న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో రూ. 4,522 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 445 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 16 శాతంపైగా క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది.
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం మూడు రెట్లు పెరిగి రూ. 5,440 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 1,520 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 65 శాతం పడిపోయి రూ. 294 కోట్లకు చేరింది. కాగా.. 2022 మార్చి31కల్లా కంపెనీ రూ. 10,123 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment