
హైదరాబాద్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ డిజిటల్ సంస్థ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ’డిజిటల్ ఇండియా సేల్’ నిర్వహిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్‌డిజిటల్‌డాట్‌ఇన్ పోర్టల్‌లో షాపింగ్ చేసేవారికి దీని కింద పలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 16 దాకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంటు (రూ.3,000 వరకూ), పేటీఎం ద్వారా రూ. 9,999 కనీస చెల్లింపుపై ఆగస్టు 31 దాకా రూ. 500 వాలెట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, జెస్ట్‌మనీ ద్వారా రూ. 10,000కు పైబడి చేసే కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 5,000 దాకా) పొందవచ్చని పేర్కొంది. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై ఈ ఆఫర్లు లభిస్తాయని వివరించింది.