లాభాల్లో అదానీ గత రికార్డులను తిరగ రాశాడు. కనివినీ ఎరుగని రీతిలో ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ కంపెనీకి సాధ్యం కానీ విధంగా లాభాలను కళ్ల జూసింది అదాని పవర్. 2022 మార్చి 31తో ముగిసిన క్వార్టర్ ఫలితాలు 2022 మే 5న ప్రకటించింది అదానీ పవర్. ఈ తాజా ఫలితాల్లో అదానీ పవర్ లాభాలు రూ.4,645 కోట్లుగా నమోదు అయ్యింది. అంతుకు ముందు ఏడాదికి ఇదే క్వార్టర్‌లో అదానీ పవర్ లాభాలు కేవలం రూ.13 కోట్లుగా ఉన్నాయి. తాజా ఫలితాలతో స్టాక్ మార్కెట్‌లో అదానీ షేర్లు రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోయాయి.
2021-22 ఆర్థిక సంవత్సంరలో అదాని పవర్ రెవన్యూ 13,,308 కోట్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య రూ.6,902 కోట్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే అదానీ పవర్ లాభం 93 శాతం ఎగిసింది. ఈ ఏడాది కాలంలో ఆదాని పవర్ షేరు ధర రూ.97 నుంచి రూ.279.50కి పెరిగింది. ఈ షేర్లపై ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిటర్నులు అందాయి. ఇటీవల ఆదాని పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల రూపాయలను దాటింది.
చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు!
Comments
Please login to add a commentAdd a comment