రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వాచ్‌ల వరకు ప్రతీదీ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాటి ధరలన్ని కోట్లలోనే. అలానే ప్రస్తుతం అంబానీ కుటుంబం తాగే పాల గురించి ఓ టాపిక్ నెట్టింట తెగ వైరల్‌గా అవుతోంది. వాళ్లు తాగే అదే పాలను కొందరూ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా తాగుతారట. మరీ అవి ఏ పాలు, వాటి ప్రత్యకతలేంటో చూద్దామా..!
సాధారణంగానే ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమేనట. వారు తాగే పాలు పూణే నుంచి వస్తాయట. నెదర్లాండ్స్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు జాతి పాలను తాగుతారట. ఈ జాతికి చెందిన ఆవులను పూణేలోని భాగ్యలక్ష్మి డెయిరీలో పెంచుతారు.
ఈ డెయిరీ ఏకంగా 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా ఈ జాతి ఆవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పాడి పరిశ్రమలోని ప్రధానమైన జాతి. వీటిని అత్యధిక పాలను ఉత్పత్తి చేసే జాతిగా పిలుస్తారు. ఈ పాలల్లో ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
అంతేగాదు ఈ ఆవుల సంరక్షణ కోసం కేరళ నుంచి వచ్చే ప్రత్యేక రబ్బరు పూతతో కూడిన దుప్పట్లు ఉపయోగిస్తారట. ఇవి మాములు వాటర్ తాగవు..ఆర్ఓ వాటర్‌ని మాత్రమే తాగుతాయట. ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట. సాధారణంగా హోల్‌స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తాయట. ఈ పాల ధర ఏకంగా రూ. 152లు పైనే పలుకుతుందట.
ఈ పాలల్లో ఉండే పోషకాలు..
హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవు పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A1, A2 బీటా-కేసిన్ (ప్రోటీన్) వంటివి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ పాలల్లో ఉంటాయట.
(చదవండి: మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!)
Comments
Please login to add a commentAdd a comment