
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కేరళలోని గురువాయూర్ శనివారం శ్రీకృష్ణుని స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో తన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు. అంబానీ సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలలో గురువాయుర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఆయన కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికారు.
ఆయన తన కుటుంబంతో కలిసి ఆలయంలోని సోపానం (అంతర్గత గర్భగుడి) వద్ద నెయ్యి సమర్పించడంతో పాటు ఆలయ ఏనుగులు చెంతమరక్షన్, బలరామన్‌లకు నైవేద్యాలు సమర్పించారు. కాగా కొన్ని రోజులుగా రిలయన్స్ అధినేత కాబోయే కోడలితో కలిసి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే తిరుపతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే.