రిలయన్స్ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా హెచ్‌ఎస్ మల్హి | Reliance Defense Group president HS malli | Sakshi
Sakshi News home page

రిలయన్స్ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా హెచ్‌ఎస్ మల్హి

Published Fri, Jun 5 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

Reliance Defense Group president HS malli

 న్యూఢిల్లీ : అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు చెందిన నేవీ డిఫెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓగా వైస్ అడ్మిరల్ హెచ్‌ఎస్ మల్హి (రిటైర్డ్) నియమితులయ్యారు. పిపావావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ కంపెనీని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ సీఈఓ పదవికి రాజీవ్ సుమన్ మే 30న రాజీనామా చేశారు. దీంతో మల్హి  కంపెనీ ప్రెసిడెంట్‌గా, సీఈఓగా బాధ్యతలు చేపడతారని రిలయన్స్ ఇన్‌ఫ్రా ఒక ప్రకటనలో పేర్కొంది.  హెచ్‌ఎస్ మల్హి  ఇండియన్ నేవీలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement