Q 4
-
అయ్యో అనిల్ అంబానీ.. భారీ నష్టాల్లో రిలయన్స్ హోమ్
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో రూ. 4,522 కోట్లకుపైగా నికర నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 445 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 16 శాతంపైగా క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం మూడు రెట్లు పెరిగి రూ. 5,440 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 1,520 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 65 శాతం పడిపోయి రూ. 294 కోట్లకు చేరింది. కాగా.. 2022 మార్చి31కల్లా కంపెనీ రూ. 10,123 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైంది. చదవండి: రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా.. -
టాటా పవర్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 31 శాతం జంప్‌చేసి రూ. 632 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 481 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం వృద్ధితో రూ. 12,085 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 10,379 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి 1.75 డివిడెండ్ ప్రకటించింది. జులై 7న వార్షిక వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 1,439 కోట్లనుంచి రూ. 2,156 కోట్లకు ఎగసింది. ఇక మొత్తం ఆదాయం 28 శాతం మెరుగుపడి రూ. 42,576 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 33,239 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. క్యూ4లో ఎక్సెప్షనల్ ఐటమ్స్‌కు ముందు కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 775 కోట్లకు చేరగా.. పూర్తి ఏడాదికి 61 శాతం అధికంగా రూ. 2,298 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా.. -
ఝమ్మని దూసుకుపోయిన జియో లాభాలు
రిలయన్స్ జియో 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభాల్లో దూసుకుపోయింది. గతేడాది ఇదే క్వార్టర్ లాభాలతో పోల్చితే ఈసారి 15.4 శాతం అధిక లాభాలను సాధించింది. తాజాగా ప్రకటించిన క్వార్టర్ 4 ఫలితాల్లో రూ. 20,901 కోట్ల రెవిన్యూపై రూ. 4,173 కోట్ల లాభాలను సాధించింది. అయితే గతేడాది ఇదే కాలానికి ఫలితాలతో పోల్చితే రెవిన్యూ పెరగగా లాభాలు తగ్గాయి. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఈ క్వార్టర్లో రూ.10,510 కోట్ల లాభాలు రాగా అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 9,514 కోట్లుగా ఉంది. చదవండి: Telecom Service: టెలికాం సంస్థలకు భారీ షాక్! తగ్గిన స్థూల ఆదాయం! -
అదిరిందయ్యా అదానీ.. ‘పవర్’ఫుల్ లాభాలు!
లాభాల్లో అదానీ గత రికార్డులను తిరగ రాశాడు. కనివినీ ఎరుగని రీతిలో ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ కంపెనీకి సాధ్యం కానీ విధంగా లాభాలను కళ్ల జూసింది అదాని పవర్. 2022 మార్చి 31తో ముగిసిన క్వార్టర్ ఫలితాలు 2022 మే 5న ప్రకటించింది అదానీ పవర్. ఈ తాజా ఫలితాల్లో అదానీ పవర్ లాభాలు రూ.4,645 కోట్లుగా నమోదు అయ్యింది. అంతుకు ముందు ఏడాదికి ఇదే క్వార్టర్లో అదానీ పవర్ లాభాలు కేవలం రూ.13 కోట్లుగా ఉన్నాయి. తాజా ఫలితాలతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోయాయి. 2021-22 ఆర్థిక సంవత్సంరలో అదాని పవర్ రెవన్యూ 13,,308 కోట్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య రూ.6,902 కోట్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే అదానీ పవర్ లాభం 93 శాతం ఎగిసింది. ఈ ఏడాది కాలంలో ఆదాని పవర్ షేరు ధర రూ.97 నుంచి రూ.279.50కి పెరిగింది. ఈ షేర్లపై ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిటర్నులు అందాయి. ఇటీవల ఆదాని పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను దాటింది. చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు! -
బ్రెడ్ మాత్రమే మిగిలింది.. మారుతి భార్గవ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చిన్న కార్లే మారుతీకి బ్రెడ్ అండ్ బటర్‌గా పేర్కొనే పరిస్థితులకు కాలం చెల్లినట్లు మారుతి సూజూకి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. బటర్పోగా బ్రెడ్ మాత్రమే మిగిలినట్లు వ్యాఖ్యానించారు. నూతన నిబంధనలు, అధిక పన్నులు, కమోడిటీ ధరలు ఎంట్రీలెవల్ కార్ల ధరలు పెరిగేందుకు కారణమైనట్లు తెలియజేశారు. దీంతో హ్యాచ్ బ్యాక్ విక్రయాలు క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారిందని, మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా కంపెనీ సైతం వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. వెరసి మారుతీ పెద్ద కార్లతోపాటు, ఎస్‌యూవీలను సైతం ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. క్యూ 4 ఫలితాల్లో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 1,876 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,241 కోట్లు ఆర్జించింది. సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తిని దెబ్బతీసినప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 24,034 కోట్ల నుంచి రూ. 26,749 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 60 చొప్పున డివిడెండును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా పెట్టుబడి వ్యయాలకు తెరతీయనున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. దీనిలో భాగంగా మనేసర్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష యూనిట్లమేర విస్తరించనున్నట్లు సీఎఫ్‌వో అజయ్ సేథ్ పేర్కొన్నారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 8 లక్షల వాహనాలు. వాహన అమ్మకాలు డీలా ఈ క్యూ4లో మారుతీ వాహన విక్రయాలు స్వల్ప వెనకడుగుతో 4,88,830 యూనిట్లకు చేరాయి. వీటిలో దేశీ అమ్మకాలు 8 శాతం క్షీణించి 4,20,376 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే రికార్డు సృష్టిస్తూ 68,454 యూనిట్లను ఎగుమతి చేసింది. ఒక త్రైమాసికంలో ఇవి అత్యధికమని కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం తగ్గి రూ. 3,880 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 4,389 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 70,372 కోట్ల నుంచి రూ. 88,330 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన అమ్మకాలు 13 శాతంపైగా పుంజుకుని 16,52,653 యూనిట్లను తాకాయి. వీటిలో దేశీ విక్రయాలు 4 శాతం బలపడి 14,14,277 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 2,38,376 వాహనాలను ఎగుమతి చేసింది. 2020–21లో ఎగుమతైన వాహనాలు 96,139 మాత్రమే. చిప్‌ల కొరత కోవిడ్–19, కమోడిటీల ధరలు, చిప్‌ల కొరత వంటి సమస్యలతో గతేడాది సవాళ్లు విసిరినట్లు మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ విడిభాగాల కొరత కారణంగా గతేడాది 2.7 లక్షల వాహనాల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు మారుతీ అంచనా వేసింది. ప్రధానంగా దేశీ మోడల్స్‌కు ఇబ్బంది ఎదురైనట్లు పేర్కొంది. దీంతో 2.68 లక్షల వాహనాలకు కస్టమర్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. వాహన ధరలను పెంచడం ద్వారా స్టీల్, అల్యూమినియం తదితర కమోడిటీల పెరుగుదలను కొంతమేర ఎదుర్కోగలిగినట్లు వివరించింది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ @ మేడ్ ఇన్ ఇండియా! -
లాభాల్లో విప్రో రికార్డు.. ఈసారి ఫ్రెషర్లకు భారీ ఛాన్స్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 3,093 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,974 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 28 శాతం జంప్‌చేసి రూ. 20,860 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 16,245 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఈ ఏడాది(2022–23) తొలి క్వార్టర్లో 1–3 శాతం వృద్ధిని ఆశిస్తోంది. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 274.8–280.3 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు(గైడెన్స్) ప్రకటించింది. పూర్తి ఏడాదికి 16–18 శాతం పురోగతికి వీలున్నట్లు అభిప్రాయపడింది. గతేడాది భళా ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు 13 శాతం ఎగసి రూ. 12,233 కోట్లను తాకింది. 2020–21లో రూ. 10,866 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 28% జంప్‌చేసి రూ. 79,747 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది రూ. 62,234 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది ఆదాయం10.4 బిలియన్ డాలర్ల ఆదాయంతో ముగించడం విశేషమని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. తొలిసారి 10 బిలియన్ డాలర్ల మైలురాయిని అందుకున్నట్లు వెల్లడించారు. వార్షిక ప్రాతిపదికన పరిశ్రమలోనే అత్యధికంగా 27% వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. తాజా క్యూ4 లో వరుసగా ఆరో క్వార్టర్లోనూ పటిష్ట ఆదాయ వృద్ధి(3%)ని అందుకున్నట్లు తెలియజేశారు. రికార్డు లాభం గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 1.6 బిలియన్ డాలర్ల నికర లాభం సాధించినట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. క్లయింట్లపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా 10 కోట్ల డాలర్ల విభాగంలో 8 కొత్త కస్టమర్లను జత చేసుకున్నట్లు వెల్లడించా రు. 17.7% నిర్వహణ మార్జిన్లు సాధించినట్లు తెలియజేశారు. క్యాప్కో కొనుగోలుతో రెండంకెల వృద్ధిని అందుకుంటున్నట్లు డెలాపోర్ట్ పేర్కొన్నారు. క్యూ4లో కొత్తగా 10 కోట్ల డాలర్ల విభాగంలో ఇద్దరు, 5 కోట్ల డాలర్లలో ముగ్గురు క్లయింట్లను గెలుచుకున్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ - పోటీ సంస్థల బాటలోనే విప్రోలోనూ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 23.8%గా నమోదైంది. అయితే త్రైమాసికం వారీగా 5% తగ్గింది. - గతేడాది 19,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలిచ్చింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా మొత్తం 45,416 మందిని జత చేసుకుంది. - ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 38,000 మందికి ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. చదవండి: మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి! -
కాఫీడే....చేదు ఫలితాలు
న్యూఢిల్లీ: కాఫీడే ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి–మార్చి)కి సంబంధించి రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 69 శాతం క్షీణించి రూ. 165 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 534 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. క్యూ4లో సికాల్ లాజిస్టిక్స్‌లో గల ఈక్విటీ షేర్ల విలువ తగ్గిన కారణంగా రూ. 151 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాఫీ డే పేర్కొంది. కోవిడ్–19 కారణంగా తలెత్తిన లాక్డౌన్లు, ఆంక్షలు బిజినెస్ కార్యకలాపాలు, సప్లై చైన్ దెబ్బతిన్నట్లు తెలియజేసింది. డైరెక్టర్ రాజీనామా క్యూ4లో కాఫీ, తత్సంబంధిత ఆదాయం 61 శాతంపైగా క్షీణించి రూ. 141 కోట్లకు పరిమితమైనట్లు కాఫీడే పేర్కొంది. అయితే ఆతిథ్య సర్వీసుల టర్నోవర్ 40 శాతం ఎగసి రూ. 11 కోట్లను తాకినట్లు వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 652 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో దాదాపు రూ. 1,849 కోట్ల నికర లాభం సాధించింది. మొత్తం ఆదాయం 67 శాతం పడిపోయి రూ. 853 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 2,552 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే 2019–20లో ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీలో ఈక్విటీ వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 1,828 కోట్లు కలసి ఉన్న విషయాన్ని కాఫీడే ఫలితాల సందర్భంగా ప్రస్తావించింది. అంతేకాకుండా గ్లోబల్ విలేజ్ ప్రాపర్టీ అమ్మకం ద్వారా మరో రూ. 1,190 కోట్లు లభించినట్లు తెలియజేసింది. కాగా.. 2020–21లో వే2వెల్త్ సెక్యూరిటీస్ విక్రయం ద్వారా రూ. 151 కోట్లు లభించినట్లు పేర్కొంది. జర్మనీలో నివసిస్తున్న కంపెనీ డైరెక్టర్ ఆల్బర్ట్ జోసెఫ్ హీరోనిమస్ వ్యక్తిగత ఆరోగ్య రీత్యా పదవికి రాజీనామా చేసినట్లు కాఫీడే వెల్లడించింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా కస్టమర్ల ప్రాంతాల నుంచి వెండింగ్ మెషీన్ల వినియోగానికి రూపొందించిన 30,000 కేబినెట్లను వెనక్కి తీసుకున్నట్లు కాఫీడే తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేరు ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 41.30 వద్ద ముగిసింది. చదవండి : జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు! -
యూనియన్ బ్యాంక్ లాభం 27% డౌన్
క్యూ4లో రూ. 579 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 579 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 789 కోట్లతో పోలిస్తే ఇది 27% క్షీణత. మొండిబకాయిలకు ప్రొవిజన్లు పెరగడం, వడ్డీయేతర ఆదాయం తగ్గడం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంకు చైర్మన్ అరుణ్ తివారీ పేర్కొన్నారు. బకాయిలకు కేటాయింపులు రూ. 655 కోట్ల నుంచి రూ. 920 కోట్లకు పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం రూ. 875 కోట్ల నుంచి రూ. 775 కోట్లకు తగ్గింది. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.61% నుంచి 2.33%కు పెరిగాయి. ఈ కాలంలో రూ. 320 కోట్లమేర మొండి రుణాలను విక్రయించింది. వడ్డీ ఆదాయం 3.6% అప్ క్యూ4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.6% పుంజుకుని రూ. 2,052 కోట్లను తాకగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.62%గా నమోదయ్యాయి. ఇదే కాలానికి బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,445 కోట్లకు ఎగసింది. ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 21%పైగా క్షీణించి రూ. 1,696 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంకు షేరు దాదాపు 9% పతనమై రూ. 135 వద్ద ముగిసింది.