
అంబానీ సోదరులు అనగానే అందరికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీయే గుర్తొస్తారు. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన అనిల్ అంబానీ (Anil Ambani ) గురించి, ఆయనకున్న కంపెనీలు, వ్యాపార సామ్రాజ్యం గురించి తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
ఎప్పుడూ నష్టాలతో వార్తల్లో నిలిచే అనిల్ అంబానీ ఇటీవల రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేశారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది. రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని తీర్చేసింది.
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్మెంట్, పవర్ జనరేషన్ వంటి రంగాల్లో వైవిధ్యమైన వ్యాపారాలను కలిగి ఉంది. 2006లో రిలయన్స్ గ్రూప్ విడిపోయిన తర్వాత ఈ గ్రూప్ ఏర్పాటైంది. 2002 జూలై 6న ధీరూభాయ్ అంబానీ మరణించిన తరువాత, అప్పటి 15 బిలియన్ డాలర్ల సమ్మేళనం ఇద్దరు సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య విడిపోయింది.
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ ఇవే..
» రిలయన్స్ కమ్యూనికేషన్స్: మార్కెట్ క్యాప్ రూ.335 కోట్లు. షేరు 52 వారాల కదలిక రూ.2.49 గరిష్టాన్ని, రూ.1.01 కనిష్టాన్ని సూచిస్తుంది. షేరు ప్రస్తుత ధర రూ.1.93.
» రిలయన్స్ హోమ్ ఫైనాన్స్: మార్కెట్ క్యాప్ రూ.132 కోట్లు. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.4.05గా ఉంది. 52 వారాల కదలిక రూ .5.80 గరిష్టాన్ని, రూ .1.70 కనిష్టాన్ని సూచిస్తుంది.
» రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: మార్కెట్ క్యాప్ రూ.4,876 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ప్రస్తుత ధర రూ.202.99. షేరు 52 వారాల కదలికలు రూ.308 గరిష్టాన్ని, రూ.134 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.
» రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్: మార్కెట్ క్యాప్ రూ.155 కోట్లు. కంపెనీ నౌకా నిర్మాణంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2.3గా ఉంది.
» రిలయన్స్ పవర్: మార్కెట్ క్యాప్ రూ.4,520 కోట్లు. రిలయన్స్ పవర్ ప్రస్తుత ధర రూ.31.08గా ఉంది. షేరు 52 వారాల కదలికలు రూ.34.45 గరిష్టాన్ని, రూ.13.80 కనిష్టాన్ని సూచిస్తున్నాయి.
ఇదీ చదవండి: ‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు!