న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్‌జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.
సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్‌జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్‌ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్‌జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ..
రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ!
Comments
Please login to add a commentAdd a comment