Reliance Group
-
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్‌లో మెంటార్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్‌లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్‌కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్‌లతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.15 రోజుల్లో చెల్లించాలిఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్ ఉన్నాయి.ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
పడిన కెరటం తప్పకలేస్తుంది. అలాగే పరాజయం పాలైన ప్రతిఒక్కరికీ తమదైన రోజు తప్పక వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన అనిల్ అంబానీ వరుస వైఫల్యాలతో నష్టాలు, అప్పులతో చీకటి రోజులను చవిచూశారు. ఇప్పుడాయనకు మంచి రోజులు వచ్చాయి. ఒక్కో కంపెనీ అప్పుల ఊబిలోంచి బయట పడుతోంది. వ్యాపార సామ్రాజ్యం తిరిగి పుంజుకుంటోంది.టాప్ టెన్ సంపన్నుడుఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. తర్వాత ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ రూ.24,000 కోట్ల విలువైన బాండ్లను చెల్లించలేక రిలయన్స్ క్యాపిటల్ 2021లో దివాళా తీసే వరకూ వచ్చేశారు.వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీని చూసి చాలా మంది ఇక ఆయన పుంజుకోలేడనే అభిప్రాయానికి వచ్చేశారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగిన అనిల్ అంబానీ అద్భుతమైన పునరాగమనం చేస్తున్నారు.కలిసొచ్చిన సెప్టెంబర్ఈ ఏడాది సెప్టెంబర్ నెల రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలమైనదిగా మారుతోంది. ఎందుకంటే 18 నుంచి 21 తేదీల మధ్య కేవలం మూడు రోజుల్లోనే గ్రూప్ తమ అప్పులు దాదాపు తీరిపోయినట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక నిధుల సేకరణ ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది. రిలయన్స్ పవర్ భారీ ఆర్డర్‌ను అందుకుంది. దాని షేర్లను పెంచుకుంది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ రహితం దిశగా వేగంగా కదులుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నుండి అనుకూలమైన వార్తలను అందుకుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?అనిల్ అంబానీకి పెద్ద ఊరటగా కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చేసిన అంచనా ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బకాయిలను క్లెయిమ్ చేయాలని రాష్ట్ర పన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టిందని వార్తా సంస్థ తాజాగా నివేదించింది.అనిల్ అంబానీ నెట్వర్త్తన నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీల పురోగతితో అనిల్ అంబానీ నెట్‌వర్త్ కూడా పుంజుకుంటోంది. నిధుల చేరిక ఫలితంగా ఇటీవలి ఫైలింగ్‌ల ప్రకారం.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ రూ. 9,000 కోట్ల నుండి రూ. 12,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఫిబ్రవరిలో నివేదించినదాని ప్రకారం.. అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 20,000 కోట్లు. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్‌లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
అనిల్ అంబానీ కంపెనీలు.. వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అంబానీ సోదరులు అనగానే అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీయే గుర్తొస్తారు. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన అనిల్ అంబానీ (Anil Ambani ) గురించి, ఆయనకున్న కంపెనీలు, వ్యాపార సామ్రాజ్యం గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది.ఎప్పుడూ నష్టాలతో వార్తల్లో నిలిచే అనిల్ అంబానీ ఇటీవల రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేశారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది. రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని తీర్చేసింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్, పవర్ జనరేషన్ వంటి రంగాల్లో వైవిధ్యమైన వ్యాపారాలను కలిగి ఉంది. 2006లో రిలయన్స్ గ్రూప్ విడిపోయిన తర్వాత ఈ గ్రూప్ ఏర్పాటైంది. 2002 జూలై 6న ధీరూభాయ్ అంబానీ మరణించిన తరువాత, అప్పటి 15 బిలియన్ డాలర్ల సమ్మేళనం ఇద్దరు సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య విడిపోయింది.అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ ఇవే..» రిలయన్స్ కమ్యూనికేషన్స్: మార్కెట్ క్యాప్ రూ.335 కోట్లు. షేరు 52 వారాల కదలిక రూ.2.49 గరిష్టాన్ని, రూ.1.01 కనిష్టాన్ని సూచిస్తుంది. షేరు ప్రస్తుత ధర రూ.1.93.» రిలయన్స్ హోమ్ ఫైనాన్స్: మార్కెట్ క్యాప్ రూ.132 కోట్లు. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.4.05గా ఉంది. 52 వారాల కదలిక రూ .5.80 గరిష్టాన్ని, రూ .1.70 కనిష్టాన్ని సూచిస్తుంది.» రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: మార్కెట్ క్యాప్ రూ.4,876 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ప్రస్తుత ధర రూ.202.99. షేరు 52 వారాల కదలికలు రూ.308 గరిష్టాన్ని, రూ.134 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.» రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్: మార్కెట్ క్యాప్ రూ.155 కోట్లు. కంపెనీ నౌకా నిర్మాణంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2.3గా ఉంది.» రిలయన్స్ పవర్: మార్కెట్ క్యాప్ రూ.4,520 కోట్లు. రిలయన్స్ పవర్ ప్రస్తుత ధర రూ.31.08గా ఉంది. షేరు 52 వారాల కదలికలు రూ.34.45 గరిష్టాన్ని, రూ.13.80 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు! -
భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రధానంగా కరెంట్ అవసరాలు కూడా పెరుగుతాయి. ఇండియా 2027 నాటికి దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల ఎనానమీ మార్కును తాకనుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు పారిశ్రామిక రంగం ఎంతో చేయూతనందిస్తుంది. అయితే దానికి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దాంతోపాటు దాదాపు అన్ని రంగాల్లో విద్యుత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కానీ దాని తయారీకి ప్రభుత్వాలు, యంత్రాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. సమర్థంగా కరెంట్ తయారు చేసి వినియోగించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో అణు విద్యుత్‌కే పెద్దపీట వేస్తున్నారు. అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. అణు విద్యుత్ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ కంపెనీలతో చర్చలు అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల వల్లే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, వేదాంతా, టాటా పవర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిసింది. ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. 1.300 మెగావాట్ల సామర్థ్యం పెరిగే అవకాశం.. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్లాంట్లను ఎన్పీసీఐఎల్ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని అంచనా. -
అపార వనరులు.. యువ నాయకుడు: ముఖేష్ అంబానీ
(విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి, ప్రతినిధి): దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడుల సదస్సుకు ఎన్నడూ హాజరు కాని రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ సదస్సు కోసం 5 గంటలకు పైగా సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడమే కాకుండా రాష్ట్రంలోని అపార వనరులు, సీఎం వైఎస్ జగన్ పాలన దక్షత, యువ నాయకత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. అపార వనరులు కలిగి ఉండటం ఒక వరమని, ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జీఐఎస్ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... బ్లూ ఎకానమీ (సముద్ర వాణిజ్యం)లో సాగరమంత అవకాశాలను కల్పిస్తూ రాష్ట్రం స్వాగత ద్వారాలు తెరిచింది. రెన్యువబుల్ ఓషన్ ఎనర్జీ, సముద్ర ఖనిజాలు, మెరైన్ బయోటెక్నాలజీ రంగాల్లో చాలా అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, ఎంత వేగంగా విస్తరిస్తోందో అదేవిధంగా సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతో వృద్ధి రేటు, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన రాష్ట్ర యువత, అధికారులకు శుభాకాంక్షలు. నూతన భారత దేశ వృద్ధిలో ఏపీ ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం ఇక్కడ యువత, వ్యాపారవేత్తల్లో ధృడంగా కనిపిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్‌లోని అపార అవకాశాలను గుర్తించి చమురు, గ్యాస్ రంగంలో 2002లో అడుగుపెట్టాం. రూ.1,50,000 కోట్లకుపైగా పెట్టుబడులను కేజీ డి–6 అసెట్స్‌పై పెట్టాం. భవిష్యత్తులో దేశ సహజవాయువు ఉత్పత్తిలో 30% కేజీ డి–6 నుంచే వస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత కీలకమో చెప్పేందుకు ఇదే నిదర్శనం. జియో సేవలకు సంబంధించి రాష్ట్రంలో టెలికాం విస్తరణ కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 98 శాతం 4జీ నెట్వర్క్ కవర్ చేసింది. ఇప్పుడు ట్రూ 5జీ సేవలను 2023 చివరి నాటికల్లా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం. 5జీ రాకతో రాష్ట్రంలో డిజిటల్ విప్లవం అన్ని రంగాల్లో వృద్ధికి దోహదం చేస్తుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా సారవంతమైన భూములు, సహజ వనరులు, నైపుణ్యం, విశిష్ట సంస్కృతి ఉన్నాయి. విశాఖలో అందమైన బీచ్‌లున్నాయి. అధిక ఆదాయాన్ని అందించే కృష్ణా, గోదావరి నదుల మధ్య మంచి భూములున్నాయి. విజయనగరం సామ్రాజ్యం నుంచి తిరుమల వరకు ఎంతో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇవన్నీ వినియోగించుకుంటూ ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. ఇన్ఫ్రా, ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు గణనీయమైన శక్తి కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు పలువురు ఏపీకి చెందిన వారే. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో మంచి నైపుణ్యంతో వివిధ నాయకత్వ హోదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. ► రిలయన్స్ రిటైల్ ద్వారా భారీగా విస్తరించాం. రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో రిలయన్స్ రిటైల్ సేవలను అందిస్తోంది. రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధితోపాటు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. రైతులు, హస్తకళాకారుల ఉత్పత్తులను విక్రయిస్తూ నేరుగా 50,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. రిలయన్స్ ఫౌండేషన్ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కృషి చేస్తోంది. గ్రామీణ సామాజిక కేంద్రాల్లో రిలయన్స్ భాగస్వామి కానుంది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో ఇదే విధమైన బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. రాష్ట్ర వృద్ధి రేటులో రిలయన్స్ భాగస్వామిగా ఉంటుంది. మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ సదస్సు విజయవంతమై రాష్ట్రాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. -
అలా కలిసొచ్చింది.. ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిపోర్టు పరిణామాలతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు. దీంతో ఆ లిస్టులో ఆసియా దేశాల నుంచి ఏకైక కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిల్చారు. ఫోర్బ్స్ వెబ్సైట్ ప్రకారం 83.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గత వారం వరకు మూడో స్థానంలో కొనసాగిన అదానీ ర్యాంకు తాజాగా 15వ స్థానానికి తగ్గింది. ఆయన సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది. -
జియో సంచలనం.. మొన్న సౌతాఫ్రికా లీగ్, ఇప్పుడు ఐపీఎల్! ఫ్రీ?!
FIFA World Cup 2022- SA20 2023- IPL 2023:ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! ఐపీఎల్-2023 సీజన్ మ్యాచ్‌లను ఎలాంటి ప్రత్యేకమైన ఫీజు లేకుండానే డిజిటల్ మాధ్యమంలో చూసే అవకాశం రానుంది. ఇందుకు సంబంధించి రిలయన్స్ గ్రూపు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్-18 రూ. 23, 758 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోసినిమా యాప్‌లో ఫ్రీగా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిఫా, సౌతాఫ్రికా లీగ్ ఇటీవల ముగిసిన సాకర్ మెగా టోర్నీ ఫిఫా వరల్డ్‌కప్-2022ను ఇప్పటికే జియో సినియా యాప్‌లో విజయవంతంగా ప్రసారం చేశారు. టీవీ ఛానెళ్లు స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్18 హెచ్డీలో ప్రేక్షకులు ఈ ఫుట్‌బాల్ సమరాన్ని వీక్షించగా.. డిజిటల్ యూజర్లకు జియో సినిమాలో ఈ వెసలుబాటు దక్కింది. మరోవైపు.. జనవరి 10న మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్‌లను జియో సినిమాలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఐపీఎల్-2023ని కూడా జియో సినిమా యాప్‌లో ప్రసారం చేసేందుకు వయాకామ్ ప్లాన్ చేస్తున్నట్లు ది హిందూ బిజినెస్‌లైన్ కథనం పేర్కొంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఐపీఎల్ మ్యాచ్‌లను డిజిటల్ మీడియాలో ఫ్రీగా ప్రసారం చేసిన తొలి సంస్థగా రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికినట్లవుతుంది. అంతేగాక.. టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ గ్రూప్‌నకు భారీ షాకిచ్చినట్లవుతుంది. 6️⃣ teams 3️⃣3️⃣ matches ♾️ entertainment Enjoy the thrilling 🏏 season as #SA20 is HERE 💥@sa20_league action from Jan 10 to Feb 11 👉🏻 LIVE on #JioCinema, #Sports18 & @colorstvtamil 📺📲#SA20League #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/Jo3FkSJysw — JioCinema (@JioCinema) January 12, 2023 -
నవంబర్ 17 వరకూ అనిల్ అంబానీపై చర్యలు వద్దు
ముంబై: బ్లాక్ మనీ చట్టం కింద ఐటీ శాఖ నోటీసులు అందుకున్న రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 17 వరకూ ఎటువంటి బలప్రయోగ చర్యలు తీసుకోవద్దని ఆదాయ పన్ను శాఖను న్యాయస్థానం ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 814 కోట్ల వివరాలు వెల్లడించకుండా రూ. 420 కోట్ల మేర పన్నులు ఎగవేశారంటూ ఆగస్టు 8న అంబానీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పన్నులు ఎగవేయాలనే ఉద్దేశ్యంతో, ఆయన కావాలనే తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించలేదని ఆరోపించింది. నోటీసులో పొందుపర్చిన సెక్షన్ల ప్రకారం అనిల్ అంబానీకి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ అనిల్ అంబానీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట లావాదేవీలు 2006–07 నుంచి 2010–11 మధ్యలో జరిగినవని ఐటీ శాఖ చెబుతుండగా.. బ్లాక్‌మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని ఆయన తరఫు లాయరు రఫిక్ దాదా వాదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే ఐటీ కమిషనర్ వద్ద సవాలు చేసినట్లు, సివిల్ వివాదం పెండింగ్‌లో ఉండగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదని దాదా తెలిపారు. అనిల్ అంబానీ పిటిషన్‌పై స్పందించేందుకు కొంత సమయం కవాలని ఐటీ శాఖ కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. -
సంపద సృష్టిలో అదానీ రికార్డ్!
ముంబై: అదానీ గ్రూపు తన విలువను అత్యంత వేగంగా పెంచుకుంది. 2020 ఏప్రిల్ వరకు ఆరు నెలల కాలంలో (2021 నవంబర్–2022 ఏప్రిల్) అదానీ గ్రూపు విలువ 88 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. ‘బర్గుండీ ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ జాబితా బుధవారం విడుదలైంది. రూ.18.87 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంటే ఈ జాబితాలో ముందున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ అదే కాలంలో 13.4 శాతమే పెరిగింది. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఉండగా, రూ.12.97 లక్షల కోట్లతో టీసీఎస్ మూడో స్థానంలో ఉంది. 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో టీసీఎస్ విలువ 0.9% తగ్గినా కానీ, మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ ఉన్నాయి. ► అదానీ గ్రూపు కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ ఆరు నెలల్లో 139 శాతం పెరిగి 2022 ఏప్రిల్ నాటికి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. గ్రూపు కంపెనీల్లో అత్యంత వేగంగా ఎక్కువ విలువను పెంచుకున్న కంపెనీ ఇది. దీంతో జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆరు నెలల క్రితం నాటి జాబితాలో ఇది 16వ స్థానంలో ఉండడం గమనార్హం ► అదానీ విల్మార్ ఇదే కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.66,427 కోట్లకు ఎగసింది. అదానీ పవర్ 158 శాతం పెరిగి రూ.66,185 కోట్లకు చేరింది. ► అదానీ గ్రూపులో తొమ్మిది కంపెనీల విలువ ఉమ్మడిగా 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. టాప్–500 కంపెనీల మొత్తం విలువలో అదానీ గ్రూపు కంపెనీల విలువ 7.6 శాతంగా ఉంది. ► 2020 ఏప్రిల్ నాటికి 6 నెలల్లో భారత్‌లోని టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ సగటున కేవలం 2% పెరగ్గా.. అదానీ గ్రూపు కంపెనీల విలువ 88% పెరగడం విశేషం. ► 2021 అక్టోబర్ 30 నాటికి భారత్‌లో టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నాటికి రూ.232 లక్షల కోట్లకు చేరింది. ► వీటి మార్కెట్ విలువ కొద్దిగానే పెరిగినా.. బీఎస్ఈ 30 షేర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఇదే కాలంలో సెన్సెక్స్ 4 శాతం క్షీణించగా, నాస్డాక్ ఏకంగా 17% పతనాన్ని ఎదుర్కొన్నది. ► మార్కెట్ విలువలో క్షీణత చూసినవీ ఉన్నాయి. రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ విలువ ఇదే కాలంలో 17.9 శాతం పడిపోయి రూ.23,000 కోట్లుగా ఉంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు.. ► అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో 35.6 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది. ► సీరమ్ ఇన్స్టిట్యూట్ విలువ 4.6 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరగా, బైజూస్ విలువ 24.7 శాతం వృద్ధి చెంది రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. ► శాతం వారీగా చూస్తే వేదంత్ ఫ్యాషన్స్ విలువ 320 శాతం పెరగ్గా, అదానీ విల్మార్, బిల్ డెస్క్ 173 శాతం మేర (విడిగా) వృద్ధి చెందాయి. -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్‌తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్‌ను రిలయన్స్‌కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్‌కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్‌పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్‌తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్‌ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్‌ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
అయ్యో అనిల్ అంబానీ.. భారీ నష్టాల్లో రిలయన్స్ హోమ్
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో రూ. 4,522 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 445 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 16 శాతంపైగా క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం మూడు రెట్లు పెరిగి రూ. 5,440 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 1,520 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 65 శాతం పడిపోయి రూ. 294 కోట్లకు చేరింది. కాగా.. 2022 మార్చి31కల్లా కంపెనీ రూ. 10,123 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. చదవండి: రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా.. -
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
ఇక ఆర్ఐఎల్ సోలార్ పవర్
జీరో కార్బన్‌పై దృష్టి పెట్టిన డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగం పెంచింది. ఇప్పటికే రిలయన్స్ న్యూ ఎనర్జీ పేరిట పునరుత్పాదక ఇంధన కంపెనీని నెలకొలి్పన సంస్థ ఒకే రోజు రెండు కంపెనీలపై గురిపెట్టింది. తాజాగా నార్వేజియన్ దిగ్గజం ఆర్ఈసీ సోలార్‌ను సొంతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ద్వారా 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లోనూ 40 శాతం వాటాను చేజిక్కించుకుంది. తద్వారా 2035కల్లా జీరో కార్బన్ పోర్ట్‌ఫోలియో నిర్మాణంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎస్ఎల్) తొలిసారి ఒక విదేశీ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) కో నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. నార్వేకు చెందిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)లో 100 శాతం వాటాను 77.1 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,783 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు పూర్తి అనుబంధ సంస్థగా రిలయన్స్ న్యూ ఎనర్జీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో 2035కల్లా నికరంగా జీరో కార్బన్‌తో శుద్ధ ఇంధన పోర్ట్‌ఫోలియో కంపెనీగా ఆవిర్భవించేందుకు ఆర్ఐఎల్ తొలి అడుగు వేసింది. ఆర్ఐఎల్ వార్షిక సమావేశంలో శుద్ధ ఇంధన తయారీ సామర్థ్యాలపై రూ. 60,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. కంపెనీ తీరిలా.. నార్వే, సింగపూర్ కేంద్రాలుగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్(ఆర్ఈసీ గ్రూప్)నకు సోలార్ ఎనర్జీలో పట్టుంది. కొత్తతరహా సాంకేతిక ఆవిష్కరణలు, అత్యంత మన్నికైన దీర్ఘకాలిక సోలార్ సెల్స్, ప్యానల్స్‌ను రూపొందిస్తోంది. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన కంపెనీ నార్వేలో సోలార్ గ్రేడ్ పాలీసిలికాన్ తయారీకి రెండు, సింగపూర్‌లో పీవీ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి ఒక ప్లాంటు చొప్పున నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా 1,300 మందికిపైగా ఉద్యోగులున్నారు. విస్తరణకు మద్దతు ఆర్ఈసీ విస్తరణ ప్రణాళికలకు పూర్తి మద్దతివ్వనున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్ఈసీ.. సింగపూర్‌లో 2–3 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీతోపాటు.. బ్రాండ్న్యూ 2 గిగావాట్ల సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ పేరిట జామ్‌నగర్‌లో ఏర్పాటైన కాంప్లెక్స్‌లో ఆర్ఈసీ సాంకేతికతలను ఆర్ఐఎల్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్కు షాపూర్జీ కంపెనీలో వాటా శుద్ధ ఇంధన ఆస్తులపై దృష్టిపెట్టిన ఆర్ఐఎల్ తాజాగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 2,845 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా కంపెనీ బోర్డులో ఇద్దరు సభ్యులను నియమించనుంది. ఈపీసీ కార్యకలాపాల స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌ను ఖుర్షీద్ యజ్డీ డరువాలా కుటుంబంతో కలసి షాపూర్జీ పల్లోంజీ భాగస్వామ్య ప్రాతిపదికన(జేవీ) ఏర్పాటు చేసింది. డీల్‌లో భాగంగా తొలుత షేరుకి రూ. 375 ధరలో 2.93 కోట్ల స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రిలయన్స్ న్యూ ఎనర్జీ పొందనుంది. ఈక్విటీ జారీ తదుపరి పెరగనున్న వాటా మూలధనంలో ఇది 15.46 శాతానికి సమానంకాగా.. తదుపరి మరో 1.84 కోట్ల షేర్లను(9.7 శాతం వాటాకు సమానం) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి అదే ధరలో సొంతం చేసుకోనుంది. ఆపై సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ నుంచి 25.9 శాతం వాటా(4.91 కోట్ల షేర్లు) కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. వెరసి కంపెనీలో 40 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. గ్రూప్ రూ. 20,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను కొద్ది రోజులుగా షాపూర్జీ పల్లోంజీ అమలు చేస్తోంది. వినూత్న ఇన్వెస్ట్మెంట్... కొత్త, ఆధునిక సాంకేతికతలపై ఇన్వెస్ట్‌చేసే మా వ్యూహాలకు అనుగుణంగానే ఆర్ఈసీ గ్రూప్‌ను కొనుగోలు చేశాం. నిర్వహణా సామర్థ్యాలు సైతం ఈ దశాబ్దాంతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకున్న 100 గిగావాట్ల శుద్ధ ఇంధన సాధనకు ఉపయోగపడనున్నాయి. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ అధినేత -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్లు..
హైదరాబాద్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ డిజిటల్ సంస్థ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ’డిజిటల్ ఇండియా సేల్’ నిర్వహిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్డాట్ఇన్ పోర్టల్‌లో షాపింగ్ చేసేవారికి దీని కింద పలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 16 దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంటు (రూ.3,000 వరకూ), పేటీఎం ద్వారా రూ. 9,999 కనీస చెల్లింపుపై ఆగస్టు 31 దాకా రూ. 500 వాలెట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, జెస్ట్‌మనీ ద్వారా రూ. 10,000కు పైబడి చేసే కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 5,000 దాకా) పొందవచ్చని పేర్కొంది. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై ఈ ఆఫర్లు లభిస్తాయని వివరించింది. -
అమెజాన్–ఫ్యూచర్స్ వివాదం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్–రిలయన్స్ రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ నుంచి తీసుకున్న అవార్డు (తీర్పు) భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా? ఇది దేశీయంగా అమలు సాధ్యమేనా అన్న అంశాలపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసుకుంది. ‘‘ఈ కేసులో వాదోపవాదనలను విన్నాం. తీర్పును రిజర్వ్ చేస్తున్నాం’’ అని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ 17 (1), 17 (2) సెక్షన్ల కింద సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డు చట్ట బద్దతపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది. సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డు, దీని అమలుపై ఢిల్లీ హైకోర్టు సింగిల్, డివిజనల్ బెంచ్ విభిన్న తీర్పుల నేపథ్యంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఇప్పుడు ఫ్యూచర్స్ రిటైల్ వాటా రిలయన్స్‌కు విక్రయించడం సమ్మతం కాదని వాదిస్తోంది. -
వాస్తవాలు ఎందుకు దాచారు?
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ గ్రూప్ తన రిటైల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ అసెట్స్‌ను రిలయన్స్‌కు విక్రయించడానికి సంబంధించి అమెజాన్‌తో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదానికి ప్రధాన మూలమైన 2019 నాటి అమెజాన్–ఫ్యూచర్స్ గ్రూప్ ఒప్పందం పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను జరిమానాసహా తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదని నాలుగు పేజీల షో కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న అమెజాన్–ఫ్యూచర్స్ న్యాయపోరాటంలో సీసీఐ తాజా నోటీసులు కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... తన రిటైల్ అండ్ హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ (ఎఫ్ఆర్ఎల్) 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్‌లో అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్‌లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో విచారణలో ఉంది. అయితే 2019 నాటి ఒప్పందం వివరాలను తనకు పూర్తిగా వెల్లడించలేదన్నది అమెజాన్‌కు వ్యాపారాల్లో గుత్తాధిపత్య నిరోధక రెగ్యులేటర్– సీసీఐ తాజా నోటీసుల సారాంశం. కాగా రిలయన్స్, ఫ్యూచర్స్ ఒప్పందం సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉంటుందని సుప్రీంకు గురువారం అమెజాన్ తెలిపింది. -
క్యూ1 ఫలితాలు, ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: కార్పొరేట్ల తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకంగా మారొచ్చని చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మార్కెట్ సోమవారం ముందుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక గణాంకాలు, రిలయన్స్ – జస్ట్ డయల్ విలీన ప్రక్రియ అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. కావున ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘‘దేశీయంగా సానుకూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. సూచీల తాజా గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఈ అంశాలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను ప్రేరేపించవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,950 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నిరాలి షా తెలిపారు. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కావడంతో పాటు కంపెనీలు ఆశాజన ఆర్థిక ఫలితాల ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో నెలరోజుల తర్వాత గతవారంలో సూచీలు తిరిగి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఆర్థిక, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, మెటల్స్ షేర్లు రాణిండంతో క్రితం వారంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లను ఆర్జించగలిగాయి. కీలక దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సందడి... దేశీయ కార్పొరేట్ల తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటన సందడి కీలక దశకు చేరుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఈ వారంలో తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంకులతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని మొత్తం పది కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. నేడు రెండు లిస్టింగ్‌లు... ఇటీవల ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకున్న రోడ్ల నిర్మాణ సంస్థ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్లీన్ సైన్స్ టెక్నాలజీ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. గ్రే మార్కెట్లో ఇరు కంపెనీల షేర్లు 55–60 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కావున లాభదాయక లిస్టింగ్‌కు అవకాశం ఉందని ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై తొలి భాగంలో రూ.4,515 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్!
న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందం విషయంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన రూలింగ్‌పై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యూచర్ లేదా అమెజాన్లు ఈ విషయంలో పంపిన ఈ–మెయిల్ ప్రశ్నలకు స్పందించలేదు. కేసు వివరాల్లోకి వెళితే, ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్‌తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్– రిలయన్స్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా... జనవరి 21వ తేదీన ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు సెబీ, సీసీఐ, స్టాక్ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో జనవరి 26న ఫ్యూచర్ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్నీ ఆశ్రయించింది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్లో ఆరోపించింది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. ఈ పిటిషన్‌ను నాలుగురోజులు విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ, ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన డివిజనల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన ఫ్యూచర్‌కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
ఒక్కరోజులో 5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కరోజులో భారీగా పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో (ఎన్ఎస్ఈ) రిలయన్స్ షేర్ ఐదు శాతానికి పైగా నష్టపోవడంతో, రిలయన్స్ సంస్థ 5.2 బిలియన్ల డాలర్ల మేర నష్టపోయింది. నిఫ్టీ ఇంట్రా ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు నిమిషానికి 12 మిలియన్ల డాలర్ల మేరకు సంపదను కోల్పోగా, రిలయన్స్ సంస్థ మరింత నష్టాన్ని చవి చూసింది. సోమవారం చవిచూసిన నష్టాల కారణంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అతని సంపద 79.2 బిలియన్ల డాలర్ల వద్ద స్థిరపడిందని ఆ సంస్థ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో రిలయన్స్ నిర్వహణ ప్రగతి బలహీనంగా ఉందని, ఇదే కొనసాగితే ఆ సంస్థ మార్కెట్ అంచనాలను చేరుకోలేదని కోటక్ ఈక్విటీస్ సంస్థ వ్యాఖ్యానించింది. సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో రిలయన్స్ సంస్థ మార్కెట్ లీడర్ హోదాను కూడా కోల్పోయింది. -
రిలయన్స్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పెట్టుబడులు వచ్చి చేరనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు. మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీపీజీ తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది. -
రిలయన్స్ రిటైల్ జోరు..
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ తర్వాత తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుధాబికి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. ఇందుకుగాను ముబాదలా రూ. 6,247.5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించింది. రిలయన్స్ గ్రూప్‌లో ఈ సంస్థకు ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ముబాదలా ఇప్పటికే రూ. 9,093.6 కోట్లతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.85 శాతం వాటా కొనుగోలు చేసింది. ‘ముబాదలా వంటి దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం మాకు గణనీయంగా ఉపయోగపడనుంది. భారత రిటైల్ రంగంలో లక్షల సంఖ్యలో చిన్న రిటైలర్లు, వ్యాపారులకు తోడ్పాటునివ్వాలన్న మా సంకల్పంపై ముబాదలాకు ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనం. మా లక్ష్య సాధనలో ఆ సంస్థ పెట్టుబడులు, మార్గదర్శకత్వం ఎంతగానో తోడ్పడగలవు‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడుల ద్వారా రిలయన్స్‌తో భాగస్వామ్యం మరింత పటిష్టమైంది.’ అని ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్ తెలిపారు. మూడు వారాల్లో అయిదో డీల్.. గడిచిన మూడు వారాల్లో ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడులకు సంబంధించి ఇది అయిదో డీల్. అమెరికాకు చెందిన కేకేఆర్ అండ్ కంపెనీ రూ. 5,550 కోట్లు (1.28 శాతం వాటా), ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ. 3,675 కోట్లు (0.84 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ఇవిగాకుండా సిల్వర్ లేక్ రెండు విడతలుగా మొత్తం రూ. 9,375 కోట్లు పెట్టుబడులు (2.13 శాతం వాటా) పెట్టింది. వీటి ప్రకారం రిలయన్స్ రిటైల్ వేల్యుయేషన్ దాదాపు రూ. 4.29 లక్షల కోట్లుగా ఉండనుంది. సెప్టెంబర్ నుంచి చూస్తే రిటైల్ విభాగంలో 5.65 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ ఇప్పటిదాకా రూ. 24,847.5 కోట్లు సమీకరించినట్లయింది. -
ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లోని డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు లైను కడుతున్నారు. తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్ పార్ట్నర్స్ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఆర్ఆర్వీఎల్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ‘ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని పేర్కొంది. సిల్వర్‌లేక్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ఈ డీల్‌కు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్ రిటైల్‌కు మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా ఉండగా .. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, డేవిస్ పోక్ అండ్ వార్డ్‌వెల్ న్యాయ సలహదార్లుగా ఉన్నారు. సిల్వర్ లేక్‌కు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో, లాథామ్ అండ్ వాట్కిన్స్ లీగల్ అడ్వైజర్లుగా ఉన్నారు. 12 వేల పైచిలుకు స్టోర్స్.. ఆర్ఆర్వీఎల్లో భాగమైన రిలయన్స్ రిటైల్ .. దేశవ్యాప్తంగా సూపర్మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ చెయిన్ స్టోర్స్, హోల్‌సేల్ వ్యాపారం, ఫ్యాషన్ అవుట్‌లెట్స్, ఆన్లైన్ నిత్యావసరాల స్టోర్ జియోమార్ట్ మొదలైన వాటిని నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాల్లో 12,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. రిటైల్ విభాగంపై ఆధిపత్యం సాధించే క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో తలపడేందుకు రిలయన్స్‌కు ఈ పెట్టుబడులు ఉపకరించనున్నాయి. ‘నికర రుణ రహిత సంస్థగా మారిన రిలయన్స్ గ్రూప్ అధిక వృద్ధి సాధించేందుకు ఈ వాటాల విక్రయం తోడ్పడగలదు. ఇదే సెగ్మెంట్లో మరిన్ని వాటాల విక్రయానికి దోహదపడగలదు‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అనలిస్ట్ శ్వేతా పటోడియా అభిప్రాయపడ్డారు. రిటైల్ విభాగంలో వాటాల విక్రయం ఊహించిన దానికన్నా ముందుగానే చోటు చేసుకుంటోందని క్రెడిట్ సూసీ తెలిపింది. పెట్టుబడుల సమీకరణ మొదలైన నేపథ్యంలో ప్రణాళికల అమలుపై.. ముఖ్యంగా జియోమార్ట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఫైనాన్షియల్ సేవల సంస్థ సిటీ ఒక నివేదికలో పేర్కొంది. జియోలో సిల్వర్‌లేక్.. ఫేస్బుక్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తొలి అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్. సుమారు రూ. 10,203 కోట్లతో రెండు విడతల్లో 2.08 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేకేఆర్, విస్టా, జనరల్ అట్లాంటిక్, గూగుల్ మొదలైనవి జియోలో ఇన్వెస్ట్ చేశాయి. ట్విట్టర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, డెల్ టెక్నాలజీస్ వంటి పలు టెక్ దిగ్గజాల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టింది. కేకేఆర్‌కు కూడా రిలయన్స్ ఆఫర్... జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి .. తమ రిటైల్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు రిలయన్స్ ఆఫర్ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే సిల్వర్‌లేక్ ఇన్వెస్ట్ చేస్తోంది. జియోలో ఇన్వెస్ట్ చేసిన మరో ఈక్విటీ సంస్థ కేకేఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,100 కోట్లు) పెట్టుబడులు పెట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడులతో రిలయన్స్ మార్కెట్ వేల్యుయేషన్‌లో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వాటా ఏకంగా రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కొద్దీ చిన్న వర్తకులతో భాగస్వామ్యం ఏర్పర్చుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించే మా ప్రయత్నాల్లో సిల్వ ర్లేక్ కూడా భాగస్వామి కానుండటం సంతోషకర విషయం. ఈ రంగంలో టెక్నాలజీతో పెను మార్పులు తేవచ్చని విశ్వసిస్తున్నాం. భారతీయ రిటైల్ రంగానికి సంబంధించి మా ప్రణాళికలు అమలు చేయడంలో సిల్వర్‌లేక్ విలువైన భాగస్వామి కాగలదు‘. – ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ