
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్టు పరిణామాలతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. దీంతో ఆ లిస్టులో ఆసియా దేశాల నుంచి ఏకైక కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిల్చారు. ఫోర్బ్స్ వెబ్‌సైట్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగిన అదానీ ర్యాంకు తాజాగా 15వ స్థానానికి తగ్గింది. ఆయన సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment