Mukesh Ambani Top 5 Expensive And Luxurious Cars Collection - Sakshi
Sakshi News home page

ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు

Published Sun, Mar 12 2023 3:33 PM | Last Updated on Sun, Mar 12 2023 5:12 PM

Mukesh ambani top 5 car collection - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఈయన అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లను గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్:

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే కంపెనీలలో చెప్పుకోదగ్గది రోల్స్ రాయిస్. ఈ సంస్థకు చెందిన ఫాంటమ్ SUV ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 13.50 కోట్లు. ఈ లగ్జరీ కారు  6.75 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్660 గార్డ్:

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 'మేబ్యాచ్ ఎస్660' ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 10.50 కోట్లు. ఈ కారు అత్యంత సురక్షితమైన, అధిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది బుల్లెట్లు, బాంబులు ఇతర ప్రాణాంతక ప్రమాదాల్లో రక్షించడానికి ప్రత్యేకంగా తయారుచేశారు.

బిఎండబ్ల్యు 760ఎల్ఐ సెక్యూరిటీ: 

రూ. 8.9 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ సెక్యూరిటీ కూడా ముఖేష్ అంబానీ వినియోగించే కార్లలో ఒకటి. ఈ లగ్జరీ సెడాన్ 6 లీటర్ V12 ఇంజన్‌ కలిగి 544 బిహెచ్‌పి పవర్, 880 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధిక భద్రతా ఫీచర్స్ కలిగిన కార్లలో ఇది ఒకటి.

ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్:

అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్. దీని ధర రూ. 7.50 కోట్లు. ఈ స్పోర్ట్స్ కారు 2019లో ప్రారంభమై హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి కారు. ఇది 4 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 769 బిహెచ్‌పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్:

బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ధర రూ. 3.69 కోట్లు. ఇది 2005లో బెంట్లీ ఆర్నేజ్‌కు వారసుడిగా పరిచయమైంది. కావున ఇది కూడా అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 6 లీటర్ డబ్ల్యు12 ఇంజన్‌తో అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కార్లతో పాటు ముఖేష్ అంబానీ గ్యారేజిలో మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement