
అట్లాంటిక్ కౌన్సిల్ అడ్వైజరీ బోర్డులో అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: రాజకీయ, కార్పొరేట్ దిగ్గజాల అంతర్జాతీయ సంస్థ ది అట్లాంటిక్ కౌన్సిల్ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డులో వ్యాపార దిగ్గజం అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చోటు దక్కించుకున్నారు. న్యూస్ కార్ప్ చైర్మన్ రూపర్ట్ మర్డోక్, స్పెయిన్ మాజీ ప్రధాని జోస్ మారియా అజ్నార్, ఎయిర్‌బస్ సీఈవో థామస్ ఎండర్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్ తదితర ప్రముఖులు ఇప్పటికే ఈ బోర్డులో ఉన్నారు.
రిలయన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది. దక్షిణాసియాలో.. ముఖ్యంగా భారత్‌లో అట్లాంటిక్ కౌన్సిల్ విస్తరిస్తున్న నేపథ్యంలో బోర్డులో అనిల్ అంబానీ చేరిక సరైన సమయంలో జరిగిందని కౌన్సిల్ చైర్మన్ జాన్ హంట్స్‌మాన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భౌగోళికంగా, రాజకీయంగా పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి ఇది గుర్తింపుగా అనిల్ అంబానీ తెలిపారు.