
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట దొరికిన కారు బాంబు కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరో పోలీసు సునీల్ మానెను అరెస్టు చేశారు. కారు ఓనర్ హిరానీ హత్యకు సునీల్ మానెకు సంబంధం ఉన్నట్లు ఎన్‌ఐఏ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు వివరించి ఈ నెల 28 వరకూ కస్టడీలోకి తీసుకుంది. సునీల్‌ను ఈ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, దాంతో పాటు ఆయనకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను, కాల్ రికార్డులను పరిశీలించాలని భావిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది.
( చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! )
Comments
Please login to add a commentAdd a comment