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ కోరుకునే యూజర్లు తగిన పరికరాలను(డివైజెస్) కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది. ‘ప్రస్తుతం దేశంలో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బాండ్ వేగం సగటున 25 ఎంబీపీఎస్‌గా ఉంది. అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కూడా సగటు వేగం 90 ఎంబీపీఎస్. అయితే, జియో ఫైబర్ ప్రారంభ నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి ప్రారంభమై 1 జీబీపీఎస్ వరకూ ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే టాప్-5 బ్రాడ్‌బాండ్ వినియోగ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది’ అని జియో ఫైబర్ ఒక ప్రకటలో పేర్కొంది. వెల్కమ్ ఆఫర్‌తో ఉచితంగా టీవీ... ఫైబర్ నెట్ సేవల కోసం వార్షిక చందా ఒకేసారి చెల్లించే వారికి వెల్కమ్ ఆఫర్‌ను కూడా జియో ప్రకటించింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో పాటు జియో హోమ్ గేట్‌వే(సెక్యూరిటీ సేవలు-విలువ దాదాపు రూ.5,000), 4కే సెట్‌టాప్ బాక్స్(విలువ సుమారు రూ.6,400) లభిస్తుంది. ఇక గోల్డ్, అంతకుమించిన ప్లాన్లను వెల్కమ్ ఆఫర్లో వార్షికంగా సబ్స్క్రయిబ్ చేస్తే టీవీ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇంకా ఓటీటీ(ఓవర్ది టాప్ వీడియో స్ట్రీమింగ్ సేలు) యాప్స్ ద్వారా నచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌ను చూసే అవకాశం కూడా ఉంటుంది. జియో ఫైబర్‌లో సేవలు ఇవీ... ♦ అల్ట్రాహైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ (1 జీబీపీఎస్ వరకూ) ♦ ఉచిత వాయిస్ కాలింగ్(దేశీయంగా), కాన్ఫరెన్సింగ్, ఇంటర్నేషనల్ కాలింగ్ ♦ టీవీ వీడియో కాలింగ్/కాన్ఫరెన్సింగ్ ♦ ఎంటర్టైన్మెంట్ ఓటీటీ యాప్స్ ♦ గేమింగ్ ♦ హోమ్ నెట్వరర్కింగ్ (ఇంటా, బయటా కూడా కంటెంట్ షేరింగ్) ♦ డివైస్ సెక్యూరిటీ(నార్టన్ యాంటీవైరస్) ♦ వర్చువల్ రియాలిటీ(వీఆర్) హెడ్సెట్ వినియోగానికి అనుకూలం(థియేటర్లో చూసిన అనుభూతి) ♦ ప్రీమియం కంటెంట్(ఫస్ట్‌డే ఫస్ట్ షో సినిమాలు, స్పెషల్ స్పోర్ట్్స కంటెంట్) సేవలు పొందడం ఎలా... జియో ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకోవాలంటే ముందుగా www.jio.com వెబ్సైట్ ద్వారా లేదా మైజియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత వివరాలన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. కస్టమర్ ఇచ్చిన అడ్రస్ పరిధిలో జియో ఫైబర్ అందుబాటులో ఉంటే.. సర్వీస్ ప్రతినిధులు సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారు. విప్లవాత్మకమైన సేవలు... ‘రిలయన్స్ జియో ఫైబర్ కస్టమర్లకు అత్యధ్బుతమైన బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించాం. బ్రాడ్‌బాండ్ సేవల్లో ఇది ఒక విప్లవాత్మకమైన ముందడుగు. మరిన్ని అధునాతన సేవలను వినియోగదారులకు అందించేందుకు ఎల్లవేళలా కృషిచేస్తూనే ఉంటాం. తద్వారా జియో ఫైబర్‌ను కొత్త శిఖరాలకు చేరుస్తాం. అంతేకాకుండా ముందస్తుగా జియో ఫైబర్ సేవలను అందిపుచ్చుకున్న (ప్రివ్యూ యూజర్స్) 5 లక్షల మంది సబ్స్క్రయిబర్స్కు కృతజ్ఞతలు’. - ఆకాశ్ అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్ ప్లాన్ ప్రయోజనాలు 1.డేటా (30 రోజులకు హైస్పీడ్,ఎఫ్‌యూపీ దాటితే 1ఎంబీపీఎస్) అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ 100జీబీ+50జీబీ 200జీబీ+200జీబీ) 500జీబీ+250జీబీ 1250జీబీ+250జీబీ) 2500జీబీ 5000జీబీ 2. వాయిస్ కాలింగ్ (దేశంలో ఎక్కడికైనా) ఉచితం 3. టీవీ వీడియో కాలింగ్/ ఏడాదికి రూ.1,200 విలువ చేసే సేవలుకాన్ఫరెన్సింగ్ 4. గేమింగ్ ఏడాదికి రూ.1,200 విలువ చేసే సేవలు 5. హోమ్ నెట్వర్కింగ్(కంటెంట్ షేరింగ్ ఇంటాబయటా) వర్తిస్తుంది 6. డివైజ్ సెక్యూరిటీ(నార్టన్) 5 డివైజ్‌ల వరకూ(ఏడాదికి రూ.999 విలువ) 7. వీఆర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్ 8. ప్రీమియం కంటెంట్(ఫస్ట్‌డే ఫస్ట్ షో మూవీస్, స్పెషల్ స్పోర్ట్స్) ప్లాట్‌ఫామ్ యాక్సెస్) -
సెక్యూరిటీ సేవల్లోకి జియో
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరిన్ని కొత్త రంగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. తాజాగా అపార్ట్మెంట్ల భద్రత నిర్వహణ సేవల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో జియో గేట్ పేరిట కొత్త యాప్ ప్రత్యక్షమవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో విజిటర్లు మొదలుకుని రోజువారీ సిబ్బంది, డెలివరీ బాయ్స్, క్యాబ్స్ దాకా అన్నింటి రాకపోకల వివరాల నిర్వహణ అంతా జియోగేట్ క్రమబద్ధీకరిస్తుందని యాప్ గురించిన వివరణలో ఉంది. ‘దొంగతనాలు, నేరాలపై ఆందోళన లేకుండా కమ్యూనిటీ పరిసర ప్రాంతాలను సురక్షితంగా తీర్చిదిద్దేలా సెక్యూరిటీ నిర్వహణ ప్రక్రియను సమూలంగా మారుస్తున్నాం‘ అని యాప్ గురించి జియో పేర్కొంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ..: ప్రస్తుతం మైగేట్, అపార్ట్మెంట్ అడ్డా, స్మార్ట్గార్డ్ వంటి సంస్థలు యాప్ ఆధారిత అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నాయి. జియో గానీ భారీ యెత్తున వస్తే వీటికి గట్టి పోటీనివ్వొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. జియోగేట్ ఫీచర్స్‌ను బట్టి చూస్తే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌నే ఇంటర్‌కామ్ డివైజ్‌గా కూడా వాడుకోవచ్చన్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తామెక్కడ ఉన్నామో కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డుకు తెలియజేసేందుకు వీలుగా పానిక్ అలర్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అయితే, సెక్యూరిటీ సేవల విభాగంలోకి ఎంట్రీపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది. -
జూన్‌లో ‘జియో’ హవా
న్యూఢిల్లీ: నూతన సబ్స్క్రైబర్లను జతచేసుకుంటూ జర్నీని కొనసాగించడంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని ‘రిలయన్స్ జియో’ వాయువేగంతో దూసుకెళ్తోంది. ఇటీవలే సబ్స్క్రైబర్ల పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండవ స్థానానికి చేరిన ఈ సంస్థ.. జూన్‌లో 82.68 లక్షల నూతన సబ్స్క్రైబర్లను జతచేసుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జూన్‌లో వొడాఫోన్ ఐడియా 41.45 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోగా, భారతీ ఎయిర్టెల్ 29,883 కస్టమర్లను వదులుకోవాల్సి వచ్చింది. జూన్ చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల పరంగా.. వొడాఫోన్ ఐడియాకు 38.34 కోట్లు (32.9% మార్కెట్ వాటా), జియోకు 33.12 కోట్లు (28.42%), ఎయిర్‌టెల్‌కు 32.03 కోట్లు (27.49%) ఉన్నాయి. -
రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్
ముంబై : భారత్‌లో అతిపెద్ద ఎఫ్‌డీఐగా రిలయన్స్ రిఫైనరీ, పెట్రోకెమికల్ - సౌదీ ఆరామ్కో ఒప్పందం నిలవనుంది. రిలయన్స్ రిఫైనరీ, కెమికల్ వ్యాపారంలో సౌదీ చమురు దిగ్గజం ఆరామ్కో రూ 5,32,466 కోట్ల మొత్తంతో 20 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆర్ఐఎల్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండు రిలయన్స్ రిఫైనరీలకు ఆరామ్కో రోజుకు 50,000 బ్యారెళ్ల ముడిచమురును సరఫరా చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోని దిగ్గజ వాణిజ్య సంస్థల్లో ఒకటైన సౌదీ ఆరామ్కోను తమ సంస్ధలో కీలక ఇన్వెస్టర్‌గా స్వాగతిస్తున్నామని చెప్పారు. సౌదీ ఆరామ్కోతో తమకు పాతికేళ్లుగా ముడిచమురు రంగంలో అనుబంధం ఉందంటూ ఈ పెట్టుబడులతో తమ బంధం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. భారత నియంత్రణ సంస్థలు, ఇతర అనుమతులు, నిబంధనలకు లోబడి వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి ఒప్పందం కార్యరూపం దాల్చుతుందని వెల్లడించారు. మరోవైపు సౌదీ ఆయిల్ కంపెనీ ఆరామ్కో దుబాయ్‌కు చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ)తో కలిసి మహారాష్ట్రలో పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలు ఏర్పాటు చేసే మెగా రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో 50 శాతం వాటా తీసుకునేందుకు అంగీకరించాయి. భారత ఇంధన రంగంలో అపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సౌదీ ఆయిల్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. -
స్టార్టప్‌లకు ఆర్ఐఎల్ బొనాంజా
ముంబై : రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ చిరువ్యాపారులు, స్టార్టప్ కంపెనీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్టప్‌లకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను ఉచితంగా అందచేస్తామని ప్రకటించారు. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమటెడ్ (ఆర్ఐఎల్) 42 వ ఏజీఎంలో ముఖేష్ అంబానీ ఈ విషయం వెల్లడించారు. అలాగే, ఉచితంగా 5 లక్షల కుటుంబాలకు జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందిస్తామన్నారు. ఇక నెలకు 500 రూపాయలతో ప్రపంచంలో ఎక్కడికైనా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ అత్యధికంగా రూ 67,000 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. -
కాంగ్రెస్ అభ్యర్థికి ముఖేష్ అంబానీ బాసట
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరకు మద్దతు ఇచ్చారు. మిలింద్ దక్షణ ముంబైకి సరైన నాయకుడని అంబానీ చెబుతున్న వీడియోను కాంగ్రెస్ అభ్యర్థి ట్వీట్ చేశారు. దక్షిణ ముంబై నుంచి పది సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన మిలింద్ దియోర ఈ నియోజకవర్గ సామాజికార్థిక సాంస్కృతిక వ్యవహారాలపై లోతైన అవగాహన ఉందని ఈ వీడియోలో అంబానీ చెప్పుకొచ్చారు. మరోవైపు కొటాక్ మహింద్ర బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ కూడా మిలింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఈ వీడియోలో కనిపించారు. దియోర ముంబైకి సరైన ప్రాతినిధ్యం వహించే వ్యక్తని కొనియాడారు. ముంబైలో వ్యాపారాలను పూర్వపు స్థితికి తీసుకురావడం, మన యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తేవడం అవసరమని పేర్కొంటూ దియోర దీటైన వ్యక్తని ఉదయ్ కొటక్ ప్రశంసించారు. ఏప్రిల్ 29న జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో దియోర శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్‌తో తలపడుతున్నారు. -
రియల్టీలోకి ముకేశ్ అంబానీ!!
న్యూఢిల్లీ: చౌక చార్జీల జియోతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ తాజాగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్ తరహాలో భారీ మెగా సిటీకి రూపకల్పన చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గర్లో దీన్ని తలపెట్టినట్లు సమాచారం. ఈ మెగా సిటీ ప్రాజెక్ట్‌లో ప్రతీ విభాగం ఒక భారీ ప్రాజెక్టుగా ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం, పోర్టులకు కూడా దీన్ని అనుసంధానించనున్నట్లు వివరించాయి. ఇది పూర్తయితే ఏకంగా అయిదు లక్షల మందికి నివాసం కాగలదని, వేల కొద్దీ వ్యాపార సంస్థలకు కేంద్రం కాగలదని పేర్కొన్నాయి. వచ్చే పదేళ్లలో దీనిపై దాదాపు 75 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. టెలికం రంగంలో జియోతో చౌక చార్జీల విప్లవం తీసుకొచ్చినట్లే ఈ ప్రాజెక్టులో అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు అందించడంపై అంబానీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా దేశీయంగా పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల స్వరూపాన్ని సమూలంగా మార్చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అభివృద్ధి.. నిర్వహణ కూడా .. ఈ మెగా సిటీని అభివృద్ధి చేయడంతో పాటు దాని పరిపాలనకు సంబంధించి నిర్వహణపరమైన బాధ్యతలు కూడా రిలయన్సే చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ తీసుకున్న స్పెషల్ ప్లానింగ్ అథారిటీ లైసెన్సు ఇందుకు ఉపయోగపడనుంది. ప్రాజెక్టులో నివాసితులకు ప్రభుత్వపరమైన అనుమతులు లభించడంలో జాప్యంతో పాటు ఇతరత్రా వ్యయాలు కూడా దీనివల్ల తగ్గగలవని అంచనా. సాధారణంగా ముంబై ఖరీదైన ప్రాంతం అయినప్పటికీ అవకాశాలరీత్యా భారీగా వలస వస్తుంటారు. అదే చౌక మెగా సిటీ గానీ పూర్తయితే రివర్స్‌లో ముంబై నుంచి కొత్త నగరానికి వలసలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ధీరూభాయ్ కల.. వాస్తవానికి రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 1980లలోనే ఇలాంటి ప్రపంచ స్థా యి నగరాన్ని నవీ ముంబైలో నిర్మించాలని తలపోశారు. తద్వారా దక్షిణ ముంబై, నవీ ముంబైలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించాలని భావిం చారు. ఒకవేళ ఇదే గానీ సాకారమై ఉంటే, ముంబైలో రద్దీ గణనీయంగా తగ్గి ఉండేదని విశ్లేషణ. లీజుకు 4 వేల ఎకరాలు.. అంతర్జాతీయ స్థాయిలో ఎకనమిక్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా నవీ ముంబై సెజ్ (ఎన్‌ఎంసెజ్) నుంచి దాదాపు 4,000 ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు రిలయన్స్ ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 2,180 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్‌ఎంసెజ్‌లో ముకేశ్ అంబానీకి వాటాలు ఉండటం గమనార్హం. సుమారు పదిహేనేళ్ల క్రితమే ఈ భారీ ప్రాజెక్టుకు బీజం పడినట్లు భావించవచ్చు. ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ చైనాలోని మెగా ఆర్థిక మండళ్ల (సెజ్) తరహాలో దేశీయంగా కూడా సెజ్ ఏర్పాటు చేసే లక్ష్యంతో 2000 నుంచి పెద్ద ఎత్తున స్థలాలను సమీకరిస్తోంది. అప్పట్లో ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రా అధినేత నిఖిల్ గాంధీతో టాటా గ్రూప్ కూడా చేతులు కలిపేందుకు ప్రయత్నించింది కానీ.. ఇంతలో ముకేష్ అంబానీ ఆ అవకాశాన్ని అందుకున్నారు. 2005లో నిఖిల్ గాంధీతో చేతులు కలిపారు. ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జై కార్ప్ ఇండియా, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్ప్ (సిడ్కో), ముకేష్లు కలిసి ఎన్ఎంసెజ్ను ఏర్పాటు చేశారు. 2006లో ప్రపంచ స్థాయి సెజ్ నిర్మాణం కోసం ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించింది. 2018లో మహారాష్ట్ర పారిశ్రామిక విధానం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం.. సెజ్‌లకు కేటాయించిన స్థలాన్ని సమీకృత పారిశ్రామిక వాడగా మార్చేందుకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఎన్‌ఎంసెజ్ కూడా దరఖాస్తు చేసుకోవడం, సెజ్‌ను ఐఐఏ కింద మార్చుకునేందుకు అనుమతులు తీసుకోవడం జరిగింది. -
అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!
ముంబై : ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ తేదీ ఖరారైంది. ఆకాశ్ అంబానీ- వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా నిశ్చితార్థం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల(మార్చి) 9 నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్ సెంటర్ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్- శ్లోకాల వివాహ ఆహ్వాన మొదటి పత్రికను గణనాథుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబరులో పిరమిల్ గ్రూపు వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ఇషా- ఆనంద్‌ల వివాహ ఆహ్వాన తొలి పత్రికను కూడా ఇక్కడే ఉంచి పూజలు నిర్వహించారు. -
అంచనాలకు అనుగుణంగా ఆర్ఐఎల్ ఫలితాలు
సాక్షి, ముంబై : ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఈ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ 10,251 కోట్లుగా నమోదైంది. సంస్ధ రాబడి 55.9 శాతం పెరిగి రూ 1,71,336 కోట్లకు చేరింది. పన్నులకు ముందు లాభం 9.3 శాతం పెరిగి రూ 14,445 కోట్లుగా నమోదైంది. మూడో త్రైమాసికంలో కంపెనీ అన్ని విభాగాల్లోనూ సంతృప్తికర ఫలితాలను సాధించిందని ఆర్ఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. రూ 10,000 కోట్లు దాటిన జియో రాబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ జియో కీలక విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. నిర్వహణ రాబడి రూ 10,383 కోట్లు కాగా నికర లాభం 65 శాతం వృద్ధితో రూ 831 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో రూ 504 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంచనాలకు మించి జియో ప్రస్ధానం అత్యద్భుతంగా సాగుతోందని, 28 కోట్ల మంది సబ్స్ర్కైబర్లతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్‌గా ఆవిర్భవించిందని ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ నాణ్యతతో ప్రతిఒక్కరికీ చేరువ కావాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా జియో పయనం సాగుతోందన్నారు. -
ఇషా అంబానీ ఉండబోయే ఇంటిని చూశారా..?!
ముంబై : ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్‌ల వివాహం దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచింది. భారతదేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ తన కూతురు పెళ్లి కోసం ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరిగిన ఇషా పెళ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హజరయ్యారు. వారం రోజుల పాటు జరిగిన పెళ్లి తంతు పూర్తయ్యింది. ఇషా - ఆనంద్‌లు నివసింసచేబోయే ఇంటి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ సౌధం విస్తీర్ణం దాదాపు 50 వేల చదరపు అడుగులు. దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్ర ప్రాంత సమీపంలో ఉంది. ఆనంద్ పిరమాల్ తల్లిదండ్రులు ఈ ఇంటిని నూతన దంపతులకు కానుకగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటిదగ్గర రిన్నోవేషన్ పనులు జరుగుతున్నాయి. దీనితో పోలిస్తే, ముఖేష్ అంబానీ ఇళ్లు యాంటిలియా దాదాపు 8 రేట్ల పెద్దదిగా ఉంటుంది. -
వాళ్లుండేది అక్కడే.. రూ.450 కోట్ల బంగ్లాలో..!
ముంబై : ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ వివాహం డిసెంబర్ 12న ముంబయ్‌లో జరునున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమోలో ఇటీవలే అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ తారాగణమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. మరో నెల రోజుల్లో ఒక్కటి కాబోతున్న ఇషా, ఆనంద్‌ల పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్ కార్డు అందర్నీ ఔరా అనిపించగా.. తాజాగా.. ఈ సంపన్నుల పెళ్లి వేడుకకు సంబంధించి మరో విషయం వైరల్ అయింది. (ఇషా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కార్డు.. వైరల్) 2012లోనే కొనుగోలు వివాహానంతం ఇషా, ఆనంద్ 50 వేల అడుగుల విస్తీర్ణం గల ‘గులితా’ అనే భారీ బంగ్లాలో కాపురం ఉండబోతున్నారని సమాచారం. అరేబియన్ సముద్రం ఒడ్డున గల ఈ ‘గులితా’ బిల్డింగ్ హిందుస్థాన్ యునిలివర్ అధీనంలో ఉండగా.. రూ.450 కోట్లు పెట్టి పిరమాల్ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. ఆనంద్‌కు వెడ్డింగ్ గిఫ్ట్‌గా అతని తల్లి దండ్రులు స్వాతి, అజయ్ పిరమాల్ ఈ ఖరీదైన భవనాన్ని కొనిపెట్టారట. ఇక బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ నివాసముండే బకింగ్‌హామ్‌లోని ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసం. కాగా, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ‘అంటిల్లా’ ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. ‘అంటిల్లా’నిర్మాణ వ్యయం 14 వేల కోట్లు. -
ఒడిషాలో హై అథ్లెటిక్ సెంటర్ : ముఖేష్ అంబానీ
భువనేశ్వర్ : ఒడిషాలో మానవ వనరుల అభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. సోమవారం భువనేశ్వర్‌లో మేక్ ఇన్ ఒడిషా సదస్సులో పాల్గొన్న ముఖేష్ అంబానీ ఒడిషాలో భారీ పెట్టుబడులకు సిద్ధమనే సంకేతాలు పంపారు. ఒడిషాలో యువతకు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ హై అథ్లెటిక్స్ సెంటర్‌ను నెలకొల్పుతామని ప్రకటించారు. 21వ శతాబ్ధం యువత నైపుణాల్యపై అపార నమ్మకంతో ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కలలుగంటున్న న్యూ ఒడిషా సాకారానికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఒడిషాలోని అన్ని గ్రామాలు, పట్టణాలను రిలయన్స్ జియో ద్వారా డిజిటల్ కనెక్టివిటీతో అనుసంధానిస్తామని చెప్పారు. స్మార్ట్ మిషన్ శక్తి స్కీమ్ కింద మహిళలకు స్మార్ట్ ఫోన్లను చేరువ చేస్తామన్నారు. ఈ సదస్సులో కుమార మంగళం బిర్లాతో సహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
అంబానీ చేయివేస్తే...
న్యూయార్క్ : ప్రపంచంలోని ఆయా దేశాల్లో అత్యంత సంపన్నులు తమ సొమ్ముతో ప్రభుత్వాలను ఎన్ని రోజులు నడిపించగలరని లెక్కలు తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. బ్లూమ్‌బర్గ్ రాబిన్‌హుడ్ ఇండెక్స్ 2018 ప్రకారం సంపన్నుల నికర ఆస్తులు, ఆయా దేశాల ప్రభుత్వాల రోజువారీ వ్యయంతో లెక్కగట్టి ఈ విశ్లేషణ చేపట్టారు. భారత్‌లో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదతో 20 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలరని వెల్లడైంది. సైప్రస్‌లో అత్యంత సంపన్నుడైన జాన్ ఫ్రెడ్రిక్సన్ ఏకంగా 441 రోజుల పాటు తమ ప్రభుత్వ ఖర్చులను గట్టెక్కించగలరని తేలింది. సైప్రస్‌లో తక్కువ జనాభా, పరిమిత వ్యయం ఉండటంతో సర్కార్ నిర్వహణ ఖర్చులు అక్కడ తక్కువగా ఉండటం గమనార్హం. ఇక జపాన్, పోలాండ్, అమెరికా, చైనాలో దిగ్గజ సంపన్నులకూ తమ ప్రభుత్వాలను ఈదడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమే. చైనాలో అలీబాబా అధినేత ప్రపంచంలోనే 16వ అత్యంత సంపన్నుడు జాక్‌మా తన సంపదతో డ్రాగన్ సర్కార్‌ను కేవలం నాలుగు రోజుల పాటే నడిపించగలరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అమెరికా ప్రభుత్వాన్ని కేవలం అయిదు రోజులే ఆదుకోగలరని రాబిన్‌హుడ్ ఇండెక్స్ విశ్లేషిస్తే వెల్లడైంది. బ్రిటన్ సంపన్నుడు హ్యూ గ్రొస్వెనార్, జర్మనీలో డైటర్ స్కార్జ్లూ అపార సంపదతోనూ కొద్ది గంటలు మాత్రమే తమ ప్రభుత్వాలను ఆదుకోగలరు. -
జియోతో రిలయన్స్‌లో జోష్
సాక్షి,ముంబయి: రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 12.5 శాతం వృద్ధితో రూ 8109 కోట్లకు పెరిగింది. కంపెనీ రాబడి 23.9 శాతం పెరిగి రూ 1,01,169 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో రిలయన్స్ రిటైల్ జెనెసిస్ లగ్జరీ లిమిటెడ్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఐఎల్ బాలాజీ టెలిఫిల్మ్స్లో వాటా కొనుగోలు చేసింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిందన్నారు. ఈ క్వార్టర్లో కంపెనీ అద్భుత సామర్ధ్యం కనబరిచిందని, రిలయన్స్ జియో తన తొలి క్వార్టర్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని అన్నారు. తమ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార వృద్ధి కంపెనీ ఫలితాలపై సానుకూల ప్రభావం చూపిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపార అవకాశాల విస్తృతి ఫలితాలు ఇవ్వడం మొదలైందని అన్నారు. రిటైల్ బిజినెస్ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. డిజిటల్ మార్కెట్లో రిలయన్స్ జియో నూతన తరం డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటుందని అన్నారు. 4జీ టెక్నాలజీలో భారీగా వెచ్చించడంతో పాటు సరైన వ్యాపార వ్యూహాలతో జియో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలిగిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. -
వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి పలువురు ప్రముఖులు వచ్చారు. ఆయా సేవల సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. నిజపాద దర్శనంలో స్వామివారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు దర్శించుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు స్వామిని దర్శించుకున్నారు. అలాగే అభిషేక సేవలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. -
ముఖేశ్ అంబానీ చెప్పుచేతల్లో యూపీఏ, మోడీ ప్రభుత్వాలు
-
ముఖేశ్ అంబానీ చెప్పుచేతల్లో యూపీఏ, మోడీ ప్రభుత్వాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. రాజీనామా సమర్పించిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడుతూ.. ముకేశ్ అంబానీకి సహకరించడం కోసం కాంగ్రెస్, బీజేపీ లు ఒక్కటయ్యాయి అని ఆయన విమర్శించారు. ముకేశ్ అంబానీ చెప్పినట్లే యూపీఏ, మోడీ ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాకు ప్రభుత్వాన్ని నడపటం రాదని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అంటున్నాయని.. అవును నిజమే మాకు లాలూచీ పడటం రాదు అని కేజ్రీవాల్ ధీటుగా జవాబిచ్చారు. జన లోక్ పాల్ బిల్లు ఆమోదించడమే మా ప్రధాన లక్ష్యం, దాన్ని ఆమోదించకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకున్నాయని ఆయన అన్నారు. జన్ లోక్ పాల్ బిల్లు వస్తే చాలా మంది నేతలు జైలుకు వెళ్లడం ఖాయం అని ఆయన అన్నారు. ప్రజల పక్షాన నిలువడం కోసం పదవికి రాజీనామా చేశాను. మీలో ఒక్కడిని..ప్రజల కోసం ఎన్నిసార్లైనా రాజీనామా చేస్తాను అని కేజ్రీవాల్ ఉద్వేగంగా ప్రసంగించారు. శాసన సభలో విధ్వంసం సృష్టిస్తే.. దేవాలయంలో విగ్రహాలను పగలకొట్టినట్టే అని ఆయన వ్యాఖ్యలు చేశారు.